Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, శాంతికుమారి ఆధ్వర్యంలో సీఎంకు ఘన స్వాగతం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, శాంతికుమారి ఆధ్వర్యంలో సీఎంకు ఘన స్వాగతం

ఉదయగిరి: వరికుంటపాడు మండలం రామాపురంలో నిర్వహించిన పల్లె పండుగ–3.0 కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేశారు. ఈ సందర్భంగా రామాపురం హెలిప్యాడ్ వద్ద ఉదయగిరి మాజీ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ మేకపాటి శాంతికుమారి ముఖ్యమంత్రికి హృదయపూర్వక స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందించి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి సభా ప్రాంగణానికి చేరుకుని పల్లె పండుగ–3.0 కార్యక్రమంలో పాల్గొన్నారు. రామాపురం వేదికగా గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన పలు పనులకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ పరిసరాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, శాంతికుమారి ఆధ్వర్యంలో సీఎంకు ఘన స్వాగతం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *