Tuesday, 7 April 2026

Blog

కర్నూలు

సమగ్రత ప్రతిజ్ఞ:-గోనెగండ్ల ఎంపీడీఓ మణి మంజరి

ఎమ్మిగనూరు నియోజకవర్గం,గోనెగండ్ల మండలం అక్టోబర్ 30(పున్నమి ప్రతినిధి) మన దేశ ఆర్థిక,రాజకీయ మరియు సామాజిక పురోగతికి అవినీతి ఒక ప్రధాన అడ్డంకి అని నేను నమ్ముతున్నాను.ప్రభుత్వం పౌరులు మరియు ప్రైవేట్ రంగం వంటి అన్ని వాటాదారులు అవినీతిని నిర్మూలించడానికి కలిసి పనిచేయాలని నేను నమ్ముతున్నాను. ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలని మరియు అన్ని సమయాల్లో నిజాయితీ మరియు సమగ్రత యొక్క అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని మరియు అవినీతికి వ్యతిరేకంగా పోరాటానికి మద్దతు ఇవ్వాలని నేను గ్రహించాను.కాబట్టి నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను.జీవితంలోని అన్ని రంగాలలో నిజాయితీ మరియు చట్ట నియమాలను అనుసరించడం.లంచం తీసుకోకూడదు లేదా ఇవ్వకూడదు.అన్ని పనులను నిజాయితీగా మరియు పారదర్శకంగా నిర్వహించడానికి.ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయడానికి.వ్యక్తిగత ప్రవర్తనలో సమగ్రతను ప్రదర్శించడం ద్వారా ఉదాహరణగా నడిపించడం.ఏదైనా అవినీతి సంఘటనను తగిన ఏజెన్సీకి నివేదించడం.అని ప్రతిజ్ఞ చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

🎉 నెల్లూరు జిల్లా ఖజానా కార్యాలయంలో కొత్త DT&AO (FAC)గా శ్రీ బి. శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరణ 🎉

నెల్లూరు అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా ఖజానా కార్యాలయంలో నూతనంగా DT&AO (FAC) బాధ్యతలు స్వీకరించిన గౌరవనీయ శ్రీ బి. శ్రీనివాసులు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలో ఖజానా విభాగం కీలకమైన పాత్ర పోషిస్తున్నది. ఖజానా సిబ్బంది అందరి సమన్వయంతో, ప్రజా నిధుల పారదర్శక వినియోగం, సమయపాలన, బాధ్యతాయుత ఆర్థిక నిర్వహణలో శ్రీనివాసులు గారు మరింత నూతన దిశలో ముందుకు తీసుకువెళతారని విశ్వసిస్తున్నాము. ఆయనకు ఉన్న అనుభవం, నిబద్ధత, ప్రజాసేవా తపన ఖజానా విభాగానికి మరింత బలం చేకూరుస్తుంది. ఖజానా సిబ్బంది తరఫున ఆయనకు ఈ కొత్త బాధ్యతలలో విజయం, ఆరోగ్యం, ఆనందం కలగాలని కోరుకుంటూ — జిల్లా ఖజానా వ్యవహారాలు మరింత చక్కగా సాగేలా ఆయన నాయకత్వం మార్గదర్శకంగా నిలుస్తుందని సిబ్బంది తెలిపారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మొంథా తుపాన్ ప్రభావంలో విద్యుత్ పునరుద్ధరణలో విద్యుత్ సంస్థకు అభినందనలు

