Wednesday, 8 April 2026

Blog

సిద్ధిపేట

సిద్దిపేట జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు

సిద్దిపేట జిల్లాలో అక్బర్ పేట భూంపల్లి మండలం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతులు తాము పండించిన ఆరు కాలాల వర్షం తడిసి ముద్ద అవుతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ రానున్న 48 గంటల్లో వర్షాలు ఉన్నాయని తెలవడంతో ప్రజలు తాము పండించిన పంటపై వివిధ రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు అదేవిధంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు సి పి గారు అత్యవసర నెంబర్లను కూడా ప్రజలకు రైతులకు తెలియజేయడం జరిగింది అత్యవసర సమయాలలో ఫోన్ చేయాలని చెప్పడం జరిగింది

తిరుపతి

రబీ సీజన్ కు కావలసిన యూరియా అందుబాటులో వుందీ – సొసైటీ అధ్యక్షులు

తొట్టంబేడు అక్టోబర్ 29, పున్నమి న్యూస్: మండలంలలోని రైతు సోదరులకు సొసైటీ అధ్యక్షులు బి. భాస్కర్ బుధవారం నాడు పత్రిక ప్రకగణ ద్వారా తెలియజేస్తూ.. అందుబాటులోఉన్న యూరియాను రైతులు సద్వినియోగించుకోవాలని తంగేళ్లపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ నందు రబీ సీజన్ కు కావలసిన యూరియా అందుబాటులో కలదు . యూరియా కావలసినవారు 1 ఎకరాకు3 బస్తాలు చొప్పున 3విడతలుగా ఇస్తారని యూరియా కావలసిన రైతులు వ్యవసాయ శాఖ వారు జారీ చేసిన కార్డు తీసుకొని యూరియాను తీసుకుని వెళ్లవలసిందిగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు జీ భత్తయ్య పి ధనంజయలు, సంఘపు సీఈవో చిరంజీవి రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

సిద్ధిపేట

సిద్దిపేట జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు

సిద్దిపేట జిల్లాలో అక్బర్ పేట భూంపల్లి మండలం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతులు తాము పండించిన ఆరు కాలాల వర్షం తడిసి ముద్ద అవుతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ రానున్న 48 గంటల్లో వర్షాలు ఉన్నాయని తెలవడంతో ప్రజలు తాము పండించిన పంటపై వివిధ రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు అదేవిధంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు సి పి గారు అత్యవసర నెంబర్లను కూడా ప్రజలకు రైతులకు తెలియజేయడం జరిగింది అత్యవసర సమయాలలో ఫోన్ చేయాలని చెప్పడం జరిగింది

ఆంధ్రప్రదేశ్

నిరంతరం ప్రజా సేవలో మచ్చా గంగాధర్ (ఎంజిఆర్)

రెండు కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ కాకినాడ : జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు ఆయన స్ఫూర్తితో కాకినాడకు చెందిన జనసేన సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం కాకినాడలోని రెండు నిరుపేద కుటుంబాలకు 2 నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు అందించారు. పట్టణంలోని జగన్నాధపురంలోని 20వ డివిజన్ లో నివసిస్తున్న కర్ర సురేష్ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులును మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) కలిసి తనప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారికి రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యవసర సరుకులను అందజేశారు. అదే విధంగా జగన్నాధపురంలోని 20వ డివిజన్ లో ఇటీవల మృతి చెందిన చింతా అంజి కుటుంబ సభ్యులును కలిసి తనప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారి కుటుంబానికి కూడా రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యవసర సరుకులు అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జనసేన వీర మహిళా మోనా మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) సేవ చేస్తున్నారని కొనియాడారు. ఇప్పటివరకు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు, కుటుంబ పెద్ద కోల్పోయిన వారికి, నిరుపేదలకు సుమారు 302 కుటుంబాలకు ఆయన నిత్యవసర సరుకులు అందించడం జరిగిందన్నారు. తన సొంత నిధులతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారని, అటువంటి వ్యక్తి 1000 వరకు కార్యక్రమాలు చేయాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఓలేటి రాము, పి.వీర్రాజు, వీరబాబు, జనసేన పార్టీ వీర మహిళలు బంటు లీల, సుజాత, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

వైస్ ఎంపిపి రామిరెడ్డి ధ్వజారెడ్డినీ సన్మానించిన ఎంపీటీసీలు సర్పంచులు

.వైస్ ఎంపిపి రామిరెడ్డి ధ్వజారెడ్డినీ సన్మానించిన ఎంపీటీసీలు సర్పంచులు రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు వైసీపీ సీనియర్ నాయకులు వైస్ ఎంపిపి రామిరెడ్డి ధ్వజారెడ్డినీ విదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆయనను ఘనంగా శాలవాలతో పూలమాలతో సత్కరించిన వైయస్సార్ సిపి ఎంపీటీసీలు నూక మహేశ్వర్ రెడ్డి, బండారు మల్లికార్జున ,సర్పంచులు కస్తూరి రామకృష్ణయ్య, నాయిని హరికృష్ణ రెడ్డి , చెం గల్ రెడ్డి, నాయకులు అనిల్ రెడ్డి, తేజ రెడ్డి, షఫీ, శ్రీరాములు, సుబ్రమణ్యం కార్యకర్తలు అభిమానులు సన్మానం చేసిన వారికి రామిరెడ్డి ధ్వజారెడ్డి , వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

