Friday, 10 April 2026

Blog

రంగారెడ్డి

మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పిన సీఎం —జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముస్లిం సోదరులకు సీఎం భరోసా

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 28 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జిల్ పల్లి మున్సిపాలిటీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జమాత్ ఉలెమా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పటం కాంగ్రెస్ కార్యకర్తల్లో మనోధైర్యం పెంచిందని మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్‌, ముస్లిం మైనారిటీ వర్గాల సంక్షేమం, విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన మౌలానా హఫీజ్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ సహా క్యాడర్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేఎల్ఆర్ భరోసా ఇచ్చారు. జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని షహీన్‌నగర్‌లో ఉన్న హఫీజ్ పీర్ షబ్బీర్ నివాసంలో ముస్లిం సోదరులు, వారి కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు… షబ్బీర్ లేనిలోటు తీర్చలేమన్నారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & టిపిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి బడంగ్పేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

రంగారెడ్డి

మహేశ్వరం ఎమ్మార్వో ఆఫీస్ లో లంచం ఇస్తేనే ఫైల్లు ముందుకి — కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నవీన్ కుమార్

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 28 : రంగారెడ్డిజిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని.. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నవీన్ కుమార్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… మండల కేంద్రంలో ఎమ్మార్వో ఆఫీస్ లో లంచం ఇస్తేనే పనులు చేస్తున్నారు అంటూ.. అటెండర్ నుంచి పై అధికారి వరకు మొత్తం సిబ్బంది లంచం తీసుకోవడం జరుగుతుందని నిరుపేదలు ఆవేదన కు గురవుతున్నారని ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారని డిప్యూటీ తాసిల్దార్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ రేషన్ కార్డుకు ₹1000 నుంచి 4000 రూపాయల దాకా లంచం తీసుకుంటున్నారంటూ ఆరోపించారు. ఉప తాసిల్దార్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అని మహేశ్వరం మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు ఎర్ర నవీన్ కుమార్ అడుగుతే అసభ్యకరంగా మాట్లాడారని తెలియజేశారు ఇలాంటి వాళ్లపైన తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మహేశ్వరం మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు ఎర్ర నవీన్ కుమార్ మరియు అమీర్పేట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్సీ సెల్ అధ్యక్షులు నీగోల బాలరాజ్ తెలియజేశారు

రంగారెడ్డి

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల పర్యటన లో పాల్గొన్న కల్వకుంట్ల కవిత — రెండు సంవత్సరాలు గడిచిన ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.పల్నాటి నరేష్ నేత

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 28 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పర్యటన కార్యక్రమంలో భాగంగా.. షాద్నగర్లో జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక సమితి వ్యవస్థాపకులు పల్నాటి నరేష్ నేత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు కేవలం ఉచిత బస్సు మాత్రమే ఇచ్చి మిగతా హామీలను అమలు చేయడం లేదని తెలియజేస్తూ.. ప్రజలను మేల్కొల్పి వారిలో చైతన్యం తెచ్చే విధంగా. కవితమ్మ పోరాటాలకు మేము సైతం సిద్ధంగా ఉన్నామని ఆయన తెలియజేయడం జరిగింది

రంగారెడ్డి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో ప్రజలకు లాభం లేదు.. కల్వకుంట్ల కవిత షాద్‌నగర్ లో కవితకు ఘన స్వాగతం పలికిన… కప్పటి పాండురంగారెడ్డి

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 28 : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘జాగృతి జనంబాట’ కార్యక్రమంలో పాల్గొనేందుకు మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ సందర్శించడానికి వెళ్తున్న సందర్భంలో బెంగుళూరు హైదరాబాద్ జాతీయ రహదారి షాద్‌నగర్ వద్ద రంగారెడ్డి జిల్లా జాగృతి నియోజకవర్గ ఇంచార్జ్ చీమల రమేశ్ కురుమ, ఆద్వర్యంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోళ శ్రీనివాస్,మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు ముస్తపా తదితలతో కలిసి ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విలేఖర్లు సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల గెలుపు ఓటముల వల్ల ప్రజలకు ఒరిగేది ఏమిలేదన్నారు. జాగృతి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఈ యాత్రను ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కేవలం ఉచిత బస్సులు మాత్రమే ఇచ్చి మిగతా ముఖ్యమైన హామీలు పింఛన్లు ఇండ్లు తదితర అంశాల విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని కవిత విమర్శించారు. ప్రజలను మేల్కొల్పి వారిలో చైతన్యం తెచ్చే విధంగా తన పర్యటనలు కొనసాగుతాయని ఆమె సందర్భంగా తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కు సంబంధించి జరుగుతున్న నిర్లక్ష్యం పై నిలదీసేందుకు తమ పోరాటాలు కొనసాగుతాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిసి విభాగం ప్రధాన కార్యధర్శి రాం కోటీ, రాష్ట్ర యంబిసి అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ, అందుగుల సత్యనారాయణ,ఉదయ బాను షాద్‌నగర్ పట్టణ అధ్యక్షుడు మహేష్, కేశంపేట్ మండల అధ్యక్షుడు వెంకటయ్య,కొత్తూరు కుమార్ మండల అధ్యక్షుడు వీరయ్య, చౌదర్ పల్లి మండల అధ్యక్షుడు అంజీ కురమ , పరూక్ నగర్ మండల అధ్యక్షుడు మల్లేశ్,నరేందర్ గోపు వర్ష జాగృతి శ్రేణులు, మహిళలు మంగళ హరతులతో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పటి పాండురంగారెడ్డి ఘన స్వాగతం పలికారు..

E-పేపర్

Live తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామంలో తుపాను

తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి పున్నమి న్యూస్ ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. మొంథా తుపాను ప్రభావం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామంలో అధికారులు, పోలీసు వారు మరియు హైవే పెట్రోలింగ్ వారు జాగ్రత్తలు తీసుకుని ప్రజలను ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు End

E-పేపర్

సమయపాలన లేని ఇబ్రహింపట్నం బస్సులతో ప్రజలు ఇబ్బందులు

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 సమయపాలన లేని ఇబ్రహింపట్నం RTC బస్సులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ప్రజలు… యాచారం బస్సు స్టాండ్ కు ఐదు గంటలకు రావాల్సిన తాటిపర్తి బస్సు ఇప్పటివరకు రాకపోవడంతో యాచారం బస్టాండ్ లో ఎదురుచూస్తున్న విద్యార్థులు ప్రజలు ఆర్టీసీ అధికారులకు పలుమార్లు చెప్పిన స్పందన లేదు అధికారులు ఇప్పటికైనా స్పందించి గతంలో రద్దు చేసిన బస్సులను పునర్రారం చేయాలని అదేవిధంగా బస్సులు సమయనికి వచ్చే విధంగా చూడాలని కోరుచున్నాము.

అల్లూరి సీతారామరాజు

అరకు: పోలీసుల పహారాలో చొంపి గెడ్డ

అరకులోయ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:28, అరకులోయ మండలంలో కురుస్తున్న ఎడతెరిపిలేని భారీ వర్షం కారణంగా గెడ్డలు, వాగులు ఉప్పొంగి ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మండలంలోని రాకపోకలు ఎక్కువగా ఉన్న చొంపి గెడ్డ వద్ద ప్రమాదాలు జరగకుండా రాకపోకలను నిషేధిస్తూ పోలీసులు స్టాపర్లను ఏర్పాటు చేసి, రహదారికి అడ్డంగా తాళ్ళు కట్టారు. ఎవరూ గెడ్డలోకి దిగకుండా చూడటానికి పోలీసు సిబ్బంది విశ్వనాథం, కన్నంనాయుడు పహారకాస్తున్నారు.

ఖమ్మం

గార్లఓడ్డు వద్ద రోడ్డు ప్రమాదం – వ్యక్తికి గాయాలు

గార్లఓడ్డు వద్ద రోడ్డు ప్రమాదం – వ్యక్తికి గాయాలు పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా అక్టోబర్ 29 ఏన్కూర్ మండలం గార్లఓడ్డు గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి వెంట నడుచుకుంటూ వస్తున్న ఆళ్లకుంట బాలయ్య (55)ను కొత్తగూడెం నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. దీంతో బాలయ్య తలకు, కాళ్లకు గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా ఏన్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అల్లూరి సీతారామరాజు

అనంతగిరి: ఘాటీ లో రాకపోకలు నిషేధం

కురుస్తున్న భారీ వర్షం వలన కొండల పై నుండి ఉదృతంగా వస్తున్న నీటితో అరకు ఘాటీ రోడ్డు జలమయమై వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అలాగే ఈ రోజు రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడే సూచన ఉండటంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు అనంతగిరి మండలం చిలకలగెడ్డ ఫారెస్ట్ చెక్ పోస్ట్ నుండి అరకులోయ మండలం సుంకరమెట్ట ఫారెస్ట్ చెక్ పోస్టుల మధ్య మంగళవారం రాత్రి రాకపోకలు నిషేదించారు.

ఆంధ్రప్రదేశ్

తీవ్ర రూపు దాల్చిన మంతా తుఫాను

సమయం ఆసన్నమైంది మరియు తీవ్ర తుఫాను మంథా తీరం దాటేందుకు సిద్ధమవుతోంది. మధ్య రాత్రికి తీరం దాటోచ్చు.. కన్ను పూర్తిగా భూమిలోకి ప్రవేశించడానికి 6-8 గంటలు పడుతుంది, కాబట్టి రేపు ఉదయం ఈ రాకాసి తుఫానుమధ్య ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి ప్రవేశించి, భారీ వర్షాలు మరియు తీవ్రమైన గాలులతో విలయం సృష్టిస్తుంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.