உண்மையான செய்தி. விரைவான தகவல். ஆந்திரப் பிரதேசம் • தெலங்கானா • தேசியம்
ஆசிரியர் பலகம்
கடப்பா

ఖలీల్ నగర్‌లో టీడీపీలోకి 200 కుటుంబాల భారీ చేరికలు

புன்னமி செய்தியறை வெளியீடு: புதுப்பிப்பு:
ఖలీల్ నగర్‌లో టీడీపీలోకి 200 కుటుంబాల భారీ చేరికలు

ఖలీల్ నగర్‌లో టీడీపీలోకి 200 కుటుంబాల భారీ చేరికలు

పున్నమి ప్రతినిధి, కడప: కడప నగర పరిధిలోని 34వ డివిజన్ ఖలీల్ నగర్‌లో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఖలీల్ నగర్ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ చేరికల కార్యక్రమంలో సుమారు 200 కుటుంబాలు టీడీపీలో చేరాయి.

ప్రభుత్వ విప్, కడప శాసనసభ్యురాలు శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి రెడ్డి, టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 200 కుటుంబాలు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరగా, వారికి మాధవి రెడ్డి, శ్రీనివాసరెడ్డి పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో కుటుంబాలు టీడీపీలో చేరడం శుభపరిణామమన్నారు. కడప నగరంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకు చేరేలా కృషి చేయాలన్నారు.

పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవం కల్పిస్తామని, కార్యకర్తలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ నాయకులు, కూటమి ముఖ్య నేతలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

ఖలీల్ నగర్‌లో టీడీపీలోకి 200 కుటుంబాల భారీ చేరికలు

ఖలీల్ నగర్‌లో టీడీపీలోకి 200 కుటుంబాల భారీ చేరికలు

ఖలీల్ నగర్‌లో టీడీపీలోకి 200 కుటుంబాల భారీ చేరికలు

ఖలీల్ నగర్‌లో టీడీపీలోకి 200 కుటుంబాల భారీ చేరికలు

ఖలీల్ నగర్‌లో టీడీపీలోకి 200 కుటుంబాల భారీ చేరికలు

ఖలీల్ నగర్‌లో టీడీపీలోకి 200 కుటుంబాల భారీ చేరికలు

ఖలీల్ నగర్‌లో టీడీపీలోకి 200 కుటుంబాల భారీ చేరికలు

ఖలీల్ నగర్‌లో టీడీపీలోకి 200 కుటుంబాల భారీ చేరికలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *