నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం, చెన్నాయిపాలెం అరుంధతి వాడకు చెందిన యువత జనసేన పార్టీపై నమ్మకంతో ముందుకు కదిలింది. రావూరి మదన్మోహన్ ఆధ్వర్యంలో సుమారు 30 మంది ఉత్సాహభరితమైన జెన్-జి (Gen-Z) యువకులు జనసేన పార్టీలో చేరారు.
స్థానిక జనసేన నాయకులు మన్నెమాల సుకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలోసుకుమార్ రెడ్డి గారు స్వయంగా యువకులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ముందుకు వస్తున్న యువతతో జనసేన మరింత బలపడుతుందని సుకుమార్ రెడ్డి గారు,నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
