Saturday, 21 March 2026

Blog

విశాఖపట్నం

యువత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలి*

*యువత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలి* విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- *ఏపీ, దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలి* *ఆంధ్రప్రదేశ్ ను కాలిఫోర్నియా ఆఫ్ ఈస్ట్ గా తీర్చిదిద్దుతాం* *యువత భాగస్వామ్యంతోనే భారతదేశం నెం.1 ఎకానమీగా రూపుదిద్దుకుంటుంది* *విశాఖపట్నానికి యువతే బ్రాండ్ అంబాసిడర్లు* *ఐటీ కంపెనీలకు భూమి పూజ అనంతరం ఉద్యోగులతో మంత్రి నారా లోకేష్* విశాఖపట్నం: ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోందని.. వచ్చిన అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విశాఖపట్నం ఐటీ హిల్స్ లో పలు ఐటీ కంపెనీలకు భూమి పూజ అనంతరం అక్కడి ఐటీ ఉద్యోగులతో లోకేష్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి లోకేష్ ప్రసంగిస్తూ.. అందరూ విశాఖ వైపు చూస్తున్నారు. వచ్చిన అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి. ఏపీ, ఇండియా గర్వపడే విధంగా చేయాలి. ఏపీని కాల్నిఫోర్నియా ఆఫ్ ఈస్ట్ గా తీర్చిదిద్దుతాం. ఈ ప్రయాణంలో మీరందరూ భాగస్వామ్యం కావాలి. హైదరాబాద్ ఈ స్థాయికి రావడానికి 35 ఏళ్ల సమయం పడితే విశాఖ అభివృద్ధికి పదేళ్లు చాలు. మేం అందరం చాలా కష్టపడుతున్నాం. చాలా మంది రాజకీయ నాయకులకు ఒక్క అవకాశమే వస్తుంది. మాకు విశాఖ, అమరావతిని అభివృద్ధి చేసేందుకు రెండు అవకాశాలు లభించాయి. మున్ముందు విశాఖకు అనేక కంపెనీలు తరలివస్తాయి. *యువత భాగస్వామ్యంతోనే భారతదేశం నెం.1 ఎకానమీగా రూపుదిద్దుకుంటుంది* యువత రాష్ట్రంతో పాటు దేశం గర్వపడే విధంగా చేయాలి. ప్రపంచం వికసిత్ భారత్ కోసం పీఎం నరేంద్ర మోదీ గారు విశేషంగా కృషిచేస్తున్నారు. మోదీ గారి నేతృత్వంలో ప్రపంచంలో ఇండియా నెం.1 ఎకానమీగా రూపుదిద్దుకుంటుంది. దానికి కారణం మీ లాంటి యువతే. విశాఖను ఐటీ కేంద్రగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోంది. వచ్చే పదిహేనేళ్లు మనవే. మన లక్ష్యాన్ని సాధించాలంటే, మనం నమ్ముతున్న అభివృద్ధిని నిజం చేయాలంటే, భారతదేశం నెం.1 ఎకానమీగా ఎదగాలంటే మనలో ప్రతి ఒక్కరికీ ఆ కసి ఉండాలి. ప్రతి ఒక్కరం ఎంతో కష్టపడి పనిచేయాలి. ఆంధ్రప్రదేశ్ కు, భారతదేశానికి గర్వకారణంగా నిలవాలి. అందరూ విశాఖపట్నం బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలి. మీలో ప్రతి ఒక్కరూ మీ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించాలి. ఇక్కడికి వచ్చే తెలుగు ప్రజలు, భారతీయులు…. ఈ అద్భుతమైన కొత్త కంపెనీల్లో పనిచేయబోతున్న వారందరినీ ఆత్మీయంగా స్వాగతించాలి. విశాఖపట్నం పరిశుభ్రంగా, పచ్చగా ఉండాలి. మన నగరం దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలవాలి. దానికోసం మన వంతు కృషి చేయాలన్నారు.

విశాఖపట్నం

విశాఖ ఎకనామిక్ రీజియన్ సదస్సుకు హాజరై ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు*

• *విశాఖ :- విశాఖ ఎకనామిక్ రీజియన్ సదస్సుకు హాజరై ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- * • *విశాఖ ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ డాక్యుమెంట్‌ను విడుదల చేసిన ముఖ్యమంత్రి , నీతిఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం* • విశాఖను మోస్ట్ లివబుల్ సిటిగా తీర్చిదిద్దుతున్నాం. ప్రధాని మోదీ కూడా ఏపీ అభివృద్ధికి సహకరిస్తున్నారు • 2038కి భారత్ రెండో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మారుతుంది. 2047కు అగ్రస్థానంలోకి రావటాన్ని ఎవరూ ఆపలేరు • రాష్ట్ర అభివృద్ధి కోసమే ఓ విజన్ తయారు చేసుకుని అమలు చేస్తున్నాం • దేశంలోని నాలుగు నగరాలకు విజన్ తయారు చేయాలని కేంద్రం నిర్దేశించింది. • ముంబై, వారణాసి, సూరత్ , విశాఖల అభివృద్ధికి ఈ విజన్ అమలు చేయాలని నిర్ణయించింది • అక్షర క్రమంలో, అభివృద్ధి పోటీలో ఏపీనే ఎప్పుడూ ముందుంటుంది. • సాగర తీరాన ఉన్న విశాఖ నగరం దేశంలోనే అత్యంత సుందరమైన ప్రాంతం • గత పాలకులు రాష్ట్రాన్ని, దాని అభివృద్ధిని సర్వనాశనం చేశారు. • అందుకే కూటమిగా ప్రజల మద్దతుతో పునర్నిర్మాణం చేస్తున్నాం • రూ.2.66 లక్షల కోట్ల ఎంఓయూలు సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ కంటే ముందే చేశాం • 17 నెలల్లోనే రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు తేగలుగుతున్నాం • గూగుల్ డేటా సెంటర్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో వస్తోంది • అనకాపల్లిలో దాదాపు రూ.1 లక్ష కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మించబోతోంది • 9 జిల్లాలతో ఏర్పాటు చేస్తున్న విశాఖ ఎకనామిక్ రీజియన్ భవిష్యత్‌ ఆర్థిక శక్తిగా ఏపీని నిర్దేశించే ఓ మోడల్ • విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్, సుస్థిర అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం • విశాఖపట్నం ఇండస్ట్రియల్ రీజియన్ మాస్టర్ ప్లాన్– 2040కు రూపకల్పన చేశాం • తూర్పుతీరంలో వీఈఆర్ దేశ ఆర్ధిక ప్రగతికి గేట్వేగా పనిచేస్తుంది. • అన్ని వనరులూ 9 జిల్లాలతో కూడిన విశాఖ ఎకనామిక్ రీజియన్ కు ఉన్నాయి. • విశాఖ ఎకనామిక్ రీజియన్ అథారిటీకి చైర్మన్ హోదాలో నేనే స్వయంగా అభివృద్ధిని పర్యవేక్షిస్తాను.

విశాఖపట్నం

విశాఖపట్నం బీచ్ రోడ్డులోని ఇండియాలోనే ఫస్ట్ లైట్ ఆర్ట్ థీమ్ పార్క్ ను సందర్శించిన మంత్రి కందుల దుర్గేష్*

*విశాఖపట్నం బీచ్ రోడ్డులోని ఇండియాలోనే ఫస్ట్ లైట్ ఆర్ట్ థీమ్ పార్క్ ను సందర్శించిన మంత్రి కందుల దుర్గేష్* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* *వినోదాన్ని కోరుకునే వారికి వైజాగ్ ప్రసిద్ధ గమ్యస్థానం అని పేర్కొన్న మంత్రి దుర్గేష్* *నగర జీవితంలోని గందరగోళం,ఒత్తిడితో కూడిన రోజువారీ జీవితం నుండి విశ్రాంతి తీసుకోవాలనుకునే వారికి వైజాగ్‌లోని థీమ్ పార్క్ లు మంచి ఉపశమనాన్ని ఇస్తున్నాయన్న మంత్రి దుర్గేష్* *తాను సందర్శించిన అమ్యూజ్ మెంట్ పార్క్ మాయా ప్రపంచమన్న మంత్రి దుర్గేష్* *చిన్నా, పెద్ద అనే తేడా కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆనందంగా ఉత్కంఠభరితమైన రోజును గడిపే ప్రదేశమని వెల్లడి*

విశాఖపట్నం

30వ సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్- 2025 కు విస్తృత ఏర్పాట్లు…

