Friday, 3 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ భీమా నాయక్ కు ఘన వీడ్కోలు

కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలో పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ (సిఐ) భీమా నాయక్ బదిలీ సందర్భంగా వీడ్కోలు సన్మాన కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి,కనిగిరి డి.ఎస్.పి తో కలిసి బిజెపి కనిగిరి అసెంబ్లీ కన్వీనర్ కొండిశెట్టి వెంకట రమణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీమా నాయక్ సేవలను కొనియాడుతూ ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.

ఆంధ్రప్రదేశ్

కనిగిరి బాలికల హాస్టల్ వార్డెన్ సస్పెండ్

శుక్రవారం, కనిగిరి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలికల వసతి గృహం వార్డెన్ చంద్ర కుమారిని విధుల పట్ల నిర్లక్ష్య వైఖరి కారణంగా కలెక్టర్ రాజాబాబు సస్పెండ్ చేశారు. విద్యార్థినులను సెలవులపై పంపించే సమయంలో ఒంటరిగా పంపిస్తున్నారనే ఆరోపణలపై విచారణ అనంతరం ఈ చర్య తీసుకున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్ వెల్లడించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మాదాల నాగభూషణమ్మను మోసగించిన వి ధనలక్ష్మి

నెల్లూరులోని పొదలకూరు నేతాజీ నగర్ నందు నివసిస్తున్న నాగభూషణమ్మ ఇంటి వద్ద ఉన్న వి ,ధనలక్ష్మి అనే ఆమె ఓల్డ్ ఏజ్ హోమ్ పెడదామని మాదాల నాగభూషణమ్మకు తమకు చెప్పగా తమ అందుకు ఒప్పుకున్నారు ఆమె దగ్గర సుమారు ఐదున్నర సేవర్ల బంగారం నగదు 7,30,000 తీసుకున్నారు అనే అడిగినప్పుడల్లా అదిగో ఇదిగో అని బ్యానర్లు ఫొటోస్ చూపించడం మొదలు పెట్టింది ఈ విషయం తెలిసే ఆమె నిలదీయగా ఈరోజు రేపు అని కాలం గడిపింది అని ఆమె శనివారం ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బాధను ఆమె చెప్పగా నాకు ఎక్కడ ఇటువంటి న్యాయం జరగలేదు నా నగదు నాకు ఇప్పించండి అని బోరున విలపించారు నగదు కొన్ని రోజులకి మాదాల నాగభూషణ్ అమ్మ తన ఇంటి వద్దకి వీ ధనలక్ష్మి కుమారుడు సూరజ్ అతని శ్నేహీతులు చంపేస్తామని బెదిరించారు తమకు ప్రాణహాని ఉంది ప్రాణాలను రక్షణ కల్పించాలని ఆమె కోరుకున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మాదాల నాగభూషణమ్మను మోసగించిన వి ధనలక్ష్మి

నెల్లూరులోని పొదలకూరు నేతాజీ నగర్ నందు నివసిస్తున్న నాగభూషణమ్మ ఇంటి వద్ద ఉన్న వి ,ధనలక్ష్మి అనే ఆమె ఓల్డ్ ఏజ్ హోమ్ పెడదామని మాదాల నాగభూషణమ్మకు తమకు చెప్పగా తమ అందుకు ఒప్పుకున్నారు ఆమె దగ్గర సుమారు ఐదున్నర సేవర్ల బంగారం నగదు 7,30,000 తీసుకున్నారు అనే అడిగినప్పుడల్లా అదిగో ఇదిగో అని బ్యానర్లు ఫొటోస్ చూపించడం మొదలు పెట్టింది ఈ విషయం తెలిసే ఆమె నిలదీయగా ఈరోజు రేపు అని కాలం గడిపింది అని ఆమె శనివారం ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బాధను ఆమె చెప్పగా నాకు ఎక్కడ ఇటువంటి న్యాయం జరగలేదు నా నగదు నాకు ఇప్పించండి అని బోరున విలపించారు నగదు కొన్ని రోజులకి మాదాల నాగభూషణ్ అమ్మ తన ఇంటి వద్దకి వీ ధనలక్ష్మి కుమారుడు సూరజ్ అతని శ్నేహీతులు చంపేస్తామని బెదిరించారు తమకు ప్రాణహాని ఉంది ప్రాణాలను రక్షణ కల్పించాలని ఆమె కోరుకున్నారు.

ఆంధ్రప్రదేశ్

కలుషిత నీటి వల్లే విద్యార్థులకు కామెర్లు: డీఎంహెచ్

కనిగిరి ఎస్సీ కాలనీలో కలుషిత నీరు తాగడం వల్ల విద్యార్థులకు కామెర్లు వచ్చినట్లు డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం ఆయన కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో కామెర్లు వచ్చిన విద్యార్థులను పరామర్శించారు. మంచినీటి బోరు వద్ద కలుషిత నీరు చేరడం, వైరస్, బ్యాక్టీరియా వ్యాప్తి చెందడమే దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు క్షేమంగా ఉన్నారని, భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మాజీ సీఎం జగన్ను కలసిన సహదేవ్

డాక్టర్అంబేద్కర్ కోనసీమ జిల్లా నవంబర్ 8 పున్నమి ప్రతినిధి: రాజోలు నియోజకవర్గానికి చెందిన “వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధికార ప్రతినిధి తాడి సహదేవ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఈ మేరకు కలిసి పుష్పగుచ్ఛం అందించారు. నియో జక వర్గంలో విద్యార్థి విభాగాన్ని యాక్టివేట్ చేయాలని జగన్ సూచించనట్లు సహదేవ్ తెలి పారు.

