Friday, 3 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు రక్షిత నీరు అందించాలి

కనిగిరి: పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు శుద్ధజాలన్నీ అందించాల ని డిడివో కె. శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్ డబ్ల్యూఎస్, ఐసీడీఎస్, విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొoధా తుపాను వల్ల కురిసిన వర్షాలకు తాగునీరు కొన్నిచోట్ల కలుషితమైదాన్నారు. విద్యార్థులు తాగే నీటి నమూనాలను పట్టణంలోని పరీక్ష కేంద్రానికి తీసుకురావాలని కోరారు. ఆర్ డబ్ల్యూఎస్ డీఈఈ వి. విశ్వానాథరెడ్డి పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు రక్షిత నీరు అందించాలి

కనిగిరి: పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు శుద్ధజాలన్నీ అందించాల ని డిడివో కె. శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్ డబ్ల్యూఎస్, ఐసీడీఎస్, విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొoధా తుపాను వల్ల కురిసిన వర్షాలకు తాగునీరు కొన్నిచోట్ల కలుషితమైదాన్నారు. విద్యార్థులు తాగే నీటి నమూనాలను పట్టణంలోని పరీక్ష కేంద్రానికి తీసుకురావాలని కోరారు. ఆర్ డబ్ల్యూఎస్ డీఈఈ వి. విశ్వానాథరెడ్డి పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు డొక్కా సీతమ్మ మున్సిపల్ హైస్కూల్ లో “వందేమాతరం” జాతీయ గీతాన్ని రచించి 150 వసంతలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సామూహిక గీతాలాపన కార్యక్రమoలో పాల్గొన్న ప్రధానోపాధ్యాయుడు నేతల భీమారావు, బిజెపి పార్టీ నిడదవోలు టౌన్ సెక్రెటరీ లక్కోజు సాయి సూర్య *“వందేమాతరం“ జాతీయ గీత రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయ్ గారి చిత్ర పటానికి నివాళులర్పించిన ప్రధానోపాధ్యాయుడు నేతల భీమారావు*, బిజెపి పార్టీ నిడదవోలు టౌన్ సెక్రటరీ లక్కోజు సూర్య సాయి, యాజమాన్య కమిటీ చైర్మన్ వెంకటపు చందు. పాల్గొన్నారు బంకించంద్ర ఛటోపాధ్యాయ్ గారి రచించిన “వందేమాతరం“ గీతo నేటితో 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈరోజు ఉదయం 10 గంటలకే దేశ వ్యాప్తoగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ప్రతి ఒక్కరు వికసిత్ భారత్ లక్ష్యం వైపు అడుగులు వేసే ప్రతి ఒక్కరు కార్యోణుముకులను చేసే దిశగా ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది.తప్పనిసరిగా ప్రతి ఒకరు దేశభక్తి తో ఈదేశ స్వరాజ్య స్థాపనకు పునరాకింతo కావాలని అని అన్నారు,ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నేతల భీమారావు, బిజెపి పార్టీ నిడదవోలు టౌన్ సెక్రటరీ లక్కోజు సూర్య సాయి,యాజమాన్య కమిటీ చైర్మన్ వెంకటప్ప చందు, సోషల్ టీచర్ హేమ, ఫిజికల్ డైరెక్టర్ చెల్లె చిట్టి తల్లి, మ్యాక్స్ టీచర్ ఏవి అప్పారావు, సంస్కృత పండిత్ ఎస్ ఏసు మణి,,తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

జాతీయ సదస్సు – భౌతికశాస్త్ర విభాగం, శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్దార్థ మహిళా కళాశాల

సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ & టెక్నికల్ ఎడ్యుకేషన్ యొక్క గోల్డెన్ జూబిలీ (1975–2025) వేడుకల సందర్భంగా, శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్దార్థ మహిళా కళాశాల (ఆటోనమస్), విజయవాడ భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో, డీ.పి. సోమయ్యజీ మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో “NANO–NEXT: The Invisible Revolution Transforming Daily Life” అనే అంశంపై జాతీయ సదస్సు (22వ ఫిజిక్స్ లెక్చర్ సిరీస్) 2025 నవంబర్ 7న విజయవంతంగా నిర్వహించబడింది. 🎓 ప్రధాన అతిథులు గెస్ట్ ఆఫ్ ఆనర్: శ్రీ ఏ. మల్లికార్జునశర్మ గారు, రిటైర్డ్ ఫ్యాకల్టీ, శాతవాహన డిగ్రీ కాలేజ్, విజయవాడ. చీఫ్ గెస్ట్: డా. వేమూరి వెంకట సుబ్రహ్మణ్య కుమార్ గారు, ప్రిన్సిపల్, శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్దార్థ మహిళా కళాశాల. ప్రత్యేక ఆహ్వానిత వక్త: డా. పర్వతులు కలకొండ గారు, అసోసియేట్ ప్రొఫెసర్, ఫిజిక్స్ విభాగం, గవర్నమెంట్ సిటీ యూజీ/పీజీ కాలేజ్, హైదరాబాద్. 🧬 సదస్సు ముఖ్యాంశాలు డా. పర్వతులు కలకొండ గారు “Emerging Global Applications of Nanotechnology” అనే అంశంపై విశిష్టమైన లెక్చర్ ఇచ్చారు. తన ప్రసంగంలో ఆయన నానో టెక్నాలజీ ఆధారంగా ఆరోగ్యరంగంలో యాంటీబ్యాక్టీరియల్ & యాంటీక్యాన్సర్ పరిశోధనలు, బయోవేస్ట్ ద్వారా ఎకో–ఫ్రెండ్లీ పరికరాల తయారీ, పచ్చ శక్తి (Green Nano–Energy) అభివృద్ధి, నీటి కాలుష్య నివారణకు నానో మెటల్ కాంపోజిట్స్ వినియోగం వంటి అంశాలను వివరించారు. ☀️ ప్రత్యేక లెక్చర్ – డా. బి. సూర్య ప్రసాద్ గారు (IET చైర్మన్, విజయవాడ) ఈ సదస్సులో డా. బి. సూర్య ప్రసాద్ గారు, IET చైర్మన్, విజయవాడ, పాల్గొని విద్యార్థులకు ప్రేరణాత్మక ఉపన్యాసం అందించారు. ఆయన భౌతికశాస్త్రం మరియు సాంకేతికతల ప్రాముఖ్యతను సులభంగా, ఆసక్తికరంగా వివరించి విద్యార్థులను ఆకట్టుకున్నారు. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా విని, సందేహాలు అడిగి చురుకుగా పాల్గొన్నారు. 👩‍🏫 సిబ్బంది, విద్యార్థులు మరియు ట్రస్ట్ కుటుంబ సభ్యుల స్పందన కళాశాల సిబ్బంది శ్రీమతి సునీత గారు, శ్రీమతి నీరజ గారు మరియు ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా డీ.పి. సోమయ్యజీ మెమోరియల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, సదస్సు విజయవంతంగా జరుగుటకు తోడ్పడ్డారు. డా. బి. సూర్య ప్రసాద్ గారు విద్యార్థుల ఆసక్తిని అభినందించి, భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలకు ప్రోత్సహించారు. 🌸 ముగింపు ఈ సదస్సు ద్వారా నానో సైన్స్ ఆధారిత సాంకేతికతలు మన దైనందిన జీవితంలో ఎలా మార్పు తీసుకొస్తున్నాయో విద్యార్థులు అవగాహన పొందారు. కార్యక్రమానికి విభాగాధిపతి శ్రీమతి గీతా మాధురి గారు అధ్యక్షత వహించి, పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

వందేమాతరం..!

స్థానిక ప్రభుత్వ కార్యాలయాల వద్ద, కేజీబీవీ లో తహసీల్దార్ షేక్ మహమ్మద్ హుస్సేన్, ఎంపీడీవో వి. ప్రతాప్ రెడ్డి,ఎంఈవో జె. ప్రసాదరావ్, నాయకులు, విద్యార్థులు వందేమాతరం గీతం ఆలపించారు. ఉప ఎంపిడివో ఎంవీ రమణయ్య, మండల తెదేపా, భాజపా అధ్యక్షులు బి. రమేష్, ఐవి సత్యం తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ పార్థసారథి ఆధ్వర్యంలో కుట్టు మెషిన్ లు పంపిణీ

గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుట్టు మెషిన్ లు పంపిణీ రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్నేహితులరోజు సందర్బంగా ఉచితంగా టైలరింగ్ శిక్షణ పొందిన వారికి మిత్రుడు సిద్దార్థ జ్ఞాపకర్ధం ట్రస్ట్ చైర్మన్ కె.పార్థసారధి కుట్టు మెషిన్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోడూరు మెయిన్ బ్రాంచ్ చీఫ్ మనేజర్ సి. రఘునాధ్ కుమార్ మాట్లాడుతూ మిత్రుడు జ్ఞాపకర్ధం 100 కు పైగా బ్యాచులకు టైలరింగ్ శిక్షణ ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ఆధునిక టైలరింగ్ పద్ధతుల ద్వారా మహిళలు ఉపాధి పొందుతున్నారని శిక్షణ పూర్తి చేసుకున్న మీరు కూడా పారిశ్రామికవేత్తలుగా బ్యాంక్ ద్వారా సహకరిస్తామన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా తక్కువ ప్రీమియంతో ఇస్తున్న ప్రమాద భీమా సదుపాయాలు విజపయోగించుకోవలన్నారు. బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ డి. కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యతపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి, క్రమశిక్షణతో బ్యాంకు లావాదేవీలు నిర్వహించాలన్నారు. వినియోగదారుల అవసరాలు గమనిస్తూ నాణ్యమైన పని చేయడం ద్వారా ఆర్థికంగా ఎదగవచ్చునన్నారు. ట్రస్ట్ చైర్మన్ కె.పార్థసారథి మాట్లాడుతూ మిత్రుడు సిద్దార్థ జ్ఞాపకార్థం ఇప్పటివరకు స్వంత నిధులతో 104 బ్యాచుల ద్వారా 3200 మందికి టైలరింగ్ శిక్షణ ఇచ్చామని, సంక్రాంతికి బట్టలు కుట్టే విధంగా శిక్షణ ఇచ్చే విధంగా సంక్రాంతికి వస్తున్నాం అనే నినాదంతో కొత్త బ్యాచ్ ప్రారంభించమన్నారు. బ్యాంక్ చీఫ్ చేతుల మీదుగా మహిళలకు టైలరింగ్ మెటీరియల్ కిట్లు, సబ్సిడీతో కుట్టు మెషిన్లు, శిక్షణ పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్లు, మహిళలకు క్రీడల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, ట్రస్ట్ కో ఆర్డినేటర్, మహిళలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజల చేతుల్లో పల్లె రహదారుల సమాచారం – కూటమి ప్రభుత్వ లక్ష్యం

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు విలేకరుల సమావేశం సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో, సర్వేపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, > “ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వం దూసుకెళ్తోంది. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, పల్లెల అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు,” అని తెలిపారు. సర్వేపల్లి (వెంకటాచలం):- పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులను పారదర్శకంగా వినియోగించేందుకు ప్రతి రూపాయి వివరాలు ప్రజలకే అందేలా ‘జియో రూరల్ రోడ్ మేనేజ్‌మెంట్ సిస్టం’ ద్వారా సమాచారం పంచుకునే కొత్త విధానం త్వరలో అందుబాటులోకి రానుందని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లా లో RTC బస్సుకు మరో ప్రమాదం

ఒంగోలు సమీపంలోని పేర్ణమిట్ట వద్ద గురువారం రాత్రి RTC బస్సుకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే శుక్రవారం సాయంత్రం మరో యాక్సిడెంట్ జరిగింది. పామూరు నుంచి కనిగిరి ఆర్టీసీ బస్సు బయల్దేరింది. రావిపల్లి టోలప్లాజా వద్ద ఎదురుగా వచ్చిన లారీ బస్సును ఢీకొట్టింది. బస్సులోని 9మందికి గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కు పోయాడు. క్షత్రగాత్రులను కనిగిరి ఆసుపత్రికి తరలించాసారు.

ఆంధ్రప్రదేశ్

సింగరాయకొండ : ప్రేమ వివాహం… యువకుల పై దాడి

కావాలి మండలంలో యువుకులపై దాడి జరిగింది. బాధితుల వివరాల మేరకు… సింగరాయకొండకు చెందిన తన్నీరు కోటి అదే గ్రామానికి చెందిన దివ్యను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్ లో ఉంటున్న అతను పనిమీద రుద్రకోటకు వచ్చాడు. కోటిని కలవడానికి అతను ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు. అదే సమయంలో దివ్య బంధువులుఅక్కడికి వచ్చి తమపై దాడి చేశారని కోటి వాపోయాడు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వందేమాతరం గీతాలాపన

డాక్టర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పున్నమి ప్రతినిధి స్వాతంత్ర్య సముపార్జనలో సామాన్య ప్రజలను స్వాతంత్ర్య ఉద్యమకారులుగా తయారుచేసేలా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు,కవి శ్రీ బంకించంద్ర ఛటర్జీ రచించి, ఆలపించిన వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సూచనమేరకు దేశ వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగా ఈరోజు మలికిపురం ఎంవిఎన్,జెఎస్ & ఆర్వీ ఆర్ డిగ్రీ కళాశాలలో వందేమాతరం గీతం సామూహిక గీతాలాపన కన్నులపండువగా జరిగింది..ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు దేవ వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే శ్రీ మానేపల్లి అయ్యాజీ వేమా,కళాశాల కరస్పాండెంట్ శ్రీ ఎం వి.సత్యనారాయణ మూర్తి, ప్రిన్సిపాల్ శ్రీమతి ఆనంద్ మహానీ కళాశాల పాలకవర్గ సభ్యులు రుద్రరాజు పద్మరాజు, మలికిపురం మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు మేడిచర్ల సత్యవాణి, డిగ్రీ, జూనియర్ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు,హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ శ్రీ నల్లి శివకుమార్, స్టూడెంట్ యూనియన్ తరపున పోలిశెట్టి గణేష్,మానవతా మూర్తులు – సామాజిక సేవా సంస్థ అధ్యక్షులు బోనం రాజు మరియు కూటమి ప్రభుత్వ నాయకులు పాల్గొన్నారు…

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.