Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ప్రభుత్వ డీకేటీ భూమిపై ఆక్రమణలు..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

సిద్ధవటం మండలం శేఖరాజుపల్లె రెవెన్యూ పరిధిలోని మొహిద్దిన్ సాహెబ్ పల్లె సమీపంలో సర్వే నంబర్‌ 425/1లో దాదాపు మూడు ఎకరాల ప్రభుత్వ డీకేటీ భూమి ఆక్రమణకు గురైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆ భూమిని ఆక్రమించి దానిమ్మ, జామ, తదితర చెట్లు సాగు చేస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు.ఈ విషయంపై గతంలో పలు దినపత్రికల్లోనూ కథనాలు ప్రచురితమైనప్పటికీ రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆక్రమణపై సమగ్రంగా సర్వే నిర్వహించి, భూమి ప్రభుత్వ డీకేటీ స్థలమా కాదా నిర్ధారించి, ఆక్రమణ నిజమైతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణపై అధికారులు దృష్టి సారించకపోతే మరిన్ని ఆక్రమణలకు అవకాశం ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అసైన్డ్‌ భూముల నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో అధికారులకు భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం చట్టంలో ఉంది.

ప్రభుత్వ డీకేటీ భూమిపై ఆక్రమణలు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *