Friday, 3 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

టెక్ టూల్ రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు

ఉదయగిరి బీసీ కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టెక్ టూల్ రెండు రోజుల శిక్షణ కార్యక్రమనికీ ఏంఈ ఓ తోట శ్రీనివాసులు ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ బోధన పద్ధతులు నాణ్యతను పరిశీలించి తరగతి గదిలో బోధన తీరు గమనిస్తూ బోధన నాణ్యతను కొలవడం, విధాన రూపకర్తలకు డేటా అందించడం విద్యార్దుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు.

అన్నమయ్య

పుల్లంపేట వారి వివాహ మహోత్సవంలో పాల్గొన్న టిడిపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల

నందలూరు మండలం లేబాక గ్రామంలో వరుని స్వగృహము నుందు ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై జరిగిన పుల్లంపేట చంద్రయ్య కుమారుని వివాహ మహోత్సవములో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల రాయుడు పాల్గొని శివ- కావ్య అనే నూతన వధూవరులను శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

నూతన వధూవరులను ఆశీర్వదించిన మేడా విజయ శేఖర్ రెడ్డి

లేబక గ్రామంలో పుల్లంపేట వారి పెళ్లి సందడిలో వరుని స్వగ్రహము వద్ద ఏర్పాటుచేసిన కళ్యాణ వేదికపై జరిగిన శివ కావ్య వారి వివాహముకు ముఖ్యఅతిథిగా వారి వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి.ఇదే వివాహ శుభకార్యానికి హాజరైన టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రమణ్యం మర్యాదపూర్వకంగా కలిసి పలు రాజకీయ విశేషాలు చర్చించారు ఈ కార్యక్రమంలో లేబక సర్పంచ్ లంకయ్య నరసయ్య కల్వకుర్తి సంజీవ రాయుడు, ముత్యాల వెంకట సుబ్బయ్య, ఓర్సు శ్రీనివాసులు ,అన్నం నాగేంద్ర ,గుగ్గిల సుబ్బరాయుడు,పఠాన్ మహర్ ఖాన్,అడపూర్ గురుకుల పాఠశాల చైర్మన్ ఇరువురి మురళి,గుగ్గిల నాగరాజు,మరియు పలువురు టిడిపి నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

బేగంపేట గ్రామ పెద్దమ్మ ను దర్శించుకున్న చెరుకు

పున్నమి ప్రతినిధి అక్బర్ పేట భూంపల్లి మండలం మల్లేశం *అక్బర్ పేట-భూంపల్లి మండలం బేగంపేట గ్రామ పెద్దమ్మ దేవాలయాన్ని దర్శించుకున్న దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి* గారు..*అక్బర్ పేట-భూంపల్లి మండలంలోని బేగంపేట గ్రామంలో ముదిరాజ్ సంఘం సభ్యుల ఆహ్వాన మేరకు పెద్దమ్మ పెద్దిరాజుల ప్రథమ వార్షికోత్సవనీకి విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందిన మన ప్రియతమ నాయకులు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు*…*ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి గారికి ముదిరాజ్ సంఘం సభ్యులు శాలువాతో సత్కరించడం జరిగింది*….*ఇట్టి కార్యక్రమంలో పాతూరి వెంకటస్వామి గౌడ్, మండల ఫిషర్మెన్ అధ్యక్షులు అన్నబోయిన చంద్రశేఖర్, ముత్యాలు, తాజా మాజీ సర్పంచ్ అనసూయ ప్రతాప్,భూంపల్లి తాజా మాజీ ఎంపీటీసీ అబ్బుల ఉమారాణి బాలా గౌడ్, కూడవెల్లి ఆలయ కమిటీ, డైరెక్టర్ వేల్పుల యాదయ్య,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భీమ్రావు, బాల్తే వెంకటేశం, కడవేర్గు రవీందర్, ఎల్లన్న గారి సురేందర్ రెడ్డి, సోలిపేట ప్రసాద్ రెడ్డి, రమేష్, స్వామి బాలనర్సు తదితరులు పాల్గొన్నారు*…

