Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

భక్తులతో కిటకిటలాడిన విఠలేశ్వరాలయం.. వరసిద్ధి వినాయకుడికి ఘన ఆరతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
భక్తులతో కిటకిటలాడిన విఠలేశ్వరాలయం.. వరసిద్ధి వినాయకుడికి ఘన ఆరతి

వార్త ముఖ్యాంశాలు

  • కుబీర్:మండల కేంద్రంలోని ప్రాచీన విఠలేశ్వర ఆలయంలో కొలువుదీరిన,వరసిద్ధి వినాయకుడికి మంగళవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేకఆరతికార్యక్రమంనిర్వహించారు.గత15సంవత్సరాలుగా,ఆలయంలో ప్రతిష్ఠిస్తున్న ఈ విశిష్ట కర్ర గణపయ్యను దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.ఆరతి కార్యక్రమం సందర్భంగా విఠలేశ్వర ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.
  • గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు భక్తిశ్రద్ధలతో ఆరతిలో పాల్గొన్నారు.
  • అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు బారులు తీరారు.విఘ్నాలను తొలగించి కోరిన కోరికలు నెరవేర్చే వరసిద్ధి వినాయకుడిగా ఈ కర్ర గణపయ్యకు భక్తుల్లో విశేషమైన నమ్మకం ఉంది.

కుబీర్:మండల కేంద్రంలోని ప్రాచీన విఠలేశ్వర ఆలయంలో కొలువుదీరిన,వరసిద్ధి వినాయకుడికి మంగళవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేకఆరతికార్యక్రమంనిర్వహించారు.గత15సంవత్సరాలుగా,ఆలయంలో ప్రతిష్ఠిస్తున్న ఈ విశిష్ట కర్ర గణపయ్యను దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.ఆరతి కార్యక్రమం సందర్భంగా విఠలేశ్వర ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు భక్తిశ్రద్ధలతో ఆరతిలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు బారులు తీరారు.విఘ్నాలను తొలగించి కోరిన కోరికలు నెరవేర్చే వరసిద్ధి వినాయకుడిగా ఈ కర్ర గణపయ్యకు భక్తుల్లో విశేషమైన నమ్మకం ఉంది. ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రుల సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భక్తుల“గణపతి బప్పా మోరియా”నామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ప్రత్యేక ఆరతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *