Monday, 13 April 2026

Blog

అనకాపల్లి

తీవ్ర వాయుగుండంగా మొoధా తుపాన్

అనకాపల్లి జిల్లా అక్టోబర్ 26 పున్నమి న్యూస్ ప్రతినిధి: అందరూ DYEO/MEO/HM లకు తెలియజేయనది ఏమనగా మన గౌరవ కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ గారు ఆదేశాల మేరకు 27.10.2025 నుండి 29.10.2025 వరకు అన్ని యాజమాన్యలు అనగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలకు తుపాను హెచ్చరిక కారణంగా ముందస్తుగా సెలవు ప్రకటించడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పాఠశాల కూడా తెరవదానికి ఎవరికి అనుమతి లేదు, ఏదైనా ప్రైవేట్ పాఠశాల తెరిచినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవు. ఇట్లు జిల్లా విద్యాశాఖాధికారి, అనకాపల్లి

ఖమ్మం

ఖమ్మంలో ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి

పున్నమి ఖమ్మం జిల్లా ప్రతి నిధి బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి ఖమ్మంలో ప్రధాని నరేంద్ర మోదీ గారి ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని జిల్లా బీజేపీ నాయకులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత కనమర్లపూడి ఉపేందర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారి ఇంట్లోనే ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని జిల్లా నాయకులతో కలిసి వీక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, నున్న రవి కుమార్, నంబూరి రామలింగేశ్వరావ్, ఈవి రమేష్, విజయ్ రాజు, అల్లిక అంజయ్య, గుత్త వెంకటేశ్వర్లు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

రైతులు ఎలక్షన్ లో పాల్గొన కూడదని కుట్ర పూరితంగా నామినేషన్లని రిజెక్టు చేశారు

26-10-2025 పున్నమి ప్రతినిధి: ఆలంపల్లి దుర్గేష్ 9133469506 *ఫార్మా రైతులు ఎలక్షన్ లో పాల్గొన కూడదని కుట్ర పూరితంగా నామినేషన్లని రిజెక్టు చేశారు* కాంగ్రెస్ పార్టీ 2023 ఎలక్షన్ లో మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలని తుంగలో తొక్కి ఫార్మా సిటీ ని రద్దు చేయకుండా, రైతుల భూములని ఆన్లైన్ లో ఎక్కించి అన్ని హక్కులు కల్పిస్తామని అప్పుడు మాట ఇచ్చి, గెలిచిన తర్వాత మోసం చేసి, పోలీసులని పెట్టించి భూములు గుంజుకుటుందన్న వాస్తవాలు మొత్తం తెలంగాణ ప్రజలకి తెలియచేయ్యాలని, ఫార్మా రైతులు జూబిలీ హిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్ లో నామినేషన్ వేశారు. నామినేషన్ వెయ్యకుండా కాంగ్రెస్ సర్కార్ అడుగడుగునా అనేక అడ్డంకులు సృష్టించారు. అసలు సర్టిఫైడ్ ఎలక్టోరల్ రోల్స్ ఇయ్యటానికి ఇబ్రహీంపట్నం RDO ఆఫీస్ చుట్టు 4 రోజులు తిప్పించుకున్నారు. ఆఖరికి ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చినా, సర్టిఫికెట్ ఇచ్చేశానని వారికి అబద్దం చెప్పారు. ఆఖరికి మీరు ఇచ్చేదాక మీ ఆఫీస్ నుంచి కదిలేదు లేదని రైతులు తేల్చి చెప్పాడంతో చేసేది లేక ఇచ్చారు. రైతుల గురించి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎంక్వయిరీ చేస్తూ భయ పెట్టేందుకు ప్రయత్నించారు. అన్ని ఎదురుకుని 21-10-2025 తేదిన రైతులు నామినేషన్ వేశారు. నామినేషన్ రోజునే ఫార్మా రైతులు బంజారా హిల్స్ తాసిల్దార్ ఆఫీస్ వద్ద చేసిన ర్యాలీ, రైతుల ఇంటర్వ్యూలు మొత్తం రాష్ట్ర మీడియా లో హల్చల్ చేసింది. ఫార్మా రైతులు పోటీలో ఉంటే ప్రభుత్వానికి నెగటివ్ ప్రచారం జరుగుతుంది అని, మొత్తం ఫార్మా రైతుల నామినేషన్స్ ని రిజెక్ట్ చేశారు. రిజెక్షన్ కి కారణాలు అడిగితే ఎలక్షన్ నిర్వహణ అధికారులు మీరు ఇచ్చిన అఫిడవిట్ లో “బ్లాంక్స్” అంటే ఖాళీలు ఉన్నాయి అన్నారు. అఫిడవిట్ లో నాలుగు కాలమ్స్ ఉంటే ఒక కాలమ్ లో రాసిన మేటర్ ఎక్కువగా ఉండి పక్క పేజీలో ఆ కాలమ్ లో మేటర్ ఉండి, మిగతా కాలమ్స్ ఖాళీగా ఉన్నాయి. ఇది కంటిన్యూ అయినదే తప్ప ఖాళీలు కావు. ఇదే విధమైన ఖాళీలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇచ్చిన 4 అఫిడవిట్స్ లో ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి అఫిడవిట్స్ అన్నిటీలో కూడా ఇలా ఖాళీలు ఉన్నాయి. అయన వన్నీ కూడా accept చేశారు. దీపక్ రెడ్డి ఇచ్చిన అఫిడవిట్ ఒక దాంట్లో అయితే ఆయన ఫోటో కూడా లేదు. అది కూడా accept చేశారు. కానీ బ్లాంక్స్ ఉన్నాయని ఫార్మా రైతుల నామినేషన్ రిజెక్టు చేశారు. ఇదే కారణం చెప్పి RRR రైతుల నామినేషన్స్ అన్ని రిజెక్టు చేశారు. ఇది ఖచ్చితంగా కుట్ర పూరితంగా జరిగింది. ఈ విషయం గురించి మేము జనరల్ అబ్సర్వర్ , అట్లాగే చీఫ్ ఎలక్షన్ కమీషనర్, న్యూ ఢిల్లీ ఫిర్యాదు చేసాము. ఒక పక్క రాహుల్ గాంధీ నేను రాజ్యాంగాన్ని రక్షిస్తాను, ప్రజా స్వామ్యాన్ని రక్షిస్తాను అని అంటారు. మరీ వాళ్ళ ప్రభుత్వమే రాజ్యాంగ విరుద్ధంగా, ప్రజా స్వామ్యాన్ని కాలరాస్తుంటే ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. ఇట్లు ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ

ఖమ్మం

భూక్యా విజయ్‌ను పరామర్శించిన బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి

పున్నమి ప్రతి నిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షుడు భూక్యా విజయ్‌పై 18వ తేదీన జరిగిన దాడి ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆదివారం నాడు బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి రక్ష హాస్పిటల్‌లో ఆయనను పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ధైర్యం చెప్పిన ఆయన, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ కోశాధికారి దేవకీ వాసుదేవరావు జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, నంబూరి రామాలింగేశ్వరరావ్, గుత్త వెంకటేశ్వర్లు, ఈవి రమేష్ రుద్ర ప్రదీప్, విజయ్ రాజు బీజేపీ నాయకులు ఆయనతో కలిసి ఉన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

లక్ష దీపోత్సవానికి విపీఆర్ దంపతుల అంకురార్పణ

విపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 6, 7, 8 తేదీలలో నెల్లూరు వీఆర్ కళాశాల మైదానంలో జరగబోయే లక్ష దీపోత్సవ మహోత్సవానికి అంకురార్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు హాజరై గుంజ ప్రతిష్ట చేసి అంకురార్పణ నిర్వహించారు. లక్ష దీపోత్సవం ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ప్రతీకగా నిర్వహించబడుతుందని, వేలాది మంది భక్తులు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ మహోత్సవాన్ని లక్ష దీపోత్సవ కమిటీ సభ్యులు కంచర్ల భాస్కర్ శర్మ, ఆమంచర్ల ప్రభాకర్, విజయసారధి, సునీల్ మరియు వారి మిత్ర బృందం నేతృత్వంలో విస్తృతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ ఇంటిలో భక్తి దీపం వెలిగేలా, సమాజంలో శాంతి, ఐక్యత, ఆధ్యాత్మికత ప్రసరించేందుకు ఈ దీపోత్సవం ఒక ప్రేరణగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.

కాకినాడ

కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ,భారీ తుఫాను ప్రభావ రీత్యా ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలకు అక్టోబర్ 27 నుండి 31 వరకు సెలవు ప్రకటించారు.

పున్నమి న్యూస్, పెద్దాపురం 26/10 కాకినాడ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్, వారి ఆదేశాల మేరకు రానున్న అతి భారీ తుఫాను ప్రభావ రీత్యా కాకినాడ జిల్లాలో గల అన్ని ప్రభుత్వ ప్రైవేటు యాజ మాన్యాలలోని అన్ని పాఠశాలలకు అక్టోబర్ 27 నుండి 31 వరకు సెలవు ప్రకటించారు. ఎట్టి పరిస్థితులలోనూ తదుపరి సమాచారం ఇచ్చేవరకు ఏ పాఠశాలలను నిర్వహించ రాదు అన్నారు. ఉప విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారులు , ప్రధానోపాధ్యాయులు పాఠశాల యొక్క రికార్డులన్నీ సురక్షితంగా ఉండే విధంగా తగు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉండి వారు తుఫాను పునరావాస కేంద్రం నిర్వహణ నిమిత్తము పాఠశాల ఆవరణ కోరినట్లయితే వారికి పాఠశాల తాళాలను అప్పగించ వలసిందిగా ఆదేశించారు. తుఫాను రీత్యా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పాఠశాల విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా సమాచారాన్ని తెలియ పరచాలన్నారు. ఉప విద్యాశాఖ అధికారులు , మండల విద్యాశాఖ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారి వారి అత్యవసర ఆదేశముల కొరకు నిరంతరం అందుబాటులో ఉండవల సిందిగా ఆదేశించారు. ప్రధానోపాధ్యాయులు ,మండల విద్యాశాఖ అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించ వలసిందిగా కాకినాడ కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్, ఆదేశించారు .

హైదరాబాద్

రైతు నేస్తం -ముప్పవరపు ఫౌండేషన్ సంయుక్తము గా రైతు పురాష్కరాలు ప్రధానం

పున్నమి ప్రతి నిధి రైతు నేస్తం, ముప్పవరపు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వ్యవసాయ రంగంలో విశేష సేవలందించిన పలువురికి పురస్కారాలు అందజేశారు. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమం లో భారత మాజీ ఉప రాష్ట్ర పతి ముప్ప వరపు వెంకయ్య నాయుడు, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరావ్, ముప్ప వరపు హర్ష వర్ధన్ లు పాల్గొన్నారు ఈ సం ధర్భముగా ముప్పవరపు వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఈ స్ఫూర్తిని 15 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు, వారికి చేదోడుగా నిలుస్తున్న శ్రీ ముప్పవరపు హర్షవర్ధన్‌లకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీ కొసరాజు చంద్రశేఖర్ రావు, “భూమిరత్న” బిరుదును పొందిన భూమి హక్కుల కార్యకర్త శ్రీ ఎం. సునీల్ కుమార్, “కృషిరత్న” బిరుదును అందుకున్న చత్తీస్‌ఘడ్ రాష్ట్ర ఔషధ మొక్కల బోర్డు ముఖ్య కార్యనిర్వాహణాధికారి శ్రీ జొన్నలగడ్డ చంద్రశేఖర (JACS) రావులకు సహా రైతు, శాస్త్రవేత్త, నూతన ఆవిష్కరణలు, విస్తరణ విభాగాల్లో పురస్కారాలు అందుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. రైతుల కష్టం లోకానికి అవసరం అయినప్పటికీ, వారికి సంఘటిత శక్తి లేకపోవడం వల్ల తగిన ప్రాధాన్యత దక్కడం లేదని పేర్కొన్నారు. పట్టణాలు, పరిశ్రమలతోపాటు గ్రామాలు, వ్యవసాయ రంగాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పోషకాహార లోపం (Hidden Hunger) నివారణకు, ఎం.ఎస్. స్వామినాథన్ స్ఫూర్తిని తీసుకొని, రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి సిరిధాన్యాల ఉత్పత్తికి ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. యువతరాన్ని ఈ దిశగా చైతన్యవంతం చేయడం అవసరమని అన్నారు. అదే విధంగా రైతులు వ్యవసాయం మాత్రమే కాకుండా అనుబంధ రంగాలపైనా దృష్టి పెట్టి, పరస్పరం సమస్యలను పంచుకొని సంఘటితంగా పరిష్కారాలను అన్వేషించాలన్నారు. అప్పుడే రైతు స్వావలంబన సాధ్యమవుతుందని వెంకయ్య పేర్కొన్నారు.

హైదరాబాద్

రైతు నేస్తం -ముప్పావరపు ఫౌండేషన్ సంయుక్తము గా రైతు పురాష్కరాలు ప్రదానం

భక్తి

స్వర్ణలింగేశ్వర స్వామి వార్షికోత్సవము

నెల్లూరు రూరల్ {పున్నమి ప్రతినిధి }అక్టోబర్ 26శ్రీ స్వర్ణలింగేశ్వరస్వామి వార్షికోత్సవం ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం. గణేష్ ఘాట్, నెల్లూరు భక్త మహాశయులా శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైన మరియు విశేషమైన కార్తీక పౌర్ణమి సందర్భముగా శ్రీ స్వర్ణలింగేశ్వరస్వామి శ్రీ ఇరుకుల పరమేశ్వరి అమ్మవార్ల ఆశీస్సులతో లోక కళ్యాణార్ధం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, శరదృతువు కార్తీకమాసం తేది 05-11-2025 బుధవారం ఉదయం 6-00 ల శ్రీ మల్లికార్జునస్వామి తాత్కా లింగ చేసి స్వామి వారికీ అభిషేకాలు పూజలు నిర్వహించెదరు. భక్తులు. స్వహస్తములతో అభిషేక పూజలు నిర్వహించెదరు. తదనంతరం ఆదిదంపతులు పార్వతి పరమేశ్వరులు. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వార్ల ణం అత్యంత వైభవముగా జరుపబడును సాయంత్రం 4-30 గంటలకు శ్రీ శివకేశవ పీఠం అధ్యక్షులు పూరు శ్రీ శ్రీ శ్రీశ్రీ మాతా వారి ఆధ్వర్యంలో ఉపోత్సవద్యాని, గంగాహారతి, కార్తీక మహాచిపోత్సవ కార్యక్రమం జరుగును తేది 06-11-2025 గురువారం ఉదయం 10-00 గం నుండి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం. అన్నవరం వారిచే సామూహిక శ్రీ రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము జరుగును. తేది. 07-11-2025 శుక్రవారము ఉదయం 10-00 గం నుండి తుది తపోవనం పీఠాధిపతులు పూజ్యశ్రీ శ్రీశ్రీశ్రీ సచ్చిదానం తిస్వామి వారి కరకమలములతో శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామి దేవాలయం వార్షికోత్సవం అతివైభవముగా నిర్వహించబడును: పూలా కార్యక్రమములు నవంబర్ 5,6,7 తేదీలలో దీపోత్సవ వ్యాలి, గంగా హారతి కార్తీక దీపోత్సవం ప్రారంభం శ్రీమతి గ్ ట్రస్ట్ 7-30 సాంస్కృతిక కార్యక్రమాలు 10-00ల నుండి శ్రీ వీర సత్యనారాయణ స్వామి దేవాలయం, అన్నవరం వారిచే సామూహిక శ్రీ రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము జరుగును. రాత్రి 7-30 గంటలకు: సాంస్కృతిక కార్యక్రమాల ఉదయం గం॥ 10-00 ల నుండి తుని, తపోవనం పీఠాధిపతులు పరాజశ్రీ శ్రీశ్రీశ్రీ సరస్వతిప్పామి వారి కరకమలములతో శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామి దేవాలయం వార్షికోత్సవం అతివైభవముగా నిర్వహించబడును.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.