Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

అంధకారంలో బతుకమ్మ సంబరాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అంధకారంలో బతుకమ్మ సంబరాలు

వార్త ముఖ్యాంశాలు

  • పెద్దనాగారం గ్రామంలో విద్యుత్‌ అంతరాయంతో చీకట్లోనే బతుకమ్మ వేడుకలు మహబూబాబాద్ జిల్లా, నరసింహుల పేట మండలం పెద్దనాగారం గ్రామంలో బతుకమ్మ సంబరాలు అంధకారంలో జరిగాయి.
  • తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, యువతులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు.
  • అయితే వేడుకల సమయంలో విద్యుత్‌ లేకపోవడంతో గ్రామంలో చీకట్లు అలుముకున్నాయి.

పెద్దనాగారం గ్రామంలో విద్యుత్‌ అంతరాయంతో చీకట్లోనే బతుకమ్మ వేడుకలు

మహబూబాబాద్ జిల్లా, నరసింహుల పేట మండలం పెద్దనాగారం గ్రామంలో బతుకమ్మ సంబరాలు అంధకారంలో జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, యువతులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. అయితే వేడుకల సమయంలో విద్యుత్‌ లేకపోవడంతో గ్రామంలో చీకట్లు అలుముకున్నాయి. దీంతో మహిళలు, యువతులు చీకట్లోనే బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు.

బతుకమ్మ పండుగ సందర్భంగా విద్యుత్‌ సౌకర్యం లేకపోవడంపై గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పండుగ వేళల్లోనైనా అధికారులు స్పందించి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *