Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

ఉదయగిరి: పల్లెలకు రోడ్డు కష్టాలు.. ప్రజలకు తప్పని ఇక్కట్లు!

Punnami Newsroom Published:
ఉదయగిరి: పల్లెలకు రోడ్డు కష్టాలు.. ప్రజలకు తప్పని ఇక్కట్లు!

Story highlights

  • ఉదయగిరి: నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో రహదారులు అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
  • ఉదయగిరి–నందవరం ప్రధాన రహదారితో పాటు బండగానిపల్లి ఘాట్‌ రోడ్డు, కృష్ణాపురం–కుర్రపల్లి మార్గాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
  • రహదారులపై ప్రయాణం ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు, గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు.

ఉదయగిరి: నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో రహదారులు అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయగిరి–నందవరం ప్రధాన రహదారితో పాటు బండగానిపల్లి ఘాట్‌ రోడ్డు, కృష్ణాపురం–కుర్రపల్లి మార్గాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రహదారులపై ప్రయాణం ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు, గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా బండగానిపల్లి ఘాట్‌ రోడ్డు నిర్మాణం కోసం నాలుగు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారుల దుస్థితి కారణంగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు, అత్యవసర సమయాల్లో వైద్య సేవలు పొందేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టి, ఘాట్‌ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *