खबर की मुख्य बातें
- బైరవరం పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన తహశీల్దార్ నాగరాజు బైరవరం: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బైరవరం పోలింగ్ కేంద్రాన్ని తహశీల్దార్ నాగరాజు సందర్శించారు.
- ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు.
- ఓటింగ్ సరళి, పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
బైరవరం పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన తహశీల్దార్ నాగరాజు
బైరవరం: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బైరవరం పోలింగ్ కేంద్రాన్ని తహశీల్దార్ నాగరాజు సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. ఓటింగ్ సరళి, పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రం పరిసరాల్లో పరిస్థితులను గమనిస్తూ ఎన్నికల విధుల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.