జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ ఏఐసీసీ కార్యాదర్శి సంపత్
జూబ్లీహిల్స్ అక్టోబర్ 30(పున్నమి ప్రతినిధి) **జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ గారు.* ఎలక్షన్ స్టార్ క్యాంపేయినర్ గా బాధ్యతల నిర్వాహణ , పార్టీ గెలుపుకు స్థానిక నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహించిన సంపత్ కుమార్. పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ గారు . జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు యూసఫ్ గూడా డివిజన్ లోని కృష్ణ నగర్ లో ఎఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ గారు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డిగారి తో కలిసి గడప గడప తిరుగుతూ ప్రచారం నిర్వహించారు , సంపత్ కుమార్ గారు మాట్లాడుతూ అధికారం లో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి మీ ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి పథకాలు ప్రతి గడపకు చేరుతాయని ప్రత్యక్షము లో ఉన్నవారు అభివృద్ధి చేయలేరు అనే విషయాన్ని గ్రహించాలని జూబ్లీహిల్స్ ప్రజలను కోరారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి ప్రజలకు అర్థం అయ్యేలా వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వీరితో పాటు , tricor చైర్మెన్ బెల్లయ్య నాయక్ గారు,MUDA చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్ గారు, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్నపల్లి శంకర్ గారు ,రాష్ట స్పోర్ట్స్ అథారిటీ చైర్మెన్ శివ సేన రెడ్డి గారు, మహిళ కాంగ్రెస్ నాయకురాలు సునీత రావ్ గారు,మరియు ఇతర ముఖ్య కాంగ్రెస్ నాయకులు మహిళలు ,కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.











