Sunday, 22 March 2026

Blog

నాగర్‌కర్నూల్

*లింగారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ మల్లెపాకుల సోమయ్య గారికి ఘన నివాళులు*

*లింగారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ మల్లెపాకుల సోమయ్య గారికి ఘన నివాళులు* నాగర్ కర్నూల్ ప్రతినిధి, నవంబర్11 (పున్నమి) : మంగళవారం లింగారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ మల్లెపాకుల సోమయ్య గారు మరణించడం జరిగింది. ఆయన మరణం మరణం ఎంతో బాధాకరం. ఒక సాక్షి రిపోర్టర్ గా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో వెల్దండ మండలంలో రిపోర్టర్లలో అందరికంటే ఎక్కువగా జూపల్లి గ్రామాన్ని ఇష్టపడేవారు జూపల్లి గ్రామం మండలం కావాలని లింగారెడ్డిపల్లి గ్రామం గ్రామపంచాయతీ కావాలని ఆ రోజులలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు జూపల్లి గ్రామానికి పూర్తి మద్దతు తెలిపారుఇక్కడ తెలంగాణ వాదాన్ని ఆయన పేపర్ ద్వారా అందరికంటే ఎక్కువ రాసేవారు. సోమయ్య గారి మృతదేహానికి జూపల్లి గ్రామ యువనాయకులు. వారి పార్థివ దేవానికి పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జూపల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్ జగపతి. భాస్కర్ రావు యువసేన అధ్యక్షుడు ఎండి సిరాజ్ . కాంగ్రెస్ నాయకుడు గిరి యాదవ్ నివాళులు అర్పించారు

అల్లూరి సీతారామరాజు

గంజాయి, మత్తుపదార్ధాలపై విద్యార్ధినిలకు అవగాహన

అరకులోయ(పున్నమి ప్రతినిధి), నవంబర్:11 పాడేరు ఈగల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో అరుకులోయ ప్రభుత్వ డిగ్రీ మహిళ కళాశాలలో మంగళవారం గంజాయి, డ్రగ్స్ దుర్వినియోగం పై అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పట్టాసి చలపతిరావు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలను వినియోగించడం వలన ఆరోగ్య, మానసిక సంబంధిత సమస్యలు, తోటి వారితో సరైన సంబందాలు లేకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో విద్యార్థులు, యువత గంజాయి, డ్రగ్స్ బారిన పడటానికి గల కారణలను, వాటి బారిన పడితే కలిగే నష్టాలను, గంజాయి, డ్రగ్స్ అలవాటు పడకుండా ఉండటానికి పాటించవలసిన నియమాలను ఈగల్ సీఐ రమేష్ రుద్ర వివరించారు. డ్రగ్స్, గంజాయి నివారణకు ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు తెలియజేయాలని అన్నారు. అలాగే మాదక ద్రవ్యాల నిరోదానికి సంబంధించిన ప్రతిజ్ఞను అధ్యాపకులు, విద్యార్థులు చేత చేయించడం జరిగింది. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్, ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ ఈగల్ గురించి తెలియజేశారు. అలాగే మాదకద్రవ్యాల నిరోధక చట్టాలు, శిక్షలు గురించి జిల్లా ఎన్.డి.పి.ఎస్ సీఐ రవి కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పట్టాసి చలపతి రావు, అరకులోయ పోలీస్ స్టేషన్ సిబ్బంది అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ధవళేశ్వరం MSME పార్కులో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన

“ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త” – ప్రభుత్వ ప్రధాన లక్ష్యం* ధవళేశ్వరం MSME పార్కు ప్రాంగణంలో మంగళవారం ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (FFC) భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రధాన అతిథిగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. “ఈ ప్రాంతంలో ఇప్పటికే 12 పరిశ్రమలు విజయవంతంగా పనిచేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో ఆయన స్ఫూర్తితో ఇక్కడ ఏర్పడిన విజ్ఞాన కేంద్రం అన్నారు. యువతకు ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ యువతకు నైపుణ్యం పెంచే విధంగా గొప్ప ప్రోత్సాహాన్ని అందిస్తోందన్నారు. పేదవాడు కూడా ఆలోచన చేస్తే పారిశ్రామికవేత్తగా ఎదగవచ్చు అన్న నారా చంద్రబాబు నాయుడు ఆలోచన ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వేత్త అన్నారు. నారా లోకేష్ నాయకత్వంలో మానవ వనరుల అభివృద్ధికి, యువతకు నైపుణ్యం పెంపు దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నవంబర్ 18న నారా లోకేష్ జిల్లాకు రానుండగా, విద్యార్థులు మరియు యువత తమ సమస్యలు, అభివృద్ధి ప్రతిపాదనలు తెలియజేసి , ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలని ఆలోచన చెయ్యడం జరుగుతోందని వెల్లడించారు. నారా చంద్రబాబు నాయుడు విజన్ ప్రకారం ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త అవతరించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది” అని తెలిపారు. ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (FFC) వివరాలను గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడిస్తూ – “Ac.2.00 ఎకరాల్లో ప్రతిపాదిత ఈ ప్రాజెక్టు ద్వారా 26 యూనిట్లు స్థాపించబడతాయన్నారు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 34,444.51 చదరపు అడుగులు కాగా, ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 5.15 కోట్లుగా ఉందన్నారు. ఇది సూక్ష్మ మరియు చిన్న స్థాయి యూనిట్లకు ‘ప్లగ్ అండ్ ప్లే’ సౌకర్యాలను అందించే ఆధునిక పారిశ్రామిక భవనం అవుతుందన్నారు. తయారీ, అసెంబ్లింగ్, సేవా రంగాల యూనిట్లు ఇక్కడ స్థాపించుకోగలవనీ, తద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రూపు దిద్దుకుని మరికొందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం సాధ్యం అవుతుందని తెలిపారు. శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు మాట్లాడుతూ – “ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిదాయకం అన్నారు. యువత పారిశ్రామిక రంగంలో అడుగుపెట్టి తమ భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు. అధికారులు కూడా ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తున్నారు” అన్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ – “పరిశ్రమల ఏర్పాటు ద్వారా జిల్లాలో ఉద్యోగావకాశాలు సృష్టించబడు తున్నాయన్నారు. యువత తమ సెల్‌ఫోన్, టెక్నాలజీని సృజనాత్మకంగా ఉపయోగించుకోవాలనీ , సాంకేతిక పరిజ్ఞానం మంచికి, చెడుకి రెండిటికీ వాడవచ్చు అన్నారం కానీ, మేము దీన్ని సృజనాత్మక మార్గంలో ఉపయోగించే యువతను కోరుకుంటున్నాం అని పిలుపు ఇచ్చారు. MSME రంగంలో 15 కోట్ల రూపాయలతో చిన్న, మధ్య తరహా యూనిట్లు ఏర్పాటు చేయబడతాయి. ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో ఆసక్తి ఉన్న వారు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలనీ కోరారు. మీ ఆలోచనలను ప్రోత్సహించి, ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తోందన్నారు. నైపుణ్యం ఉన్న వ్యక్తిని , వాటి నుండి ఎవరూ దూరం చేయలేరు” అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్, ఎపిఐఐసి లిమిటెడ్ జోనల్ మేనేజర్ రమణా రెడ్డి, ఎపిఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, డీఐవో శ్రీవనిధర్ రామన్, ఎంపీపీ (కడియం) వి. ప్రసాద్, ఎంఎస్ఎంఈ చైర్మన్ జార్జీ బాబు, ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, మచ్చేటి ప్రసాద్, మజ్జి పద్మావతి, పండూరి అప్పారావు, యానాపు యేసు, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, పి. అప్పారావు, ఎం. ప్రసాద్, స్థానిక నాయకులు, మరియు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

రంగారెడ్డి

* మహేశ్వరం మార్కెట్ కమిటీల వేలం:కృష్ణనాయక్,సిహెచ్‌.యాదయ్య. *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 11 : మహేశ్వరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో వాణిజ్య సముదాయంలోని ఐదు కమర్షియల్ షాపుల వేలంపాట ఈరోజు నిర్వహించబడింది.ఈ సందర్భంగా ఎఎంసీ మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ నాయక్, వైస్‌ చైర్మన్ సిహెచ్‌.యాదయ్య పర్యవేక్షణలో ఐదు షాపులు ప్రాకతీయంగా ఎన్నుకోబడ్డాయి.ఎంపికైన వారు –షాప్ నం.1 – నరసింహ గౌడ్ ( ఓసి),షాప్నం.2 – లాజర్ ( ఎస్సీ),షాప్ నం.3 – మల్లేష్ (ఓసి),షాప్ నం.4 – గోపాల్ నాయక్ (ఎస్సీ),షాప్ నం.5 – శ్రీకాంత్ ( బీసీ).ఈ కార్యక్రమంలో చైర్మన్,వైస్ చైర్మన్‌లను శాలువా కప్పి సన్మానం చేశారు.ఈ సందర్భంగా చైర్మన్ కృష్ణ నాయక్ మాట్లాడుతూ వేలంపాట ద్వారా నెలవారీగా రూ.53,650 ఆదాయం రావడం ఎంతో ఆనందంగా ఉంది.ఈ ఆదాయం వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి తోడ్పడుతుంది అని తెలిపారు.కార్యక్రమంలో డీ.డి.ఎం.ప్రసాద్ రావు (హైదరాబాద్),ఇబ్రహీంపట్నం సెక్రటరీ సంతోష్ కుమార్,మహేశ్వరం మార్కెట్ కమిటీ సెక్రటరీ సుజాత, సభ్యులు పాల్గొన్నారు.

అన్నమయ్య

అన్నమాచార్య ఫార్మసీ కళాశాల ఎన్ఎస్ఎస్ బృందం వారిచే క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం నిర్వహణ

బోయినపల్లి స్థానిక అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న మూడో సంవత్సరం ఫార్మసీ విద్యార్థులు మరియు ఎన్.ఎస్.ఎస్ కార్యక్రమం అధికారి అయిన వై.ప్రదీప్ కుమార్ ఈరోజు గుండ్లూరు అగస్తేశ్వర స్వామి శివాలయం నందు పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి . స్వర్ణత సూచనల మేరకు నిర్వహించారు.కళాశాల యాజమాన్యం కార్యదర్శి డాక్టర్ సి.గంగ రెడ్డి కోశాధికారి సి.అభిషేక్ రెడ్డి వైస్ చైర్మన్ సి. ఎల్లారెడ్డి మరియు చైర్మన్ డాక్టర్ సి.రామచంద్ర రెడ్డి పై కార్యక్రమ నిర్వహణను అభినందించారు

ఎన్ టి ఆర్ జిల్లా

NEET‌లో అద్భుత విజయం – తిరుమలగిరి గ్రామానికి గర్వకారణంగా నిలిచిన శ్రీ నిత్య

జగ్గయ్యపేట నియోజకవర్గం తిరుమలగిరి గ్రామానికి చెందిన పోతురాజు వసంతరావు కుమార్తె శ్రీ నిత్య NEET పరీక్షల్లో ప్రతిభ కనబరచి, A కేటగిరీ కింద ఎంబిబిఎస్ ఫ్రీ సీటు సాధించారు. ఈ సందర్భంగా ఆమె జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. ఉదయభాను శ్రీ నిత్యకు అభినందనలు తెలియజేసి, భవిష్యత్తులో మంచి వైద్యురాలిగా ఎదిగి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో స్థానిక జనసేన నాయకులు, కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొని శ్రీ నిత్యను ఘనంగా సత్కరించారు.

ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటన విజయవంతం కావడంతో సిబ్బందిని అభినందించిన ఎస్పీ

ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతంగా ముగిసింది. దీంతో పోలీసు సిబ్బందిని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు. మంగళవారం పెద్ద చెర్లోపల్లి మండలంలో సీఎం ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు సీఎంను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. దాదాపు 750 మంది పోలీసు సిబ్బందితో భద్రత కల్పించామని, సీఎం పర్యటన సజావుగా సాగడంపై ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అప్పనపల్లి పాఠశాలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు ఘనంగా

అప్పనపల్లి, నవంబర్ 11 (పున్నమి ప్రతినిధి): అప్పనపల్లి ఎంపీపీ ప్రభుత్వ పాఠశాలలో భారతదేశపు తొలి విద్యాశాఖ మంత్రి, మహానుభావుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు అబుల్ కలాం ఆజాద్ గారి సేవలను స్మరించారు. ఆయన దేశ విద్యా వ్యవస్థ అభివృద్ధి, విశ్వవిద్యాలయాల స్థాపన, విద్యా హక్కు విస్తరణలో చేసిన కృషిని గుర్తుచేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ నైనాల రఘు రామయ్య మాట్లాడుతూ, “మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి విజన్ వల్లే నేటి భారత విద్యా వ్యవస్థ బలమైన పునాదులపై నిలిచింది” అని పేర్కొన్నారు. అలాగే విద్యార్థుల్లో విద్యాపట్ల ఆసక్తి పెంచే దిశగా ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టాలని ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో బాలెం రామకృష్ణ, బాలెం పెద్దిరాజు, షబ్బీర్ హుస్సేన్, అనంతలక్ష్మి దేవి తదితరులు పాల్గొని మౌలానా ఆజాద్ గారి విప్లవాత్మక ఆలోచనలను స్మరించారు. కార్యక్రమం చివరగా విద్యార్థులు ఆయన జీవిత చరిత్రపై వ్యాస రచన, ప్రసంగ పోటీలు నిర్వహించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రోడ్లపై మూగజివాలు పట్టించుకోని యాజమాన్యం

11/11/2025 మనుబోలు మండలం కాగితాలపూర్ రోడ్డు నందునోరులేని మూగ జీవాలను ఇలా రోడ్డుమీదకీ వదిలేస్తే వాటికేం తెలుసు పాపం అకస్మాత్తుగా రోడ్ల మీదకి వచ్చేయడం వాహనదారులను ప్రమాదాలకు గురి చేస్తున్నప్పటికి యాజమాన్యం పట్టించుకోవడం లేదు దయచేసి యాజమాన్యులు ఈ యొక్క మూగజీవాలను తరలించి హైవే రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాలను అరికట్టాలని వాహనదారులు కోరుకుంటున్నారు,

అన్నమయ్య

ఉర్దూ పాఠశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం

-భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలకు నివాళి – హిందూ-ముస్లిం ఐక్యతపై ప్రధాన దృష్టి చిట్వేల్, నవంబర్ 11: పున్నమి ప్రతినిధి భారత స్వాతంత్ర్య సమరయోధులు, స్వతంత్ర భారతదేశ తొలి విద్యా శాఖా మంత్రి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని, చిట్వేల్ మండల పరిషత్ ప్రాథమిక ఉర్దూ పాఠశాలలో మంగళవారం జాతీయ విద్యా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. -ఆజాద్ సేవలను స్మరించుకుంటూ. ఈ సందర్భంగా జరిగిన సభలో సీనియర్ ఉపాధ్యాయులు కామాటం వెంకటేశ్వర్లు మరియు సామాజిక కార్యకర్త గాడి ఇంతియాజ్ అహ్మద్ ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. వారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను, విద్యా దినోత్సవం యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించారు.జాతీయ ఐక్యత:మౌలానా అబుల్ కలాం ఆజాద్‌గారు కేవలం స్వాతంత్ర్యం కోసం మాత్రమే కాకుండా, ఈ దేశంలోని హిందూ ముస్లింల ఐక్యత**ను సాధించడం అత్యంత ప్రధానమని బలంగా విశ్వసించి, అప్పట్లో ప్రకటించారని వక్తలు తెలిపారు. విద్యా సేవ:విద్యాశాఖ మంత్రిగా ఆయన అమలు చేసిన విలక్షణమైన విద్యా ప్రణాళికలు అలాగే నేడు అగ్రగామిగా వెలుగొందుతున్న అకడమిక్, సాంకేతిక విద్యా సంస్థలకు ఆయన వేసిన పునాదులు అనిర్వచనీయమైనవని కొనియాడారు.సాహిత్యం – త్యాగం: చిన్న వయసులోనే (12 ఏళ్లకు) ‘నైరంగే ఆలం’ పత్రికను వెలువరించడం, 13వ ఏట అద్భుత సాహిత్య విమర్శను సృజించడం ఆయనలోని సాటి లేని విద్వాంసుడిని చాటి చెబుతుంది. స్వతంత్ర పోరాటంలో 10 సంవత్సరాల 7 నెలలు జైలు జీవితం గడపడం ఆయన త్యాగానికి నిదర్శనమని వక్తలు పేర్కొన్నారు.అలాగే, పలు గ్రంథాలను రచించి మహాకవిగా, పండితునిగా, అద్భుత మేధాశక్తిగల ధార్మికవేత్తగా ఆయన ఆర్జించిన ఖ్యాతిని వివరించారు. ఆయన సేవలకు గాను భారత ప్రభుత్వం భారతరత్న గౌరవాన్ని అందించిందని గుర్తుచేశారు. ఇలాంటి మహానుభావుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని విద్యార్థులకు ఉపదేశించారు. -విద్యాసామాగ్రి పంపిణీ తదనంతరం, పాఠశాలలోని విద్యార్థినీ విద్యార్థులకు మిఠాయిలు మరియు విద్యాసామాగ్రిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఇప్పటికే పలు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని వక్తలు తెలియజేశారు. -ముస్లిం సంక్షేమ సంఘం హామీ: కార్యక్రమానికి హాజరైన ముస్లిం సంక్షేమ సంఘ మహిళలు మాట్లాడుతూ, తమ వంతుగా ఉర్దూ పాఠశాల అభివృద్ధికి ఎల్లవేళలా సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. విశాలమైన భవన సదుపాయంతో నూతన పాఠశాల నిర్మాణం కొరకు మరియు విద్యార్థుల విద్యాభివృద్ధి కొరకు కృషి చేస్తున్నామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ముస్లిం సంక్షేమ సంఘ సభ్యులు షేక్ మస్తాన్ భాషా, రియాజ్ భాషా, షేక్ షబ్బీర్ భాషా, షేక్ సాదిక్ అలీ, గాడి ఇంతియాజ్ అహ్మద్, మహమ్మద్ ఇలియాజ్, ముస్లిం మహిళలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కామాటం వెంకటేశ్వర్లు ఉర్దూ ఉపాధ్యాయురాలు కుమారి శశాంక , తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.