Friday, 10 April 2026

Blog

రంగారెడ్డి

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల పర్యటన లో పాల్గొన్న కల్వకుంట్ల కవిత — రెండు సంవత్సరాలు గడిచిన ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.పల్నాటి నరేష్ నేత

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 28 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పర్యటన కార్యక్రమంలో భాగంగా.. షాద్నగర్లో జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక సమితి వ్యవస్థాపకులు పల్నాటి నరేష్ నేత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు కేవలం ఉచిత బస్సు మాత్రమే ఇచ్చి మిగతా హామీలను అమలు చేయడం లేదని తెలియజేస్తూ.. ప్రజలను మేల్కొల్పి వారిలో చైతన్యం తెచ్చే విధంగా. కవితమ్మ పోరాటాలకు మేము సైతం సిద్ధంగా ఉన్నామని ఆయన తెలియజేయడం జరిగింది

రంగారెడ్డి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో ప్రజలకు లాభం లేదు.. కల్వకుంట్ల కవిత షాద్‌నగర్ లో కవితకు ఘన స్వాగతం పలికిన… కప్పటి పాండురంగారెడ్డి

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 28 : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘జాగృతి జనంబాట’ కార్యక్రమంలో పాల్గొనేందుకు మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ సందర్శించడానికి వెళ్తున్న సందర్భంలో బెంగుళూరు హైదరాబాద్ జాతీయ రహదారి షాద్‌నగర్ వద్ద రంగారెడ్డి జిల్లా జాగృతి నియోజకవర్గ ఇంచార్జ్ చీమల రమేశ్ కురుమ, ఆద్వర్యంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోళ శ్రీనివాస్,మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు ముస్తపా తదితలతో కలిసి ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విలేఖర్లు సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల గెలుపు ఓటముల వల్ల ప్రజలకు ఒరిగేది ఏమిలేదన్నారు. జాగృతి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఈ యాత్రను ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కేవలం ఉచిత బస్సులు మాత్రమే ఇచ్చి మిగతా ముఖ్యమైన హామీలు పింఛన్లు ఇండ్లు తదితర అంశాల విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని కవిత విమర్శించారు. ప్రజలను మేల్కొల్పి వారిలో చైతన్యం తెచ్చే విధంగా తన పర్యటనలు కొనసాగుతాయని ఆమె సందర్భంగా తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కు సంబంధించి జరుగుతున్న నిర్లక్ష్యం పై నిలదీసేందుకు తమ పోరాటాలు కొనసాగుతాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిసి విభాగం ప్రధాన కార్యధర్శి రాం కోటీ, రాష్ట్ర యంబిసి అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ, అందుగుల సత్యనారాయణ,ఉదయ బాను షాద్‌నగర్ పట్టణ అధ్యక్షుడు మహేష్, కేశంపేట్ మండల అధ్యక్షుడు వెంకటయ్య,కొత్తూరు కుమార్ మండల అధ్యక్షుడు వీరయ్య, చౌదర్ పల్లి మండల అధ్యక్షుడు అంజీ కురమ , పరూక్ నగర్ మండల అధ్యక్షుడు మల్లేశ్,నరేందర్ గోపు వర్ష జాగృతి శ్రేణులు, మహిళలు మంగళ హరతులతో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పటి పాండురంగారెడ్డి ఘన స్వాగతం పలికారు..

E-పేపర్

Live తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామంలో తుపాను

తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి పున్నమి న్యూస్ ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. మొంథా తుపాను ప్రభావం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామంలో అధికారులు, పోలీసు వారు మరియు హైవే పెట్రోలింగ్ వారు జాగ్రత్తలు తీసుకుని ప్రజలను ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు End

E-పేపర్

సమయపాలన లేని ఇబ్రహింపట్నం బస్సులతో ప్రజలు ఇబ్బందులు

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 సమయపాలన లేని ఇబ్రహింపట్నం RTC బస్సులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ప్రజలు… యాచారం బస్సు స్టాండ్ కు ఐదు గంటలకు రావాల్సిన తాటిపర్తి బస్సు ఇప్పటివరకు రాకపోవడంతో యాచారం బస్టాండ్ లో ఎదురుచూస్తున్న విద్యార్థులు ప్రజలు ఆర్టీసీ అధికారులకు పలుమార్లు చెప్పిన స్పందన లేదు అధికారులు ఇప్పటికైనా స్పందించి గతంలో రద్దు చేసిన బస్సులను పునర్రారం చేయాలని అదేవిధంగా బస్సులు సమయనికి వచ్చే విధంగా చూడాలని కోరుచున్నాము.

అల్లూరి సీతారామరాజు

అరకు: పోలీసుల పహారాలో చొంపి గెడ్డ

అరకులోయ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:28, అరకులోయ మండలంలో కురుస్తున్న ఎడతెరిపిలేని భారీ వర్షం కారణంగా గెడ్డలు, వాగులు ఉప్పొంగి ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మండలంలోని రాకపోకలు ఎక్కువగా ఉన్న చొంపి గెడ్డ వద్ద ప్రమాదాలు జరగకుండా రాకపోకలను నిషేధిస్తూ పోలీసులు స్టాపర్లను ఏర్పాటు చేసి, రహదారికి అడ్డంగా తాళ్ళు కట్టారు. ఎవరూ గెడ్డలోకి దిగకుండా చూడటానికి పోలీసు సిబ్బంది విశ్వనాథం, కన్నంనాయుడు పహారకాస్తున్నారు.

ఖమ్మం

గార్లఓడ్డు వద్ద రోడ్డు ప్రమాదం – వ్యక్తికి గాయాలు

గార్లఓడ్డు వద్ద రోడ్డు ప్రమాదం – వ్యక్తికి గాయాలు పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా అక్టోబర్ 29 ఏన్కూర్ మండలం గార్లఓడ్డు గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి వెంట నడుచుకుంటూ వస్తున్న ఆళ్లకుంట బాలయ్య (55)ను కొత్తగూడెం నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. దీంతో బాలయ్య తలకు, కాళ్లకు గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా ఏన్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అల్లూరి సీతారామరాజు

అనంతగిరి: ఘాటీ లో రాకపోకలు నిషేధం

కురుస్తున్న భారీ వర్షం వలన కొండల పై నుండి ఉదృతంగా వస్తున్న నీటితో అరకు ఘాటీ రోడ్డు జలమయమై వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అలాగే ఈ రోజు రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడే సూచన ఉండటంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు అనంతగిరి మండలం చిలకలగెడ్డ ఫారెస్ట్ చెక్ పోస్ట్ నుండి అరకులోయ మండలం సుంకరమెట్ట ఫారెస్ట్ చెక్ పోస్టుల మధ్య మంగళవారం రాత్రి రాకపోకలు నిషేదించారు.

ఆంధ్రప్రదేశ్

తీవ్ర రూపు దాల్చిన మంతా తుఫాను

సమయం ఆసన్నమైంది మరియు తీవ్ర తుఫాను మంథా తీరం దాటేందుకు సిద్ధమవుతోంది. మధ్య రాత్రికి తీరం దాటోచ్చు.. కన్ను పూర్తిగా భూమిలోకి ప్రవేశించడానికి 6-8 గంటలు పడుతుంది, కాబట్టి రేపు ఉదయం ఈ రాకాసి తుఫానుమధ్య ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి ప్రవేశించి, భారీ వర్షాలు మరియు తీవ్రమైన గాలులతో విలయం సృష్టిస్తుంది.

పిల్లలకు

హాస్య కథ

అనగనగా ఒక అడవిలో మూడు చీమలు ఉండేవి .ఒకటి ఎర్రది ,నల్లది ,తెల్లది.ఈ ముగ్గురు ఖాళీగా ఉండడం ఎందుకని అలా అడవిలో తిరుగుదాం అని అనుకొని బయలుదేరారు.కొంచెం దూరం వెళ్లి అలిసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి కోసం ఆగాయి.కొంతసేపటికి తెల్ల చీమకి ఒక సందేహం వచ్చింది. మేము ఒక్కొక్కరం ఒక్కో రంగులు ఎందుకు ఉన్నాము అని.ఇంత తలనొప్పి ఎందుకు నేరుగా వెళ్లి వాళ్ళనే అడుగుదాం అని అనుకొని వెళ్లి ఎర్ర చీమని అడిగింది. నీవు ఎర్రగా ఎందుకు ఉన్నావు మిత్రమా అని అడిగింది . దానికి ఎర్ర చీమ నేను మనుషుల రక్తాన్ని తాగుతాను అందుకే నేను ఎర్రగా ఉన్నాను అని చెప్పింది. తరువాత నల్ల చీమ వద్దకు వెళ్లి నీవు ఎందుకు నల్లగా ఉన్నావు మిత్రమా అని అడిగింది తెల్ల చీమ. దానికి నల్ల చీమ నేను బురదలో ఉంటాను అందుకే నల్లగా ఉన్నాను అంది. ఇప్పుడు ఎర్ర చీమ మరియు నల్ల చీమ తెల్ల చీమ అని నీవు ఎందుకు తెల్లగా ఉన్నావు మిత్రమా అని అడిగాయి. దానికి తెల్ల చీమ నేను ఎట్ల చీమలాగా మనుషులు రక్తాన్ని తాగను అలాగే నేను నల్ల చీమ లాగా బురదలోను ఉండను నేను రోజు స్నానం చేసి పౌడర్ మరియు ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకుంటాను. అందుకే నేను ఇంత తెల్లగా ఉంటాను అని చెప్పింది తెల్ల చీమ. మనం తెలుసుకోవలసినది ఏమనగా ఫెయిర్ అండ్ లవ్లీ నీ ఇప్పుడు చీమలు కూడా వాడుతున్నాయి. దీన్నే అంటారు ఫెయిర్ అండ్ లవ్లీ మహత్యం అని😄😄😄😄 కథా రచయిత్రి, హఫ్సా అంజుమ్.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు మండలం, ఏరుకొల్లు, రాచవారిపల్లి గ్రామాలను, వాగులను పరిశీలించిన మండల అధికారులు.

నెల్లూరు జిల్లా… – దుత్తలూరు మండలం, ఏరుకొల్లు, రాచవారిపల్లి గ్రామాలను, వాగులను పరిశీలించిన మండల అధికారులు. – లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారిని పునరావస కేంద్రాలకు తరలింపు. – అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు అంటూ తహసిల్దార్ సూచన.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.