30వ సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్- 2025 కు విస్తృత ఏర్పాట్లు… *విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి:-*: విశాఖపట్నంలో ఈనెల 14,15 తేదీల్లో రెండు రోజులపాటు జరుగనున్న 30వ సిఐఐ(భారత పరిశ్రమల సమాఖ్య)(Confederation of Indian Industries)భాగస్వామ్య సదస్సు(Partnership Summit)2025 నిర్వహణకు విస్తృతమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి.భారతప్రభుత్వంమరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం,సిఐఐ భాగస్వామ్యం తో సాగరతీర నగరమైన విశాఖపట్నం ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సిఐఐ సమ్మిట్ జరగనుంది.ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.రెండు రోజులపాటు జరిగే ఈసదస్సుకు ఆంధ్రప్రదేశ్ పెవీలియన్ ప్లీనరీ హాల్ ప్రధాన వేదికగా ఉండగా దానికి అనుబంధంగా వివిధ హాళ్ళను ఏర్పాటు చేశారు.అక్కడ వివిధ ప్లినరీ సెషన్లు జరగనున్నాయి. రెండు రోజుల సిఐఐ సమ్మిట్లో భాగంగా 14వ తేది శుక్రవారం ఉ.8.30 గం.ల నుండి ఈ.10.30 గం.ల వరకు ఆంధ్రప్రదేశ్ పెవీలియన్ ప్లీనరీ హాల్ 5 లో ప్రారంభోత్సవ కార్యక్రమం (Inaugural Session) జరగనుంది.ఈకార్యక్రమంలో భారత ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిధిగా పాల్గోనుండగా రాష్ట్ర గవర్నర్ జస్టీస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గౌరవ అతిథిగా పాల్గోనున్నారు. అదే విధంగా కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖామాత్యులు పియూష్ గోయల్,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు కీలకోపాన్యాసం చేయనున్నారు. ఇంకా ఈప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు,పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్,టిజి భరత్,సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జి, పలువురు పరిశ్రమల ప్రతినిధులు,రాష్ట్ర మంత్రులు తదితరులు పొల్గోనున్నారు. అనంతరం 10.30 గం.ల నుండి 11.45 గం.ల వరకు ఓపెనింగ్ ప్లినరీ కార్యక్రమం జరుగుతుంది. గౌరవ అతిధులుగా కేంద్రమంత్రి పియుష్ గోయల్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు.అలాగే పలువురు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొంటారు.అదే సమయంలో వివిధ కాన్పరెన్స్ హాల్లో వివిధ ప్లీనరీ సెషన్లు జరగనున్నాయి. సా.8 గం.ల వరకు జరగనున్నాయి. రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా 15వతేది ఉదయం 9.30 గం.ల నుండి సాయంత్రం వరకూ వివిధ ప్లీనరీ హాల్లో పలు ప్లీనరీ సెషన్లు జరగనున్నాయి. అనంతరం సాయంత్రం 5 గం‌.ల నుండి 5.45.గం‌ల వరకు ఈ రెండు రోజుల సిఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు వేడుక (Valedictory Session) ప్రధాన వేదికైన ఆంధ్రప్రదేశ్ పెవీలియన్ ప్లీనరీ హాల్ 5లో జరగనుంది.ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గౌరవ అతిథులుగా పాల్గోనున్నారు.అదే విధంగా సిఐఐ ఉపాధ్యక్షులు సుచిత్రా కె.యల్ల,సిఐఐ ఇంటర్నేషనల్ కౌన్సిల్ చైర్మన్ ఆర్.దినేష్ తదితరులు పొల్గోనున్నారు. అనంతరం సా.5.45 గం.లకు ఈరెండు రోజుల సదస్సు ముగియనుంది. కాగా రెండు రోజుల సిఐఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధాన వేదికైన ఆంధ్రప్రదేశ్ పెవీలియన్ లో సభావేదికతో పాటు ముఖ్య అతిథులు,ఇతర అతిథులు,మీడియా తదితరులు కుదుర్చుకునేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేశారు.అలాగే మిగతా ప్లినరీ హాల్స్ వద్ద కూడా తగిన ఏర్పాట్లు చేశారు.అదే విధంగా సభావేదికకు వెలుపల ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో వివిధ వాహనాల పార్కింగ్ కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల సిఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ఎపి బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచానికి చాటి చెప్పే ప్రక్రియలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీ సహా ముంబాయి హైదరాబాద్,చెన్నై,బెంగుళూరు, విశాఖపట్నం,విజయవాడ నగరాల్లోని ప్రధాన కూడళ్లు, విమానాశ్రయాల్లో పలు హోర్డింగులు,డిజిటల్ డిస్ప్లేచేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలోని ఇతర ముఖ్య నగరాలు,పట్టణాల్లో కూడా పెద్ద ఎత్తున హోర్డింగులు ఏర్పాటు చేయడం జరిగింది.ముఖ్యంగా విశాఖ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నగరమంతా సిఐఐ సదస్సుకు సంబంధించి పెద్ద ఎత్తున హోర్డింగులు ఏర్పాటు చేయడం జరిగింది.పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకునే రీతిలో ఎపి బ్రాండింగ్ జరిగింది.అంతేగాక వివిధ ప్రసార మాధ్యమాలు ద్వారా సిఐఐ సమ్మిట్ పై విస్తృతమైన ప్రచారం చేయడం జరిగింది. సిఐఐ సమ్మిట్లో పెద్ద ఎత్తున అవగాహనా ఒప్పందాలు (MOU).. విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ సమ్మిట్లో వివిధ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం పలు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకోనుంది‌. ఇప్పటికే 13వ తేదీన పరిశ్రమల శాఖ 9 ఎంఓయులు,ఐఅండ్ఐ 3, ఆహారశుద్ధి శాఖ 4,ఇంధన శాఖ 6,సిఆర్డిఏ 8 ఎంఓయులు కుదుర్చుకోవడం జరిగింది. కాగా 14వ తేది తొలిరోజు సదస్సులో సాయంత్రం 6.30 గం.ల నుండి రాత్రి 7.30. గం.ల మధ్య ప్రధాన వేదిక ప్రాంగణంలో హాల్ నంబరు 7లో పరిశ్రమల శాఖ 14, ఐఅండ్ ఐ 15,ఆహార శుద్ధి శాఖ 6,ఇంధన శాఖ 21 అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకోనుంది. అదే విధంగా చివరి రోజైన 15వ తేది మధ్యాహ్నం 2.30.గం.ల నుండి 3.30 గం.ల మధ్య ప్రధాన వేదిక ప్రాంగణం హాల్ నంబరు 7లో పరిశ్రమల శాఖ 27 ఎంఓయులను,పర్యాటక శాఖ 21,ఐటి శాఖ 7,చేనేత జౌళి శాఖ రెండు అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకోనుంది.అదే విధంగా ఈరెండు రోజుల్లోను మిగతా హాల్లో కూడా వివిధ సంస్థలతో పలుశాఖలు అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకోనున్నాయి.

విశాఖపట్నం

పెట్టుబడుల సదస్సుకు ముందే భారీగా ఎంఓయూలు*

*పెట్టుబడుల సదస్సుకు ముందే భారీగా ఎంఓయూలు* *ఒక్క రోజులోనే 5 రంగాల్లో 35 ఎంఓయూలు* *రూ. 3.65 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.26 లక్షల మందికి ఉద్యోగాలు* *ఇంధన శాఖలోనే రూ. 2.65 లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన సంస్థలు* *ఏపీని విడిచి వెళ్లిన కంపెనీలను తిరిగి తెచ్చిన కూటమి ప్రభుత్వం* *పారిశ్రామిక రంగానికి ఏపీ ఇస్తున్న సహకారానికి కంపెనీల నుంచి కితాబులు* *ప్రభుత్వం చేపట్టే అన్నక్యాంటీన్లకు విరాళాలు* *వేగమే వేదంగా పెట్టుబడుల సాధనకు కృషి: ముఖ్యమంత్రి* *రోజంతా 15కు పైగా సమావేశాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు* *విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి:- * పెట్టుబడులు ఆకర్షించడంలో రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో నిలపడమే ధ్యేయంగా పని చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ మేరకు వేగమే వేదంగా పెట్టుబడుల సాధనకు కృషి చేస్తున్నామని చెప్పారు. విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సుకు ముందు రోజు గురువారం జరిగిన వివిధ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సుమారు 15కు పైగా సమావేశాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన వారితో వరుస భేటీలు నిర్వహించారు. అలాగే తైవాన్, ఇటలీ వంటి దేశాల రాయబారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు. ఏయే ప్రాంతంలో ఏయే రంగానికి తాము ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించడంతోపాటు… ఆయా ప్రాంతాల్లో ఉన్న పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం ఏ విధంగా ఉంది… అక్కడ కనెక్టివిటీ ఏ విధంగా అభివృద్ధి చేశాం అనే విషయాలను వివిధ పారిశ్రామిక వేత్తలకు ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే తైవాన్, ఇటలీ దేశాలకు చెందిన పరిశ్రమలను ఏపీలో పెట్టుబడులు పెట్టేలా చూడాలని ఆ దేశాల రాయబారులను ముఖ్యమంత్రి కోరారు. ఇక వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు రావడంతో పాటు… ప్రతిపాదనలతో వచ్చిన కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఈ మేరకు రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేలా వివిధ కంపెనీలు ముందుకు వచ్చాయి. మొత్తంగా 35 ఎంఓయూలను ఒక్క రోజులోనే ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. ఈ ఎంఓయూలు ద్వారా భారీ పెట్టుబడులు రానున్నాయి. భాగస్వామ్య సదస్సు ప్రారంభానికి ముందు రోజే ఏకంగా రూ.3.65 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.26 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయి. ఇలా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన కంపెనీల్లో రెన్యూ పవర్ వంటి ప్రముఖ సంస్థలు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయి. అప్పటి విధానాలు నచ్చక రాష్ట్రం విడిచి వెళ్లిన సంస్థలను తిరిగి ఏపీకి రప్పించడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. రెండు రోజుల పాటు జరిగే భాగస్వామ్య సదస్సులో సుమారుగా రూ.10 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయనే అంచనాలు ఉన్నాయి. అయితే ఆ సదస్సు కంటే ముందే రూ.3.65 లక్షల కోట్ల పెట్టుబడులు రావడంతో ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లకు రూ.1 కోటి విరాళం చెక్కును బాలాజీ యాక్షన్ బిల్డ్ వేర్ సంస్థ ముఖ్యమంత్రికి అందించింది. *వనరులున్నాయి… కనెక్టివిటీ ఉంది…* భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన వివిధ పరిశ్రమల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహించారు. అలాగే ఎంఓయూలు కుదుర్చుకునేందుకు నిర్వహించిన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..”సీఐఐ సదస్సుకు ముందుగానే ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం చాలా సంతోషకరం. పెట్టుబడులకు ముందుకు వచ్చిన పారిశ్రామిక వేత్తలకు ధన్యవాదాలు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీలో పరిశ్రమలు స్థాపించడానికి వివిధ సంస్థలు ముందుకు వస్తున్నాయి. గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్, బీపీసీఎల్ వంటి భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. దేశం చాలా వేగంగా అభివృద్ది చెందుతోంది. ఆ వేగంలో మనం ముందుడాలి. పెట్టుబడులు సాధించాలి. రాష్ట్రాన్ని పెట్టుబడుల్లో ముందుంచాలి అనేది ప్రభుత్వ ప్రయత్నం. గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రంలో అనేక అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం రూపొందించిన ఎనర్జీ పాలసీ మంచి ఫలితాలను ఇస్తోంది. అందుకే ఇంధన రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఏపీకి 1000 కి.మీ మేర సముద్ర తీరం ఉంది. పోర్టులు, రోడ్లు, రైలు మార్గం వంటి వాటి ద్వారా లాజిస్టిక్స్ రంగానికి ఏపీ కేంద్ర బిందువుగా మారుతుంది. రాష్ట్రంలో అన్ని రంగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉంది… దీన్ని వినియోగించుకోవాలని పారిశ్రామిక వేత్తలను కోరుతున్నా. హార్టికల్చర్, అగ్రికల్చర్, ఆక్వా కల్చర్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అవకాశాలు ఉన్నాయి. స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ వంటి వాటిని ఏర్పాటు చేసుకుంటున్నాం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున మినరల్ వెల్త్ ఉంది. వీటి విలువను మరింత పెంచగలిగే పరిశ్రమలు తెస్తున్నాం. ఒక కుటుంబం ఒక వ్యాపార వేత్త అనే నినాదంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఆలోచనలతో వచ్చే వారికి అవకాశాలు కల్పిస్తాం. ఒప్పందం చేసుకున్న ప్రతి సంస్థకు భూములు కేటాయిస్తున్నాం. పారిశ్రామిక వేత్తలు వేగంగా పనులు గ్రౌండ్ చేయడానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో వెళ్తున్నాం. మా ప్రభుత్వం నుంచి అనుమతులు సహా ఏ విషయంలోనూ జాప్యం ఉండదు”అని ముఖ్యమంత్రి వెల్లడించారు. *పెట్టుబడుల వెల్లువ… ఉద్యోగాల కల్పన…* శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు పెట్టుబడుల సదస్సు ప్రారంభం అవుతుంటే… దాని కంటే ముందు రోజే వివిధ పరిశ్రమలు భారీ ఎత్తున పెట్టుబడులకు సిద్ధమయ్యాయి. రూ.3.65 లక్షల కోట్ల మేర పెట్టుబడులపై ఎంఓయూలు కుదిరాయి. మొత్తంగా 5 రంగాల్లో ఈ పెట్టుబడులు రాగా… ఒక్క ఇంధన రంగం నుంచే రూ.2,64,787 లక్షల కోట్ల పెట్టుబుడులు వచ్చాయి. ఇంధన శాఖ 7 ఎంఓయూలు కుదుర్చుకుని ఈ పెట్టుబడులను రాబట్టింది. ఇంధన రంగంలో వచ్చిన పెట్టుబడుల ద్వారా 49,400 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇక మిగిలిన నాలుగు రంగాల్లో పెట్టుబడులు వచ్చిన విధానం పరిశీలిస్తే… 8 ఒప్పందాల ద్వారా ఏపీ సీఆర్డీఏకు రూ.32,300 కోట్లు, 7800 మందికి ఉద్యోగాలు రానున్నాయి. 4 ఎంఓయూల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి రూ.2319 కోట్ల పెట్టుబడి, 8166 మందికి ఉద్యోగాలకు అవకాశం ఉంది. 3 ఒప్పందాల కుదుర్చుకుని ఐ అండ్ ఐ రంగంలో రూ.12,255 కోట్ల పెట్టుబడులు, 1300 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు వివిధ సంస్థలు ముందుకు వచ్చాయి. మరోవైపు 3 ఎంఓయూల ద్వారా రూ.52,143 కోట్ల పెట్టుబడుల ద్వారా 32,105 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేలా పరిశ్రమలు-వాణిజ్యం రంగం ఆయా సంస్థల నుంచి హామీ పొందింది. *కంపెనీల వివరాలివి…* రాష్ట్ర ప్రభుత్వంతో ఏయే కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.. ఎంత మేర పెట్టుబడులు పెట్టనున్నాయి… ఏ మేరకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాయనే వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి: *ఇంధన రంగం…* • ABC క్లీన్‌టెక్ & ఆక్సిస్ ఎనర్జీ వెంచర్స్ – రూ. 1,10,250 కోట్లు, 13500 మందికి ఉద్యోగాలు • రీన్యూ పవర్-రూ. 25000 కోట్లు, 10000 మందికి ఉద్యోగాలు • రీన్యూ ఇ-ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్-రూ. 17000 కోట్లు, 1100 మందికి ఉద్యోగాలు. • రీన్యూ ప్రైవేట్ లిమిటెడ్-రూ 12500 కోట్లు, 3250 మందికి ఉద్యోగాలు • నవయుగ ఇంజనీరింగ్-రూ. 23427 కోట్లు, 6300 మందికి ఉద్యోగాలు • చింతా గ్రీన్ ఎనర్జీ-రూ. 27955 కోట్లు, 6600 మందికి ఉద్యోగాలు • ఫోర్ స్క్వేర్ గ్రీన్ ఎనర్జీ-రూ. 10205 కోట్లు, 1750 మందికి ఉద్యోగాలు • ఇండోసోల్-రూ. 23450 కోట్లు, 6900 మందికి ఉద్యోగాలు • షిర్డీ సాయి-రూ.15000 కోట్లు, 15400 మందికి ఉద్యోగాలు *పరిశ్రమలు-వాణిజ్య రంగం…* • రెన్యూ ఫొటో వాల్ టైక్స్-రూ. 5451 కోట్లు, 3600 మందికి ఉద్యోగాలు • ఇండోసోల్-రూ. 2200 కోట్లు, 500 మందికి ఉద్యోగాలు • షిర్డీ సాయి-రూ. 5000 కోట్లు, 5000 మందికి ఉద్యోగాలు • వైజాగ్ ప్రొఫైల్స్ లాజిస్టిక్స్-రూ. 6000 కోట్లు, 5250 మందికి ఉద్యోగాలు • స్టీల్ ఎక్సైఛేంజ్ ఇండియా-రూ. 4650 కోట్లు, 5400 మందికి ఉద్యోగాలు • విరూపాక్ష ఆర్గానిక్స్-రూ. 1189 కోట్లు, 2000 మందికి ఉద్యోగాలు • అనంత్ టెక్నాలజీస్-రూ. 1000 కోట్లు, 1000 మందికి ఉద్యోగాలు • ఏటీఆర్ వేర్ హౌసింగ్-రూ. 1100 కోట్లు, 6200 మందికి ఉద్యోగాలు • లారస్ ల్యాబ్స్-రూ. 1000 కోట్లు, 500 మందికి ఉద్యోగాలు • మారుతి ఇస్పాత్ అండ్ పైప్స్-రూ. 1000 కోట్లు, 1800 మందికి ఉద్యోగాలు • ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్-రూ. 1000 కోట్లు, 500 మందికి ఉద్యోగాలు • మల్లాది ఫార్మా-రూ. 353 కోట్లు, 355 మందికి ఉద్యోగాలు • ఈజౌల్-రూ. 19000 కోట్లు, 1800 మందికి ఉద్యోగాలు • కోరమండల్-రూ. 2000 కోట్లు, 500 మందికి ఉద్యోగాలు • తైవాన్ ప్రైవేట్ ఇండస్ట్రీయల్ పార్క్స్-రూ. 1200 కోట్లు, 10000 మందికి ఉద్యోగాలు • జూల్-రూ. 1500 కోట్లు, 1000 మందికి ఉద్యోగాలు *ఏపీ సీఆర్డీఏ…* • మణిపాల్ గ్రూప్-రూ. 15000 కోట్లు, 1000 మందికి ఉద్యోగాలు • బెర్జాయ గ్రూప్-రూ. 8300 కోట్లు • అమరావతి లైఫ్ సైన్సెస్-రూ. 2000 కోట్లు • మైసిటీ-రూ. 2000 కోట్లు • వివెన్స్ గ్రూప్-రూ. 2000 కోట్లు, 5000 మందికి ఉద్యోగాలు • ఫ్యాషన్ ఎంటర్ ప్రెన్యూయర్ ఫండ్-రూ. 1200 కోట్లు, 1200 మందికి ఉద్యోగాలు • ఏస్ అర్బన్ డెవలర్స్-రూ. 1800 కోట్లు, 600 మందికి ఉద్యోగాలు *ఐ అండ్ ఐ…* • క్రౌన్ ఎల్ఎన్జీ-రూ. 10640 కోట్లు • ఆర్సీఆర్టీ-రూ. 1615 కోట్లు, 1300 మందికి ఉద్యోగాలు *ఫుడ్ ప్రాసెసింగ్…* • ఉమెన్ ఓవా అగ్రో ఫుడ్ పార్క్-రూ. 1440 కోట్లు, 7000 మందికి ఉద్యోగాలు • ఐటీసీ ఫుడ్స్-రూ. 400 కోట్లు, 500 మందికి ఉద్యోగాలు • గాడ్రేజ్ అగ్రో వెట్-రూ. 279 కోట్లు, 66 మందికి ఉద్యోగాలు • బిస్లరీ-రూ. 200

విశాఖపట్నం

రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కి ఘణంగా స్వాగతం పలికిన భాజపా శ్రేణులు

రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కి ఘణంగా స్వాగతం పలికిన భాజపా శ్రేణులు *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * తిరుపతి పర్యటన విజయవంతం ముగించుకుని గురువారం మధ్యాహ్నం ఇండిగో విమానంలో విశాఖ వచ్చిన బిజేపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కి ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పరశురాంరాజు , రాష్ట్ర మీడియా పేనలిస్ట్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో విశాఖపట్నం విమానాశ్రయంలో ఆయనకు ఘణంగా స్వాగతం పలికిన బిజేపి నాయకులు దామోదర్ యాదవ్ ,తాతారావు, వెన్నా శ్రీరామమూర్తి,స్టీల్ ప్లాంట్ గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు కేఎస్ఎన్ ,కృష్ణారెడ్డి, శ్రీనివాసరావు బిజేపి కార్యకర్తలు తదితరులు.

విశాఖపట్నం

ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్న ఆంధ్రప్రదేశ్*

*ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్న ఆంధ్రప్రదేశ్* *విశాఖపట్నం,దివ్యదర్శిని న్యూస్*: ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ అని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మరియు గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. రాష్ట్రం వైబ్రంట్ స్టేట్ గా విరాజిల్లుతోందని చెప్పారు. సి ఐ ఐ భాగస్వామ్య సదస్సు ప్రాంగణంలో ఏర్పాట్లను మంత్రి కొలుసు పార్ధ సారధి గురువారం పరిశీలించారు. ఏర్పాట్లు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ సదస్సును విజయవంతంగా నిర్వహించుటకు మంచి ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. రాష్ట్రానికి సి ఐ ఐ భాగస్వామ్య సదస్సు కి ముందు తరవాత అనే రీతిలో అభివృద్ధి జరుగుతోందన్నారు. సమర్ధ వంతమైన నాయకుడు చంద్రబాబు పై నమ్మకంతో పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి వస్తున్నారని పేర్కొన్నారు. వెళ్లి పోయిన పరిశ్రమలు సైతం వెనక్కి వస్తున్నాయని, నారా లోకేశ్ , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషితో తో రాష్ట్రం అభివృద్ది చెందుతోందని చెప్పారు. సుమారు పది లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి వివరించారు. సమావేశానికి ముందే ..కంపెనీల భూమి పూజలు అవుతున్నాయని, గూగుల్, టిసిఎస్ ,లాంటి పెద్ద సంస్థలు విశాఖ లో సంస్థ నెలకొల్పుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 18 నెలల కాలంలో రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తద్వారా 8 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఈ సదస్సులో కనీసం 450 నుండి ఐదు వందల పెట్టుబడి ఒడంబికలు జరగనున్నాయని చెప్పారు. ఈ ఒడంబికలు ద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయని, పెట్టుబడులు లక్షల కోట్లలో రానున్నాయని చెప్పారు. సి ఐ ఐ భాగస్వామ్య సదస్సుకు జాతీయ అంతర్జాతీయ స్థాయి నుండి డెలిగేట్ లు పాల్గొంటున్నారని తెలిపారు. రెండు రోజుల్లో జాతీయ , రాష్ట్ర స్థాయిలో 40 వరకు సెషన్స్ జరగనున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడు ప్రారంభించిన ఇల్లకు కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు. గత ప్రభుత్వం మధ్య లో వదిలేసిన ఇళ్లను కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పారు. మరి కొద్ది నెలల్లో రెండో విడత మరిన్ని ఇళ్లకు గృహప్రవేశం చేస్తామని అన్నారు.

విశాఖపట్నం

ఇటలీ రాయబారితో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ*

*ఇటలీ రాయబారితో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ* *ఇటాలియన్ ఇండస్ట్రీయల్ క్లస్టర్ ఏర్పాటుపై చర్చ* *విశాఖపట్నం,దివ్యదర్శిని న్యూస్:* ఆంధ్రప్రదేశ్ ఇటాలియన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దేశ రాయబారి ఆంటోనియో ఎన్రికో బార్టోలీని కోరారు. విశాఖపట్నంలోని CII భాగస్వామ్య సదస్సు సందర్భంగా వివిధ దేశాల రాయబారులతో సీఎం చంద్రబాబు భేటీ అవుతున్నారు. ఈ భేటీల్లో భాగంగా గురువారం భారతదేశంలోని ఇటలీ రాయబారితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని ముఖ్యమంత్రి బార్టోలీకి వివరించారు. కీలక రంగాలైన ఆటోమోటివ్, ఆటో విడిభాగాలు, యంత్రాల తయారీ, ఇంధన, ఫ్యాషన్, ఆహార శుద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులపై ముఖ్యమంత్రి-ఇటలీ రాయబారి మధ్య చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ యంత్రాలు, పునరుత్పాదక విద్యుత్ రంగం, నౌకానిర్మాణ రంగాలలో భాగస్వాములు కావాలని ఇటాలియన్ కంపెనీలను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఏపీ-ఇటలీ మధ్య దీర్ఘకాలిక వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఇటాలియన్ ఇండస్ట్రీయల్ క్లస్టర్ ను ఏర్పాటు చేసే అంశంపై సీఎం చంద్రబాబు-ఇటలీ రాయబారి బార్టోలీ మధ్య చర్చలు జరిగాయి.

విశాఖపట్నం

పర్యాటకానికి చిరునామా విశాఖ

పర్యాటకానికి చిరునామా విశాఖ *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- * గురువారం సాయంత్రం రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేశ్ గారు TU 142 యుద్ద విమాన మ్యూజియం, అదే ఆవరణలో నూతనముగా ఏర్పాటుచేసిన *”మాయా వరల్డ్”* లను సందర్శించారు. తదుపరి మంత్రి వర్యులు శ్రీ కందుల దుర్గేశ్ గారు, VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు ఇరువురు ఇటీవలే ప్రారంభించిన హెలికాప్టర్ మ్యూజియం ను సందర్శించారు. ఈ సందర్భంగా హేలీ మ్యూజియం వివరాలను మంత్రికి VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు వివరించారు. విశాఖ కి వచ్చే పర్యాటకులను, సందర్శకులను ఆకర్షించేలా హేలీ మ్యూజియం ను అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు. అలానే కైలాసగిరి పై త్రిశూల్ ప్రాజెక్ట్ ను వచ్చే శివరాత్రి నాటికి అందుబాటులో కి తీసుకువస్తామని, దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జి ను కూడా త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. విశాఖ అంటే పర్యాటకానికి చిరునామా గా తీర్చిదిద్దుతామని మంత్రికి వివరించారు. పర్యాటకులను ఆకర్షించేలా పలు ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకువచ్చిన VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారిని పర్యాటక శాఖ మంత్రి వర్యులు శ్రీ కందుల దుర్గేశ్ గారు అభినందలు తెలిపి, ప్రశంసించారు. తదనంతరం మంత్రివర్యులు శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో VMRDA కి చెందిన అధికారులు, సిబ్బంది, *మాయా వరల్డ్* ప్రతినిధి రమణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

సి ఐ ఐ సమ్మిట్ ని స్వాగతిస్తున్నాం : ప్రియాంక దండి*

*సి ఐ ఐ సమ్మిట్ ని స్వాగతిస్తున్నాం : ప్రియాంక దండి* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* శుక్రవారం, శనివారం విశాఖలో జరగబోయే సి ఐ ఐ సమ్మిట్ ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి ప్రకటన విడుదల చేసారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సులో సుమారు 9.5 లక్షల కోట్లు పెట్టుబడులకు ఒప్పందం జరగవచ్చని అంచనాలు ఉన్నాయని, ఆచరణలోకి వస్తే రాష్ట్ర అర్థిక పరిస్థితి మెరుగు పడుతుందని, ఎదరికో ఉపాధి అవకాశాలు వస్తాయని, ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు ఐ టీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషిని అభినందిస్తున్నామని ప్రియాంక అన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.