Saturday, 11 April 2026

Blog

ఎన్ టి ఆర్ జిల్లా

సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్నాము: ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను

ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సనాతన ధర్మ పరిరక్షణకు జనసేన పార్టీ తగిన కృషి చేస్తోందని తెలిపారు. మొదటి కార్తీక సోమవారం సందర్భంగా నిర్వహించిన కార్తీకమాస దీపోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈకార్యక్రమాన్ని జనసేన పార్టీ ఆరో డివిజన్ అధ్యక్షులు పల్లి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సామినేని ఉదయభాను మాట్లాడుతూ — “జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటూనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తోంది. అదే సమయం లో హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి జనసైనికుడు అంకితభావం తో పనిచేస్తున్నాడు” అని పేర్కొన్నారు. అలాగే, ఆయన అన్నారు కార్తీక మాసం సనాతన ధర్మ విశిష్టత ను తెలియజేసే పవిత్ర మాసమని, ఈ నెలలో హిందువులు దేవుళ్లకు, దేవతా మూర్తులకు పూజలు, దీపారాధ నలు చేయడం శాశ్వత సంప్రదాయమని చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక మహిళలు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపోత్సవాన్ని విజయవంతం చేశారు.

అన్నమయ్య

మోంథా’ తుఫాను ప్రభావం: పునరావాస కేంద్రం సిద్ధం

మోంథా’ తుఫాను ప్రభావం: పునరావాస కేంద్రం సిద్ధం -చిట్వేల్ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఏర్పాట్లు పూర్తి: ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు వెల్లడి -అసత్య ప్రచారాలు నమ్మొద్దు: ప్రజలకు అధికారుల విజ్ఞప్తి** చిట్వేల్, అక్టోబరు 27: పున్నమి ప్రతినిధి ‘మోంథా’ తుఫాను ప్రభావం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చిట్వేల్ మండలంలో పునరావాస కేంద్రం సిద్ధమైంది. చిట్వేల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్‌) నందు తుఫాను పునరావాస కేంద్రం ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ప్రధానోపాధ్యాయులు బి.దుర్గరాజు తెలిపారు. -అసత్య ప్రచారాలు నమ్మొద్దు: ప్రధానోపాధ్యాయులు బి.దుర్గరాజు మాట్లాడుతూ, మోంథా తుఫాను గురించి సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ అధికారుల ద్వారా జారీ చేయబడిన అధికారిక వార్తలనే నమ్మాలని సూచించారు. “తుఫాను పరిస్థితులు చక్కబడే వరకూ ప్రజలు సురక్షిత నివాసాలలోనే ఉండాలి. అత్యవసరమైన ముఖ్యమైన పనులుంటేనే బయటకు రావాలి. ప్రభుత్వ అధికారుల నుండి వచ్చే సూచనలను తప్పక పాటించాలి” అని ఆయన ప్రజలకు తెలియజేశారు. -ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధం: పాఠశాల ఎన్.సి.సి. అధికారి పసుపుల రాజశేఖర్ మాట్లాడుతూ, చిట్వేల్ మండలంలోని ప్రజలందరూ ధైర్యంగా, అప్రమత్తంగా ఉండాలని కోరారు. తుఫాన్ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందన్న విషయాన్ని ప్రజలందరూ గమనించాలన్నారు. -సహాయానికి ఉపాధ్యాయులు సిద్ధం: మండల విద్యా శాఖ అధికారులు మాట్లాడుతూ, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు మండలంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు బాధితులకు తోడ్పాటు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజలకు అండగా ఉండేందుకు విద్యా శాఖ సిబ్బంది తమ వంతు సాయం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. -పునరావాస కేంద్రంలో ఏర్పాట్లు: తుఫాను బాధితులకు అవసరమయ్యే తరగతి గదులను, మరుగుదొడ్లను పాఠశాల పారిశుద్ధ్య ఆయాలు మరియు వాచ్‌మెన్‌లచే శుభ్రం చేయించారు. పునరావాస బాధితుల కోసం మంచినీటిని క్యాన్లతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది చెన్నయ్య, సుహాసిని, కిరణ్ కుమార్ రాజు, ఆయాల బృందం, వాచ్‌మెన్ వెంకట రెడ్డి పాల్గొన్నారు.అధికారులు, పాఠశాల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ, ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Featured

తుఫాన్ పర్యటించిన బందరు డి యస్ పి గారు

కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యా సాగర్ నాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, మొంధా తుఫాన్ నేపథ్యంలో బందర్ డీఎస్పీ CH. రాజా గారు గారు నాగాయలంక పరిధిలోని సంగమేశ్వరం గ్రామంలోని రీహాబిలిటేషన్ సెంటర్‌ను సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు. తదనంతరం ఏటిమొగ్గ – ఎదురుమొండి ఫెర్రీ (పంటు) ప్రాంతాన్ని సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలను అధికారులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ హెచ్చరికలను గమనించాలని, అవసరమైతే సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించుకోవాలని సూచించారు. Andhra Pradesh Police

ఎన్ టి ఆర్ జిల్లా

మోంథా తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – సిపిఐ నేత దోనేపూడి శంకర్

ప్రళయ భీకరంగాదూసుకొస్తున్న మోంథా తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్ల ను అప్రమత్తం చేయడం, ముందస్తు సహాయక చర్యలను చేపట్టడం హర్షణీయమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మరియు ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యదర్శి దోనేపూడి శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — ప్రజలు తమ వంతు బాధ్యతగా తుఫాను తీవ్రత పట్ల అత్యంత జాగ్రత్తతో వ్యవహరించి, ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దోనేపూడి శంకర్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తూ, తక్షణమే కదిలి పలు జిల్లాల్లో సహాయక కార్యక్రమాలు చేపట్టాలని, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా మరియు విజయవాడ పరిసర ప్రాంతాల్లో రైతాంగం, పట్టణ ప్రాంతాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ప్రజల భద్రతకే ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వం చేపడుతున్న చర్యల కు తోడ్పడాలని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతోముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్

🕉️ శ్రీకాకుళం జిల్లాలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ రుద్రపూజల వైభవం (శ్రీకాకుళం, అక్టోబర్ 27: పున్నమి ప్రతినిధి)

జిల్లాలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా రుద్రపూజలు భక్తి భావభరితంగా నిర్వహించబడ్డాయి. ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పూజలు వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరిగాయి. మొదటిరోజు సాహితీ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో, రెండవ రోజు యారబాడు గ్రామంలోని నీలమ్మ తల్లి గుడి ఆవరణలో, ఈరోజు శ్రీకాకుళం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్లో రుద్రపూజలు నిర్వహించబడ్డాయి. పండితుల మంత్రోచ్ఛారణతో వాతావరణం శాంతిమయంగా మారగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజల ద్వారా ఆధ్యాత్మిక ఆనందం పొందారు. పూజ అనంతరం భజనలు, సత్సంగం, ప్రసాద వితరణ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమాలు శ్రీ శ్రీ రవిశంకర్ జీ స్ఫూర్తితో, సమాజంలో శాంతి, సాత్వికత, సద్విచారాల వ్యాప్తి లక్ష్యంగా కొనసాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.

Featured

మెంతా తుఫాన్ ను దృష్టిలో ఉంచుకుని రేపు 28/10 న విజయవాడ లో దుకాణాలు బంద్.

* *_రేపు బెజవాడ దుకాణాలు బంద్.._* * _ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ కీలక ఆదేశాలు.._ * _భారీ వర్షాలకు అప్రమత్తమైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్.._ * _రేపు విజయవాడలో షాపులు మూసేయాలని కలెక్టర్ ఆదేశం.._ * _మెడికల్‌, పాలు, కూరగాయల షాపులకు మాత్రం మినహాయింపు.._ * _అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని సూచన.._

రంగారెడ్డి

ఇబ్రహీంపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేసిన మండల ఎంఈఓ అధికారి హిర్య నాయక్

పున్నమి అక్టోబర్ 27 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో భారత్ పెట్రోల్ బంక్ అనుకోని ప్రమాదకరంగా నిర్వహిస్తున్న శ్రీ చైతన్య స్కూల్ ను మండల విద్యాధికారి సీజ్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలో భారత్ పెట్రోల్ బంక్ కు ఆనుకుని ఏర్పాటు చేసిన శ్రీ చైతన్య స్కూల్ కు పెట్రోల్ బంక్ వల్ల ప్రమాదం పొంచి ఉంది. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే వందలాది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికి ఏలాంటి చర్యలు లేకపోవడం వల్ల రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడంతో స్పందించిన అసిస్టెంట్ మండల విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం స్థానిక ఎంఈవో హీర్యానాయక్ శ్రీ చైతన్య స్కూల్ ను సీజ్ చేశారు.

తెలంగాణ

ఇబ్రహీంపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేసిన మండల ఎంఈఓ అధికారి హిర్య నాయక్

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 ఇబ్రహీంపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేసిన మండల ఎంఈఓ అధికారి హిర్య నాయక్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని మంచాల్ రోడ్డు నందు భారత్ గార్డెన్ కు ఎదురుగా భారత్ పెట్రోల్ బంక్ కు ఆనుకొని ఏర్పాటుచేసిన శ్రీ చైతన్య స్కూల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వందలాది బ్రాంచ్లు ఏర్పాటు చేసుకున్న ప్రముఖ కార్పొరేట్ స్కూల్ స్థానికులు,విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పెట్రోల్ బంక్ పక్కనే ఉండడంతో అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవిస్తే విద్యార్థులకు ప్రాణాలకు పెద్ద ఎత్తున ముప్పు వాటిల్లుతుందని పలుమార్లు ఫిర్యాదు చేసిన జిల్లా, మండల విద్యాధికారులు పట్టించుకోలేదు… దీంతో పలు దినపత్రికలు, ప్రత్యేకంగా మెట్రో దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితం కావడంతో జిల్లా అధికారులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడంతో స్పందించిన విద్యాశాఖ అధికారుల ఆదేశాలతో ఈరోజు సాయంత్రం స్థానిక ఎంఈఓ అధికారి హిరియానాయక్ శ్రీ చైతన్య స్కూల్లో సీజ్ చేయడం జరిగింది

E-పేపర్

మిషన్ భగీరథ నోటీస్ అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం,మంచాల, యాచారం మరియు శంషాబాద్ మండలాలకు మంచి నీరు సరఫరా చేయు మెయిన్ పైప్ లైన్ లో(1000mm) లీకేజీ మరమ్మతు చేయడం జరుగుతుంది. కావున పై ఐదు మండలాలకు నీటి సరఫరా బంద్

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9133469506 మిషన్ భగీరథ నోటీస్*: అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం,మంచాల, యాచారం మరియు శంషాబాద్ మండలాలకు మంచి నీరు సరఫరా చేయు మెయిన్ పైప్ లైన్ లో(1000mm) లీకేజీ మరమ్మతు చేయడం జరుగుతుంది. కావున పై ఐదు మండలాలకు *అక్టోబర్ 28 ఉదయం 10 గంటల నుండి 29 మధ్యాహ్నం 3 గంటల వరకు)* సరఫరాలో అంతరాయం కలుగుతుంది. కావున మీ పరిధిలోని లోకల్ సోర్స్ (local source) ఉపయోగించుకొని నీటి సరఫరా చేసుకోని సహకరించగలరు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపి ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు – విద్యార్థులకు మరో అవకాశం!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు తాజా ప్రకటన ప్రకారం, 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫీజు చెల్లించడానికి గడువు అక్టోబర్ 30, 2025 వరకు పొడిగించబడింది. ఇంకా ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ తేదీ లోపు చెల్లించవచ్చు. గడువు దాటిన తర్వాత రూ.1,000 ఆలస్య రుసుముతో నవంబర్ 6, 2025 వరకు ఫీజు చెల్లించుకునే అవకాశం కల్పించారు. విద్యార్థులు తమ కళాశాలల ద్వారా లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫీజులు సమర్పించాలి. బోర్డు అధికారులు ఆలస్యం చేయకుండా ఫీజులు చెల్లించాలని సూచించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.