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నగరం అగ్రహారం గ్రామం మొంథా తుపాన్ ప్రభావంతో తీవ్ర నష్టం చవిచూసింది. భారీ గాలులు, వర్షాల కారణంగా గ్రామంలో అనేక చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలపై పడి తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. స్థానిక ప్రజలు చీకట్లో కష్టాలు పడుతుండగా, పరిస్థితిని తక్షణమే అర్థం చేసుకున్న విద్యుత్ శాఖ అధికారులు పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించారు. ధోన్ డివిజన్, నంద్యాల సర్కిల్‌కి చెందిన రాయలసీమ విద్యుత్ సిబ్బంది ఈ కష్టసమయంలో నిజమైన సేవా భావంతో ముందుకు వచ్చారు. ఏఈ నాగేశ్వరరెడ్డి, ఏడిఈ నాగేంద్ర, లైన్మెన్ లాజర్, కాటమరాజు, జూనియర్ లైన్మెన్ బృందం ఎటువంటి భయం లేకుండా వర్షం, గాలులకు ఎదురీది విద్యుత్ తీగలను, స్తంభాలను మరమ్మతు చేసి విద్యుత్ సరఫరాను పునఃప్రారంభించారు. వారి సమయస్పూర్తి, ధైర్యం, ప్రజల పట్ల ఉన్న నిబద్ధత అభినందనీయమైనది. ఈ రాయలసీమ వీరులు తమ సొంత ప్రాంతం దూరంగా, ప్రాణాలకు ముప్పు ఉన్న సమయంలోనూ ప్రజల సౌకర్యం కోసం అహర్నిశలు శ్రమించారు. వారి సేవా తపన, విధిపట్ల ఉన్న నిజాయితీ, మన సమాజానికి ఆదర్శప్రాయమైనవి. మొంథా తుపాన్ వల్ల తీవ్ర నష్టం ఎదుర్కొన్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ ప్రజలకు ఈ విద్యుత్ సిబ్బంది కృషి ఆశాజ్యోతి నింపింది. ఈ కష్టకాలంలో సేవా ధర్మాన్ని నిలబెట్టిన ఏఈ నాగేశ్వరరెడ్డి గార్కి, ఏడిఈ నాగేంద్ర గార్కి లైన్మెన్ లాజర్ గార్కి , కాటమరాజు గార్కి మరియు మొత్తం జూనియర్ లైన్మెన్ బృందానికి ప్రజల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాము. వారి కృషి వల్ల డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మళ్లీ వెలుగులు నిండింది — వీరందరూ నిజమైన ప్రజాసేవకులు!

గూడూరు

ఎస్.కే.ఆర్. డిగ్రీ కళాశాలలో జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞ

స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అధ్యాపకులతో సహా విద్యార్థిని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 31 న రాష్ట్రీయ ఏక్తా దివస్ జరుపుకుంటారని, భారతదేశ ఐక్యత, సమగ్రత మరియు జాతీయ సంఘీభావాన్ని రాష్ట్రీయ ఏక్తా దివస్ సూచిస్తుందని, దేశ సార్వభౌమత్వం, ఐక్యతను పెంపొందించడానికి అన్ని కళాశాలల్లోని విద్యార్థులతో జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞ చేయించడం సమైక్యత పట్ల మనందరిలో బాధ్యతాయుతమైన అంకిత భావాన్ని పెంపొందించడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే. కోటేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ విజయ మహేష్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ నారాయణ రాజు, అధ్యాపకులు డాక్టర్ కే. శివప్రసాద్, డాక్టర్ శైలజ, డాక్టర్ ఝాన్సీ వాణి, కిరణమై, డాక్టర్ పీర్ కుమార్, రవిరాజు, గోపాల్ తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల

మానవత్వం చాటుకున్న డ్రైవర్ల యూనియన్

జోగులాంబ గద్వాల్ అక్టోబర్ 30 (పున్నమి ప్రతినిధి) గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు మాలపేట కాలనీకి చెందిన మాల వీరేష్ కుటుంబానికి డ్రైవర్ల యూనియన్ మానవత్వాన్ని చాటుకుంది. *డ్రైవర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా వీరేష్ కుటుంబానికి 36 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.* గత వారం రోజుల క్రితం నాగర్ దొడ్డి–బింగి దొడ్డి మధ్య మార్గంలో వీరేష్ తండ్రి మాల ముక్కెన్న గారు ప్రమాదవశాత్తు మరణించగా, ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించామని యూనియన్ నేతలు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, డ్రైవర్ వీరేష్ బైక్ యాక్సిడెంట్లో మరణించడం సాటి డ్రైవర్లకు తీవ్ర బాధాకరమని తెలిపారు. అలాగే అయిజ మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాల యజమానులు కూడా మానవత్వంతో ముందుకు వచ్చి వీరేష్ భార్య, పిల్లలకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.అలాగే ప్రమాదంపై ఇప్పటివరకు మండల పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం లేదని, త్వరలో బాధిత కుటుంబానికి న్యాయం జరగకుంటే డ్రైవర్ల యూనియన్ పెద్ద ఎత్తున ఆందోళనలు ప్రారంభిస్తుందని గౌడ్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో *అయిజ మండల డ్రైవర్ల యూనియన్ అధ్యక్షుడు తిరుమలేష్, ఉపాధ్యక్షుడు మల్లేష్, ప్రధాన కార్యదర్శి ఎం.డి. నజీర్ తదితరులు పాల్గొన్నారు.*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నిమ్మ రైతులను ముంచిన మొంతా తుఫాన్

అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలంలోని నిమ్మ రైతులను మాంథా తుఫాన్ నిలువునా ముంచేసింది. తుఫాన్ ప్రభావంతో మంగళవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు నిమ్మ చెట్లు వేరులతో సహా కొన్నిచోట్ల పైకి లేచాయి. నిమ్మచెట్ల పూత, పిందె మొత్తం రాలిపోయాయి. అధిక వేగంతో వీచిన ఈదురు గాలులకు చాలా చెట్లు నేలవాలాయి. ఈ తుఫాను ప్రభావంతో నిమ్మ పూత,పిందెలు రాలిపోవడంతో నిమ్మ రైతులు కుదేలయ్యారు. ఎన్నో ఏళ్ళుగా సాగు చేసిన నిమ్మ చెట్లు తుఫాను ప్రభాతంతో నేల మట్టం కావడంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారయ్యింది. రైతులను ప్రభుత్వం వెంటనే అన్ని విధాల ఆదుకోవాలని నిమ్మరైతులు కోరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్

వికలాంగునకు మూడు చక్రాల కుర్చీ అందజేత – సేవలతో అద్వైత భావన.- మెహర్ బాబా సేవకులు బరాటం.వరప్రసాద్ (శ్రీకాకుళం – అక్టోబర్ పున్నమి ప్రతినిధి)

ఆపదలో ఉండే వారిని ఆదుకోవటం, అద్వైత భావన కలిగిస్తుందని మెహర్ బాబా సేవకులు బరాటం.వరప్రసాద్ అన్నారు. స్థానిక హాయతి నగరానికి చెందిన దువ్వు.ఈశ్వర్ వృత్తిరీత్యా ఆటో చోదకులుకాగా, అనివార్య కారణాలతో నడవలేని స్థితికి చేరుకున్నారు. తండ్రి నారాయణ దినసరి కూలీ కావటంతో ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా మూడు చక్రాల కుర్చీ కోసం ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమా శంకర్ సహాయం కోరారు. ఆయన వాట్సాప్ స్టేటస్ కు స్పందించిన దాత, న్యూ కోలనీకి చెందిన మెహర్ బాబా సేవకులు బరాటం.వరప్రసాద్ ముందుకు వచ్చి చక్రాల కుర్చీని, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ప్రెసిడెంట్ డా.పైడి.సింధూర చేతుల మీదుగా బాధితునికి అందించారు. ఈ సందర్భంగా లయన్ డా.పైడి.సింధూర మాట్లాడుతూ చక్రాల కుర్చీ దాత వరప్రసాద్ కు కృతజ్ఞతలని, నగరంలో మెహర్ బాబా పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, మెహర్ బాబా సేవకునిగా ఈ రోజు చేసిన సేవకు ధన్యవాదాలన్నారు. అనంతరం బాధితునికి ఉచిత వైద్యపరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో బాధితుడు దువ్వు ఈశ్వర్, సహాయకుడు ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమా శంకర్, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ప్రతినిధి పొడుగు.చరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తుఫాన్ బాధితులని పలకరించనున్న గొల్లపల్లి

నియోజకవర్గంలోని మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాలను రేపు ఉదయం 9:00 గంటలకు నుంచి పర్యటించి వివరాలు, వారి యోగక్షేమాలు తెలుసుకోనున్న మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాజోలు నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ గొల్లపల్లి సూర్య రావు గారు. తుపాను కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని, బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ప్రభుత్వ అధికారులతో మాట్లాడతారు. తుఫాను ప్రభావిత తీర ప్రాంతాల్లో ప్రజలను పునరావాస శిబిరాలకు వెళ్లి సందర్శించి వారితో మాట్లాడతారు. మధ్యాహ్నం 2:00 గంటలకు రాజోలు మండలంలో కడలి, వేగివారిపాలెం, చెన్నాడం గ్రామాలలో రచ్చబండ కార్యక్రమాలలో పాల్గొని అనంతరం ఆ గ్రామాలను సందర్శించనున్నారు. రాజోలు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం – మల్కిపురం.

తూర్పు గోదావరి

‘మొంథా’తుఫాన్ బాధితుల కోసం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్న యం.ఎల్.ఏ ముప్పిడి…

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్ళపూడి మండలం ప్రక్కిలంక గ్రామంలో ‘మొంథా’ తుఫాన్ బాదితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పర్యవేక్షించిన కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎన్.డి.ఏ కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు.ఈ సందర్భంలో అక్కడ ఒకావిడ కళ్ళుతిరిగి పడిపోగా ఆమెకి ప్రధమ చికిత్స చేయించారు. వారికి సమయానికి భోజన సధుపాయం వుండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్

నగరంలో అన్నప్రసాద వితరణ ..- మన ఊరు, మన బాధ్యతలో వర్షంలోనూ అన్నదాన కార్యక్రమాలు. (శ్రీకాకుళం – అక్టోబర్ పున్నమి ప్రతినిధి)

మన ఊరు, మన బాధ్యతలో భాగముగా కొంతమంది సేవకులు, వర్షంలోనూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేటి అన్నప్రసాద దాతలు అరసవల్లికి చెందిన డా.ఇంజరాపు మోహన్ రావు కుమార్తె, ఇంజరాపు.కీర్తన జన్మదినం సందర్భంగా నగరంలో పలు చోట్ల అన్నవితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం, పాత బ్రిడ్జి, కొత్త బ్రిడ్జి, డే అండ్ నైట్ కూడలి, నైట్ షెల్టర్, రామలక్ష్మణ, సూర్యమహల్, అరసవల్లి , పాత బస్ స్టాండ్, ఏడు రోడ్ల కూడలి, కొత్త రోడ్ పరిసర ప్రాంతాలలో నిస్సహాయ పేదలకు ఆహారాన్ని అందించారు. అనంతరం పేదల వైద్యులు ఇంజరాపు.మోహన్ మాట్లాడుతూ సివిల్స్ కి సిద్దమౌతున్న నా కుమార్తె, కీర్తన ఆలోచన మేరకు ఈ రోజు నగరంలో వందమంది ఆకలి తీర్చామని, మన ఊరు, మన బాధ్యతలో భాగముగా సేవా కార్యక్రమాన్ని చేయటం బాధ్యతతోపాటు, పదిమంది కడుపు నింపటం ఆనందంగా ఉందన్నారు. తుఫాన్ తీవ్రత ఉన్నందున నగరంలో అన్ని ముఖ్య కూడలిలలో ఆహారాన్నందించామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది.ఉమా శంకర్, నేటి దాత ఇంజరపు.మోహన్ మిత్రులు సిరిగిరి.నవచైతన్య, బత్తిలి.రమేష్, కె.నవీన్, సేవకులు ఉర్లం.శివతేజ, షెల్టర్ నిర్వాహకులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.