Saturday, 21 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పిల్లల అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు! బోగినేని కాశీరావు

ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం చిన్నక్రాక లో జనసేన పార్టీ తరుపున గుండబతిన రామమూర్తి, తేలప్రోలు రమేష్ గారి ఆధ్వర్యంలో జరిపిన బాలల దినోత్సవ కార్యక్రమంలో జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ సభ్యులు బోగినేని కాశీరావు, ఉపాధ్యాయులతో కలిసి పిల్లల అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి ఈ రోజు అవశ్యకతను వారికి వివరించి అందరికీ నోటు బుక్కులు, చాక్లెట్స్ , పెన్, పెన్సిల్, బిస్కట్ లు పంచి, పిల్లల అందరూ జీవితంలో ఏం సాధించాలో ఒక లక్ష్యము పెట్టుకొని, ఆ లక్ష్యం సాధించే విధంగా కృషి చేయాలని పిల్లల కు సూచించారు. అలాగే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మాటలను జవదాటకుండా క్రమశిక్షణతో నడుచుకోవాలని ఆకాంక్షించారు.. పిల్లలే దేశ భవిష్యత్తు అని, వారిని జాగ్రత్తగా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన చెప్పారు.. మంచి విద్యను పిల్లలకు అందించడం మనందరి బాధ్యత. భవిష్యత్తులో దేశానికి మంచి పౌరులుగా ఎదగాలని కోరుకుంటున్నాను అని ఆకాంక్షించారు.. ఈ కార్యక్రమం లో జలదంకి మండలం దాసరి అగ్రహారం చెరువు వైస్ చైర్మన్ మాధవరావు, పసుపులేటి వెంకటేశ్వర్లు, మురళి, జనసేన నాయకుడు బోగినేని కాశి రత్తయ్య, సీతారామపురం ఊర చెరువు అధ్యక్షుడు నీలి రత్నయ్య, సీతారామపురం సొసైటీ డైరెక్టర్ లు గొల్లపల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు

*గుంటూరు:ఈరోజు మధ్యాహ్నం తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నందు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు అనంతరం కోడూరు నియోజకవర్గం లో జరుగుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మరియు నిన్నటి రోజున విజయవంతమైన ర్యాలీ గురించి అడిగి తెలుసుకుని వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి& నియోజకవర్గ ఇన్చార్జ్&మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ని అభినందించిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి .

E-పేపర్

అంగన్వాడీ కేంద్రానికి సీలింగ్ ఫ్యాన్ వితరణ గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ ట్రస్ట్ చైర్మన్ పార్థసారధి,

అంగన్వాడీ కేంద్రానికి సీలింగ్ ఫ్యాన్ వితరణ గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ ట్రస్ట్ చైర్మన్ పార్థసారధి, రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి బాలల దినోత్సవం సందర్బంగా రైల్వే కోడూరు గ్రామ పంచాయితీ కార్యాలయం నందు జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న కాకుమూరి నరసింహులు ఆర్థిక సహకారంతో రైల్వేకోడూరు పట్టణ పరిధిలోని తోటిళ్లు అంగన్వాడీ కేంద్రానికి సీలింగ్ ఫ్యాన్ ను ట్రస్ట్ చైర్మన్ కె.పార్థసారధి అందజేశారు. పిల్లల వసతి కొరకు అభ్యర్థించగా వెంటనే స్పందించి సీలింగ్ ఫ్యాన్ అందించినందుకు దాత కాకుమూరి నరసింహులు కు ట్రస్ట్ చైర్మన్ పార్థసారధి, అంగన్వాడీ కార్యకర్త డి. కాత్యాయని, సహాయకురాలు ప్రభావతి, ప్రజలు, పిల్లలు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బాలల దినోత్సవం సందర్బంగా పిల్లలకు స్వీట్స్ అందజేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

భద్రతే ప్రథమం! నెల్లూరులో విస్తృత పోలీస్ తనిఖీలు ప్రారంభం

నెల్లూరు , నవంబర్ (పున్నమి ప్రతినిధి) ఢిల్లీ దాడుల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా యస్.పి. డా. అజిత్ వేజెండ్ల తెలిపారు. యస్.పి. ఆదేశాల మేరకు అన్ని స్టేషన్ల పరిధిలో బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, పబ్లిక్ ప్రదేశాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలియని వ్యక్తులిచ్చే బ్యాగులు, కవర్లు స్వీకరించవద్దని, ఏదైనా అనుమానం ఉన్నా ఆందోళన చెందకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే భద్రత మరింత బలపడుతుందని యస్.పి. గారు వెల్లడించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, వస్తువులు గమనించిన వెంటనే 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సాంకేతిక నిఘాతో నేరాలపై కఠిన చర్యలు

నెల్లూరు , నవంబర్ (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లాలో నేరాల నియంత్రణకు డ్రోన్ నిఘాను విస్తృతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా యస్.పి. డా. అజిత్ వేజెండ్ల తెలిపారు. యస్.పి. ఆదేశాలతో, ఎడిషనల్ యస్.పి. మరియు సంబంధిత డి.ఎస్.పి.ల పర్యవేక్షణలో పట్టణం, శివారు, నిర్మానుష్య ప్రదేశాలలో ఉదయం, సాయంత్రం, రాత్రి నిర్దిష్ట సమయాల్లో డ్రోన్ నిఘా కొనసాగుతోంది. ఓపెన్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, మద్యం సేవనం, గంజాయి వినియోగం, పేకాట, ఈవ్ టీజింగ్, చైన్‌ స్నాచింగ్ వంటి నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఓవర్ స్పీడ్, త్రిబుల్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్‌లను కూడా డ్రోన్ ద్వారా గుర్తిస్తున్నారు. నేరాలకు ఆస్కారం ఉన్న పాడుబడ్డ భవనాలు, తోటలు, పార్కులు, నదీ తీరాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా డయల్ 112 లేదా 1972 కు సమాచారమివ్వాలని పోలీసులు ప్రజలను కోరారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అప్పనపల్లి మోడల్ ప్రైమరీ పాఠశాలలో ఉత్సాహభరితంగా బాలల దినోత్సవ వేడుకలు

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా : ఈరోజు అప్పనపల్లి మండల ప్రజా పరిషత్ మోడల్ ప్రైమరీ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ఆనందోత్సాహాలతో ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని స్కూల్ ప్రాంగణాన్ని సందడి చేశారు. విద్యార్థులు తమ ప్రతిభను రంగరించిన ఈ వేడుకలో, పాఠశాల ఉపాధ్యాయులు, నిర్వాహకులు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రఘు రామయ్య గారు, బాలెం రామకృష్ణ గారు, బాలెం పెద్ది రాజు గారు, షబ్బీర్ హుస్సేన్ గారు, అనంతలక్ష్మి గారు పాల్గొని విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు. పిల్లలలో ఉన్న ప్రతిభను వెలికితీసే ఉద్దేశ్యంతో నిర్వహించిన వివిధ ఆటల పోటీలు, ప్రతిభా కార్యక్రమాలలో విజయం సాధించిన వారికి మొదటి, రెండో, మూడో బహుమతులు అందజేశారు. ప్రత్యేకంగా, నాల్గో తరగతి విద్యార్థులకు ఎఫ్ఏ–2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను వేదికపై సత్కరించి బహుమతులు ప్రదానం చేయడం ఈ కార్యక్రమానికి మరింత విశిష్టతను తీసుకువచ్చింది. చదువులోనూ, ఆటల్లోనూ రాణించాలనే ఉత్సాహాన్ని పిల్లల్లో నింపుతూ, ఈ వేడుకను పాఠశాల ఆనందవాతావరణంతో విజయవంతంగా పూర్తి చేసింది.

E-పేపర్

అంగన్వాడీ కేంద్రానికి సీలింగ్ ఫ్యాన్ వితరణ ఇచ్చిన కే పార్థసారధి

*అంగన్వాడీ కేంద్రానికి సీలింగ్ ఫ్యాన్ వితరణ ఇచ్చిన కే పార్థసారథి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నవంబర్ 14 (పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ ) పట్టణ ంలోని గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్బంగా రైల్వే కోడూరు గ్రామ పంచాయితీ కార్యాలయం నందు జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న కాకుమూరి నరసింహులు ఆర్థిక సహకారంతో రైల్వే కోడూరు పట్టణ పరిధిలోని తోటిళ్లు అంగన్వాడీ కేంద్రానికి సీలింగ్ ఫ్యాన్ ను ట్రస్ట్ చైర్మన్ కె.పార్థసారధి అందజేశారు. పిల్లల వసతి కొరకు అభ్యర్థించగా వెంటనే స్పందించి సీలింగ్ ఫ్యాన్ అందించినందుకు దాత కాకుమూరి నరసింహులు కు ట్రస్ట్ చైర్మన్ పార్థసారధి, అంగన్వాడీ కార్యకర్త డి. కాత్యాయని, సహాయకురాలు ప్రభావతి, ప్రజలు, పిల్లలు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బాలల దినోత్సవం సందర్బంగా పిల్లలకు స్వీట్స్ అందజేశారు.

తెలంగాణ

జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో సమావేశమైన : ర్యాగింగ్ వ్యతిరేక జిల్లా స్థాయి కమిటీ

నకిరేకల్ :నవంబర్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల ర్యాగింగ్ వ్యతిరేక జిల్లా స్థాయి కమిటీ శుక్రవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధ్యక్షతన సమావేశమై, ఇటీవల ప్రభుత్వ వైద్య కళాశాలలో సంభవించిన ర్యాగింగ్ సంఘటనపై చర్చించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సమావేశంలో నిర్ణయించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, మరియు ఇతర అధికారులు హాజరయ్యారు.

జోగులాంబ గద్వాల

అయిజ పట్టణంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినఆలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు గారు

*🌽 రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను* అయిజ పట్టణంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినఆలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు గారు జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలోని అయిజ పట్టణంలో సింగిల్ విండో కార్యాలయం నందు మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని నేడు *ఆలంపూర్ ఎమ్మెల్యే శ్రీ విజయుడు గారు, మార్కెట్ యార్డు చైర్మన్ దొడ్డప్ప గారు, సింగిల్ విండో అధ్యక్షుడు పోతుల మధుసూదన్ రెడ్డి గారు* సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల ప్రయోజనార్థం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు తమ పంటలను మధ్యవర్తుల ద్వారా కాకుండా నేరుగా మార్కెట్ యార్డుల్లో విక్రయించి తగిన మద్దతు ధర పొందాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కొనుగోలు వ్యవస్థ రైతులకు రక్షణగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎక్లాస్‌పురం నరసింహారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మాల నర్సింహులు, బ్రహ్మయ్య, సిద్దిరామప్ప, జంబయ్య, గజ్జి దేవరాజ్,యోబు, చాకలి హుస్సేన్, మురళీ, నెస వెంకటేష్, గడిగే రమణ, లెనిన్ బాబు, అంజి,రియల్ ఎస్టేట్ శివ, వీరేష్, రాజ గోపాల్,రవి, నరేష్, మహేష్, అల్తాఫా తదితరులు పాల్గొన్నారు

హనుమకొండ

పేద ప్రజల పాలిట వరంగా ముఖ్యమంత్రి సహాయ నిధి

*పేదల ప్రజల పాలిట వరంగా ముఖ్యమంత్రి సహాయనిధి…* *బాధిత కుటుంబానికి రూ.2,50,000/-ల LOC కాపీనీ అందజేసిన ఎమ్మెల్యే నాగరాజు గారు..* *ఆపధకాలంలో అండగా నిలిచిన ఎమ్మెల్యే నాగరాజు గారికి కృతజ్ఞతలు తెలిపిన గజ్జెలి నిరోషా కుటుంబ సభ్యులు..* హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నందు నేడు హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పరిధిలోని నందనం గ్రామానికి చెందిన గజ్జెల్లి నిరోషా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న క్రమంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్ఓసి నుంచి రూ.2,50,000 (2లక్షల 50 వేల రూపాయలు) ఎల్ఓసి కాపీనీ గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు *శ్రీ కేఆర్ నాగరాజు* గారు ప్రత్యేక చొరతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి లో చికిత్స కోసం గజ్జెల్లి నిరోషా కుటుంబ సభ్యులకు LOC కాపీనీ అందజేశారు…. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుపేదలకు వైద్య విషయంలో అన్ని విధాలుగా అండగా ఉంటుందని, స్థానిక శాసనసభ్యుడిగా నా దృష్టికి వచ్చిన అనారోగ్య సమస్యల పట్ల నా వంతు సహాయ సహకారం అందించే కృషి చేస్తానని తెలిపారు… నా వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలందరికి విజ్ఞప్తి లక్షల రూపాయలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆసుపత్రిల దోపిడికి గురై అప్పుల పాలు కావద్దు విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వ నిమ్స్ హాస్పిటల్ వెళ్లి నేను ఇచ్చే ఎల్వోసీ ద్వారా ఉచిత చికిత్స పొందాలనీ ఈ సందర్భంగా ప్రజలకు ఎమ్మెల్యే నాగరాజు గారు విజ్ఞప్తి చేశారు… ఈ సందర్బంగా గజ్జెల్లి నిరోషా గారి కుటుంబ సభ్యులు గారు ఎమ్మెల్యే నాగరాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి, తమ కృతజ్ఞత భావాన్ని చాటుకున్నారు…..

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.