అన్నమయ్య

మెంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ఎద్దుల విజయ సాగర్

ఇటీవల నందలూరు మండలంలో కురిసిన భారీ వర్షాల దాటికి నందలూరు మండలంలోని అన్ని గ్రామాల్లో వరి పంట పూర్తిగా నీటిలో మునిగిపోయి నేలమట్టమైనది అని. దీని వలన మండలంలోని రైతులు పూర్తిగా నష్ట పోయారు అని. కష్టపడి పండించిన పంట తమ కళ్ళ ముందే నేలమట్టం కావడంతో మండలంలోని రైతులందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు అని.సత్వరమే మండలంలోని రైతులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి గారు శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు నీ వ్యవసాయ సంబంధిత అధికారులను మరియు అన్నమయ్య జిల్లా కలెక్టర్ ను రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఎద్దుల విజయసాగర్ పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేశారు.

కామారెడ్డి

రామారెడ్డి ఎస్‌.సి కాలనీలో రూ.40 లక్షలతో అభివృద్ధి పనుల ప్రారంభం

కామారెడ్డి, 07నవంబర్‌, పున్నమి ప్రతినిధి రామారెడ్డి పట్టణంలోని ఎస్‌.సి కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ పునరుద్ధరణకు సంబంధించిన రూ.40 లక్షల విలువగల అభివృద్ధి పనులకు శుక్రవారం ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ శంకుస్థాపన చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కాలనీలోని రోడ్లు దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు, కాలనీవాసుల విజ్ఞప్తికి ఎమ్మెల్యే వెంటనే స్పందిస్తూ సిఆర్‌ఆర్ నిధుల ద్వారా నిదులు మంజూరు చేశారు. ఈ సందర్భం గా కాలనీవాసులు ఎమ్మెల్యేకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజల సమస్యలను గుర్తించి వేగంగా పరిష్కరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సభలో మాట్లాడిన ఎమ్మెల్యే మద న్ మోహన్ రామారెడ్డి మండలంలోని ప్రతి గ్రామం లో అభివృద్ధి పనులు దశల వారీగా జరుగుతున్నా యి. సీసీ రోడ్లు, గంగమ్మ వాగు పై వంతెన,రామాల య దేవస్థానం సౌందర్య వృద్ధి, కాలభైరవ స్వామి ఆలయ అభివృద్ధి వంటి పలు కార్యక్రమాలు త్వరితగతిన సాగుతున్నాయి. ప్రజల ఆశీర్వాదాల తో రామారెడ్డి అభివృద్ధి పథంలో ముందుకు వెళు తోంది” అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నేతలు, వివిధ హోదా లో ఉన్న ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

వందేమాతరం గేయం రచించబడిన 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా

వందేమాతరం గేయం రచించబడిన 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం… ఈరోజు శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకళహస్తీశ్వర స్వామి వారి దేవాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఎదుట సామూహిక వందేమాతరం గేయం ఆలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ… 1875లో బంకిమ్ చంద్ర చటర్జీ గారు రచించిన “వందేమాతరం” గేయం అప్పటి బ్రిటిష్ వలస పాలకులకు గుండెల్లో వణుకు పుట్టించిన గేయం అని “వందేమాతరం” ఒక మాట కాదు… స్వాతంత్ర సమరయోధుల చేతిలో ఒక శక్తివంతమైన ఆయుధం అవుతూ వేలాది మందిలో దేశభక్తిని రగిల్చిందని వివరించారు. 150 సంవత్సరాల ఈ ప్రత్యేక సందర్భంలో స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు మరొకసారి వందనం తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు యువతకు పిలుపునిస్తూ… యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో – వందేమాతరం భావంతో దేశ అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొట్టే సాయి ప్రసాద్,కుమార్, గరికపాటి, చంద్ర, జయప్రకాష్, మహేష్, ఢిల్లీ బాబు, సురేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరులో రైతులకు యూరియా, శనగ విత్తనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల..! 🔹రైతు సంక్షేమమే మా లక్ష్యం – ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! 🔸ఎరువులు ప్రతి రైతుకూ అందేలా చూడాలని ఎమ్మెల్యే కాకర్ల ఆదేశాలు

