Friday, 10 April 2026

Blog

అల్లూరి సీతారామరాజు

అరకు: వాయుపుత్ర మోటార్ యూనియన్ అధ్యక్షులుగా పాంగి నాగర్జున

అరకులోయ (పున్నమి ప్రతినిధి), అక్టోబర్ :28 అరకులోయ వాయుపుత్ర మోటార్ యూనియన్ ఎలక్షన్ జరిగినట్లు మంగళవారం యూనియన్ సభ్యులు తెలిపారు. ఈ ఎలక్షన్ లో అధ్యక్ష స్ధానానికి కిల్లో సహదేవ్, పాంగి నాగర్జున పోటీ చేశారు. కాగా యూనియన్ మెజారిటీ సభ్యులు పాంగి నాగార్జునను అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ మేరకు అధ్యక్షులుగా గెలిపొందిన నాగార్జున మాట్లాడుతూ.. యూనియన్ సభ్యులు తన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా యూనియన్ సమస్యల పరిష్కారం కొరకు పనిచేస్తానని అన్నారు.

E-పేపర్

జాతీయ స్థాయికి ఎస్ వి కే స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థి ఎంపిక

జాతీయ స్థాయికి ఎస్ వి కే స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థి ఎంపిక రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడారుకు చెందిన ఎస్ వి కె స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థి ఈ నెల 26.27 వ తేది కోడూరు సి ఎస్ ఆర్ కళ్యాణ్ మండలం నందు జరిగిన 69వ ఎస్ జి ఎఫ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 19 రాష్ట్రా స్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పట్టణలో ఉన్న ఎస్.వి.కె స్పోర్ట్స్ అకాడమీకి చెందిన బి హారిక over68 విభాగంలో బంగారు పథకము సాధించింది . అలాగే సి. మేఘన వెండి పథకము, పి జ్యోస్న కాంస్య పతకాన్ని బాలుల విభాగంలో బి. శ్రీనివాసులు కాంస్య పతకం సాధించారు.బంగారు పతకము సాధించిన బి హారిక నవంబర్-నెలలో జమ్మూ కాశ్మీర్ లో జరగబోమే జాతియ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కోచ్ శివాజీ తేలిపారు.

ఆంధ్రప్రదేశ్

అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలి

అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలి అవసరమైతే తప్ప బయట ప్రయాణాలు మానుకోండి ప్రభుత్వ హెచ్చరికలు దృశ్య అందరూ జాగ్రత్తలు పాటించాలి.. ఎమ్మెల్యే అంజిబాబు భీమవరం : మోంతా తుఫాను వల్ల రానున్న 4 రోజులు పాటు (27,28,29,30) భారీ వర్షాలు బలమైన గాలులు ఏర్పడే అవకాశం ఉన్నందున అధికారులు, నియోజక వర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. ప్రభుత్వం వారి హెచ్చరికల దృశ్య అందరూ జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప ప్రయాణాలను చేయవద్దని అన్నారు. ఏ విధమైన అత్యవసర పరిస్థితులు ఉన్నాయెడల ఎమ్మెల్యే కార్యాలయం నెంబర్లు 90145 68555, 94410 10095 లకు సంప్రదించవచ్చునని అన్నారు.

ఖమ్మం

ఖమ్మం మున్నేరు కరకట్ట పనుల వల్ల ప్రజలకు ఇబ్బందులు – కాంట్రాక్టర్ తక్షణ చర్యకు హామీ

పున్నమి ప్రతి నిధి ఖమ్మం ఖమ్మం నగర పరిధిలో జరుగుతున్న మున్నేరు కరకట్ట నిర్మాణ పనుల కారణంగా భారీ వాహనాలు దానవైగూడెం ప్రధాన రహదారి గుండా తరచుగా వెళ్తున్నాయి. దీని వల్ల రహదారిపై గుంతలు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని స్థానికంగా గుర్తించిన అన్ని పార్టీ నాయకులు — బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ ప్రతినిధులు కలిసి సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చారు. వీరు కాంట్రాక్టర్‌ను కలసి రహదారి గుంతలను పూడ్చి ప్రజలకు తక్షణ ఉపశమనం కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యను అర్థం చేసుకున్న కాంట్రాక్టర్ వెంటనే స్పందించి రేపటిలోపు రోడ్డు మరమ్మతులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా యువ నాయకుడు వల్లాల రమేష్ యాదవ్, బీఆర్ఎస్ 59వ డివిజన్ మాజీ అధ్యక్షుడు దామల రవి, మద్దెల ఉదయ్, బత్తుల యేసు, సీపీఐ నాయకులు ప్రతాపనేని వెంకటేశ్వర్లు, తిరపయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టకుండా అన్ని పార్టీలు ఒకే వేదికపైకి రావడం ప్రశంసనీయమని స్థానికులు అభిప్రాయపడ్డారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

🏟️ ప్రపంచంలోనే తొలి స్కై స్టేడియం సౌదీలో!

