Saturday, 21 March 2026

Blog

తెలంగాణ

సింథటిక్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామన్న :జిల్లా కలెక్టర్

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ పట్టణంలోని ఎన్ జి కళాశాల మైదానంలో సింథటిక్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎన్జీ కళాశాల మైదానం నల్గొండకు ఒక మంచి గుర్తింపు అని అన్నారు. నల్గొండ కళాశాల మైదానంలో మంచి క్రీడా సౌకర్యం కల్పించే విషయంలో మున్సిపల్ లేదా జిల్లా యంత్రాంగం నిధులతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

E-పేపర్

భీమొలు గ్రామం గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాడు వెంకటరాజు జన్మదిన వేడుకలు

తూ. గో జిల్లా… గోపాలపురం మండలం పున్నమి ప్రతినిధి ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాడు వెంకటరాజు గారి జన్మదిన వేడుకలు భీమూలు గ్రామంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు దాకారపు అప్పారావు, జనసేన గ్రామ అధ్యక్షులు గండ్రొతు ఉమామహేశ్వరరావు, సీనియర్ తెలుగుదేశం నాయకులు ఎక్సర్పంచ్ గండ్రొతు శ్రీనివాసరావు, కొత్తచెరువు నీటి సంఘం అధ్యక్షులు కోడి సత్యనారాయణ, జనసేన సీనియర్ నాయకులు రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం, వరప్రసాద్,రాంపండు, మోసే, పొలరాజు, రవీంద్ర, మోహన్ రావు, శివ రామకృష్ణ, సత్యనారాయణ పోలరాజు దాసు పండుతెలుగుదేశం మరియు జనసేన నాయకులు ఆధ్వర్యంలో End

రంగారెడ్డి

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుతొ బాలాపూర్ లో సంబరాలు

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 14 : జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడంతో మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ లో స్వీట్లు పంచుకుని సంబరాలలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ఈ సందర్భంగా మాజీ మేయర్ మాట్లాడుతూ గెలుపులో భాగస్వామ్య పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు శుభాకాంక్షలు అలాగే ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్య బద్దంగా జరిగే ఎన్నికల్లో ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసిన పెయిడ్ సర్వేలను ప్రజల్లోకి పంపి అయోమాయానికి గురిచేసిన జూబ్లిహిల్స్ ప్రజలు స్పష్టమైన నిర్ణయాన్ని ఓటు రూపంలో చూపించారని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను గుర్తించి తీర్పు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి డైరెక్టర్ పన్నాల రాజేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, ఏఐసీసీ విచార్ విభాగ్ కో ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, నాయకులు తుళ్ల సునీత గౌడ్, నయన చారి, గిరి ముదిరాజ్, రాకేష్, అరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

* జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఘన విజయం మహేశ్వరంలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు – ఆరు సంక్షేమ పథకాలే విజయానికి కారణం: దేప భాస్కర్ రెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 14 : జూబ్లీహిల్స్ శాసనసభ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ సాధించిన అఖండ విజయం సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్ని అంటాయి. కార్యకర్తలు, నాయకులు తో కలిసి పెద్ద ఎత్తున టపాసులు (బాణసంచా) పేల్చి, మిఠాయిలు పంచుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేసిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & టిపిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి ఈ సందర్భంగా మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.ఈ ఘన విజయానికి ఏకైక కారణం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు (ఎల్‌ఓపీ) రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉపముఖ్య మంత్రివర్యులు మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రవేశపెట్టిన ఆరు సంక్షేమ పథకాలు అని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకాలపై ప్రజలకు ఉన్న విశ్వాసమే కాంగ్రెస్‌కు పట్టం కట్టిందని అన్నారు. పథకాలపై ప్రజలకు ఉన్న విశ్వాసమే కాంగ్రెస్‌కు పట్టం కట్టిందని అన్నారు.బిఆర్‌ఎస్ మరియు బీజేపీ పార్టీలు కలిసి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, ఓటర్లు వాటిని తిప్పికొట్టారని, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసే ఓటర్లు, కాంగ్రెస్ పార్టీని ఆదరించి, విజయాన్ని కట్టబెట్టారని దేప భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.రాబోయే ఎన్నికల్లో విజయం ఖాయం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ శకం కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

