Monday, 6 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శ

02-11-2025 కోసూరు శ్రీనివాసులు కుటుంబానికి సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు. కోసూరు శ్రీనివాసులు కుమారుడైన సురేష్ ని ఆయన అల్లుడు సర్వేపల్లి తెలుగు యువత అధ్యక్షుడు శివుడు రాజా గౌడ్ ని పరామర్శించి ఓదార్చారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాష్ట్రంలో హత్యలు, ఆలయ ఘటనలపై ప్రభుత్వ నిర్లక్ష్యంపై గెడ్డం గంగాధర్ ఆవేదన

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో హత్యలు, హత్యాచారాలు పెరుగుతున్నాయని గెడ్డం గంగాధర్ (అప్పనపల్లి), డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, ఇటీవల తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో జరిగిన ఘటనల్లో అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి విషాద ఘటనలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, భద్రతా చర్యలు లేకపోవడంపై ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టడం, కల్తీ మద్యం అమ్మకాలను అడ్డుకోలేకపోవడం, ఆలయాల పట్ల నిర్లక్ష్యం ప్రభుత్వం పాలనలో తీవ్రంగా కనిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. గెడ్డం గంగాధర్ మాట్లాడుతూ – “ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టడం కంటే, ఆలయాల్లో భద్రతా చర్యలు చేపట్టడం, ప్రజల ప్రాణాలను కాపాడడం ముఖ్యమని ప్రభుత్వం గ్రహించాలి. ఇప్పటికైనా మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వం మేల్కొని అక్రమాలు, నిర్లక్ష్యాలు ఆగేలా చర్యలు తీసుకోవాలి,” అని పిలుపునిచ్చారు.

అన్నమయ్య

కూటమి ప్రభుత్వంలో చెరువులకు జలకళ జల హారతి ఇచ్చి పూజలు పాల్గొన్న మేడా

కూటమి ప్రభుత్వంలో చెరువులకు జలకళ లభించిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి అన్నారు.నందలూరు మండలంలోని ఎర్రచెరువుపల్లి చెరువు అలుగు పొంగడంతో నీటి సంఘం ఉపాధ్యక్షులు సాతపల్లి పిచ్చిరెడ్డి, ఆధ్వర్యంలో అలుగు వద్ద మేడా విజయ శేఖర్ రెడ్డి పూజలు నిర్వహించి జల హారతి ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాకతో చెరువులకు జలకళ ఉట్టిపడుతుందన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా త్రాగు సాగునీటికి ఇబ్బందులు లేకుండా వేల కోట్లు రూపాయలు ఖర్చు చేసి చెరువులకు సాగునీరు అందించాలన్న సంకల్పం నేడు రాష్ట్రవ్యాప్తంగా నెరవేరింది అన్నారు.రైతుల సంక్షేమమే ధ్యేయంగా చెరువులకు నీరుమల్లిచ్చి వారు పంటలు వేసుకునే విధంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.ఐదేళ్లలో చెరువుల అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు.చెరువులు నిండడం ద్వారా అటు సాగునీరు త్రాగునీటికి ఇబ్బందులు ఉండవన్నారు.భూగర్భ జలాలు పెరగడంతో పొలాలన్నీ పచ్చని పైర్లుగా నిండిపోతాయని ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఆకాంక్షగా ఆయన అభివర్ణించారు,ఈ కార్యక్రమంలో సాతపల్లి సాయి నర్సారెడ్డి, బైన బోయిన వేణు యాదవ్, నాగ రెడ్డప్ప రెడ్డి, సానం రెడ్డి మహేశ్వర్ రెడ్డి, సాతపల్లి వెంకటసుబ్బారెడ్డి, మరియు మహిళలు గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు.

ఖమ్మం

ఘనంగా స్మార్ట్ కిడ్జ్ పాఠ శాల వన మహోత్సవ. కార్యక్రమం

ఖమ్మం ఉల్లాసంగా ఉత్సాహంగా స్మార్ట్ కిడ్జ్ పాఠశాల వన సమారాధన ఖమ్మం నగరంలోని ప్రముఖ విద్యాసంస్థ స్మార్ట్ కిడ్జ్ పాఠశాల విద్యార్థులు శనివారం ఉత్సాహభరితంగా వన సమారాధన కార్యక్రమం ని స్థానిక చెరుకూరి గార్డెన్ని లో ర్వహించారు. కార్తీక మాస శుభవేళలో పాఠశాల నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. చిన్నారుల నృత్యాలతో వన ప్రాంగణం హోరెత్తగా, మ్యాజిక్ షో అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేసింది. ఉరకలేసే ఉత్సాహంతో పాల్గొన్న చిన్నారులు వాతావరణాన్ని మరింత సంతోషభరితంగా మార్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ చింత నిప్పు కృష్ణ చైతన్య తో పాటు అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని చిన్నారులను ప్రోత్సహించారు.

నాగర్‌కర్నూల్

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు*

నాగర్ కర్నూల్ నవంబర్ 2 (పున్నమి ప్రతినిధి) పెద్ద కొత్తపల్లి మండల పరిధిలోని చెన్నపురావుపల్లి గ్రామం లో బాల్య వివాహం చేస్తుండగా అధికారులు అడ్డుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. 18 సంవత్సరాలు కూడా నిండని అమ్మాయికి వివాహం చేస్తున్నట్లు చైల్డ్ హెల్ప్ లైన్ కు సమాచారం రావడంతో హఠాత్తుగా నాగర్ కర్నూల్ చైల్డ్ హెల్ప్ లైన్, డీసీపీయూ యూనిట్ సభ్యులు, పోలీసులు సంక్షేమ శాఖ అధికారులు సంయుక్తంగా బాల్య వివాహం జరుగుతున్న చెన్నపురావుపల్లి గ్రామానికి చేరుకొని వివాహాన్ని అడ్డుకున్నారు. అదే గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి తో 9 వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను ఇచ్చి బలవంతం గా పెళ్లి చేయాలనీ ప్రయత్నించారు. అమ్మాయి జిల్లా బాలల సంరక్షణ సమితికి సమాచారం అందించడంతో అదుపులోకి తీసుకొని పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ నుంచి అమ్మాయి ని తరలించి చైల్డ్ వెల్ఫేర్ కమిటి ముందుకు హాజరు పరిచారు. అమ్మాయి కి, వారి సోదరుని కి కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం అమ్మాయి ని బాలసదన్ తరలించారు. ఈ కార్యక్రమంలో డీసీపీయూ యూనిట్ 5 ప్రతినిధులు జంగిటి మధుబాబు, లలిత, చైల్డ్ హెల్టైన్ ప్రమీల, స్థానిక అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఘనంగా సుబ్బారావు పేటలో శ్రీ శ్రీ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు

సుబ్బారావు పేట గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ వీరభద్రేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ప్రారంభమయ్యాయి. శనివారం స్వామి వారి కళ్యాణ మహోత్సవం, ఆదివారం మహా అన్న సమారాధన, సోమవారం తిరువీధి ఉత్సవాలు ప్రత్యేకంగా నిర్వహించబడనున్నాయి. పరిసర మండలాల ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీర్వాదం పొందుతున్నారు. ఆలయ ప్రాంగణం పూలతో, పతాకాలతో అలంకరించబడగా, వేదిక వద్ద భజనలు, హోమాలు, సాంప్రదాయ వాద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ ఉత్సవాలు సుబ్బారావు పేట గ్రామానికి ప్రత్యేక గౌరవాన్ని తెస్తున్నాయి. ఈ కార్యక్రమాలకు పరిసర గ్రామాలైన సుబ్బారావుపేట, వాండ్రాడ, చిన్నబమ్మిడి, పెద్దబమ్మిడి, గట్లపాడు, నర్సింగబిల్లి, నిమ్మాడ, నిమ్మాడ జంక్షన్, జడూరు, మహదేవపురం మరియు నిమ్మాడ వారి శ్రీ లలితా జ్యూయలర్స్ వారు ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పి గన్నవరం : రోడ్డు ప్రమాదంలో ఒక్కరు మృతి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం కడలి గ్రామానికి చెందిన నెల్లి హర్షవర్ధన్ (23) వల్లూరి తేజ (16) ఇద్దరు యువకులుకి పి గన్నవరం మండలం మొండెపులంక లాకు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హర్షవర్ధన్ మృతి చెందడం జరిగింది. మృతుడు ఇటీవలే కువైట్ దేశం నుండి వచ్చినట్లు సమాచారం అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలియజేశారు తేజ అమలాపురం ఓ ప్రెవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్సై శివకృష్ణగారు తెలిపారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పి గన్నవరం : రోడ్డు ప్రమాదంలో ఒక్కరు మృతి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం కడలి గ్రామానికి చెందిన నెల్లి హర్షవర్ధన్ (23) వల్లూరి తేజ (16) ఇద్దరు యువకులుకి పి గన్నవరం మండలం మొండెపులంక లాకు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హర్షవర్ధన్ మృతి చెందడం జరిగింది. మృతుడు ఇటీవలే కువైట్ దేశం నుండి వచ్చినట్లు సమాచారం అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలియజేశారు తేజ అమలాపురం ఓ ప్రెవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్సై శివకృష్ణగారు తెలిపారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పి గన్నవరం : రోడ్డు ప్రమాదంలో ఒక్కరు మృతి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం కడలి గ్రామానికి చెందిన నెల్లి హర్షవర్ధన్ (23) వల్లూరి తేజ (16) ఇద్దరు యువకులుకి పి గన్నవరం మండలం మొండెపులంక లాకు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హర్షవర్ధన్ మృతి చెందడం జరిగింది. మృతుడు ఇటీవలే కువైట్ దేశం నుండి వచ్చినట్లు సమాచారం అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలియజేశారు తేజ అమలాపురం ఓ ప్రెవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్సై శివకృష్ణగారు తెలిపారు

ఆంధ్రప్రదేశ్

రాజోలు శాసన సభ్యులు దేవ వరప్రసాద్ ను మెమంటో తో అభినందించిన…ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

రాజోలు శాసన సభ్యులు దేవ వరప్రసాద్ ను మెమంటో తో అభినందించిన…ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేసిన మొంథ తుఫాను ను రాజోలు నియోజకవర్గం లో ఎదుర్కొని ప్రజలకు ఏ ఇబ్బంది కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని, తుఫాన్ అనంతరం ఒక్కరోజు వ్యవధి లోనే నియోజకవర్గాన్ని వస్తావ స్థితికి తీసుకురావడం లో తనదైనా శైలిలో పని చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు చె ప్రశంసలు పొంది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ రోజు అమరావతి లో సైక్లోన్ ఫైటర్ మెమంటో ను అందుకున్న శాసన సభ్యులు దేవ వరప్రసాద్ గారికి శుభాకాంక్షలు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.