Wednesday, 1 April 2026

Blog

కడప

మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్..

మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలో ఆరు మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ చెప్పుకొచ్చారు. వారి నుంచి ఒక టన్ను ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు

విశాఖపట్నం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ కి విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి ఐపీఎస్ ఆత్మీయ స్వాగతం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్, విశాఖపట్నం సిటీలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సు (సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్) నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం గురువారం విశాఖపట్నం విచ్చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర డీజీపీని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు. సదస్సు నిర్వహణలో తీసుకోవలసిన భద్రతా ఏర్పాట్లు, సమన్వయ చర్యలపై చర్చించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

రాఘవపురంలో కొత్త కేంద్రియ విద్యాలయానికి అప్రోచ్ రోడ్ నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు

నందిగామ మండలంలోని రాఘవపురం గ్రామంలో కొత్తగా మంజూరైన కేంద్రియ విద్యాలయానికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి రూ.20 లక్షల నిధులు మంజూరు అయ్యాయి. ఈ నిధులను ఎమ్.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ (MGNREGS) పథకం కింద విడుదల చేసినట్లు ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన నిధుల ద్వారా రాఘవపురం గ్రామం లోని కొత్త కేంద్రియ విద్యాలయా నికి సులభంగా చేరుకునే విధంగా డబ్ల్యూ.బి.ఎం (WBM) రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, “రాఘవపురంలో కేంద్రియ విద్యాలయం మంజూరైనది విద్యారంగానికి గొప్ప ప్రగతి. ఈ రోడ్డు నిర్మాణం వల్ల గ్రామస్తు లకు రవాణా సౌకర్యం మెరుగు పడుతుంది,” అని పేర్కొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

జగ్గయ్యపేటలో పాస్టర్ కుమారుని వివాహం

జగ్గయ్యపేట పట్టణంలోని చిలకల్లు రోడ్డులోని శుభమస్తు కళ్యాణ మండపంలో పాస్టర్ మాదాసు సంసోను కుమారుని వివాహ వేడుక గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్ టి ఆర్ జిల్లా

కంచికచర్లలో టీడీపీ ఇన్చార్జిల ప్రమాణ స్వీకారం ఘనంగా ప్రజలతో మమేకమై పార్టీ బలపరచాలని ఎమ్మెల్యే సౌమ్య

కంచికచర్ల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో గురువారం మండల, గ్రామ పార్టీ క్లస్టర్ యూనిట్ ఇన్చార్జిలు, పోలింగ్ బూత్ కన్వీనర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ “తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు, అది తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఉద్యమం” అని పేర్కొన్నారు. తెలుగు వారి స్వాభిమానాన్ని ఢిల్లీకి చాటి చెప్పిన మహానీయుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సేవలను ఆమె స్మరించుకున్నారు. “పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు తప్పక లభిస్తుంది. పదవి పెద్దది, చిన్నది అనేది కాదు — అది దక్కడం స్వయంగా ఒక గౌరవం,” అని ఆమె అన్నారు. ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై పార్టీ బలాన్ని పెంచేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు, స్కీమ్ ప్రెసిడెంట్లు, మండల పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

యాదవ వనబోజన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి*

“* *మర్రిపాడు నవంబర్ (పున్నమి ప్రతినిధి)* మర్రిపాడు మండలంలో ఈ నెల 16 వ తేదీన జరగబోయే యాదవ వన భోజనాలు కార్యక్రమంలో భాగంగా మర్రిపాడు లో PNR గార్డెన్ లో సభా వేదిక ఏర్పాట్ల గురించి & భోజన ఏర్పాట్ల గురించి మరియు మెడికల్ క్యాంప్ గురించి అతిథులకు ప్రత్యేక వసతుల గురించి జిల్లా యాదవ ట్రస్టు భవన్ చైర్మన్ నాగ కిశోర్ యాదవ్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మర్రిపాడు మండలంలో ప్రతీ ఒక్కరు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ సమావేశం సందర్బంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ పద్మజ యాదవ్ గారు మాట్లాడుతూ మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా శక్తిని చాటి చెప్పాలి అని కోరారు. కార్యక్రమం లో గుర్రం శ్రీనివాసులు గారు కూడా మాట్లాడుతూ యాదవుల చైతన్యానికి వన భోజన కార్యక్రమం మన ఐక్యతకు పాటుపడుతుందని తెలియజేసారు.తెలుగుదేశం నాయకులు ఎలగాల వెంకటేశ్వర్లు, గుర్రం నాగేశ్వరరావు, యూత్ నాయకులు సన్ను వినీత్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

పిల్లల భవిష్యత్తుకు పునాది వేయడంలో పాఠశాలల పాత్ర కీలకం : ఎమ్మెల్యే బొండా ఉమ

పిల్లల భవిష్యత్తుకు పునాది వేయడంలో పాఠశాలల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. విద్యార్థులకు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం, ఆత్మవిశ్వాసం, సాంస్కృతిక విలువలు, క్రీడాస్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, సామాజిక నైపుణ్యాలు కూడా అవసరమని సూచించారు. గురువారం ఉదయం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సింగ్‌నగర్‌లోని శ్రీరామ్ పాఠశాల ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన స్పోర్ట్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బొండా ఉమ మాట్లాడుతూ, శ్రీరామ్ స్కూల్ యాజమాన్యం ఒక రోజు ముందుగానే పిల్లల కోసం అద్భుతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసి, విద్యతో పాటు సంస్కృతి, సంప్రదాయాలు, క్రీడలు వంటి అనేక రంగాల్లో శిక్షణ ఇస్తోందని ప్రశంసించారు. గతంలో సింగ్‌నగర్ బసవ పున్నయ్య స్టేడియంలో కూడా ఈ పాఠశాల ఆధ్వర్యంలో అద్భుతమైన స్పోర్ట్స్ మీట్ నిర్వహించామని గుర్తుచేశారు. చదువుతో పాటు శారీరక వ్యాయామం, ఫిజికల్ ఫిట్‌నెస్ కూడా ప్రతి విద్యార్థికి తప్పనిసరి కావాలని సూచించారు. విద్యార్థుల్లో కొందరు టెన్త్ క్లాస్‌లో 594 మార్కులు సాధించడం పాఠశాల క్రమశిక్షణ కు నిదర్శనమని అన్నారు. టీచర్లు, మాస్టర్లు పిల్లలపై చూపుతున్న శ్రద్ధ ప్రశంసనీయ మని పేర్కొన్నారు.తల్లిదండ్రులు పిల్లల కార్యక్రమాలకు హాజరై వారిని ప్రోత్సహిస్తే, అది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని బొండా ఉమ తెలిపారు. భవిష్య త్తులో కూడా ఇటువంటి కార్యక్ర మాలను శ్రీరామ్ స్కూల్ యాజమాన్యం కొనసాగించాలని సూచించారు. ఈ సందర్భంగా బొండా ఉమ ప్రతిభావంతమైన ఉపాధ్యాయులను సన్మానించి, పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం,ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల లో 13- 11- 2025వ తేదీన ఎన్.ఎస్.ఎస్. విభాగం వారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, విజయవాడ. వారి సహకారంతో మొదటి సంవత్సరం డిగ్రీ విద్యార్థులకు బ్లడ్ గ్రూపింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల లో 13- 11- 2025వ తేదీన ఎన్.ఎస్.ఎస్. విభాగం వారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, విజయవాడ. వారి సహకారంతో మొదటి సంవత్సరం డిగ్రీ విద్యార్థులకు బ్లడ్ గ్రూపింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 800 మంది విద్యార్థులు వారి బ్లడ్ గ్రూప్ చేయించుకొని గ్రూపును నిర్ధారణ చేయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.వి.ఎస్. కుమార్ గారు ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ కె. సరళ ,శ్రీమతి టి .నాగరాణి ,పి. శ్రీ భారతి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

వరంగల్

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు – ఆరోగ్య శ్రీ నిధుల దుర్వినియోగం చేసినట్లు గుర్తించిన అధికారులు – ఆసుపత్రిలోని సూపరింటెండెంట్ ఛాంబర్ లో రికార్డులను పరిశీలిస్తున్న విజిలెన్స్ డిఎస్పీ నారాయణ రెడ్డి – 2021 – 2024లలో సుమారు రూ.30 కోట్ల కుంభకోణం జరిగిందని గుర్తించిన అధికారులు..!

ఆంధ్రప్రదేశ్

ధాన్యం పట్టుబడి లో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి మరీ తెలుసుకున్న MLA కాగితకృష్ణప్రసాద్

పెడన మండలం ఈదుమూడి గ్రామంలో ధాన్యం పట్టుబడి పడుతున్న రైతుల వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారు రైతులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వమని రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభతరంగా, పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని రైతులకు అవసరమైన గోనె సంచులు అందజేత, కొనుగోలు చేసిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం, అకాల వర్షాలకు ధాన్యం దెబ్బతినకుండా టార్పులిన్ షీట్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.