జనగాం

*నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి…..*

*స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం* *తేదీ: 08.11.2025 మడికొండ లోని రెడ్డి కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన కాజీపేట ఏ.ఎన్ రెడ్డి నగర్ కు చెందిన అడ్వకేట్ కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

E-పేపర్

ఉత్తరం రాసి.. రూ.25,000 గెలవండి

ఈమెయిల్స్, ఫోన్ రాకతో ఉత్తరాలు రాయడం కనుమరుగైంది. మళ్ళీ లెటర్స్ ఆసక్తి కలిగించేందుకు తపాలా శాఖ ‘ధైయా ఆఖర్’ పోటీలు నిర్వహిస్తోంది. ‘లెటర్ టు మై రోల్ మోడల్’ థీమ్ మీద తెలుగు, ఇంగ్లీష్, హింది సహా ఏ భారతీయ భాషలోనైనా, ఏ వయస్సువారైనా లెటర్ వ్రాసి మీ పోస్టాఫీస్ సర్కిల్ అడ్రస్సుకు పంపాలి. చివరి తేదీ DEC 8. సర్కిల్ స్థాయిలో ₹25K, ₹10K, ₹5K, జాతీయ స్థాయిలో ₹50K, ₹25K, ₹10K చొప్పున బహుమతులు ఇస్తారు.

కడప

అవినీతిమయంలో కూరుకుపోయిన కడప జిల్లా ఏసీబీ

*అవినీతిమయంలో కూరుకుపోయిన కడప జిల్లా ఏసీబీ అంటూ ఓ ఛానల్ లైవ్ డిబేట్ ప్రోగ్రాం లో సంచలన వ్యాఖ్యలు చేసిన కరుణాకర్ యాదవ్* *అవినీతి నిరోధక శాఖ కాదు అవినీతి సంపాదక శాఖ అంటూ మండిపడ్డ కరుణాకర్ యాదవ్* *కడప జిల్లా ఏసీబీ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటూ మండిపడ్డ కరుణాకర్ యాదవ్* *అవినీతికి పాల్పడుతున్న వారిపై ఏసీబీ కి ఫిర్యాదు చేస్తే,ఆ సమాచారాన్ని ఆదాయ వనరులుగా మార్చుకొని,వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్న కడప జిల్లా ఏసీబీ అధికారులు అంటూ ఆరోపణలు చేస్తున్న కరుణాకర్ యాదవ్* *కడప జిల్లా లో అవినీతికి పాల్పడుతున్న ఏసీబీ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏసీబీ డీజీ గారికి ఫిర్యాదు చేసిన కరుణాకర్ యాదవ్* *త్వరలో విచారణకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ఏసీబీ కార్యాలయం*

కడప

రాచమల్లు* గారి ఆధ్వర్యంలోప్రొద్దుటూరులో 4 రోజు మొదలైన రిలే నిరాహార దీక్ష*

*రాచమల్లు* గారి ఆధ్వర్యంలోప్రొద్దుటూరులో 4 రోజు మొదలైన రిలే నిరాహార దీక్ష* ప్రొద్దుటూరు మునిసిపల్ ఎగ్సిబిషన్ కు సంబంధించి తెలుగుదేశం పార్టీ కి చెందిన గూత్తేదారుడు సుమారు 1 కోటి రూపాయలు ఎగవేసిన నేపథ్యంలో, తిరిగి ఆ డబ్బును మునిసిపల్ ఖజానాకు చెల్లించేవరకు చేస్తున్న దీక్షల్లో భాగంగా ఇవాళ *4వ రోజు* ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్ పర్సన్ *శ్రీమతి భీమునిపల్లి లక్ష్మీదేవి* గారు మరియు మహిళ కౌన్సిలర్ల అధ్యక్షతన ఈరోజు దీక్ష ప్రారంభించడం జరిగినది. ఈ దీక్షికు సంఘీభావంగా మాజీ ఆప్కాబ్ చైర్పర్సన్ శ్రీమతి మల్లెల ఝాన్సీ గారు ప్రొద్దుటూరు పట్టణ మహిళా అధ్యక్షురాలు దానమ్మ గారు. ప్రొద్దుటూరు మండల మహిళా అధ్యక్షురాలు కందుల వాసంతి గారు రాజుపాలెం మండల మహిళా అధ్యక్షురాలు కానాల విజయలక్ష్మి గారు మరియు ప్రొద్దుటూరు పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి గారు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నెంబర్ మల్లెల రాజారాం రెడ్డి గారు మరియు కోఆప్షన్ సభ్యులు ప్రొద్దుటూరు, రాజుపాలెం మండలం మహిళా నాయకురాల్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.