🏟️ ప్రపంచంలోనే తొలి స్కై స్టేడియం సౌదీలో! సౌదీ అరేబియా ప్రపంచంలోనే మొట్టమొదటి స్కై స్టేడియం నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించింది. ‘ది లైన్‌’ నగరంలోని నియోమ్ స్టేడియంగా ఈ అద్భుత ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. భూమికి సుమారు 350 మీటర్ల ఎత్తులో నిర్మించబడుతున్న ఈ స్టేడియం ఆధునిక సాంకేతికతతో ప్రపంచ క్రీడా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించనుంది. 2032 నాటికి స్టేడియం ప్రారంభం కానుందని అధికారులు వెల్లడించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

జాగ్రత్తలు వహించి తుఫాన్ ప్రభావాన్ని ఎదురుకోవాలని నల్లి చిన్న వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా

రాజోలు నియోజకవర్గం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి మొంథా తుపాను నేపధ్యంలో ప్రజలందరూ బయటికి రాకుండా ఇంట్లోనే గడపండి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు వహించి తుఫాన్ ప్రభావాన్ని ఎదురుకోవాలని వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా నల్లి చిన్న తెలిపారు ఇంట్లోనే ఉండండి, బయటకు వెళ్లొద్దు.విద్యుత్ పరికరాలు ఆపండి.తాగునీరు, టార్చ్ సిద్ధంగా ఉంచండి.చెట్లు, విద్యుత్ తీగల దగ్గర నిలవొద్దు అని నల్లి చిన్న రాజోలు ప్రజలను కోరారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీ ప్రభుత్వం అలెర్ట్.. ఆస్పత్రులకు 787మంది నిండు గర్భిణీ స్త్రీలు.

మంథా తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలెర్ట్ – 787 గర్భిణీ స్త్రీలను ఆసుపత్రులకు తరలింపు, 551 వైద్య శిబిరాలు ఏర్పాటు మంథా తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యారోగ్య రంగంలో పటిష్ట చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా తుఫాను ప్రభావిత 17 జిల్లాల్లో గర్భిణీ స్త్రీల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డెలివరీ తేదీకి వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్న 787 మంది గర్భిణీలను స్థానిక వైద్య అధికారులు గుర్తించి, ఏరియా మరియు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ఇందులో : కృష్ణా జిల్లాలో 240 మంది, ఏలూరు జిల్లాలో 171 మంది, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 150 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 142 మంది గర్భిణీలు ఉన్నారు. ముఖ్యంగా అధిక ప్రమాదం ఉన్న గర్భిణీలకు వైద్యులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా 551 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. ప్రతి శిబిరంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి, ఒక ఏఎన్ఎం, ఆశా కార్యకర్త అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎవరూ ఇబ్బందులు పడకుండా అన్ని రకాల వైద్య, అత్యవసర సేవలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు.

జోగులాంబ గద్వాల

తుపాను ప్రభావంతో రైతులు నష్టపోకుండా చూడండి – కలెక్టర్ బి.యం. సంతోష్.

తుపాను ప్రభావం వల్ల రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో రైతులకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జోగులాంబ జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అధికారులను ఆదేశించారు. రైతులు ధాన్యం నిల్వలతో పాటు ఆయా ప్రాంతాల్లో ఆరబెట్టిన పంట ధాన్యం వర్షానికి తడిసి నష్టపోకుండా రైతులకు టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని అన్నారు. తుపాను ప్రభావం గురించి రైతులకు తెలియజేస్తూ, అప్రమత్తం చేయాలని అధికారులకి కలెక్టర్ సూచించారు. రానున్న మూడు రోజుల పాటు అవసరమైతే వరి కోతలు జరపకుండా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు.

అమరావతి

మోంథా” తీవ్ర తుఫాను

“మోంథా” తీవ్ర తుఫాను —————————– అమరావతి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన “మోంథా”తుఫాను గత 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలి, తీవ్ర తుఫానుగా బలపడి , ఈరోజు, అక్టోబర్ 28, 2025న ఉదయం 0530 గంటలకు మచిలీపట్నం (ఆంధ్రప్రదేశ్) కి ఆగ్నేయంగా 190 కి.మీ దూరములో ., కాకినాడ (ఆంధ్రప్రదేశ్) కి ఆగ్నేయంగా 270 కి.మీ.దూరములో , విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్) కి ఆగ్నేయంగా 340 కి.మీ.,దూరములో గోపాల్‌పూర్ (ఒడిశా) కి ఆగ్నేయంగా 550 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. 28 .10 .2025 —————- ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ, అక్టోబర్ 28 సాయంత్రం/రాత్రి సమయంలో మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్య కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరాన్ని దాటే అవకాశం ఉంది, తీరము దాటే సమయములో స్థిరమైన గాలులు గరిష్టంగా గంటకు 90-100 కి.మీ వేగంతో గరిష్టంగా 110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణ, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలు మరియు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లలో వివిక్త అత్యంత భారీ వర్షాలతో భారీగా వర్షపాతం ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశముంది .మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ అన్ని జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షపాతం ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశముంది . 29.10 .2025 —————- గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యము మరియు విజయనగరం అనేక ప్రాంతాలలో అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశముంది. మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ అన్ని జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షపాతం ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశముంది . 2025 , అక్టోబర్, 28 & 29 తేదీలలో తీరం వెంబడి పెనుగాలులు గంటకు 90-100 కి.మీ. వేగంతో గరిష్టంగా 110 కి.మీ. వేగంతో వీస్తాయి. చెట్లు/విద్యుత్ స్తంభాలు/కమ్యూనికేషన్ స్తంభాలు కూలిపోవడం, వరదలు, పిడుగులు, మట్టి పెళ్లలు విరిగి పడటం /బురద జారిపోవడం, రోడ్లు దెబ్బతినడం, బలహీనమైన నిర్మాణాలు/గుడిసెలు కూలిపోయే అవకాశం ఉన్నందున, దయచేసి అక్టోబర్ 28, 29 తేదీలలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలు అనవసరమైన ప్రయాణాలను నివారించి , సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని హెచ్చరించడమైనది

విశాఖపట్నం

ఇకపై ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు..*

*ఇకపై ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు..* *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* *నవంబర్ 1 నుంచి ఇంట్లోనే అన్నీ..* *ఇకెంతో కాలం ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. దేశంలో కోట్లాది మంది ఆధార్ కార్డుదారులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ గుడ్ న్యూస్ అందించింది.* *నవంబర్ 1 నుంచి ఆధార్ కార్డు వివరాల అప్‌డేట్‌లో అతిపెద్ద మార్పు తీసుకరానుంది. ఇకపై పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నంబర్ వంటి ముఖ్యమైన వివరాలను ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లకుండానే పూర్తిగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను మరింత వేగంగా, సురక్షితంగా మార్చడమే ఈ కొత్త ఆన్‌లైన్ విధానం లక్ష్యం.* *పెరిగిన అప్‌డేట్ ఫీజులు..* *2025 సంవత్సరం ఆధార్ చరిత్రలో ఒక ముఖ్య మలుపుగా మారింది. ఈ సంవత్సరం UIDAI కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.* *ఫీజు పెరిగింది:* *అక్టోబర్ 1 నుంచే అప్‌డేట్ ఫీజు కొద్దిగా పెరిగింది. చిన్న మార్పుకైనా (పేరు, అడ్రస్) ఇప్పుడు రూ. 75, బయోమెట్రిక్ మార్పులకు రూ. 125 చెల్లించాలి.* *పిల్లలకు ఫ్రీ:* *7 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న పిల్లల ఫింగర్ ప్రింట్స్, బయోమెట్రిక్ మార్చడానికి అయ్యే ఖర్చును UIDAI ఉచితం చేసింది.* *ఒక ఆధార్-ఒక వ్యక్తి: *నకిలీ ఆధార్ కార్డులు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని UIDAI హెచ్చరించింది.* *ఫ్రీ గడువు ముగిసింది:* *జూన్ 14 వరకు ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్లు ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం ముగిసింది. ఇప్పుడు అన్ని అప్‌డేట్‌లకు ఫీజు వర్తిస్తుంది.* *నవంబర్ 1 నుంచి డిజిటల్ అప్‌డేట్* *నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న అతిపెద్ద మార్పు ఏమిటంటే.. జనాభా వివరాల అప్‌డేట్ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరగనుంది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల వారికి, చిన్న పట్టణాల వారికి ప్రతి చిన్న మార్పు కోసం కిలోమీటర్లు ప్రయాణించి ఆధార్ కేంద్రాల ముందు క్యూలో నిలబడాల్సిన అవసరం తప్పనుంది. పేరు, అడ్రస్ వంటి జనాభా వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. కానీ ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ వంటి బయోమెట్రిక్ అప్‌డేట్స్ కోసం మాత్రం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది.*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.