எங்களை தொடர்புகொள்ள சமீபத்திய செய்திகள்
உண்மையான செய்தி. விரைவான தகவல். ஆந்திரப் பிரதேசம் • தெலங்கானா • தேசியம்
ஆசிரியர் பலகம்

Tag: Kadapa

కడప

ఇంద్రానగర్‌లో హోలిస్టిక్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం

ఇంద్రానగర్‌లో హోలిస్టిక్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం పున్నమి ప్రతినిధి కడప: నగరంలోని ఇంద్రానగర్ ప్రాంతంలో ఏటూరు రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో హోలిస్టిక్ హాస్పిటల్ వైద్య బృందం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించింది. ఈ వైద్య శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా హోలిస్టిక్ హాస్పిటల్ వైద్యులు స్థానిక ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య సమస్యలను గుర్తించారు. అవసరమైన వైద్య సూచనలు, ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఏటూరు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సమయంలో వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని నిర్వహించిన ఏటూరు రామచంద్ర రెడ్డికి, హోలిస్టిక్ హాస్పిటల్ వైద్య బృందానికి స్థానిక ప్రజలు అభినందనలు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు.

కడప

పదవీ విరమణ ఆత్మీయ అభినందన సభకు ఆహ్వానం

పదవీ విరమణ ఆత్మీయ అభినందన సభకు ఆహ్వానం పున్నమి ప్రతినిధి, కడప: రిజిస్ట్రేషన్‌ మరియు స్టాంపుల శాఖలో 38 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో విశిష్ట సేవలందించిన పి.వి.ఎన్. బాబు, జిల్లా రిజిస్ట్రార్‌, కడప, నేడు 04-10-2026న పదవీ విరమణ చేయనున్నారు. తన సుదీర్ఘ ఉద్యోగ ప్రస్థానంలో విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ, శాఖ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన పి.వి.ఎన్. బాబు సేవలను అధికారులు, సహచరులు, ఉద్యోగులు ఘనంగా కొనియాడారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా సత్కారం నిర్వహించి, ఆత్మీయ అభినందనలు తెలియజేసేందుకు పదవీ విరమణ ఆత్మీయ అభినందన సభను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కడప ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ సురేష్ కుమార్, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ వై. ఓబులేష్ నందన్, కడప మున్సిపల్ అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర తదితరులు హాజరై పి.వి.ఎన్. బాబును ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేయనున్నారు. 38 సంవత్సరాల విశిష్ట సేవలకు సెల్యూట్‌! పదవీ విరమణ అనంతరం ఆయన జీవితం ఆనందమయం, ఆరోగ్యమయం కావాలని అధికారులు, సహచరులు, మిత్రులు ఆకాంక్షించారు.

కడప

మామను హత్య చేసిన అల్లుడు

మామను హత్య చేసిన అల్లుడు పున్నమి ప్రతినిధి | కడప జిల్లా | లింగాల | అక్టోబర్ 3 కడప జిల్లా లింగాల మండలం మురారిచింతల గ్రామంలో శుక్రవారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. అల్లుడి చేతిలో మామ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం.. మురారిచింతల గ్రామానికి చెందిన అంకే రాజబాబు తన కుమార్తెను వేంపల్లెకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అయితే కొంతకాలంగా అల్లుడు తన కుమార్తెను వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో వారం రోజుల క్రితం ఆమెను పుట్టింటికి తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి అల్లుడు మామ ఇంటికి వచ్చి గొడవకు దిగినట్లు తెలిసింది. ఉదయం మాట్లాడుకుందామని కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆగ్రహించిన అల్లుడు కత్తితో మామ రాజబాబుపై దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన రాజబాబును కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం పులివెందుల ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో రాజబాబు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. ఈ ఘటనతో మురారిచింతల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

