Monday, 30 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

యాదవ వనబోజన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి*

“* *మర్రిపాడు నవంబర్ (పున్నమి ప్రతినిధి)* మర్రిపాడు మండలంలో ఈ నెల 16 వ తేదీన జరగబోయే యాదవ వన భోజనాలు కార్యక్రమంలో భాగంగా మర్రిపాడు లో PNR గార్డెన్ లో సభా వేదిక ఏర్పాట్ల గురించి & భోజన ఏర్పాట్ల గురించి మరియు మెడికల్ క్యాంప్ గురించి అతిథులకు ప్రత్యేక వసతుల గురించి జిల్లా యాదవ ట్రస్టు భవన్ చైర్మన్ నాగ కిశోర్ యాదవ్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మర్రిపాడు మండలంలో ప్రతీ ఒక్కరు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ సమావేశం సందర్బంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ పద్మజ యాదవ్ గారు మాట్లాడుతూ మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా శక్తిని చాటి చెప్పాలి అని కోరారు. కార్యక్రమం లో గుర్రం శ్రీనివాసులు గారు కూడా మాట్లాడుతూ యాదవుల చైతన్యానికి వన భోజన కార్యక్రమం మన ఐక్యతకు పాటుపడుతుందని తెలియజేసారు.తెలుగుదేశం నాయకులు ఎలగాల వెంకటేశ్వర్లు, గుర్రం నాగేశ్వరరావు, యూత్ నాయకులు సన్ను వినీత్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

పిల్లల భవిష్యత్తుకు పునాది వేయడంలో పాఠశాలల పాత్ర కీలకం : ఎమ్మెల్యే బొండా ఉమ

పిల్లల భవిష్యత్తుకు పునాది వేయడంలో పాఠశాలల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. విద్యార్థులకు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం, ఆత్మవిశ్వాసం, సాంస్కృతిక విలువలు, క్రీడాస్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, సామాజిక నైపుణ్యాలు కూడా అవసరమని సూచించారు. గురువారం ఉదయం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సింగ్‌నగర్‌లోని శ్రీరామ్ పాఠశాల ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన స్పోర్ట్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బొండా ఉమ మాట్లాడుతూ, శ్రీరామ్ స్కూల్ యాజమాన్యం ఒక రోజు ముందుగానే పిల్లల కోసం అద్భుతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసి, విద్యతో పాటు సంస్కృతి, సంప్రదాయాలు, క్రీడలు వంటి అనేక రంగాల్లో శిక్షణ ఇస్తోందని ప్రశంసించారు. గతంలో సింగ్‌నగర్ బసవ పున్నయ్య స్టేడియంలో కూడా ఈ పాఠశాల ఆధ్వర్యంలో అద్భుతమైన స్పోర్ట్స్ మీట్ నిర్వహించామని గుర్తుచేశారు. చదువుతో పాటు శారీరక వ్యాయామం, ఫిజికల్ ఫిట్‌నెస్ కూడా ప్రతి విద్యార్థికి తప్పనిసరి కావాలని సూచించారు. విద్యార్థుల్లో కొందరు టెన్త్ క్లాస్‌లో 594 మార్కులు సాధించడం పాఠశాల క్రమశిక్షణ కు నిదర్శనమని అన్నారు. టీచర్లు, మాస్టర్లు పిల్లలపై చూపుతున్న శ్రద్ధ ప్రశంసనీయ మని పేర్కొన్నారు.తల్లిదండ్రులు పిల్లల కార్యక్రమాలకు హాజరై వారిని ప్రోత్సహిస్తే, అది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని బొండా ఉమ తెలిపారు. భవిష్య త్తులో కూడా ఇటువంటి కార్యక్ర మాలను శ్రీరామ్ స్కూల్ యాజమాన్యం కొనసాగించాలని సూచించారు. ఈ సందర్భంగా బొండా ఉమ ప్రతిభావంతమైన ఉపాధ్యాయులను సన్మానించి, పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం,ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల లో 13- 11- 2025వ తేదీన ఎన్.ఎస్.ఎస్. విభాగం వారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, విజయవాడ. వారి సహకారంతో మొదటి సంవత్సరం డిగ్రీ విద్యార్థులకు బ్లడ్ గ్రూపింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల లో 13- 11- 2025వ తేదీన ఎన్.ఎస్.ఎస్. విభాగం వారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, విజయవాడ. వారి సహకారంతో మొదటి సంవత్సరం డిగ్రీ విద్యార్థులకు బ్లడ్ గ్రూపింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 800 మంది విద్యార్థులు వారి బ్లడ్ గ్రూప్ చేయించుకొని గ్రూపును నిర్ధారణ చేయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.వి.ఎస్. కుమార్ గారు ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ కె. సరళ ,శ్రీమతి టి .నాగరాణి ,పి. శ్రీ భారతి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

వరంగల్

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు – ఆరోగ్య శ్రీ నిధుల దుర్వినియోగం చేసినట్లు గుర్తించిన అధికారులు – ఆసుపత్రిలోని సూపరింటెండెంట్ ఛాంబర్ లో రికార్డులను పరిశీలిస్తున్న విజిలెన్స్ డిఎస్పీ నారాయణ రెడ్డి – 2021 – 2024లలో సుమారు రూ.30 కోట్ల కుంభకోణం జరిగిందని గుర్తించిన అధికారులు..!

ఆంధ్రప్రదేశ్

ధాన్యం పట్టుబడి లో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి మరీ తెలుసుకున్న MLA కాగితకృష్ణప్రసాద్

పెడన మండలం ఈదుమూడి గ్రామంలో ధాన్యం పట్టుబడి పడుతున్న రైతుల వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారు రైతులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వమని రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభతరంగా, పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని రైతులకు అవసరమైన గోనె సంచులు అందజేత, కొనుగోలు చేసిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం, అకాల వర్షాలకు ధాన్యం దెబ్బతినకుండా టార్పులిన్ షీట్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గున్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

పోలీసు అమరవీరుల వారోత్సవం సందర్భంగా పోటీలు విజేతలకు సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేత

పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా వీరజవాన్లను స్మరించుకుంటూ పట్టణంలోని కె.వీ.ఆర్ కళాశాల, శ్రీ చైతన్య పాఠశాలలో వివిధ సాహిత్య, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. కె.వీ.ఆర్ కళాశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో కే.ఇందిరశ్వనీ, పి.ప్రేమ్‌కుమార్, ఎన్.మయూరి, జి.ప్రణీత, ఎం.వర్ష, బి.చంద్రిక విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా గురువారం నాడు పోలీస్‌స్టేషన్‌ లో జరిగిన కార్యక్రమంలో సీఐ వై.వై.ఎల్.నాయుడు విజేతలకు సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బి.మోహనరావు,కే.సూర్యవంశీ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ కామారెడ్డి తెలంగాణ

బ్రహ్మోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

రామారెడ్డి, 13 నవంబర్ ,(పున్నమి ప్రతినిధి )    : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన శ్రీ కాలభైరవ స్వామి జన్మదిన వేడుకల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్  పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే భక్తులతో కలిసి ఇస్సానపల్లి, రామారెడ్డి వీధుల్లో జరిగిన రథయాత్రలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అగ్ని గుండాల కార్యక్రమంలో పాల్గొ ని స్వామివారిని దర్శించుకున్నారు. వేదపండితు లు  ఆశీర్వదించారు.ఆయన భక్తులతో కలసి భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.అనంతరం భక్తు లతో మదన్ మోహన్ మాట్లాడుతూ, “రామారెడ్డి మండలంలో శ్రీ కాలభైరవస్వామి ఆలయం అత్యం త పవిత్రమైనది, ప్రసిద్ధిగాంచిందని అన్నారు. ఈ ఆలయాన్ని ‘దక్షిణ కాశీ’గా అభివృద్ధి చేయడానికి త్వరలో ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామన్నా రు. ఈ పవిత్రక్షేత్రానికి ప్రముఖులు, సినీ తారలు, రాజకీయ నాయకులు తరచూ వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందేలా సదుపాయాలు కల్పిస్తాం” అని తెలిపారు.“ఎమ్మెల్యే రామారెడ్డి వాడినే. నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కాలభైరవస్వామి ఆలయం తో ముడిపడి ఉన్నాయని చెప్పారు. చిన్నతనంలో నే స్వామివారి ఉత్సవాలను చూసి, ఆద్యాత్మికలో  పెరిగానని చెప్పారు.  ఆలయ అభివృద్ధి కోసం నా కృషి నిరంతరం కొనసాగుతుంది” అని ఎమ్మెల్యే అన్నారు.వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలను పొందారని అన్నా రు. కార్యక్రమంలో వేదపండితులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

E-పేపర్

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం శుభ్రం చేస్తున్న సర్పంచ్ ఎంపీటీసీ

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం శుభ్రం చేస్తున్న సర్పంచ్ ఎంపీటీసీ రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు మండలం స్థానిక అనంతరాజుపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రీడా మైదానంలో పిచ్చి మొక్కలు శుభ్రం చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న సర్పంచ్ సుబ్రమణ్యం , ఎంపీటీసీ బండారు మల్లికార్జున ప్రారంభం చేశారు . సువిశాలమైన స్థలంలో ఉన్న పిచ్చి మొక్కలు శుభ్రం చేయడానికి ట్రాక్టర్ డోజర్ ను రప్పించి పనులు పూర్తి చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం లలిత కుమారి తెలుగు మాస్టర్ ,సుబ్రమణ్యం రెడ్డి, నాగేంద్ర, రత్నం ,శరత్ కుమార్ ,పిడి సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాదు

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం హస్నాపూర్ గ్రామంలో ఇంద్రవెల్లి సిఎఫ్ఎల్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం కౌన్సిలర్ వెంకట్ గౌడ్, అశ్విన్ నిర్వహించారు. వినియోగ దారుల రక్షణ కొరకు బ్యాంకులు నిరంతరం కృషి చేస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని, కేవైసీ చేసుకోవాలని తెలిపారు. ఇన్స్యూరెన్స్ పథకాలు ఆర్థిక భరోసాగా ఉంటాయని తెలిపారు. అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన పథకాల గురించి వివరించారు. డిజిటల్ పేమెంట్స్ గురించి తెలిపారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఐకెపి మడావి నాందేవ్, గ్రామ పటేల్ మాణిక్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.