Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆదిలాబాదు

జిల్లాలో విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది.
  • సోమవారం పీడీఎస్యు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ రాయిసిడాం చిత్రుకు వినతిపత్రం అందజేశారు.
  • ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు పెందూర్ దీపాలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి మడావి గణేష్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు సకాలంలో అందజేయాలని కోరారు.

ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. సోమవారం పీడీఎస్యు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ రాయిసిడాం చిత్రుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు పెందూర్ దీపాలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి మడావి గణేష్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు సకాలంలో అందజేయాలని కోరారు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు, విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, ఎంఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల మూసివేతలను నిలిపివేయాలని, విద్యాశాఖలో అక్రమ డిప్యూటేషన్లను రద్దు చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకం మేస్ ఛార్జీలను పెంచాలని, పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తే పీడీఎస్యు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా సహాయ కార్యదర్శి కనక దత్తాత్రి, పివైఎల్ రాష్ట్ర నాయకులు మేస్రం మారుతి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *