జన్మనిచ్చిన అమ్మానాన్న పై ప్రేమతో చనిపోయిన తల్లిదండ్రులకు ఆలయం నిర్మించి తల్లిదండ్రుల విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు కుమారుడు. ముందుగా తండ్రి విగ్రహం ఏర్పాటు చేయగా శుక్రవారం తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు.
తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం ఎన్ ఆర్ కమ్మపల్లిలో లలిత, వెంకటరత్నం ఆచార్యులు వీరికి ముగ్గురు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు ఒక కుమారుడు, తండ్రి 2008లో మరణించగా, తల్లి 2012 మరణించింది. గతంలో తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రత్యేక పూజలు చేస్తున్నారు కుమారుడు హరి. తల్లికి కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించాడు. నేడు శుక్రవారం ఉదయం 4:30కు శుభ ముహూర్తాన కుటుంబ సభ్యుల సమక్షంలో తండ్రి పక్కనే తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించి అభిషేకాల నిర్వహించారు. అనంతరం తల్లిదండ్రులకు పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా కుమారుడు హరి మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రులను మరవకూడదని ఉద్దేశంతోనే వారి విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Uploaded Video:



