Saturday, 21 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

పామూరులో ఆటోల సీజ్

పామూరు : పామూరులో సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం ఆటోలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పత్రాలు సరిగా లేని 13 వాహనాలను సీజ్ చేశారు. ధ్రువపత్రాలు లేని వాటికి జరిమానాలు విధించారు. ప్రజల భద్రత కోసం రోడ్డు ప్రమాదాలు నివారించేదుకు ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని సీఐ తెలిపారు.

అన్నమయ్య

నందలూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి కృషి — రాచూరి మురళి భేటీ

సికింద్రాబాద్ రైల్వే నిలయంలో అన్నమయ్య జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సూచనల మేరకు నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏ. శ్రీధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంలో రాచూరి మురళి నందలూరు రైల్వే స్టేషన్‌కు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలను చర్చించారు.ముఖ్యంగా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మరియు చెన్నై–ముంబై ట్రైన్‌లను నందలూరులో నిలుపుదల చేయవలసినదిగా కోరడమైనది.అలాగే నందలూరు రైల్వే స్టేషన్ సమీపంలో చెయ్యేరు నది ఉండటం వలన అక్కడ శుభ్రమైన నీరు అన్ని కాలాల్లో లభ్యమవుతోందని, అందువలన ట్రైన్లకు వాటరింగ్ సదుపాయం నందలూరులో ఏర్పాటు చేయాలని కోరారు.రైల్వేకు చెందిన వందల ఎకరాల స్థలం నిరుపయోగంగా ఉందని,ఆ భూమిని రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ(ఆర్ ఎల్,డి,ఏ) పద్ధతిలో అభివృద్ధి చేయాలని సూచించారు.అలాగే రైల్వే రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థులు,వృద్ధులు మరియు మండల ప్రజలు హైదరాబాద్, చెన్నై వైపు రైలు మార్గంలో ప్రయాణించేందుకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి,శబరి యాత్రికుల కోసం నందలూరులో ప్రత్యేక ట్రైన్ స్టాపేజీ ఇవ్వాలని కూడా అభ్యర్థించారు.దీనికి స్పందించిన చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శ్రీధర్ త్వరలోనే ట్రైన్ స్టాపేజీలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని,శబరి స్పెషల్ ట్రైన్‌ల రెండవ విడత స్టాపేజీల జాబితాలో నందలూరు పేరు తప్పక పొందుపరుస్తామని హామీ ఇచ్చారు.మిగిలిన రైల్వే అభివృద్ధి అంశాలు కూడా అత్యున్నత అధికారుల సమగ్ర కమిటీ సమావేశంలో పరిగణలోకి తీసుకుంటామని ఆయన తెలిపారు.

నాగర్‌కర్నూల్

గుండెపోటుతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి మృతి*

*గుండెపోటుతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి మృతి* జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అన్వర్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.కాగా మరి కాసేపట్లో ఫలితాలు వెలువడనున్న క్రమంలో అన్వర్ మృతి చెందడం కలకలం రేపింది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతోంది. కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియంలో ఎన్నికల ఫలితాల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుతంగా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను హైదరాబాద్లోని కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియంలో నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం ఒక వరుసకు 21 టేబుళ్ల చొప్పున మొత్తం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఫలితాలను 10 రౌండ్లలో లెక్కించనున్నారు. ఒక్కో రౌండ్కు సుమారు 40 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉందని, ఈ లెక్కన మధ్యాహ్నం 2 గంటలకల్లా తుది ఫలితం వెలువడే అవకాశం ఉందని జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం 186 మంది సిబ్బందిని నియమించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి టేబుల్కు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. అప్డేట్స్ను ఎల్ఈడీ స్క్రీన్లు, ఈసీ యాప్ ద్వారా అందుబాటులో ఉంచుతామన్నారు. కౌంటింగ్ సెంటర్లోకి అభ్యర్థులు, వారి ఎన్నికల ప్రతినిధులు, అనుమతిచ్చిన కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇతరులెవరికీ అనుమతి ఉండదని చెప్పారు. కౌంటింగ్ సెంటర్ పరిసరాల్లో సెక్షన్ 144 అమలులో ఉంటుందని, ఉల్లంఘనలపై చర్యలు తప్పవని సీఈవో హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్

ప్రకాశం: రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప భక్తుడి మృతి

ప్రకాశం జిల్లా పామూరు మండలం ఇనిమెర్ల ఎస్సీ పాలెం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఆటో ఢీకొట్టింది. పామూరు పట్టణంలోని ఆకుల వీధికి చెందిన అయ్యప్ప మాల ధరించిన చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటోలో ఉన్న మరికొందరికి గాయాలైనట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

E-పేపర్

ముక్కా రూపానంద రెడ్డి సతీమణి శ్రీమతి ముక్కా వరలక్ష్మి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన పాటూరు శ్రీనివాసుల రెడ్డి.

ముక్కా రూపానంద రెడ్డి సతీమణి శ్రీమతి ముక్కా వరలక్ష్మి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన పాటూరు శ్రీనివాసుల రెడ్డి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 14 పున్నమి న్యూస్ ప్రతినిధి (సింగమాల వెంకటేష్): రైల్వే కోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కడప అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ముక్కారూపానందరెడ్డి సతీమణి శ్రీమతి ముక్క వరలక్ష్మి పుట్టినరోజు పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాటూరు శ్రీనివాసుల రెడ్డి ముక్క వరలక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సహృదయులు, మానవతామూర్తి, దయాగుణం, కరుణ, సేవాగుణం కలిగిన ముక్క వరలక్ష్మి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ సర్వేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఆమెపై కలిగి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పాటూరు శ్రీనివాసులు రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు .

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జన్మదిన శుభాకాంక్షలు కావ్య కృష్ణారెడ్డి గారు

నాగలి పట్టిన నాడు *రైతువి*.. కలము పట్టిన రోజు *ఉపాధ్యాయుడివి*.. పేదల నాడి పట్టి నేడు మా *శాసనసభ్యుడవి*.. అమావాస్యకు *ఆదరలేదు* .. పౌర్ణమి *పొంగలేదు*..కటువైన నీ *మాట కడవైతే* స్వచ్ఛమైన నీ మనస్సు *గంగి గోవు పాలయే*.. కడవలోని పాలను *కాపాడే కృష్ణుడా*.. కావలి *కావ్యం(భును) కనకపట్నంభుగా* మార్చ కథనరంగమున దిగిన *కావ్య కృష్ణుడా*.. లేదు నీకు సాటి.. సమీపమున లేదు నీకు పోటీ.. *కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.. గురు రాఘవేంద్ర స్వామి కరుణాకటాక్షాలు ఎల్లవేళలా మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్సా వాచ్ఛా కర్మణా ఆ దేవదేవుని ప్రార్థిస్తూ..* మీ యేలేశం నరోత్తం రెడ్డి వింజమూర్ తెలుగు యువత

అన్నమయ్య

చిట్వేలి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో శిబిరం – విద్యార్థులకు పరీక్షలు చేసిన ఆప్తలామిక్ అధికారి

చిట్వేలి మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో విద్యార్థినుల కోసం గురువారం ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. చిట్వేలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వైద్యుడు డాక్టర్ మహమ్మద్ అన్సారి ఆధ్వర్యంలో ఈ శిబిరం జరిగింది. ఆప్తలామిక్ అధికారి ఓబులేసు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి, కంటి సమస్యలున్న వారికి తగిన సూచనలు, సలహాలు అందించారు.కంటి చూపులో లోపాలు ఉన్న విద్యార్థులను గుర్తించి, వారికి అవసరమైన చికిత్స లేదా కళ్లద్దాలు అందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వైద్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపాల్ తులసి, హెల్త్ ఆఫీసర్ విజయ్ కుమార్, హెచ్.పి. యా భాను, ఏ.ఎన్.ఏ. ఫరీదా సహా పలువురు ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణ కోసం ఇలాంటి శిబిరాలు తరచూ నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉచితంగనే సాధరం స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్: సత్య కుమార్ యాదవ్

ధివ్యాంగుల పింఛన్ కోసం రేపటి నుంచి సాధారం సర్టిఫికెట్ ప్రారంభించబడుతుంది అని మంత్రి సత్య కుమార్ యాదవ్ గారు పేర్కొన్నారు.ఈపాటికే స్లాట్ బుక్ చేసుకున్న 10 వేల మందికి ప్రధాన్యత ఇస్తమానరు. ధివ్యాంగుల అర్ధ పరిస్ధిని పరిగణలోకి తీసుకొని స్లాట్ బుకింగ్ కి,ముద్రనకి వునా40రూపైలా చోపున వున ఫీజు నే రాదు చేసినటు చెపారు.సదరం సర్టిఫికెట్లు అధరంగానే కొత పింఛన్లు అధికారులు మంజూరు చేస్తారు.

రంగారెడ్డి

కమ్యూనిటీ పారామెడికల్ వైద్యుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో DMHO కు సన్మానం

పున్నమి: నవంబర్ 13 రంగారెడ్డి జిల్లా: తెలంగాణ కమ్యూనిటీ పరామెడికల్ వైద్యుల ఐక్యవేదిక రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా రంగారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ లలితా దేవిని మర్యాదపూర్వకంగా గురువారం రోజున కలిసి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కమ్యూనిటీ పారామెడికల్ వైద్యుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఉక్కుల అశోక్ రంగారెడ్డి జిల్లా నాయకులు సయ్యద్ అబ్దుల్ ఖావి ,సరిత గౌడ్, అశోక్ కుమార్, అనిల్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఉప్పుల అశోక్ మాట్లాడుతూ ఆర్.ఎం.పి పిఎంపి వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితా దేవిని కోరారు. సాధ్యమైనంత తొందరలో ఆర్ఎంపిపీ ఎంపీ ఇలా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తానని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితాదేవి తెలిపారు.

విశాఖపట్నం

యువత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలి*

*యువత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలి* విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- *ఏపీ, దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలి* *ఆంధ్రప్రదేశ్ ను కాలిఫోర్నియా ఆఫ్ ఈస్ట్ గా తీర్చిదిద్దుతాం* *యువత భాగస్వామ్యంతోనే భారతదేశం నెం.1 ఎకానమీగా రూపుదిద్దుకుంటుంది* *విశాఖపట్నానికి యువతే బ్రాండ్ అంబాసిడర్లు* *ఐటీ కంపెనీలకు భూమి పూజ అనంతరం ఉద్యోగులతో మంత్రి నారా లోకేష్* విశాఖపట్నం: ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోందని.. వచ్చిన అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విశాఖపట్నం ఐటీ హిల్స్ లో పలు ఐటీ కంపెనీలకు భూమి పూజ అనంతరం అక్కడి ఐటీ ఉద్యోగులతో లోకేష్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి లోకేష్ ప్రసంగిస్తూ.. అందరూ విశాఖ వైపు చూస్తున్నారు. వచ్చిన అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి. ఏపీ, ఇండియా గర్వపడే విధంగా చేయాలి. ఏపీని కాల్నిఫోర్నియా ఆఫ్ ఈస్ట్ గా తీర్చిదిద్దుతాం. ఈ ప్రయాణంలో మీరందరూ భాగస్వామ్యం కావాలి. హైదరాబాద్ ఈ స్థాయికి రావడానికి 35 ఏళ్ల సమయం పడితే విశాఖ అభివృద్ధికి పదేళ్లు చాలు. మేం అందరం చాలా కష్టపడుతున్నాం. చాలా మంది రాజకీయ నాయకులకు ఒక్క అవకాశమే వస్తుంది. మాకు విశాఖ, అమరావతిని అభివృద్ధి చేసేందుకు రెండు అవకాశాలు లభించాయి. మున్ముందు విశాఖకు అనేక కంపెనీలు తరలివస్తాయి. *యువత భాగస్వామ్యంతోనే భారతదేశం నెం.1 ఎకానమీగా రూపుదిద్దుకుంటుంది* యువత రాష్ట్రంతో పాటు దేశం గర్వపడే విధంగా చేయాలి. ప్రపంచం వికసిత్ భారత్ కోసం పీఎం నరేంద్ర మోదీ గారు విశేషంగా కృషిచేస్తున్నారు. మోదీ గారి నేతృత్వంలో ప్రపంచంలో ఇండియా నెం.1 ఎకానమీగా రూపుదిద్దుకుంటుంది. దానికి కారణం మీ లాంటి యువతే. విశాఖను ఐటీ కేంద్రగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోంది. వచ్చే పదిహేనేళ్లు మనవే. మన లక్ష్యాన్ని సాధించాలంటే, మనం నమ్ముతున్న అభివృద్ధిని నిజం చేయాలంటే, భారతదేశం నెం.1 ఎకానమీగా ఎదగాలంటే మనలో ప్రతి ఒక్కరికీ ఆ కసి ఉండాలి. ప్రతి ఒక్కరం ఎంతో కష్టపడి పనిచేయాలి. ఆంధ్రప్రదేశ్ కు, భారతదేశానికి గర్వకారణంగా నిలవాలి. అందరూ విశాఖపట్నం బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలి. మీలో ప్రతి ఒక్కరూ మీ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించాలి. ఇక్కడికి వచ్చే తెలుగు ప్రజలు, భారతీయులు…. ఈ అద్భుతమైన కొత్త కంపెనీల్లో పనిచేయబోతున్న వారందరినీ ఆత్మీయంగా స్వాగతించాలి. విశాఖపట్నం పరిశుభ్రంగా, పచ్చగా ఉండాలి. మన నగరం దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలవాలి. దానికోసం మన వంతు కృషి చేయాలన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.