Saturday, 21 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతులు

దాళ్వా పంటకు నీరు ఇవ్వాలంటూ పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం పెందురులో రైతుల ఆందోళన రైతులతో పాటు ఆందోళనకు దిగిన రైతు సంఘాలు రైతుల ఆందోళనను అడ్డుకున్న పోలీసులు రైతులకు, పోలీసులకు మధ్య తీవ్రవాగ్వాదం తో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం ఎన్నికల్లో రెండో పంటకు నీరిస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు ఇచ్చిన హామీని నెరవేర్చాలని రైతులు డిమాండ్

ఎన్ టి ఆర్ జిల్లా

బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సామినేని విమలభాను

బాలల దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను సతీమణి, విమలభాను ఫౌండేషన్ చైర్మన్ సామినేని విమలభాను విద్యార్థు లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె జగ్గయ్యపేట నియోజక వర్గంలోని వత్సవాయి మండలం, మక్కపేటలో ఉన్న సాయి సెంచరీ హై స్కూల్‌లో జరిగిన బాలల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. విమానభాను మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయా ల్సిన బాధ్యత కలిగి ఉంటారని పేర్కొన్నారు. భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌ లాల్ నెహ్రూ కు పిల్లలంటే ఉన్న అనురక్తి కారణంగా ఆయన జయంతిని దేశవ్యాప్తంగా బాలల దినోత్సవంగా నిర్వహిస్తా మని తెలిపారు. అటువంటి మహనీయుల్ని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. నేటి కాలంలో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఎక్కువగా ఉన్నందున దానిని సద్విని యోగం చేసుకుని సమాజ అభివృద్ధికి చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు.

E-పేపర్

చిల్డ్రన్స్ డే సందర్భంగా ఉర్దూ పాఠశాలలో స్వీట్స్ పంపిణీ చేసిన కొప్పల శంకరయ్య

చిల్డ్రన్స్ డే సందర్భంగా ఉర్దూ పాఠశాలలో స్వీట్స్ పంపిణీ చేసిన కొప్పల శంకరయ్య రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు పట్టణంలోని ప్రధాన రహదారి సమీపంలో ఉన్న ఉర్దూ పాఠశాల నందు వైసిపి సీనియర్ నాయకులు కొప్పల శంకరయ్య ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే పురస్కరించుకొని స్వీట్స్ పంపిణీ చేశారు .ఈ సందర్భంగా కొప్పల శంకరయ్య చిన్నారులను ఉద్దేశించి మాట్లాడుతూ నెహ్రూ అడుగుజాడల్లో యువత, చిన్నారులు నడవాలని దేశ భవిష్యత్తు కోసం పెద్దలు చూపిన అడుగుజాడలను ఎంచుకోవాలని చిన్నారులకు పిలుపునిచ్చారు అనంతరం పాఠశాలలో ఉన్న అందరికీ స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మందల పవన్ సాయి, చెన్నంశెట్టి పురుషోత్తం, కొర్లకుంట శంకర తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

యువ నాయకుడు ప్రశాంత్‌ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా

జగ్గయ్యపేట ఎన్టీఆర్‌ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను, విమలభాను దంపతుల కుమారుడు, యువ నాయకుడు సామినేని ప్రశాంత్‌ బాబు జన్మదిన వేడుకలు బుధవారం పట్టణంలోని వారి స్వగృహంలో జరిగింది. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేక్‌ను ఉదయభాను, విమలభాను దంపతులతో కలిసి నేతలు కట్‌ చేయించారు. అనంతరం ప్రశాంత్‌ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదే సందర్భంగా విమలభాను ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జగ్గయ్యపేట ఆనంద సాయి ఆలయంలో ఫౌండేషన్‌ చైర్మన్‌ సామినేని విమలభాను ప్రత్యేక పూజలు చేశారు. తరువాత నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో స్వయంగా పాల్గొని భక్తులకు వడ్డించారు.

