Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

రూ.2.27 కోట్లతో అభివృద్ధి పనులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రూ.2.27 కోట్లతో అభివృద్ధి పనులు

వార్త ముఖ్యాంశాలు

  • జీవీఎంసీ 98 వార్డులో రూ.2.77 కోట్లతో ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు అడవివరం కాపుదిబ్బ వద్ద భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం శంకుస్థాపన చేశారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింహాద్రి అప్పన్న దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు, పర్యాటకులు వస్తారని..
  • రూ.

జీవీఎంసీ 98 వార్డులో రూ.2.77 కోట్లతో ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు అడవివరం కాపుదిబ్బ వద్ద భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింహాద్రి అప్పన్న దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు, పర్యాటకులు వస్తారని.. రూ. 1.25 కోట్లతో తొలిపావంచ వద్ద అభివృద్ధి, సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టామని తెలియజేశారు. అలాగే వార్డు కార్యాలయం, రోడ్లు, డ్రెయిన్ల కోసం మరో రూ.1.50 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండేళ్లలో మధురవాడ జోన్ లో మౌలిక వసతులు కల్పన కోసం రూ. 200 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించామని వివరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, పీవీ నరసింహం, పంచదార్ల శ్రీనివాస్, గుసిడి శంకర్రావు, బూర్ల కనకారావు, అవినాష్, రాజు, సూరిబాబు, ముగ్గు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *