Saturday, 4 April 2026

Blog

తిరుపతి

యోగులపర్వతం పై కార్తీక దీపోత్సవం మహాదీపాన్ని వెలిగించిన శ్రీ ప్రతాప్ స్వామీజీ

రామచంద్రపురం మండలం ఏకవీర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూజ్యశ్రీ ప్రతాప్ స్వామి దివ్య ఆశీస్సులతో, శివకేశువులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా పవిత్ర యోగులపర్వతం పై కార్తీక దీపోత్సవం జరిగింది. ఉదయం నుంచే యోగుల పర్వతంపై వెలిసి ఉన్న శ్రీ మహాగణపతి స్వామికి, శ్రీ బాలసుబ్రమణ్య స్వామికి, మహా శివునికి, నాగదేవతలకు, శ్రీవారి పాదాలకు సుగంధ ద్రవ్యాలతో విశేషాలు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు దీపోత్సవానికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన 6 అడుగుల ఎత్తైన దివ్య దీపం (కొప్పర) 1503 కేజీల నెయ్యి మరియు 2000మీటర్లు ఒత్తు కలిగిన మహాదీపాన్ని ఓం నమశ్శివాయ నామస్మరణల పారావస్యంతో భక్తిశ్రద్ధలతో శ్రీ ప్రతాప్ స్వామీజీ వెలిగించారు. యోగుల పర్వతం శివనామ స్మరణతో మారు మ్రోగింది. పరిసర ప్రాంతాల ప్రజలే కాక ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు కార్తీక దీపాన్ని సందర్శించారు. యోగుల పర్వతంపై వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం త్రాగునీరు అన్నదానం ప్రసాద వితరణ నిర్వాహకులు చేశారు. ఈ సందర్భంగా గురూజీ భక్తులకు భక్తి ప్రవచనం బోధించారు ఈ దివ్య దీపం ధర్మం, భక్తి, లోకకల్యాణం యొక్క ప్రకాశాన్ని ప్రతిబింబిస్తూ, ఆధ్యాత్మిక సందేశాన్ని వ్యాప్తి వేలాది భక్తులు దీపాలు వెలిగించి, ఈ పవిత్ర దీపోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని, ప్రకృతి పరిరక్షణ, లోకశాంతి, ప్రజల శ్రేయస్సు, సమాజ సౌభ్రాతృత్వం కోసం ప్రార్థనలు చేశారు. ఆ జ్యోతి వెలుగులో యోగులపర్వతం ఆధ్యాత్మిక క్షేత్రంగా మారి, ప్రతి భక్తుడి హృదయంలో భక్తిజ్యోతి వెలిగించింది. “దీపం ఒకటి వెలిగితే చీకటి తొలగుతుంది, భక్తి వెలిగితే లోకం ప్రకాశిస్తుంది. ధర్మజ్యోతి మన హృదయంలో వెలిగినపుడు, అది యుగయుగాల వెలుగుకి మూలం అవుతుంది.”

తెలంగాణ

భద్రాచలం ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని కేంద్రం, రెండు రాష్ట్రాలకు తెలంగాణ మంత్రి తుమ్మల లేఖ:

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి తెలంగాణ ప్రతి నిధి) ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో భద్రాచలం పరిసర ఐదు గ్రామ పంచాయితీ లని తెలంగాణ రాష్ట్రంలో కలపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి లకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. భద్రాచలం పట్టణం తెలంగాణలో ఉండగా, దానికి ఆనుకుని ఉన్న యాటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల పంచాయతీలు ఆంధ్రప్రదేశ్‌లో ఉండటం వల్ల ప్రజలు, ముఖ్యంగా గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తుమ్మల పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర తనిఖీలు, ఆరోగ్య–విద్యా సదుపాయాల లోపం, పరిపాలనా చిక్కులు ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయని ఆయన వివరించారు. భద్రాచలం దేవస్థానం భూములు ఆంధ్రప్రదేశ్‌లో ఉండటంతో దేవాలయ అభివృద్ధి, భూముల వినియోగం కష్టతరం అవుతోందని చెప్పారు. ఈ గ్రామాలను తెలంగాణకు చేర్చితే భద్రాద్రి రామయ్య ఆలయం అభివృద్ధి, గిరిజన చారిత్రక వైభవం మరింతగా వెలుగొందుతుందని తుమ్మల అభిప్రాయపడ్డారు. ఇది రాజకీయ అంశం కాదని, ప్రజల ఆకాంక్ష, పరిపాలనా అవసరాలపై ఆధారపడిన డిమాండ్ అని స్పష్టం చేశారు. “భద్రాద్రి రాముడు తెలంగాణలో ఉన్నాడు… ఆయన భూములు ఆంధ్రలో ఉండటం అన్యాయం” అని పేర్కొంటూ, కేంద్రం సానుకూలంగా స్పందించాలని, రెండు రాష్ట్రాలు సమన్వయంతో ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని తుమ్మల విజ్ఞప్తి చేశారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

సీసీ రోడ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన సర్పంచ్ మట్టా ప్రసన్నకుమారి సురేష్

రాజోలు నవంబర్ 6 పున్నమి ప్రతినిధి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా చింతలపల్లి గ్రామంలో పలు వీధుల్లోని సీసీ రోడ్లకు బుధవారం స్థానిక సర్పంచ్ మట్టా ప్రసన్నకుమారి సురేష్ శంఖుస్థాపన చేశారు. ఈ మేరకు సర్పంచ్ మట్టా ప్రసన్నకుమారి సురేష్ మాట్లాడుతూ రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సహకారంతో 30 లక్షల ఎంజీఎన్ఆర్జీఎస్ నిధులతో గ్రామంలో పలు విధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. సీసీ రోడ్ల నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కు ఈ సందర్భంగా మట్టా ప్రసన్నకుమారి సురేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొక్కా రామకృష్ణ, సొసైటీ చైర్మన్ పిప్పళ్ళ రాంబాబు, మాజీ సర్పంచ్ పిప్పళ్ల మల్లు పల్లపోతు సత్యబాబు, పాటి శ్రీనుస్వామి, పిప్పళ్ల లక్ష్మణరావు, గురుజు జగదీశ్, మామిడిశెట్టి మాధవ రావు, పితాని శ్రీను, చింతలపల్లి ఎర్రయెంకటపతి, గ్రేడ్ 5 కార్య దర్శి ఏ. రాజేష్, పినిపే మౌనిక పంచాయితీ సిబ్బంది మరియు గ్రామపెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కాకర్ల సునీల్ అన్న జన్మదిన శుభాకాంక్షలు

💐 HAPPY BIRTHDAY 🎂 SUNIL ANNA 💐 గౌరవనీయులైన బాస్ శ్రీ కాకర్ల సునీల్ గారికి ముందుగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.💐 మీ మార్గదర్శకత్వం, ఆదర్శ నాయకత్వం, మరియు మనసుకు హత్తుకునే వ్యక్తిత్వం మాకు ఎల్లప్పుడూ ప్రేరణగా నిలుస్తున్నాయి. మీ సానుకూల దృక్పథం, ఆత్మీయత, కృషి మరియు నిబద్ధత చూసి ప్రతి ఒక్కరం ఉత్తమంగా మారేందుకు ప్రేరేపించబడుతున్నాం. ఈ ప్రత్యేక రోజు మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, శాంతి, విజయాలు, ప్రేమ మరియు గౌరవం మరింత పెరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండి ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి, అందరికీ మార్గదర్శకులుగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. 🎉 Happy Birthday Sunil Anna— You are truly an inspiration! 🎉 మీ యేలేశం నరోత్తం రెడ్డి తెలుగు యువత

భక్తి

అయ్యప్ప భక్తులకీ సందేశం :

పున్నమి: అయ్యప్ప స్వాములకు సందేశం: అయ్యప్ప స్వాముల దీక్ష “స్వామి” అని పిలవడంతో మొదలవుతుంది.అయితే అలా ఎందుకు పిలవాలి? ఎందుకంటే,అందరినీ భగవంతుని ప్రతిరూపాలుగా చూడడం అలవాటు చేసుకోవాలి.ఇదే మాల ధారణంలోని మొట్ట మొదటి నియమం.అలా చూడడం అనేది ఎంతో పవిత్రమైన దృష్టి.స్వాములు దీక్షలో బలంగా నిలబడాలంటే అందరినీ భగవంతుని ప్రతిరూపాలుగా చూడడం,”స్వామి” అని పిలవడం చాలా ముఖ్యం. 🙏 ఇక రెండవ నియమం: స్వాములు ఏ పని చేసినా అయ్యప్పను (భగవంతుణ్ణి) తలుచుకుంటూ,భక్తితో చేయాలి.స్వార్థం లేకుండా (నాకు ఇంకా ఎక్కువ డబ్బు కావాలి అనే దురాశ లేకుండా) పనులు చేయడం అలవాటు చేసుకోవాలి.ఈ నియమం అందరి స్వాములకు వర్తిస్తుంది. ప్రభుత్వ అధికారులైన స్వాములు మొదలుకొని,టీ బంకు,ఆటోలు నడిపే స్వాముల వరకు అందరూ అయ్యప్ప స్వామి పట్ల భక్తితో,నిస్వార్థంగా పని చేయడం అలవాటు చేసుకోవాలి. 🙏 ఇక మూడవ నియమం: స్వాములు ఏది పడితే అది తినకూడదు.ఎందుకంటే స్వాములకు ఒక నియమం ఉంది.భగవంతునికి నైవేద్యంగా పెట్టిన ఆహారాన్ని మాత్రమే తినాలి.అది కూడా భగవంతుణ్ణి తలుచుకుంటూ భక్తితో తినాలి.అలా భక్తితో తిన్న ఆహారం అమృతం అవుతుంది.ఆ అమృతం స్వాములలో దీక్షా బలాన్ని రెట్టింపు చేస్తుంది. 🙏 ఇక నాలుగవ నియమం: స్వాములు ఏ పూజ చేసినా అయ్యప్పను తలుచుకుంటూ భక్తితో చేయాలి.అయ్యప్ప పూజలలో అన్ని పూజలూ ముఖ్యమే.కానీ అయ్యప్ప భజన అనేది చాలా ముఖ్యం.ఎందుకంటే భజనలో ఎంతో గొప్ప శక్తి ఉంటుంది. స్వాములందరూ కలిసి “స్వామియే…అయ్యప్పో…అయ్యప్పో..స్వామియే” అని గట్టిగా పలుకుతూ,స్మరిస్తూ ఉంటే మనస్సు కొద్ది సేపు సమాధి స్థితిలో నిలిచిపోతుంది.అలాంటి మనస్సుకే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.కాబట్టి స్వాములు ప్రతి రోజూ అయ్యప్ప భజనలు భక్తితో చేస్తూ ఉండాలి. 🙏 ఇక ఐదవ నియమం: స్వాములు ఇతరులకు ఏది దానం చేసినా,భగవంతుణ్ణి తలుచుకుంటూ దానం చేయాలి.అప్పుడే ఆ దానం సఫలమౌతుంది. 🙏 ఇక ఆరవ నియమం: స్వాములు ప్రతి రోజూ కొద్ది సేపు భగవంతుణ్ణి భక్తితో ధ్యానిస్తూ ఉండాలి.ఇలా ధ్యానం చేస్తూ ఉండడం వల్ల స్వాములకు మనో నిగ్రహం,ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది.తద్వారా స్వాముల దీక్షా బలం రెట్టింపవుతుంది. పై ఆరు నియమాలను బాగా గమనిస్తే,మనకు ఒక విషయం తెలుస్తుంది.మనం ఏది చేసినా భగవంతుడి పట్ల భక్తితో నిస్వార్థంగా చేయాలి అనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది.అయితే అలా ఎందుకు చేయాలి? నేను నాకోసమే,నా లాభం కోసమే పనులు చేసుకుంటాను అని కొందరు అంటారు. ఎప్పుడైతే నువ్వు నీ కోసం మాత్రమే పనులు చేసుకుంటూ ఉంటావో,అప్పుడు నీలో అహంకారం,స్వార్థం బాగా పెరిగిపోతాయి.ఆ అహంకార స్వార్థాలే నీలో దురాశను కలిగిస్తాయి.అవే నీతో చేయకూడని పనులను చేయిస్తాయి.అవే నీ జీవితాన్ని బాగా దెబ్బతీస్తాయి. కాబట్టి మనలోని అహంకారం భక్తిగా మారాలి.అలా మారాలంటే మనం భగవంతుడి పట్ల భక్తితో నిస్వార్థంగా పనులు చేయడం అలవాటు చేసుకోవాలి.అప్పుడే మనం దేవుడికి దగ్గరవుతాం.అప్పుడే నలుగురికి సహాయం చేసే గుణాన్ని పొందుతాం. ||యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్య మదర్పణం||(9.27) అర్థం: అర్జునా!..నువ్వు ఏ పని చేసినా,ఏది తిన్నా,ఏది హోమం చేసినా,ఏది దానం చేసినా,ఏ తపస్సు చేసినా,వాటన్నిటినీ నాకు సమర్పించు(మనస్ఫూర్తిగా ఇవ్వు) అని భగవంతుడు చెబుతున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వామియే శరణమయ్యప్ప

హైదరాబాద్

రేవంత్ రెడ్డి పాలనపై మహిళలే ప్రశ్నలు – పేదల ఇళ్లపై బుల్డోజర్లు పంపిన సీఎం పై మండిపడ్డ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

పున్నమి ప్రతి నిధి జూబ్లీహిల్స్ ఫ్రీ బస్సు ఎందుకు అని మహిళలే ప్రశ్నిస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. పేదల ఇళ్ల మీదకి బుల్డోజర్లు పంపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. మూడు ఏళ్ళ తరువాత కే.సి.ఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే కేటీఆర్ మీద ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఏపీ ఎస్పీడీసీఎల్ సిఎండి గారు ఆదేశాలు

గౌరవ సీఎండీ గారి ఆదేశముల మేరకు ప్రజలలో విద్యుత్ సరఫరా మీద ఉన్న అభిప్రాయము మెరుగు పడేలా చేసే ప్రయత్నంలో భాగంగా కింద తెలిపిన ప్రణాళిక అమలు చేయవలెను 1.సోమవారం ప్రతి ఒక్క జూనియర్ లైన్ మెన్ వారం లో ప్రతి సోమవారం తన పరిధిలోని 10 మంది వినియోగదారులతో మొబైల్ ఫోన్ లో మాట్లాడవలెను 2.మంగళవారం అసిస్టెంట్ లైన్ మెన్ /లైన్ మెన్ 10 మందితో మాట్లాడవలెను 3.బుధవారం లైన్ ఇన్స్పెక్టర్ /సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ / ఫోర్ మెన్ 10 మందితో మాట్లాడవలెను 4.గురువారం ఏ యి గారు 20 మందితో మాట్లాడవలెను 5 శుక్రవారం DEE గారు 30 మంది తో మాట్లాడవలెను 6.శనివారం EE గారు 40 మందితో మాట్లాడవలెను 7.గౌరవ SE గారు వారంలో ఎదో ఒక రోజు 50 మందితో మాట్లాడవలెను. మాట్లాడేప్పుడు వారితో కింద తెలిపిన సమాచారం అడగవలెను A.విద్యుత్ సరఫరా సక్రమంగా ఉందా లేదా B.వోల్టెజ్ అప్ అండ్ డౌన్ ఉందా C.సిబ్బంది అందుబాటులో ఉన్నారా లేదా ఇవ్వన్ని ఒక పుస్తకములో నమోదు చేయవలెను. పైన తెలిపిన సూచిక మనము అమలు చేసి వారంతమునకు రిపోర్ట్ ను పై అధికారులకు తెలుపవలెను.

హైదరాబాద్

రేవంత్ రెడ్డి పాలనపై మహిళలే ప్రశ్నలు – పేదల ఇళ్లపై బుల్డోజర్లు పంపిన సీఎం పై మండిపడ్డ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

పున్నమి ప్రతి నిధి జూబ్లీహిల్స్ ఫ్రీ బస్సు ఎందుకు అని మహిళలే ప్రశ్నిస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. పేదల ఇళ్ల మీదకి బుల్డోజర్లు పంపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. మూడు నెలల తరువాత కే.సి.ఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే కేటీఆర్ మీద ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

హైదరాబాద్

బీజేపీ బైక్ ర్యాలీ – జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉత్సాహభరిత ప్రచారం

పున్నమి ప్రతి నిధి (జూబ్లీహిల్స్) జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థి లంకల దీపక్‌ కు మద్దతుగా బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బోరబండ, ఎర్రగడ్డ డివిజన్‌లలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సాయిబాబా నగర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ, ప్రతిభ కాలేజ్, మోతి నగర్ ఎక్స్ రోడ్, మిద్‌ల్యాండ్ చౌరస్తా మీదుగా రాయల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. అడుగడుగునా జన ప్రభంజనం తోడవగా వేలాదిగా తరలివచ్చిన బీజేపీ మద్దతుదారులు ర్యాలీకి విశేష స్పందన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ — గత పదేళ్లుగా బీఆర్ఎస్, రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తూ వచ్చాయని, మజ్లిస్ కనుసన్నల్లో అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ఈ ఉపఎన్నికలో ప్రజలు ఈ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలి అని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందాలంటే బీజేపీనే ఏకైక ప్రత్యామ్నాయమని, ప్రజలకు అందుబాటులో ఉండే అభ్యర్థి లంకల దీపక్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ర్యాలీలో గౌరవ ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, గౌరవ నిర్మల్ ఎమ్మెల్యే ఆలేటి మహేశ్వర్ రెడ్డి, తెలంగాణ జనసేన అధ్యక్షులు శంకర్ గౌడ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

అన్నమయ్య

ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం మరొక ముందడుగు – చిట్వేలు కొత్త ఆసుపత్రి ఆరంభం

అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొన్నారు. గతంలో పాత హాస్పిటల్ భవనం శిధిలావస్థకు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ కొత్త హాస్పిటల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ చిట్వేలు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఏ సమస్యలైనా ఎదురైతే ప్రభుత్వం అండగా ఉంటుంది, అని పేర్కొన్నారు. చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతు చిట్వేలు ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యత. ఈ ఆసుపత్రిలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాం అన్నారు. డాక్టర్లు సూచించిన మరిన్ని వసతులను కూడా త్వరలో పర్మిషన్ చేయిస్తాం. చిట్వేలు నా హృదయంలో ప్రత్యేక స్థానం కలిగిన ప్రాంతం. కోడూరు – చిట్వేలు రోడ్డును కూడా త్వరలో పూర్తి చేసి ప్రారంభిస్తాం, అని తెలిపారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యం కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. చిట్వేలు హాస్పిటల్ ప్రారంభం వల్ల వేలాది మంది ప్రజలకు వైద్య సేవలు సులభతరం అవుతాయి, అని అన్నారు. డీఎంహెచ్వో డాక్టర్ లక్ష్మణ్ నారాయణ మాట్లాడుతూ – “కొత్త హాస్పిటల్‌లో అన్ని సదుపాయాలు సమృద్ధిగా ఉన్నాయి. చిన్నచిన్న అవసరాలు డోనర్ల సహకారంతో తీర్చుకోవచ్చు. ఇక్కడ డెలివరీలు సహా అన్ని రకాల చికిత్సలు అందిస్తాం,” అని వివరించారు. ఈ కార్యక్రమంలో పాటూరు శ్రీనివాస్ రెడ్డి, టిడిపి యువనేత గుత్తి నరసింహ, రవి ప్రకాష్, జనసేన నాయకుడు మాదాసు నరసింహులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ వరలక్ష్మి, తాసిల్దార్ స్పందన, సిఐ వెంకటేశ్వర్లు, డీఎంఎన్ఓ డాక్టర్ విష్ణు, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ శేఖర్, డాక్టర్ అబ్దుల్ వకీల్ అన్సారి, హెల్త్ ఇస్మాయిల్ భాష, అధికారులు, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.