Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

యానాం మార్కెట్‌లో చీరమేను సందడి.. కిలోకు భారీ ధర

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
యానాం మార్కెట్‌లో చీరమేను సందడి.. కిలోకు భారీ ధర

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

యానాం మార్కెట్‌లో ఈ సీజన్‌లో తొలి చీరమేను శుక్రవారం సందడి చేసింది. తూర్పుగాలుల ప్రభావంతో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు చీరమేను చిక్కింది. సుమారు 7 కిలోల బరువున్న చీరమేను బకెట్‌ వేలంలో రూ.26 వేల ధర పలికింది. దీంతో సేరు ధర దాదాపు రూ.4 వేల వరకు నమోదైంది. సీజన్‌లో తొలి చీరమేను కావడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపించారు. మార్కెట్‌కు వచ్చిన ఈ చేపను దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. రుచికి, ప్రత్యేక డిమాండ్‌కు పేరుగాంచిన చీరమేనుకు ప్రస్తుతం మంచి ధర లభించడంతో మత్స్యకారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. దీపావళి పండుగ వరకు చీరమేను మార్కెట్‌లో అందుబాటులో ఉండే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు.

Uploaded Video:

యానాం మార్కెట్‌లో చీరమేను సందడి.. కిలోకు భారీ ధర

Leave a comment

Your email address will not be published. Required fields are marked *