రంగారెడ్డి

చిన్నారుల కన్నీళ్లను తుడిచిన కార్తీక్ రెడ్డి – అనాథలైన చిన్నారులకు 2,00,000 ఆర్థిక సహాయం*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 14 : చేవెళ్ల బస్సు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా మిగిలిన ఇద్దరు చిన్నారుల కోసం బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ముందుకు వచ్చి ఉదారత చూపారు. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన బందప్ప, లక్ష్మీ దంపతులు అమానుష ప్రమాదంలో మృతిచెందడంతో వారి కుమార్తెలైన భవానీ, శివలీల అనాథలయ్యారు. ఈ ఘటన వివరాలు ”చేవెళ్ల న్యూస్” వాట్సాప్ గ్రూపులో చర్చకు రావడంతో చిన్నారుల పరిస్థితి అందరినీ కలిచివేసింది. పరిస్థితిని తెలుసుకున్న కార్తీక్ రెడ్డి పిల్లల భవిష్యత్తు, చదువు, సంరక్షణ కోసం రూ.2లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఆయన చేసిన ఈ సేవా కార్యక్రమం గ్రూప్ సభ్యులతో పాటు స్థానిక ప్రజల ప్రశంసలను పొందుతోంది. ఇలాంటి మానవీయ స్పందన సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. చిన్నారుల భవిష్యత్తుకై మరింత మంది ముందుకు రావాలని “చేవెళ్ల న్యూస్” గ్రూప్ తరఫున పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పిలుపునిచ్చారు. అదే సమయంలో వారి తరఫున కార్తీక్ రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

రంగారెడ్డి

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ అద్భుత విజయం –మహేశ్వరం నియోజకవర్గం కార్మిక శాఖ అధ్యక్షులు నడికుడ శివ*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 14 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జూబ్లీహిల్స్ గెలుపుతో భారత రాష్ట్ర సమితి ఖేల్ ఖతం దుకాణం బంద్ అని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కార్మిక శాఖ అధ్యక్షులు నడికుడ శివ అన్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు పట్ల శివ హర్షం ప్రకటించారు. నోరు పారేసుకున్న బిఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు ముందుగానే కాంగ్రెస్ పార్టీ వైపు శుభ పరిణామ సంకేతాలు పంపించారని అయినా ఇది అర్థం చేసుకోలేని ప్రతిపక్ష నాయకులు నూటికి ఎంత వస్తే అంత మాట్లాడాలని చివరికి అభివృద్ధి సంక్షేమమే గెలిచిందని రేవంత్ రెడ్డి వ్యూహం మహేశ్వరం నియోజకవర్గం కార్మిక శాఖ అధ్యక్షులు నడికుడ శివ కృషి కార్యకర్త పట్టుదల కలిసి జూబ్లీహిల్స్ విజయం సాధించిందని ఇది సమిష్టి విజయం అని ఈ విజయంలో పాలుపంచుకున్న ప్రతి కార్యకర్తకు ప్రభుత్వానికి అందరికీ నడికుడ శివ కృతజ్ఞతలు తెలిపారు..

రంగారెడ్డి

*జూబ్లీహిల్స్‌ ఓటర్లు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు * –మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 14 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని మహేశ్వరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య,అన్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ సుస్థిర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజలు మద్దతు తెలిపారు.జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించడం ద్వారా,తమ ప్రాంతంలో మెరుగైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆశించవచ్చని మహేశ్వరం నియోజకవర్గం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య, పేర్కొన్నారు. నవీన్ యాదవ్ నాయకత్వంలో నియోజకవర్గం కొత్త పుంతలు తొక్కుతుందని, ప్రజల అవసరాలు తీరుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ విజయం కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనమని, రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశా

ఎన్ టి ఆర్ జిల్లా

*నందిగామలో దేవాలయ చోరీ: హుండీ సొమ్ము ఎత్తుకెళ్లిన దొంగలు*

నందిగామ పాత బస్టాండ్‌లోని విగ్నేశ్వర స్వామి దేవాలయంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. చోరీకి పాల్పడిన దొంగలు, దేవాలయానికి వచ్చిన సమయంలో తాళాలు విరుచుకుపోయి, హుండీని పగలగొట్టి లోని సొమ్ము తీసుకెళ్లారు. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ తరహా చోరీలు జరగడం కలకలం రేపింది. నందిగామ పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ చోరీ విషయం గురించి స్థానికుల నుంచి తెలిసిన సమాచారం ప్రకారం, ఇతర దేవాలయాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయనీ, పోలీసులు విచారణలో భాగంగా ఇతర దేవాలయాలపై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. విగ్నేశ్వర స్వామి దేవాలయంలో హుండీకి చేరిన విరాళాలు కొన్ని సంవత్సరాలుగా మంచి మొత్తంలో కూడినట్లు, అందుకే ఈ చోరీకి లక్ష్యంగా నిలిచిందని స్థానికులు పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు ఇరుకైన ప్రాంతాల్లో ఆధారాలు సేకరిస్తూ, దొంగల రహస్యాలను వెలుగులో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

విశాఖపట్నం

శ్రిష్టి వరల్డ్ స్కూల్‌లో చిల్డ్రన్స్‌ డే వేడుకలు

గాజువాక ( ఉక్కు నగరం), నవంబర్(పున్నమి ప్రతినిధి): శ్రిష్టి వరల్డ్ స్కూల్‌లో చిల్డ్రన్స్‌ డే వేడుకలు గురువారం ఉత్సాహభరితంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. “పాపా పాపా జీ” నృత్యంతో ప్రారంభమై, “చాచా నెహ్రూ అండ్ హిస్ లిటిల్ ఫ్లవర్స్” నాటిక, “హ్యాపీ చిల్డ్రన్స్‌ డే” డాన్స్‌ను చిన్నారులు అందించారు. అనంతరం ఫోక్ డాన్స్‌లు, సెమీ-క్లాసికల్ ఫ్యూషన్‌లు, పండుగల ఆధారిత ప్రత్యేక నృత్యాలు విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించాయి. ప్రత్యేకంగా కేరళ ఫోక్ మరియు పంజాబీ బైసాఖీ నృత్యాలు ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి. పాఠశాల డైరెక్టర్ సుసీలా రాణి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణ, జీవన నైపుణ్యాల పెంపుపై శ్రిష్టి పాఠశాల దృష్టి సారిస్తోందన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. మేఘనా కంభం విద్యార్థుల్లోని ప్రతిభే పాఠశాలకు గర్వకారణమన్నారు. కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ ప్రిన్సిపాల్‌, చీఫ్ అకడమిక్ హెడ్‌, కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు హాజరై పిల్లలను అభినందించారు.

తెలంగాణ

తక్షశిల హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు.

తక్షశిల హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. వెల్దండ నవంబర్ 14 : భారతదేశపు తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి ని పురస్కరించుకుని వెల్దండ మండల కేంద్రంలోని తక్షశిల హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులై పాఠాలు బోధించి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తక్షశిల హై స్కూల్ ప్రిన్సిపాల్ రాజేష్ నాయక్ మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి బావి భారత పౌరులని, భారతదేశ మొట్టమొదటి మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ జయంతి బాలలను సమాజానికి వెలుగు చూపే దీపాలని, వారి ప్రతిభ ,సృజనాత్మకత దేశ అభివృద్ధికి పునాదులను చాటిచెప్పిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ కి పిల్లలపై ఉన్న ప్రేమ ప్రగతిశీల ఆలోచనలు మనందరికీ స్ఫూర్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజేష్ నాయర్ , ఉపాధ్యాయులు శేఖర్, మల్లేష్, శ్రీదేవి, దివ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.