Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
సాహితీ

సంగీతం – జీవకోటి అభిమతం – డా. బద్రి పీర్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సంగీతం – జీవకోటి అభిమతం – డా. బద్రి పీర్ కుమార్

వార్త ముఖ్యాంశాలు

  • సంగీతం అనేది సరిహద్దులు, సంస్కృతులు మరియు భాషలతో సంబంధం లేకుండా ప్రజలందరినీ ఏకం చేసే ఒక సార్వత్రిక భాష అని చాటి చెప్పే ముఖ్య ఉద్దేశంతో ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు.
  • ఈ సంవత్సరం 2026, జూన్ 21 ఆదివారం ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.
  • దీనిని ఫ్రెంచ్ భాషలో 'ఫెటే డి లా మ్యూజిక్' లేదా 'మేక్ మ్యూజిక్ డే' అని కూడా అంటారు.

సంగీతం అనేది సరిహద్దులు, సంస్కృతులు మరియు భాషలతో సంబంధం లేకుండా ప్రజలందరినీ ఏకం చేసే ఒక సార్వత్రిక భాష అని చాటి చెప్పే ముఖ్య ఉద్దేశంతో ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2026, జూన్ 21 ఆదివారం ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిని ఫ్రెంచ్ భాషలో ‘ఫెటే డి లా మ్యూజిక్’ లేదా ‘మేక్ మ్యూజిక్ డే’ అని కూడా అంటారు. 1982లో ఫ్రాన్స్ సాంస్కృతిక మంత్రి జాక్ లాంగ్ మరియు ప్రముఖ సంగీత దర్శకుడు మారిస్ ఫ్ల్యూరెట్ ల చొరవతో పారిస్‌లో ఉత్తర అర్ధగోళంలో సంవత్సరంలోనే అత్యంత సుదీర్ఘమైన రోజయిన జూన్ 21న మొదటిసారిగా ఈ వేడుకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఫ్రాన్స్‌లో చిన్నగా మొదలైన ఈ పండుగ ప్రస్తుతం భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా 120 కంటే ఎక్కువ దేశాలలో ఒక పెద్ద సంగీత ఉత్సవంగా జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా పాఠకుల కోసం సంగీత భావతరంగ అంతరంగ రూపమైన ఈ కమనీయ కవనతరంగం
🎸🪘🥁🪕🎻🪈🪇🎤🎧🎙️📺📽️🎞️🎬🪗📼📹
భాషల సరిహద్దులులేని సహజ గణాలు
మానసవీణానాద మధురిమలు
గుండెలయల ఆత్మీయ స్పందనలు
ప్రకృతి ప్రతిష్టించుకున్న శ్రుతిలయలు
సంగీత సమభావ స్వాగత ద్వారాలు

కుహూ కుహూ రాగాల కోయిల గొంతులో
పారుతున్న నదుల అలల సవ్వడిలో
పున్నమివెన్నెలలో వీస్తున్న చిరుగాలులలో
ప్రతిచోటా ప్రకృతి వినిపించే అద్భుత శబ్దస్వరాలే
జీవకోటిని పరవశింపజేసే సంగీతం

ప్రతిధ్వనించే అనుకరణ మనోభావాలు
పులకించు శరీర చైతన్య ప్రకంపనలు
నాదప్రవాహమై జాలువారితే సంగీతం
హృదయాంతరాలను స్పర్శించే అభిమతం
సృష్టికి ప్రతిసృష్టికి ప్రాణపదం సంగీత సుగంధం
నిర్మల మనసుకు దివ్య ఔషధ క్షేత్రం సంగీతం.
🪘🎻🎻🎻🥁🥁🥁🎤🎤🥁🥁🥁🎻🎻🎻🪘

Leave a comment

Your email address will not be published. Required fields are marked *