संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल

Tag: #పున్నమిన్యూస్

జాతీయ అంతర్జాతీయ

రోడ్డుపై రైలు గేటు చూశాం.. సముద్రంలో నౌకలకూ గేటు!

రామేశ్వరం: రోడ్డుపై వాహనాల కోసం రైల్వే గేట్లు చూశాం… సముద్రంలో నౌకలకు దారిచ్చే వంతెన చూశారా? పక్క రాష్ట్రం తమిళనాడులోని పాంబన్‌ ఇంజినీరింగ్‌ అద్భుతం! దేశంలోనే తొలి వర్టికల్‌ లిఫ్ట్‌ సముద్ర రైల్వే వంతెనలోని 72.5 మీటర్ల మధ్యభాగం 17 మీటర్ల వరకు పైకిలేస్తుంది. నౌకలు దాటిన తర్వాత కిందకు దిగి రైళ్లకు మార్గం కల్పిస్తుంది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన ఆటో డ్రైవర్ అరెస్టు

కానిస్టేబుల్‌ను ఆటోతో ఢీకొట్టి, విధుల నిర్వహణకు ఆటంకం కలిగించిన ఆరోపణలపై ఆటో డ్రైవర్‌ను నవాబుపేట పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తీసుకున్న చర్యలను ఏఎస్పీ దీక్ష వివరించారు. కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు వెల్లడిస్తూ, కేసుకు సంబంధించిన వివరాలను ఆమె మీడియాకు తెలిపారు.

జాతీయ అంతర్జాతీయ

వంద కేసులు పెట్టుకోండి.. రాహుల్‌ సవాల్‌!

ఢిల్లీ: తనపై నమోదైన 45 ఎఫ్‌ఐఆర్‌లను మెడల్స్‌గా భావిస్తున్నానని రాహుల్‌ గాంధీ అన్నారు. వంద కేసులు పెట్టినా ఎదుర్కొంటాననే ధిక్కార స్వరం వినిపించారు. ఢిల్లీ పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఓటర్ల జాబితా, ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. వెనక్కి తగ్గబోననే సంకేతం ఇచ్చారు.

శ్రీకాకుళం 

విద్యార్థిపై కర్రతో దాడి ఆరోపణ

శ్రీకాకుళం జిల్లా మందస జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థి నిఖిల్ బెహరాను ఉపాధ్యాయుడు కర్రతో కొట్టారని తల్లిదండ్రులు ఆరోపించారు. తరగతిలో అల్లరి చేశాడనే కారణంతో దాడి చేశారని తండ్రి తెలిపారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానోపాధ్యాయుడికి, మండల విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.

జాతీయ అంతర్జాతీయ

ఎయిర్‌టెల్‌ బాదుడు.. పోస్ట్‌పెయిడ్‌ భారం!

ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ప్రధాన ప్లాన్ల నెలవారీ ధరలను సంస్థ రూ.50 పెంచింది. రూ.449 ప్లాన్‌ రూ.499కు, రూ.699 ప్లాన్‌ రూ.749కు, రూ.999 ప్లాన్‌ రూ.1,049కు చేరాయి. ఈ ప్లాన్లు ఎంచుకునేవారికి ఏడాదికి రూ.600 అదనపు ఖర్చు కానుంది. కొత్త ప్లాన్లలో ప్రతి సిమ్‌కు ఏడాదిలో ఒకసారి ఐదు రోజుల ఉచిత అంతర్జాతీయ రోమింగ్‌ను జోడించింది. ఇందులో 5జీబీ డేటా, 60 నిమిషాల కాల్స్‌, 25 అవుట్‌గోయింగ్‌ ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అక్టోబర్‌ 8 నుంచి కొత్త ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఉన్న వినియోగదారులు ఎయిర్‌టెల్‌ యాప్‌ లేదా స్టోర్‌ ద్వారా వీటికి మారవచ్చని సంస్థ తెలిపింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో రెండు నవలల ఆవిష్కరణ:డాక్టర్ కనుపూరు శ్రీనివాసులురెడ్డి

ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ కవి, కథా–నవలా రచయిత డాక్టర్ కనుపూరు శ్రీనివాసులురెడ్డి రచించిన రెండు నవలల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 25న శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నెల్లూరు దర్గామిట్ట రిత్విక్ ఎన్‌క్లేవ్‌లోని శ్రీ వేంకటేశ్వర విద్యాలయంలో సాహితీవేత్తలు, రచయితలు, పాఠకుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. సాహిత్యాభిమానులు హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు ప్రత్యేకంగా కోరారు.