కడప

ఖలీల్ నగర్‌లో టీడీపీలోకి 200 కుటుంబాల భారీ చేరికలు

ఖలీల్ నగర్‌లో టీడీపీలోకి 200 కుటుంబాల భారీ చేరికలు పున్నమి ప్రతినిధి, కడప: కడప నగర పరిధిలోని 34వ డివిజన్ ఖలీల్ నగర్‌లో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఖలీల్ నగర్ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ చేరికల కార్యక్రమంలో సుమారు 200 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ప్రభుత్వ విప్, కడప శాసనసభ్యురాలు శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి రెడ్డి, టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 200 కుటుంబాలు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరగా, వారికి మాధవి రెడ్డి, శ్రీనివాసరెడ్డి పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో కుటుంబాలు టీడీపీలో చేరడం శుభపరిణామమన్నారు. కడప నగరంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకు చేరేలా కృషి చేయాలన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవం కల్పిస్తామని, కార్యకర్తలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ నాయకులు, కూటమి ముఖ్య నేతలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

కడప

గాంధీజీ జయంతి సందర్భంగా ఘన నివాళులు

గాంధీజీ జయంతి సందర్భంగా ఘన నివాళులు పున్నమి ప్రతినిధి | అక్టోబర్ 2 మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న 27వ డివిజన్ పరిధిలో గాంధీజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 27వ డివిజన్ ఇంచార్జ్ గుంటి రాణి మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీజీ పోషించిన పాత్రను ఈ సందర్భంగా ఆమె స్మరించుకున్నారు. అహింస, సత్యం, శాంతి, సత్యాగ్రహం వంటి విలువలను ఆయుధాలుగా చేసుకుని దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి స్వాతంత్ర్య ఉద్యమానికి గాంధీజీ నాయకత్వం వహించారని పేర్కొన్నారు. గాంధీజీ చూపిన అహింసా మార్గం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అవసరం ఉందని గుంటి రాణి అన్నారు. సమాజంలో శాంతి, సోదరభావం, ఐక్యతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సత్యం, అహింస, నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె సూచించారు. స్వచ్ఛమైన సమాజ నిర్మాణం, దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు. మహాత్మా గాంధీజీ దేశానికి అందించిన సేవలు, స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటం, ఆయన త్యాగాలను ఎప్పటికీ మరువలేమని గుంటి రాణి పేర్కొన్నారు. గాంధీజీ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ, ఆయన ఆశయాల సాధనకు కృషి చేయడమే నిజమైన నివాళి అని తెలిపారు. ఇట్లు 27వ డివిజన్ ఇంచార్జ్ గుంటి రాణి

కడప

కార్పొరేషన్ ఆఫీసులో గాంధీ జయంతి వేడుకలు

కార్పొరేషన్ ఆఫీసులో గాంధీ జయంతి వేడుకలు కడప, అక్టోబర్ 2 ( పున్నమి ప్రతినిధి): జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని కడప నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కడప శాసనసభ్యురాలు మాధవి రెడ్డి, టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ పూల నాగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ అందించిన సేవలను, ఆయన ఆశించిన అహింస, శాంతి, గ్రామ స్వరాజ్యం వంటి ఆదర్శాలను స్మరించుకున్నారు. మహాత్ముని అడుగుజాడల్లో నడుస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజలకు సేవ చేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భవాని ప్రసాద్, నగరపాలక సంస్థ సిబ్బంది, ఏపీ లేబర్ బోర్డు డైరెక్టర్ దోమల చంద్రమోహన్ రెడ్డి, స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ చిట్టిపోయిన సుబ్బరాయుడు యాదవ్, పాలకొండ చైర్మన్ రెడ్డయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

కడప

రూ.416.95 లక్షల నిధులతో ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజీకి భూమిపూజ

రూ.416.95 లక్షల నిధులతో ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజీకి భూమిపూజ కడప, అక్టోబర్ 2 (పునమి ప్రతినిధి): కడప నగరంలోని ఓల్డ్ రిమ్స్ ప్రాంగణంలో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఆయుష్ మిషన్ కింద రూ.416.95 లక్షల నిధులతో మంజూరైన ప్రభుత్వ హోమియోపతిక్ మెడికల్ కాలేజీ అప్‌గ్రేడేషన్ నూతన భవన నిర్మాణ బ్లాక్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, కడప శాసనసభ్యురాలు మాధవి రెడ్డి, టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై శిలాఫలకాన్ని ఆవిష్కరించి నూతన భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప నగరంలో ప్రజారోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, వైద్య విద్యార్థులకు అత్యాధునిక మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. నూతన హోమియోపతి మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనతో పాటు పరిశోధనలకు మెరుగైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ, నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత ఏపీఎంఐడీసీ అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, వైద్యులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కడప

శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారికి పంచామృతాభిషేకం

శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారికి పంచామృతాభిషేకం కడప, అక్టోబర్ 2 (పున్నమి ప్రతినిధి): లక్ష్మీ నృసింహాయ నమః ఇందిరా నగర్ రామాలయంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారికి శుక్రవారం పంచామృతాభిషేకం, దివ్య సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం షోడశోపచార పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో KSRM ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ శ్రీ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి (నాని) పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రతి స్వాతి నక్షత్రం రోజున ఉదయం 9 గంటలకు సుదర్శన హోమం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ శ్రీ ఏటూరు రామచంద్ర రెడ్డి తెలిపారు. హోమంలో పాల్గొనదలచిన భక్తులు ముందుగా ఆలయ చైర్మన్ లేదా అర్చక స్వామిని సంప్రదించి తమ వివరాలను తెలియజేయాలని కోరారు. ఇట్లు: ఆలయ చైర్మన్ శ్రీ ఏటూరు రామచంద్ర రెడ్డి సెల్: 9866599211 🙏

కడప

జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు పీపీగా గంగిరెడ్డి శివశంకర్ రెడ్డికి ఘన సన్మానం

జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు పీపీగా గంగిరెడ్డి శివశంకర్ రెడ్డికి ఘన సన్మానం కడప, సెప్టెంబర్ 29 (పున్నమి ప్రతినిధి): కడప జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)గా గంగిరెడ్డి శివశంకర్ రెడ్డి నియమితులైన సందర్భంగా ఆయనకు పలువురు న్యాయవాదులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గంగిరెడ్డి శివశంకర్ రెడ్డి పీపీగా నియమితులు కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. న్యాయ రంగంలో ఆయనకున్న అనుభవం, సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించడం అభినందనీయమని పేర్కొన్నారు. కొత్తగా చేపట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ న్యాయ వ్యవస్థ పట్ల అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బాధ్యతలు కీలకమైనవని, ప్రజలకు న్యాయం అందేలా చట్టపరమైన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు మరింత విశ్వాసం కలిగేలా తన వంతు కృషి చేయాలని అభినందనలు తెలిపారు. పీపీగా నియామకం కావడంతో గంగిరెడ్డి శివశంకర్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు న్యాయవాదులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ నాయకులు శ్రీనివాసులు, పుల్లయ్యతో పాటు పలువురు న్యాయవాదులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

కడప

జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో జ్ఞాన్ విహార్ విద్యార్థుల సత్తా

జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో జ్ఞాన్ విహార్ విద్యార్థుల సత్తా కడప, సెప్టెంబర్ 29 (పున్నమి ప్రతినిధి): కడప పట్టణంలోని మహావీర్ సర్కిల్‌లో ఉన్న జ్ఞాన్ విహార్ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. కడప జిల్లా పాఠశాలల ఆటల ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే, బాక్సింగ్, చెస్, కబడ్డీ, బ్యాడ్మింటన్ తదితర క్రీడా పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో 9వ తరగతికి చెందిన అఖిల్ కుమార్ తేజ్, అశ్వద్ధామ, ధీరజ్, లక్ష్మీ నిహాంత్, 8వ తరగతికి చెందిన అజయ్ కృష్ణారెడ్డి వివిధ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలను సాధించారు. ముఖ్యంగా బాక్సింగ్, టంట్కా విభాగాల్లో విద్యార్థులు ప్రతిభ చాటి పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు, పతకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సువర్ణ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు శిక్షణ అందించిన పాఠశాల కరాటే మాస్టర్ వెంకట్‌ను అభినందించారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సమయపాలన, జట్టుగా పనిచేసే నైపుణ్యాలు పెంపొందుతాయని తెలిపారు. పాఠశాల చైర్మన్ సుధాకర్, కరస్పాండెంట్ డా. రవి శంకర్ మాట్లాడుతూ విద్యార్థులకు విలువలతో కూడిన విద్యతో పాటు క్రీడల్లోనూ సమానంగా ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. విద్యార్థులు సాధించిన విజయాలు పాఠశాలకు గర్వకారణమని, ఈ విజయాలు ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.