Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

ఉదయగిరి దాహార్తి తీర్చండి.. పంచాయతీని ఆదుకోండి!

Punnami Newsroom Published:
ఉదయగిరి దాహార్తి తీర్చండి.. పంచాయతీని ఆదుకోండి!

Story highlights

  • జాయింట్ కలెక్టర్‌కు సామాజిక కార్యకర్త ఫయాజ్ వినతి ఉదయగిరి పట్టణంలో నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సామాజిక కార్యకర్త, సీనియర్ జర్నలిస్ట్ ఫయాజ్ కోరారు.
  • సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావేదికలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు.
  • వర్షాభావంతో భూగర్భజలాలు అడుగంటాయని, నెల రోజులుగా ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.

జాయింట్ కలెక్టర్‌కు సామాజిక కార్యకర్త ఫయాజ్ వినతి
ఉదయగిరి పట్టణంలో నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సామాజిక కార్యకర్త, సీనియర్ జర్నలిస్ట్ ఫయాజ్ కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావేదికలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. వర్షాభావంతో భూగర్భజలాలు అడుగంటాయని, నెల రోజులుగా ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అలాగే పంచాయతీలో నిధుల కొరతతో ఆరు నెలలుగా సిబ్బందికి జీతాలు అందడం లేదని, పారిశుద్ధ్య ట్రాక్టర్లకు డీజిల్ కూడా కరువైందని తెలిపారు. కోర్టు ఆదేశాలతో రూ.12 లక్షలకు పైగా చెల్లించాల్సి రావడంతో ఆర్థిక సంక్షోభం తీవ్రమైందన్నారు. దీనిపై స్పందించిన జాయింట్ కలెక్టర్ తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని గ్రామీణ నీటి సరఫరా అధికారిని, పంచాయతీ సమస్య పరిష్కరించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *