Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel

Tag: ఎడ్యుకేషనల్ న్యూస్

విశాఖపట్నం

ఏళ్ళ కలల సాకారం ఆనందపురం లో డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవం… సమిష్టి కృషితో నూతన భవన నిర్మాణం

విద్యార్థుల భవిష్యత్తుకు మరింత భరోసా కల్పిస్తాం: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం జిల్లా, ఆనందపురం, అక్టోబర్ 08 :: (పున్నమి ప్రతినిధి) ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆనందపురం డిగ్రీ విద్యార్థుల కల సాకారమైంది. సమష్టి కృషి, ప్రజాప్రతినిధుల చొరవతో నూతనంగా నిర్మించిన డిగ్రీ కళాశాల భవనం అందుబాటులోకి వచ్చింది. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా కేవలం ఏడాది కాలంలోనే భవన నిర్మాణాన్ని పూర్తి చేయడం అభినందనీయమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. నూతనంగా నిర్మించిన డిగ్రీ కళాశాల భవనాన్ని గురువారం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని అన్నారు. కళాశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్న ఎమ్మెల్యే.. కళాశాల చుట్టూ రక్షణ గోడ నిర్మాణంతో పాటు అవసరమైన ఫర్నిచర్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చదువుతో పాటు నైతిక విలువలు కూడా విద్యార్థుల జీవితంలో ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థి దశలోనే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, క్రమశిక్షణ, అంకితభావంతో ముందుకు సాగాలని సూచించారు. భవిష్యత్ భారతానికి మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే చొరవతో ఐదు ఎకరాల భూమి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీవాణి మాట్లాడుతూ.. పీఎం ఉషా నిధులు వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడిన సమయంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జోక్యం చేసుకుని ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి సమకూర్చేందుకు కృషి చేశారని తెలిపారు. ఎమ్మెల్యే చొరవతోనే కళాశాల భవన నిర్మాణం సాధ్యమైందని, ఈ భవనం ద్వారా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు మరింత మెరుగైన విద్యా వసతులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. విద్యాభివృద్ధికి సమష్టి సహకారం ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ చంద్రశేఖర్, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్, మహంతి శివాజీ, తాట్రాజు అప్పారావు, మీసాల సత్యనారాయణ, బి.ఆర్.బి. నాయుడు, కసిరెడ్డి దామోదరరావు, గంటా నూకరాజు, బమ్మిడి ఉమ, డి.ఎ.ఎన్. రాజు, బోని ప్రసాద్, రామరాజు, ఎర్ర రాజు, ఎల్.వి. రమణ, శ్రీను, గరే సదానంద, కాకర రమణ, నాగోతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆనందపురం విద్యా ప్రస్థానంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ డిగ్రీ కళాశాల నూతన భవనం ప్రారంభం కావడం విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రుల్లో ఆనందాన్ని నింపింది.