Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆదిలాబాదు

విద్యార్థులకు అండగా అతిథి అధ్యాపకుడు రాహుల్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విద్యార్థులకు అండగా అతిథి అధ్యాపకుడు రాహుల్

వార్త ముఖ్యాంశాలు

  • ఆదివాసి విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి అండగా నిలుస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉట్నూర్‌లో పొలిటికల్ సైన్స్ విభాగం అతిథి అధ్యాపకుడు బి.
  • రాహుల్ తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు.
  • ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఆదివాసి, కొలం మరియు ఇతర గిరిజన తెగలకు చెందిన 37 మంది విద్యార్థుల దోస్త్ ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన ఫీజులను స్వయంగా తనే చెల్లించి విద్యార్థుల్లో ఆనందం నింపారు.

ఆదివాసి విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి అండగా నిలుస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉట్నూర్‌లో పొలిటికల్ సైన్స్ విభాగం అతిథి అధ్యాపకుడు బి. రాహుల్ తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఆదివాసి, కొలం మరియు ఇతర గిరిజన తెగలకు చెందిన 37 మంది విద్యార్థుల దోస్త్ ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన ఫీజులను స్వయంగా తనే చెల్లించి విద్యార్థుల్లో ఆనందం నింపారు. దోస్త్ అప్లికేషన్ మరియు అడ్మిషన్ ఫీజుల కింద మొత్తం రూ.15,910లను రాహుల్ భరించి విద్యార్థుల ఉన్నత విద్యకు చేయూత అందించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా కళాశాల ప్రవేశానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఆయన చేసిన సహాయం ఆదర్శప్రాయంగా నిలిచింది.
ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు కళాశాల అధ్యాపకులు రాహుల్ సేవాభావాన్ని అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన చూపిన చొరవ ఇతరులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్య అనేది సమాజ అభివృద్ధికి మూలాధారమని, ఆర్థిక కారణాల వల్ల ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ సహాయం చేసినట్లు రాహుల్ తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి తన వంతు సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. రాహుల్ విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చేసిన సహాయాన్ని పలువురు అధ్యాపకులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *