Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

చిగురుపాడు గ్రామంలో నాయుడుపేట పోలీసుల ప్రత్యేక అవగాహన సదస్సు.*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
చిగురుపాడు గ్రామంలో నాయుడుపేట పోలీసుల ప్రత్యేక అవగాహన సదస్సు.*

వార్త ముఖ్యాంశాలు

  • నాయుడుపేట అర్బన్, సెప్టెంబర్ 24, *గ్రామాల సందర్శనలో భాగంగా గురువారం నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిగురుపాడు గ్రామంలో పోలీసులు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
  • రానున్న ఎన్నికలను దృష్ట్యా గ్రామ ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా అధికారులు దిశా నిర్దేశం చేశారు.* *ఈ సదస్సులో పోలీస్ అధికారులు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో గ్రామాల్లో ఎలాంటి గొడవలు, అల్లర్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణం నెలకొనేలా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.
  • ముఖ్యంగా యువత, విద్యార్థులు రాజకీయ గొడవలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

నాయుడుపేట అర్బన్, సెప్టెంబర్ 24,

*గ్రామాల సందర్శనలో భాగంగా గురువారం నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిగురుపాడు గ్రామంలో పోలీసులు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. రానున్న ఎన్నికలను దృష్ట్యా గ్రామ ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా అధికారులు దిశా నిర్దేశం చేశారు.*
*ఈ సదస్సులో పోలీస్ అధికారులు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో గ్రామాల్లో ఎలాంటి గొడవలు, అల్లర్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణం నెలకొనేలా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు రాజకీయ గొడవలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అల్లర్లకు పాల్పడి, ఎన్నికల సంబంధిత కేసులలో చిక్కుకుంటే వారి భవిష్యత్తు, ముఖ్యంగా చదువుకునే విద్యార్థుల జీవితాలు నాశనమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలకు, ఉన్నత చదువులకు క్రిమినల్ రికార్డులు అడ్డంకిగా మారుతాయని స్పష్టం చేశారు.*
*దీనితో పాటు ప్రస్తుత సమాజంలో యువతను పీడిస్తున్న పలు కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు:*

*సైబర్ నేరాలపై అప్రమత్తత: ఆన్‌లైన్ మోసాలు, అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్, ఓటీపీల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.*
*గంజాయి, మత్తు పదార్థాల నివారణ:*
*గ్రామంలో గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల వాడకం, విక్రయాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, మత్తుకు బానిసై జీవితాలను పాడుచేసుకోవద్దని పిలుపునిచ్చారు.*
*రోడ్డు భద్రత నియమాలు:*
*వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, అతివేగం ప్రమాదకరమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని అవగాహన కల్పించారు.*

*ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *