Wednesday, 22 April 2026

Blog

Others

భారత సైన్యం కు రక్షణ పరికరాలు (వార్త)

భారత సైన్యానికి రూ.79,000 కోట్ల రక్షణ పరికరాలు భారత సైన్యం, నేవీ, ఎయిర్‌ఫోర్స్ కోసం రూ.79,000 కోట్లతో అత్యాధునిక రక్షణ పరికరాల కొనుగోళ్లకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. పాకిస్తాన్, చైనాలకు వార్నింగ్ మెసేజ్ ఇచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ ఆర్మీకి నాగ్ మిస్సైల్ సిస్టమ్, భూ-ఆధారిత మొబైల్ ELINT వ్యవస్థ, ఇండియన్ నేవీకి ల్యాండింగ్ ప్లాట్‌ఫామ్ డాక్స్, 30mm నావల్ సర్ఫేస్ గన్స్, EOIRST వ్యవస్థల వంటివి కొనుగోలు చేయనున్నారు

విశాఖపట్నం

రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు.

*అఖిల భారత విద్యార్థి సమైక్య (AISF)** *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించారు. పెండింగ్లో ఉన్న 6,400 ఫీజ్ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలి. పి.పి.పి పేరుతో ప్రభుత్వ 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయాలనే ఆలోచన వీడాలి. ప్రభుత్వ ఎస్సీ ,ఎస్టీ ,బిసి సంక్షేమ హాస్టల్ లో మౌలిక వసతులు కల్పించి ప్రతి శాశ్వత భవనాలు కేటాయించి వార్డెన్ ,కుక్, ట్యూటర్ పోస్టులు భర్తీ చెయ్యాలి. సంక్షేమ హాస్టల్ లో ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఇదే విద్యార్థికి నెలకి 3000 రూపాయలు మెస్ ఛార్జీలు పెంచాలి. *విశాఖ స్టీల్ ప్లాంట్ :* రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సు యాత్ర సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఆంధ్ర కేసరి సెమినార్ హాల్ లో ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలపై అవగాహన సదస్సు *ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉల్లం.నాగరాజు అధ్యక్షతన* నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా *ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి కె. రామాంజనేయులు* పాల్గొని రాష్ట్రంలో విద్యారంగం మొత్తం ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తుందని అందులో భాగంగానే 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నారని విమర్శించారు. ఇలా విద్యావ్యవస్థ ప్రైవేటీకరణ అయితే పేద, బడుగు బలహీన వర్గాల పిల్లలు పూర్తిగా చదువుకు దూరం అవుతారన్నారు. *ఏ.ఐ.టి.యు.సి జాతీయ ఉపాధ్యక్షులు విశాఖ ఉక్కు పోరాట కమిటీ చైర్మన్ ఆదినారాయణ గారు* మాట్లాడుతూ విశాఖ ఉక్కు అనేకమంది పోరాట త్యాగాల ఫలితంగా ఏర్పడిందని ఇటువంటి ఉక్కుకి సంతకడులో కేటాయించకుండా నష్టాల్లో ఉంది అని ప్రజలను నమ్మిస్తూ ప్రైవేటీకరణ చేసిందని అన్నాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనరాశిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు ప్రైవేటీకన్ వైపు అడుగులు వేస్తూ ప్రజలను మోసం చేసిందన్నారు. మొన్ననే విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో శంఖారావం పూరించడం జరిగిందని భవిష్యత్తులో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై వివిధ రూపాలలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడదామని తెలిపారు. *ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గుజ్జుల.వలరాజు, బందెల నాసర్ జి* మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని గిరిజన హాస్టల్ లో మరణాలు అరికట్టాలని అలాగే పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77 రద్దు చేయాలని పెండింగ్లో ఉన్న 6400 కోట్ల రూపాయలు ఫీజ్ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని తెలిపారు. రెండు రోజులపాటు విశాఖపట్నంలో ఏఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా సమితి సిటీ లో మరియు స్టీల్ ప్లాంట్లో నిర్వహించిన బహిరంగ సభ, అవగాహన సదస్సు విజయవంతంగా ముగిసాయన్నారు. బస్సు యాత్రలో ప్రవేశపెట్టిన డిమాండ్స్ బస్సుయాత్ర ముగిసే లోపు పరిష్కరించకపోతే భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ సదస్కు *ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె. అచ్యుతరావు ప్రత్యక్షంగా పాల్గొని మద్దతు తెలిపారు.* కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిలు ఎన్. నాగభూషణ్, మస్తాన్ షరీఫ్ కుళాయి స్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు చలపతి, జిల్లా నాయకత్వం శేఖర్ మౌనిక కిరణ్ అభిషేక్ కంజీర గణేష్ హారిక పాల్గొన్నారు.

తిరుపతి

కర్నూలు సంఘన చాలా బాధాకరం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం అత్యంత బాధాకరం అని శ్రీకాళహస్తిల శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు.ఈ రోడ్డు ప్రమాదం లో బస్సు కాలిపోయే దృశ్యాలు చూస్తే హృదయం ద్రవించుకుపోతుందని,ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ట్రావెల్స్ యాజమాన్యులు మరియు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని వారు తెలియజేశారు.

విశాఖపట్నం

ఘనంగా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివారి జన్మదిన మహోత్సవాలు*

*ఘనంగా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివారి జన్మదిన మహోత్సవాలు* *విశాఖపట్నం,పున్నమి ప్రతినిధి*: విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివారి జన్మదినాన్ని పురస్కరించుకొని, శనివారం పీఠ ప్రాంగణంలో భక్తిశ్రద్ధల మధ్య జన్మదిన మహోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం తొలిపూట నుంచే పీఠంలోని దేవాలయాలలో వేదమంత్రాల నడుమ మంగళవాద్యాలతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృతాలతో మహాభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో అభిషేకం నిర్వహించి, పుష్పాలతో విశేష అలంకారం చేశారు. తరువాత ఋత్వికుల వేదఘోషల మధ్య సుబ్రహ్మణ్య హోమం, ఆయుష్ హోమం నిర్వహించారు. వేద పండితుల వేదపారాయణం, మంత్రోచ్చారణలతో పీఠ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం పీఠ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది మహిళలకు ఉచిత చీరల పంపిణీ చేపట్టారు. పీఠాధిపతుల ఆశీస్సులతో పీఠం సిబ్బంది మహిళలకు చీరలు అందజేశారు. ఈ సందర్భంగా పీఠ ప్రతినిధులు మాట్లాడుతూ — “పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివారు సమాజానికి ఆధ్యాత్మిక మార్గదర్శకులు. ఆయన ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ఈ రోజును భక్తులు ఉత్సాహంగా జరుపుకుంటారు. పీఠం ద్వారా అనేక సేవా, విద్యా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి” అని తెలిపారు. పీఠంలోని వేదపాఠశాల విద్యార్థులు వేద పారాయణం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ తీర్థ ప్రసాదం పంపిణీ చేశారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని పీఠ పాలిత ఆలయాలు మరియు పీఠ వివిధ శాఖలలో కూడా ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.

విశాఖపట్నం

ప్రతి ఆదివారం విశాఖలో ఆర్గానిక్ సంత

ప్రతి ఆదివారం విశాఖలో ఆర్గానిక్ సంత *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* – ఆదివారం ఉదయం 9 గంటల నుండి ఎయు నార్త్ క్యాంపస్ ఎం హబ్ లో – దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, జిల్లా అధ్యక్షులు, గో ఆధారిత ప్రకృతి రైతులు సంఘం విశాఖ నగరంలో నిర్వహించె ప్రకృతి ఆధారంగా నుండె పంటల సంతను జయప్రదం చేయండి అని గో ఆధారిత ప్రకృతి రైతులు సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం ఎ హబ్ వద్ద కలిసిన విలేఖరులతో మాట్లాడారు. 26 వి తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకూ  ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఎ హబ్, మద్దిలపాలెం లో నిర్వహించబోయే విశాఖ ఆర్గానిక్ సంతను జయప్రదం చేయాలని కోరారు. ఎటువంటి హానికర కెమికల్స్ వాడకుండా పండించిన బియ్యం, పప్పులు, కూరగాయలు,చెక్క గానుగ నూనెలు, బెల్లం, ఖాదీ, చేనేత వస్త్రాలు విక్రయించడం జరుగుతుంది అన్నారు. కంపోస్టింగ్, టెర్రస్ గార్డెన్, బయో ఫెర్టిలైజర్స్, హస్తకళలు మొదలైన వాటిపై వర్క్ షాప్లు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి పాలేం నేచురల్స్ అశోక్ , గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం తదితరులు పాల్గొని మాట్లాడారు .

తెలంగాణ

బైక్ ను ఢీకొట్టిన స్కూల్ బస్సు.. యువకుడు మృతి

, ఇబ్రహీంపట్నం: అక్టోబర్ 25 పున్నమి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను స్కూల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందిన ఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రావిర్యాల గ్రామం వాండర్ల సమీపంలోని ఔటర్ సర్వీస్ రోడ్డు పై హన్మకొండ జిల్లా, ధర్మసాగర్ మండలం, నర్సింగ్ రావు గ్రామం, ప్రకాష్ నగర్ కు చెందిన బండారి వినోద్(22) S% సంపత్, ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా వినోద్ బైక్ పై తుక్కుగూడ వైపు ప్రయాణిస్తుండగా అదే సమయంలో ఓ ప్రైవేటు స్కూల్ కు చెందిన బస్సు (TS07UE7933) డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఎదురుగా వచ్చిన బైక్ ను బలంగా ఢీ కొట్టాడు. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న యువకుడికి తలకు, శరీర భాగాలకు తీవ్ర గాయాలు కావడం వలన అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

తెలంగాణ

ఓఆర్ఆర్‌పై బస్సు బోల్తా.. ఆరుగురికి గాయాలు పెద్ద అంబర్ పేట్ వద్ద ప్రమాదం

పున్నమి అక్టోబర్ 25 రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ట్ మండలం: కర్నూలు జిల్లాలో వి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటన మరువకముందే మరో రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇవాళ తెల్లవా రుజామున బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న జీపీ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టడం తో వాహనం ముందు భాగం ధ్వంసం అయింది. అంతలోనే పెద్ద అంబర్ పేట్ దగ్గర మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. హైద రాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ప్రయాణికులతో మియాపూ ర్ నుంచి గుంటూరు వెళ్తున్న న్యూగో ట్రావెల్స్ ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడటంతో ఆరుగురు ప్రయా ణికులకు తీవ్రగాయాలు కాగా మరో 9మంది స్వల్పంగా గాయపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి దిగుతుండగా బస్సు అదుపు తప్పి బోల్తాప డినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను అంబులెన్సులో సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ఉన్నట్టు సమాచారం. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి

E-పేపర్

కష్టపడి కాదు ఇష్టపడి చదవాలి చిక్కిరి శ్రీకాంత్ పేద్దపులి నాగారం గ్రామంలో హై స్కూల్ లో సమస్యల పట్ల నాయకులు స్పందించాలి తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిక్కిరి శ్రీకాంత్* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం గ్రామంలో టిఎస్ఎస్ఓ తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ చిక్కిరి శ్రీకాంత్ మాట్లాడుతూ… రాష్ట్ర

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ రంగారెడ్డి జిల్లా 9133469506 కష్టపడి కాదు…ఇష్టపడి చదవాలి.. చిక్కిరి శ్రీకాంత్* *పెద్దపులి నాగారం గ్రామంలో హై స్కూల్ లో సమస్యల పట్ల నాయకులు స్పందించాలి* *తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిక్కిరి శ్రీకాంత్* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం గ్రామంలో… *టిఎస్ఎస్ఓ* తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ చిక్కిరి శ్రీకాంత్ మాట్లాడుతూ… రాష్ట్ర వ్యవస్థాపకులు లక్ష్మీ నివాస్ ఆదేశాల మేరకు.. ఉదయం ఫోన్ చేసి చెప్పిన వెంటనే స్పందించి హైస్కూల్లో ఉన్న సమస్యల పట్ల విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా.. మధ్యన భోజన పథకంలో ఎవరు భోజనం చేయడం లేదని తెలియడంతో.. పదవ తరగతి క్లాస్ రూమ్ లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడగా.. అబ్బాయిలు కొంతమంది భోజనం చేసినప్పటికీ.. అమ్మాయిలు మాత్రం ఇంటి నుండి భోజనం తెచ్చుకోవడం పట్ల ఉన్న సమస్యను అడిగి తెలుసుకోవడం జరిగింది అబ్బాయిలు మాత్రం పేపర్ ప్లేట్స్ తెచ్చుకొని తింటునట్టుగా తెలియజేశారు అమ్మాయిలు ఏకంగా ఇంటి భోజనం తెచ్చుకొని తింటున్నట్టుగా చెప్పడంతో.. వెంటనే అక్కడ ఉన్న సమస్యల పైన.. ప్రధానోపాధ్యాయులైనటువంటి వెంకటయ్య గౌడ్ నీ అడగడంతో.. విద్యార్థినీ విద్యార్థులకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వినకుండా.. అబ్బాయిలు పేపర్ ప్లేట్స్ తెచ్చుకోవడం జరుగుతుంది అమ్మాయిలు ఏకంగా ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవడం జరుగుతుంది అని స్పష్టం చేయడం జరిగింది… ఆరవ తరగతి ఏడవ తరగతి విద్యార్థిని విద్యార్థులు చక్కగా భోజనం చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది చిక్కిరి శ్రీకాంత్ విద్యార్థులతో మాట్లాడుతూ.. పదవ తరగతి పిల్లలకు ఒక ఛాలెంజ్గా తీసుకోవాలని.. తెలియజేస్తూ.. ఐదు మంది అమ్మాయిలను ఐదు మంది అబ్బాయిలను స్టేజ్ పైకి పిలిపించి.. ఒక్కొక్కరు ఒక ఐదు మంది తో.. పేపర్ ప్లేట్స్ కాకుండా.. ప్లేటు మరియు గ్లాస్ తెచ్చుకొని స్కూల్లోనే భోజనం చేసే విధంగా కమిటీని వేయడం జరిగింది.. విద్యార్థులు వెంటనే స్పందించి.. రేపటి నుండే తక్షణమే ప్లేట్స్ గ్లాస్ లు ఇంటి నుంచి తెచ్చుకొని స్కూల్లోనే భోజనం చేస్తామని తెలియజేయడం జరిగింది.. అలాగే కమిటీ ఎవరైతే పది మంది ఉన్నారో.. వంటలను ఏ విధంగా వండుతున్నారు అనే బాధ్యత కూడా మీరే తీసుకోవాలని.. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని చూడకుండా.. మన స్కూల్ మనమే బాగుపరచుకోవాలని విద్యార్థులకు తెలియజేయడంతో పాటు స్కూల్లో వంట చేస్తున్నటువంటి వాళ్లని సైతం భోజనం కరెక్ట్ గా మీరు చేసినట్లయితే పిల్లలు బయటనుంచి తెచ్చుకునే అవకాశం ఉండదు అని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఇలాంటి సమస్యలు మళ్లీ తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ వ్యవస్థకి మళ్లీ ఇలాంటి కంప్లైంట్ వస్తే మాత్రం ఏకంగా.. రాష్ట్ర స్థాయి నుంచి టిఎస్ఎస్ఓ వ్యవస్థాపకులు లక్ష్మీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజల దృష్టికి మరియు నాయకుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని హెచ్చరించడం జరిగింది

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తుఫాన్ ఎఫెక్ట్ – స్కూళ్లకు సెలవులు!

తుఫాన్ ఎఫెక్ట్ – పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన అధికారులు! దక్షిణ తీరాంధ్రపై తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. భారీ గాలులు, వర్షాలు ముప్పుగా మారే అవకాశం ఉండడంతో జిల్లా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కృష్ణా జిల్లాలో అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తూర్పు గోదావరి మరియు అన్నమయ్య జిల్లాల్లో 27, 28 తేదీల్లో విద్యాసంస్థలు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. చీరాల డివిజన్‌లో కూడా సోమవారం నుంచి మూడు రోజులపాటు స్కూల్ హాలిడేస్ అమల్లోకి వస్తున్నాయి. తుఫాన్ తీవ్రతను బట్టి తరువాతి నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని హెచ్చరించారు. వర్షాలు, గాలులు మరింత ఉధృతంగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని అధికారులు సూచించారు.

తిరుపతి

ముళ్ళపూడి ఎస్ టి కాలనీ వాసులకు అండగా వే ఫౌండేషన్

శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ముళ్ళ పూడి ఎస్టి కాలనీ నందు సుమారు 60 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి.గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి విస్తారమైన వర్షాల కారణంగా వారు పనులు లేక ఇబ్బంది పడుతున్నారని సిపిఐ శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య వే ఫౌండేషన్ వారికి సమాచారం అందించారు.వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ పైడి అంకయ్య వెంటనే స్పందించి 60 కుటుంబాలకు సరిపడా బియ్యము కూరగాయలు పాలు బ్రెడ్ అందించారు.ఈ సందర్భంగా పైడి అంకయ్య మాట్లాడుతూ ప్రకృతి విపత్తు ఎప్పుడు జరిగినా కూడా వే ఫౌండేషన్ దాతల సహకారంతో సహాయ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.