తిరుపతి

కలెక్టర్ చేతులమీదుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గ ప్రతి అందజేత

శ్రీకాళహస్తి అక్టోబర్ 29, పున్నమి న్యూస్: తిరుపతి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గం ఏర్పడిన తర్వాత తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు బుధవారం నాడు కార్యవర్గ ప్రతిని చైర్మన్ దగ్గుమాటి శ్రీహరి రావు, వైస్ చైర్మన్ డాక్టర్ గుడ్లూరు మయూర్ లకు అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. త్వరలోనే రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులందరికీ సమావేశం ఏర్పాటు చేసి పనులన్నీ త్వరిత గతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శ్రీహరి, వైస్ చైర్మన్ డాక్టర్ గుడ్లూరు మయూర్ ఇరువురు మాట్లాడుతూ.. కలెక్టర్ సూచనల మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకొని మిగిలిన ప్రతీ పని పూర్తి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తిరుపతి జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఆదిలాబాదు

కస్టమర్ల ఆర్థిక ఎదుగుదలకు బ్యాంకులు కృషి

ఆదిలాబాద్ రూరల్ మండలం చాందా (టి) గ్రామంలో మావల సిఎఫ్ఎల్ ఆధ్వర్యంలో జన సురక్ష కార్యక్రమం నిర్వహించగా జిల్లా ఎల్దియం ఉత్పల్ కుమార్ ధామ్, జిల్లా పరిశ్రమల అధికారి పద్మ భూషణ్ రాజు హాజరై మాట్లాడుతూ వినియోగ దారుల రక్షణ కొరకు బ్యాంకులు నిరంతరం కృషి చేస్తాయని తెలిపారు. జన సురక్ష కార్యక్రమం పిఎంఎస్బిఐ, పిఎంజేజేబివై పథకాల ద్వారా కుటుంబాలకు ఆర్థిక భరోసాగా ఉంటాయని తెలిపారు. డిజిటల్ పేమెంట్స్ తో లావాదేవీలు సులువుగా ఉంటాయని, సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించాలని తెలిపారు. ప్రతి ఒక్కరు బ్యాంక్ ఖాతా, ఆధార్ కార్డు కలిగి ఉండాలని అన్నారు. ఆధార్ కార్డులో తప్పులు ఉంటే సవరణ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎఫ్ఎల్ కౌన్సిలర్స్ కమలాకర్, భూమన్న, ఎంఎస్ఎంఈ సిబ్బంది పృథ్వీ రాజ్, ఆదర్శ్, పంచాయతీ కార్యదర్శి రాఖీ, ఫీల్డ్ అసిస్టెంట్ స్వామి, కారోబారి సాయి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

