Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel

Tag: Award

మేడ్చల్ – మల్కాజిగిరి

తెలంగాణ సంస్కృతి పర్యాటక వైభవం కల్చరల్ అవార్డు–2026 అందుకున్న బద్రి వెంకటరమణయ్య

హైదరాబాద్, అక్టోబర్ 5: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న నిర్వహించిన తెలంగాణ సంస్కృతి పర్యాటక వైభవం కల్చరల్ అవార్డ్స్–2026 కార్యక్రమంలో బెస్ట్ సీనియర్ రిపోర్టర్‌గా బద్రి వెంకటరమణయ్య అవార్డును అందుకున్నారు. చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో నిర్వహించిన కల్చరల్ ఈవెంట్‌కు శ్రీ మల్లికార్జున అఖిల భారత మున్నూరు కాపు నిత్య అన్నదాన ట్రస్ట్ (కొమురవెల్లి) చైర్మన్ డాక్టర్ ఉప్పు రవీందర్ పద్మ పటేల్ ఆధ్వర్యంలో . ఈ కార్యక్రమ నీకి ముఖ్య అతిథిగా సిరిసిల్ల రాజయ్య, చిలుకూరు బాలాజీ టెంపుల్ శివాలయం ప్రధాన అర్చకులు, 59 సార్లు గిరి ప్రదక్షిణ చేసిన గురువులు ఆత్మారాం గురూజీ విచ్చేశారు వారి చేతుల మీదుగా బద్రి వెంకటరమణయ్య బెస్ట్ సీనియర్ రిపోర్టర్ అవార్డును అందుకున్నారు. గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అవార్డు అందుకోవడం పట్ల బద్రి వెంకటరమణయ్య సంతోషం వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు తన వృత్తిపరమైన బాధ్యతలను మరింత నిబద్ధతతో కొనసాగించేందుకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డప్పు కళాకారు సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ మొదలగు వారు పాల్గొన్నారు

మేడ్చల్ – మల్కాజిగిరి

తెలంగాణ సంస్కృతి పర్యాటక వైభవం కల్చరల్ అవార్డు–2026 అందుకున్న బద్రి వెంకటరమణయ్య

హైదరాబాద్, అక్టోబర్ 5: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న నిర్వహించిన తెలంగాణ సంస్కృతి పర్యాటక వైభవం కల్చరల్ అవార్డ్స్–2026 కార్యక్రమంలో బెస్ట్ సీనియర్ రిపోర్టర్‌గా బద్రి వెంకటరమణయ్య అవార్డును అందుకున్నారు. చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో నిర్వహించిన కల్చరల్ ఈవెంట్‌కు శ్రీ మల్లికార్జున అఖిల భారత మున్నూరు కాపు నిత్య అన్నదాన ట్రస్ట్ (కొమురవెల్లి) చైర్మన్ డాక్టర్ ఉప్పు రవీందర్ పద్మ పటేల్ ఆధ్వర్యంలో . ఈ కార్యక్రమ నీకి ముఖ్య అతిథిగా సిరిసిల్ల రాజయ్య, చిలుకూరు బాలాజీ టెంపుల్ శివాలయం ప్రధాన అర్చకులు, 59 సార్లు గిరి ప్రదక్షిణ చేసిన గురువులు ఆత్మారాం గురూజీ విచ్చేశారు వారి చేతుల మీదుగా బద్రి వెంకటరమణయ్య బెస్ట్ సీనియర్ రిపోర్టర్ అవార్డును అందుకున్నారు. గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అవార్డు అందుకోవడం పట్ల బద్రి వెంకటరమణయ్య సంతోషం వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు తన వృత్తిపరమైన బాధ్యతలను మరింత నిబద్ధతతో కొనసాగించేందుకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డప్పు కళాకారు సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ మొదలగు వారు పాల్గొన్నారు

నంద్యాల

స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు

నంద్యాల: కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్‌, జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా పాల్గొన్నారు. జిల్లాలో స్వచ్ఛత, పారిశుద్ధ్యం, పరిశుభ్రతలో విశిష్ట సేవలు అందించిన వివిధ కేటగిరీలకు చెందిన 68 మంది అవార్డు గ్రహీతలకు మంత్రి, కలెక్టర్‌ స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ డి. శేషన్న, జడ్పీ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

నంద్యాల

విద్యార్థుల్లో గుండె ఆరోగ్యంపై అవగాహన: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమం

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ నంద్యాల అధ్యక్షులు సందీప్ ఆధ్వర్యంలో గుండె ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ మురళి, పీడియాట్రీషియన్ డాక్టర్ కార్తికేయలు విద్యార్థులకు చిన్న వయస్సు నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యతను వివరించి, వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమానికి సహకరించిన పాఠశాల ఛైర్మన్ పి. దస్తగిరి రెడ్డి, డైరెక్టర్ షావల్ రెడ్డిలకు లయన్స్ క్లబ్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు చంద్రశేఖర్, సురేష్, నాగరాజు, కిరణ్ లాల్ పాల్గొన్నారు.

నంద్యాల

విజయవంతంగా ముగిసిన 9వ జాతీయ స్థాయి నంది నృత్య పోటీలు

నంద్యాల: స్థానిక శ్రీ వివేకానంద ఆడిటోరియంలో ‘శ్రీ సాయి నాట్యాంజలి ఫైన్ ఆర్ట్స్ డెవలప్‌మెంట్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన 9వ జాతీయ స్థాయి నంది నృత్య పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ కూచిపూడి నాట్యగురువు డా. వేదాంతం రాధేశ్యామ్ న్యాయనిర్ణేతగా, శ్రీ రామకృష్ణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు డా. జి. రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కూచిపూడి, భరతనాట్యం, జానపద విభాగాల్లో వివిధ నాట్యగురువుల శిష్యులు ప్రతిభ చాటగా.. విజేతలకు ‘నంది’ మెమోంటోలతో సన్మానించినట్లు సంస్థ నిర్వాహకులు డా. పల్లెంశెట్టి సురేష్ తెలిపారు.

నంద్యాల

నవజీవన్ బధిరుల పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ బధిరుల వారోత్సవాలు

ఆయ్యలూరు మెట్ట: నంద్యాల ఆయ్యలూరు మెట్టలోని నవజీవన్ బధిరుల ప్రత్యేక పాఠశాలలో అంతర్జాతీయ బధిరుల వారోత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ జాన్ మేరీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవి కృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బధిర విద్యార్థులు వైకల్యాన్ని అధిగమించి ఆత్మవిశ్వాసంతో చదువు, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నెలకు ₹6,000 పెన్షన్, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తోందని, స్వచ్ఛంద సంస్థల సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఉపాధ్యాయుల సంకేతాలకు అనుగుణంగా బధిర బాలలు చేసిన సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పద్మావతమ్మ, రాజశేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

నంద్యాల

నవంబర్ 1న ఉచిత ముస్లిం సామూహిక వివాహాలు: వధువుకు ₹50,000 బహుమతి – నశ్యం అబ్దుల్ ఖుద్దూస్

నంద్యాల అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 1న పేద ముస్లిం యువతులకు ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్షుడు నశ్యం అబ్దుల్ ఖుద్దూస్ తెలిపారు. అర్హులైన వధువరులు తమ ఆధార్, ఫోటోలు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్‌లతో అక్టోబర్ 25 లోపు అంజుమన్ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివాహం రోజు నిఖా ఖర్చులు భరించడంతో పాటు వధువుకు ₹50,000 నగదు చెక్కును బహుకరించనున్నట్లు ఆయన వెల్లడించారు.

నంద్యాల

ఇంజనీర్లకు పురస్కారాలు.. ఘన సత్కారం

నంద్యాల: మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్ల సంఘాలు, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రామకృష్ణ పీజీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విశ్వేశ్వరయ్య చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 30 మంది ఇంజనీర్లు రక్తదానం చేశారు. ఉత్తమ సేవలందించిన 7 గురు ఏఈలు, 29 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ప్రశంసా పత్రాలు, క్రీడల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈఈ రఘురామిరెడ్డి, విశ్రాంత ఇంజనీర్లకు పురస్కారాలు అందించి సత్కరించారు. అలాగే నవజీవన్ బదిరుల పాఠశాలకు రూ.12 వేల విరాళం ప్రకటించారు. విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో ఇంజనీర్లు జాతి నిర్మాణానికి కృషి చేయాలని ఈఈ రఘురామిరెడ్డి పిలుపునిచ్చారు.

నంద్యాల

బాల అకాడమీ ప్రిన్సిపాల్‌కు ‘శిక్షా రత్న’ పురస్కారం

హైదరాబాద్: విద్యారంగంలో నూతన సంస్కరణలు అమలు చేస్తూ పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న బాల అకాడమీ ప్రిన్సిపాల్ శ్రీమతి మాధవీలత గారు ప్రతిష్ఠాత్మక ‘శిక్షా రత్న అవార్డు–2026’ సాధించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హరి యూనివర్సిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలను పెంపొందిస్తూ పాఠశాలను ప్రగతిపథంలో నడిపిస్తున్నందుకు ఆమెకు ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇది తన వ్యక్తిగత అవార్డు కాదని, బాల అకాడమీ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల సమిష్టి కృషికి లభించిన గుర్తింపు అని పేర్కొన్నారు. మాధవీలత విజయం పట్ల పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

నంద్యాల

వైభవంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం

నంద్యాల: నంద్యాలలోని శ్రీ రామకృష్ణ విద్యాలయం 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం అంగరంగ వైభవంగా జరిగింది. 50 బ్యాచ్‌లకు చెందిన దాదాపు 600 మందికి పైగా పూర్వ విద్యార్థులు హాజరై, తమ ఉపాధ్యాయులను ‘గురు వందన రథం’పై పూలవర్షం మధ్య ఊరేగింపుగా పాఠశాలకు తీసుకెళ్లారు. అనంతరం ప్రమద నంది కళ్యాణ మండపంలో గురువులను శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. పాఠశాల పూర్వ వైభవానికి, అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని పూర్వ విద్యార్థులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ నివర్తి మోహన్, విశ్రాంత, ప్రస్తుత ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.