గూడూరు

ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రంథాలయ వారోత్సవాలు

ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ లైబ్రరీ ఆధ్వర్యంలో గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సింహాద్రి మాట్లాడుతూ భారతదేశంలో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేసిన ఎస్.ఆర్. రంగనాథన్ కృషిని సేవలను గుర్తు చేసుకుంటూ గ్రంథాలయ వారోత్సవాలు సాధారణంగా స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా నవంబర్ 14 నుండి 20 వరకు జరుగుతాయని, వారోత్సవాలు గ్రంథాలయాల ప్రాముఖ్యతను, వాటిలో పుస్తక పఠనం యొక్క ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి సహాయపడతాయని విద్యార్థిని విద్యార్థులు కళాశాల ఆవరణంలో ఉన్న లైబ్రరీని సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, లైబ్రేరియన్ డాక్టర్ పి. విజయ మహేష్, ఫిజికల్ డైరెక్టర్ పి. నారాయణ రాజు, అధ్యాపకులు డాక్టర్ కే. శివ ప్రసాద్, డాక్టర్ గోవింద్ సురేంద్ర, శ్రీధర్ శర్మ, భీమవరపు లక్ష్మి, డాక్టర్ ఝాన్సీ వాణి, కృపా కరుణ వాణి, డాక్టర్ శైలజ, డాక్టర్ బి. పీర్ కుమార్, రవి రాజు, గోపాల్, రమేష్, శైలజ, శ్రీలత, పద్మమ్మ, తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

జనగాం

ZPHS ఏడునూతులలో ఘనంగా – చిల్డ్రెన్స్ డే వేడుకలు

పున్నమి ప్రతినిధి: నవంబర్ 14, జనగాం: ZPHS ఏడునూతుల పాఠశాలలో చిల్డ్రెన్స్ డే వేడుకలు ఆనందోత్సాహాలతో, సాంస్కృతిక వైభవంతో ఘనంగా జరిగాయి. పాఠశాల సంప్రదాయానికి అనుగుణంగా కార్యక్రమాలు విలువలతో, శ్రద్ధతో నిర్వహించబడ్డాయి. విద్యార్థులు స్పీచెస్, సింగింగ్, యాంకరింగ్, డ్రామా స్కిట్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఇంకా అనేక ఆకర్షణీయ కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను మెరిపించారు. ప్రతి ప్రదర్శనలో పిల్లల శ్రమ, ఆత్మవిశ్వాసం, గురువుల మార్గదర్శకత స్పష్టంగా కనిపించింది. Dance Competitions Winners: 🏆 1st Prize: Bolloju Navitha Sree, 10th 🥈 2nd Prize: Somarapu Yamini, 10th 🥉 3rd Prize: Bukka Shiva Kumar, 8th ఈ విజేతలతో పాటు పాల్గొన్న ప్రతి విద్యార్థి కూడా కార్యక్రమం విజయవంతం కావడానికి తమ వంతు పాత్ర పోషించారు. పాఠశాల గురువులు పిల్లలకు మంచి ఆచరణ, క్రమశిక్షణ, లక్ష్య సాధనపై ప్రేరణాత్మక సందేశాలు అందించారు. ప్రధానోపాధ్యాయులు నారబోయిన యాకయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమల్ కుమార్, రాంబాబు, ఈర్య, మమత, సోమేశ్వర్, జి.రజిత, ఎం.రజిత, యాదగిరి, విజయ, కవిత, భాస్కర్, విజయశ్రీ పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పిల్లల అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు! బోగినేని కాశీరావు

ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం చిన్నక్రాక లో జనసేన పార్టీ తరుపున గుండబతిన రామమూర్తి, తేలప్రోలు రమేష్ గారి ఆధ్వర్యంలో జరిపిన బాలల దినోత్సవ కార్యక్రమంలో జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ సభ్యులు బోగినేని కాశీరావు, ఉపాధ్యాయులతో కలిసి పిల్లల అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి ఈ రోజు అవశ్యకతను వారికి వివరించి అందరికీ నోటు బుక్కులు, చాక్లెట్స్ , పెన్, పెన్సిల్, బిస్కట్ లు పంచి, పిల్లల అందరూ జీవితంలో ఏం సాధించాలో ఒక లక్ష్యము పెట్టుకొని, ఆ లక్ష్యం సాధించే విధంగా కృషి చేయాలని పిల్లల కు సూచించారు. అలాగే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మాటలను జవదాటకుండా క్రమశిక్షణతో నడుచుకోవాలని ఆకాంక్షించారు.. పిల్లలే దేశ భవిష్యత్తు అని, వారిని జాగ్రత్తగా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన చెప్పారు.. మంచి విద్యను పిల్లలకు అందించడం మనందరి బాధ్యత. భవిష్యత్తులో దేశానికి మంచి పౌరులుగా ఎదగాలని కోరుకుంటున్నాను అని ఆకాంక్షించారు.. ఈ కార్యక్రమం లో జలదంకి మండలం దాసరి అగ్రహారం చెరువు వైస్ చైర్మన్ మాధవరావు, పసుపులేటి వెంకటేశ్వర్లు, మురళి, జనసేన నాయకుడు బోగినేని కాశి రత్తయ్య, సీతారామపురం ఊర చెరువు అధ్యక్షుడు నీలి రత్నయ్య, సీతారామపురం సొసైటీ డైరెక్టర్ లు గొల్లపల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు

*గుంటూరు:ఈరోజు మధ్యాహ్నం తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నందు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు అనంతరం కోడూరు నియోజకవర్గం లో జరుగుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మరియు నిన్నటి రోజున విజయవంతమైన ర్యాలీ గురించి అడిగి తెలుసుకుని వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి& నియోజకవర్గ ఇన్చార్జ్&మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ని అభినందించిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి .

E-పేపర్

అంగన్వాడీ కేంద్రానికి సీలింగ్ ఫ్యాన్ వితరణ గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ ట్రస్ట్ చైర్మన్ పార్థసారధి,

అంగన్వాడీ కేంద్రానికి సీలింగ్ ఫ్యాన్ వితరణ గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ ట్రస్ట్ చైర్మన్ పార్థసారధి, రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి బాలల దినోత్సవం సందర్బంగా రైల్వే కోడూరు గ్రామ పంచాయితీ కార్యాలయం నందు జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న కాకుమూరి నరసింహులు ఆర్థిక సహకారంతో రైల్వేకోడూరు పట్టణ పరిధిలోని తోటిళ్లు అంగన్వాడీ కేంద్రానికి సీలింగ్ ఫ్యాన్ ను ట్రస్ట్ చైర్మన్ కె.పార్థసారధి అందజేశారు. పిల్లల వసతి కొరకు అభ్యర్థించగా వెంటనే స్పందించి సీలింగ్ ఫ్యాన్ అందించినందుకు దాత కాకుమూరి నరసింహులు కు ట్రస్ట్ చైర్మన్ పార్థసారధి, అంగన్వాడీ కార్యకర్త డి. కాత్యాయని, సహాయకురాలు ప్రభావతి, ప్రజలు, పిల్లలు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బాలల దినోత్సవం సందర్బంగా పిల్లలకు స్వీట్స్ అందజేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

భద్రతే ప్రథమం! నెల్లూరులో విస్తృత పోలీస్ తనిఖీలు ప్రారంభం

నెల్లూరు , నవంబర్ (పున్నమి ప్రతినిధి) ఢిల్లీ దాడుల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా యస్.పి. డా. అజిత్ వేజెండ్ల తెలిపారు. యస్.పి. ఆదేశాల మేరకు అన్ని స్టేషన్ల పరిధిలో బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, పబ్లిక్ ప్రదేశాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలియని వ్యక్తులిచ్చే బ్యాగులు, కవర్లు స్వీకరించవద్దని, ఏదైనా అనుమానం ఉన్నా ఆందోళన చెందకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే భద్రత మరింత బలపడుతుందని యస్.పి. గారు వెల్లడించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, వస్తువులు గమనించిన వెంటనే 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.