అమరావతి

ఎట్టకేలకు తేలిన కొత్త జిల్లాల లెక్క,

*ఏపీ లో ఎట్టకేలకు తేలిన కొత్త జిల్లాల లెక్క, మండలాలు ఇలా – నియోజకవర్గాల్లో మార్పులు..!!* *అమరావతి* పున్నమి ప్రతినిధి ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు పై స్పష్టత వచ్చింది. పలు ప్రతిపాదనలు మంత్రివర్గ ఉపసంఘం వద్దకు వచ్చాయి. రెవిన్యూ డివిజన్లు.. మండలాల కూర్పు పైన కసరత్తు జరిగింది. తాజాగా సీఎం చంద్రబాబు తో మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు జరగాలని ..అదే సమయంలో త్వరలో జరిగే నియోజకవర్గాల పునర్విభజన ను పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం ఉండాలని స్పష్టం చేసారు. ఏపీలో జిల్లాల పునర్విభజన కసరత్తు వేగవంతం అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు, 77 రెవెన్యూ డివిజన్లు, 679 మండలాలున్నాయి. వైసీపీ హయాంలో పార్లమెంట్ పరిధిని ఒక జిల్లాగా మార్పు చేసారు. 13 జిల్లాలను 26కు పెంచారు. ఎన్నికల సమయంలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనికి తాజాగా రెవెన్యూ శాఖ కూడా ప్రతిపాదించింది అలాగే రాష్ట్రంలో అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌ గా ఉన్న మదనపల్లెను కూడా కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన పరిశీలనకు వచ్చింది. దీనిపై చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నేతలతో సంప్రదించాలని ఉపసంఘం భావిస్తున్నట్లు తెలిసింది. పోలవరం నిర్మాణం తర్వాత ముంపు మండలాలను ఏం చేయాలనే అంశం పైన చర్చలు జరుగుతున్నాయి. ప్రధాన కేంద్రం దగ్గరగా ఉండే జిల్లాలో విలీనం చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి ఇక, రాష్ట్రంలోని 28 నియోజకవర్గాల్లోని 86 మండలాలను డివిజన్లు, జిల్లాలవారీగా మళ్లీ పునర్‌వ్యవస్థీకరణ కోసం ప్రతిపాదనలు వచ్చాయి. అన్నమయ్య జిల్లా ప్రధాన కేంద్రాన్ని రాయచోటి నుంచి రాజంపేటకు మార్చాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం మొత్తాన్నీ ప్రకాశం జిల్లాలో కలపాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపే ఛాన్స్ కనిపిస్తోంది. భవిష్యత్‌లో జరిగే నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని కొత్త జిల్లాల పై నిర్ణయం జరగాలని సీఎం సూచించారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలన్నది ఆ ప్రాంత ప్రజల చిరకాల కోరికని గుర్తుచేశారు. పోలవరం ముంపు మండలాలపై కూడా స్పష్టత తీసుకురావాలని ఆదేశించారు దీంతో.. మంత్రివర్గ ఉపసంఘం తాజాగావచ్చిన ప్రతిపాదనల మేరకు కొన్ని జిల్లాల్లో పెంపు.. తగ్గుదల ద్వారా ప్రస్తుతం ఉన్న మండలాల సంఖ్యలో మార్పు ఉండదని చెబుతున్నారు . ఇక, రెవిన్యూ డివిజన్లు మాత్రం నాలుగు పెరగనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రెవిన్యూ డివిజన్లు లో మరో నాలుగు పెరగనున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు చేసిన సూచనలు.. ప్రతిపాదనల పైన మరో సారి మంత్రివర్గ ఉప సంఘం ఈ రోజు సమావేశం కానుంది. ఈ నెల 7వ తేదీన జరిగే మంత్రి వర్గ సమావేశంలో ప్రతిపాదనలు అందించే అవకాశం కనిపిస్తోంది. ఆ తరువాత కొత్త జిల్లాల ఏర్పాటు పైన అధికారిక ప్రక్రియ ప్రారంభించి.. ప్రజాభిప్రాయం తరువాత ప్రకటించనున్నారు

విశాఖపట్నం

జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు, జోనల్ అధికారులు, రెవెన్యూ అధికారుల తో కలెక్టర్ MN హరేందిర ప్రసాద్ టెలికాన్ఫరెన్స్.

జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు, జోనల్ అధికారులు, రెవెన్యూ అధికారుల తో కలెక్టర్ MN హరేందిర ప్రసాద్ టెలికాన్ఫరెన్స్. *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి * తుఫాను అనంతరం తీసుకోవలసిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం. కలెక్టర్ కామెంట్స్. పారిశుధ్యం, నీటి వనరుల క్లోరినేషన్, దెబ్బతిన్న రోడ్లపై గుంతలు పూడ్చడం, ల్యాండ్ స్లయిడింగ్ జరిగిన చోట రోడ్ ల పునరుద్ధరణ పై జోనల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టండి. తుఫాను నష్టాలను జాగ్రత్తగా అంచనా వేయండి. పూర్తిగా ,పాక్షికంగా దెబ్బతిన్న గృహాలను నమోదు చేయండి. పంట ,పశు నష్టం,బోట్లు నష్టం అంచనాలను తయారు చెయ్యాలి. దెబ్బతిన్న పంచాయతీ రాజ్,R&B , మైనర్ ఇరిగేషన్, పాఠశాలల భవనాలు అంచనాలు తయారు చేయాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిరాశ్రయులైన వారికి, తుఫాను వల్ల ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను గుర్తించి పరిహారం అందించడానికి చర్యలు తీసుకోవాలి. నష్టం అంచనాలను రెండు రోజులల్లో పూర్తి చేయాలి. ఎలాంటి సంఘటనలు జరగకుండా క్షేత్ర స్థాయిలో ఉండి పని చేసిన అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారనీ చెప్పారు. 1జిల్లాలో విద్యుత్ సరఫరా లో అంతరాయం కలుగ కుండా పని చేసిన అధికారులను, ప్రత్యేక అధికారులను కలెక్టర్ అభినందించారు

E-పేపర్

హరినాధపురం వాసుల కు చిన్న జీయర్ స్వామీజీ దర్శన భాగ్యం

…. నెల్లూరు జిల్లా పున్నమి ప్రతినిధి నెల్లూరు జిల్లా నెల్లూరులోని హరినాధపురం కాలనీలో శ్రీ చిన్న జీయర్ స్వామిజి పర్యటన….. హరినాధపురం కాలనీలో నివసిస్తున్న గవర్నమెంట్ జువాలజీ లెక్చరర్ డాక్టర్ అయినవోలు చక్రపాణి గారి సదనానికి చిన్న జీయర్ స్వామి వారు ఈరోజు వేoచేశారు. హరినాథపురం వాసును భక్తిశ్రద్ధలతో స్వామివారిని సేవించుకున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.