(పున్నమి )దుత్తలూరు నవంబర్ 7 దుత్తలూరు మండల కేంద్రంలో రైతు సంక్షేమం లక్ష్యంగా రైతు భరోసా కేంద్రం వద్ద ఒక విశిష్ట కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా గౌరవనీయులైన ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ రైతులకు యూరియా ఎరువులు మరియు శనగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రైతుల వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సమయానుకూలంగా అందించడమే కాకుండా, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడమే లక్ష్యమని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ సురేష్ మాట్లాడుతూ — “ప్రతి రైతుకు సమయానికి ఎరువులు, విత్తనాలు పొందేలా చర్యలు తీసుకునేలా ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యాలు కలగకుండా అధికారులు సమర్థవంతంగా పర్యవేక్షణ చేసేలా, రైతులకు అశాంతి చెందకుండా, వ్యవసాయ సీజన్ సజావుగా సాగేందుకు ప్రభుత్వం ప్రతి స్థాయిలో సహకరిస్తుందని అన్నారు. అలాగే ఆయన రైతుల సమస్యలను సమయానికి పరిష్కరించి, వారికి అవసరమైన సాంకేతిక సహాయం, మార్గదర్శకత అందించాలని సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను, ఆర్‌బీకే సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు కాకర్ల మధుసూదన్, ఐటీడీపీ అధ్యక్షుడు సింగవరపు సుబ్బారెడ్డి, కంభం వెంకటేశ్వర రెడ్డి, కంభం సుబ్బారెడ్డి, వ్యవసాయ అధికారి సిహెచ్. మదన్ మోహన్, దుత్తలూరు ఆదర్శ రైతు చుండి అంజిరెడ్డి, సొసైటీ సీఈవో లోకనాథ్ రెడ్డి, అలాగే ఆర్‌బీకే సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శన ను విజయవంతం చేయండి*

వర్ల దేవదాసు మాదిగ* సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారి మీద జరిగిన దాడికి నిరసన గా పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ అన్న గారి ఆదేశాలు మేరకు నవంబర్ 17న “జరుగు చలో ఢిల్లీ” కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం సత్యవేడు నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి MRPS జిల్లా కో ఇంచార్జి, సత్యవేడు నియోజకవర్గ ఇంచార్జి పునబాకు మునివేలు సభాధ్యక్షత వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మార్పీఎస్ తిరుపతి జిల్లా ఇన్చార్జ్ *వర్ల దేవదాసు మాదిగ* మాట్లాడుతూ గవాయ్ గారి మీద దాడి చేసిన కిషోర్ అడ్వకేట్ ను వెంటనే అరెస్ట్ చేయాలని,దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే లక్ష్యంకై, న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడడం కోసం ఉద్యమం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సిసింద్రీ మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు ఈర్ల రాజా మాదిగ,ఎమ్మార్పీఎస్ తిరుపతి జిల్లా కో ఇన్చార్జ్ *మంగళపూరి సురేష్ మాదిగ,* సత్యవేడు నియోజవర్గ, మండల ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వాడవాడల వందే మాతరం అలాపన

వందేమాతరం గీతం నేటికీ 150 ఏళ్లు పూర్తి చేసుకుంది ఉదయగిరి పరిసర ప్రాంతాల్లో వాడవాడల వందేమాతరం గీతాలాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్నా విద్యార్దులు వందేమాతరం అలపించారు అనంతరం విశిష్టతను హెచ్ యం శ్రీనివాసు రావు వివరించారు అనంతరం ర్యాలీగా బయలుదేరి పోలీస్ స్టేషన్లో SI కర్నాటి ఇంద్రసేనారెడ్డి ఆధ్యర్యంలో గీతాలాపన చేశారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.