Saturday, 21 March 2026

Blog

E-పేపర్

మంత్రి ఎన్ఎండి ఫరూక్ కి కృతజ్ఞతలు తెలిపిన ఇమాముల సంఘం

నంద్యాల ముస్లిం మైనారిటీల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ తీసుకుంటున్న చిత్తశుద్ధికి నిదర్శనంగా, ఇమామ్‌లు మరియు మౌజన్‌లకు 12 నెలల గౌరవ వేతనం కోసం రూ. 90 కోట్ల నిధులను విడుదల చేసినందుకు గాను, జిల్లా ఇమాముల సంఘం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ కి కృతజ్ఞతలను తెలియజేశారు ఈ సందర్భంగా నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన అభినందన సభలో జిల్లా ఇమాముల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. *మంత్రి ఎన్ఎండి ఫరూక్ చొరవ అభినందనీయం* ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేవలం ఎన్నికల హామీని నెరవేర్చడమే కాకుండా, రాష్ట్రంలో మైనారిటీ వర్గాల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని నిరూపించారని సంఘం నాయకులు తెలిపారు. రూ. 90 కోట్ల నిధుల విడుదల నిర్ణయం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఇమామ్‌లు మరియు మౌజన్‌ల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించిందని. ఈ నిధులు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో, ముఖ్యంగా వారి కుటుంబ పోషణకు ఎంతో సహాయపడతాయని వారు పేర్కొన్నారు. “మైనారిటీల సంక్షేమం పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ చాలా మంచిదని. గౌరవ వేతనాల బకాయిలను ఒకేసారి విడుదల చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంమని అన్నారు. ఇది రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీల పట్ల ముఖ్యమంత్రి కి ఉన్న ఆదరణను తెలియజేస్తుందని,” సంఘం నాయకులు తెలిపారు . ఈ సంక్షేమ చర్యకు గాను మంత్రి ఎన్ఎండి ఫరూక్ కృషిని కూడా ఇమాముల సంఘం ప్రత్యేకంగా అభినందించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ నాయకత్వానికి, అలాగే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు తమ సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని జిల్లా ఇమాముల సంఘం తెలిపారు . రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల గౌరవాన్ని, ఆర్థిక భద్రతను పెంపొందించడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రకమైనదని వారు కొనియాడారు. *తెలుగుదేశం పార్టీ మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉంది: మంత్రి ఎన్ఎండి ఫరూక్* మైనార్టీ సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ తెలిపారు . ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గారు ఆదేశించిన మేరకు, ఇమాములకు మరియు మోజోన్లకు రూ. 90 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం మైనార్టీ వర్గాల అభ్యున్నతికి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని , ముఖ్యమంత్రిగారి చొరవతో ఇమాములు, మోజోన్ల ఆర్థిక భద్రత కోసం రూ. 90 కోట్ల నిధులను విడుదల చేయడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేస్తూ, ఇది ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ నిధులు మైనార్టీ వర్గాల సంక్షేమానికి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇమాముల సంఘం అధ్యక్షులు హఫీజ్ ఖాజీ మహమ్మద్ అంజద్ భాష సిద్ధికి , ముఫ్తీ మహమ్మద్ రఫీ సాహెబ్ , మూలాన ఇబ్రహీం సాహెబ్ , హాజీ ఇలియాజ్ సాహెబ్ , మౌలానా అబ్దుల్ రఫీ , హఫీజ్ మహమ్మద్ ఆజమ్, హఫీస్ మహమ్మద్ కాజీ మియా , అలీమ్, హుస్సేన్ , మన్ నూర్ , ఇస్మాయిల్ , జబీబుల్లా మరియు ఇమాములు మరియు మత పెద్దలు ఆలిములు తదితరులు పాల్గొన్నారు

అల్లూరి సీతారామరాజు

అరకు: మంత్రముగ్ధులను చేస్తున్న మాడగడ వ్యూపాయింట్

అరకులోయ ప్రకృతి అందాలలో మచ్చుతునకగా మాడగడ మేఘాల కొండలు నిలుస్తున్నాయి. అరకులోయకు 10 కిలోమీటర్ల దూరములో వున్న మాడగడ కొండల్లోని మేఘాలు పర్యటకులను కట్టిపడేస్తున్నాయి. ఈ మంచుసోయగాలు పాల సముద్రాన్ని తలపిస్తూ, పర్యటకులకు కనువిందు చేస్తుంది. సూర్యుని కిరణాలు భూమిని తాకలేనంతగా దట్టంగా మంచు మేఘాలు భూమిని కప్పి ఉంచిన దృశ్యం అద్భుతం. ఇక్కడ కనిపించే సూర్యోదయం పర్యాటకుల మంత్రముగ్ధులను చేస్తుంది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎరుకలాల పరమేశ్వరి ఆలయంలో అగ్ని ప్రమాదం…

నెల్లూరు లో నీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి గుడిలో అగ్నిప్రమాదం.అగ్నిమపకధలం వచ్చి మంటలను అర్పుతునారు.

అన్నమయ్య

డబ్ల్యూ హెచ్ ఆర్సీ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ డబ్ల్యూ హెచ్ ఆర్సీ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు విశేష ఉత్సాహం,ఆనందంతో సాగాయి.వరల్డ్ మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలు మరియు జూనియర్ కాలేజ్ గర్ల్స్ అలాగే గొబ్బిళ్ళ అక్షర స్కూల్‌లలో ఈ వేడుకలను భవ్యంగా నిర్వహించారు.పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో వివిధ పోటీలను నిర్వహించి విజేతలకు మెడల్స్,మోమెంటోలు, సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. విద్యార్థినుల ప్రతిభను అభినందించిన అతిథుల ప్రసంగాలు పిల్లల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన డబ్ల్యూ హెచ్ ఆర్సీ ఆంధ్ర రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు సయ్యద్ మెహతాజ్ బేగం మాట్లాడుతూ ప్రతి బాలిక స్వప్నం నిజం కావాలి.విద్యతో పాటు స్ఫూర్తి,ప్రోత్సాహం, సమాన హక్కులు కల్పించడం ప్రతి సమాజం యొక్క బాధ్యత అని పేర్కొన్నారు. అలాగే డబ్ల్యూ హెచ్ ఆర్సీ నిర్వహిస్తున్న మానవహక్కుల అవగాహన కార్యక్రమాలు, బాలిక విద్యాభివృద్ధి,భద్రత పై సంస్థ తీసుకుంటున్న చర్యలను వివరించారు. డబ్ల్యూ హెచ్ ఆర్సీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు షేక్ మస్తాన్ సాహెబ్ ఇద్దరి స్కూల్‌లలో విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లల చదువులో గడిపే ప్రతి నిమిషం,దేశ భవిష్యత్తుకే పెట్టుబడి అని.వారి హక్కులను రక్షించటం మనందరి బాధ్యత అని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో డబ్ల్యూ హెచ్ ఆర్సీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జుల్ఫికర్, రాయలసీమ జోన్ ఎడ్యుకేషన్ సెల్ ప్రెసిడెంట్ వరప్రసాద్, స్టేట్ సెక్రటరీ రవితేజ పాల్గొని విద్యార్థినులను అభినందించారు.ఇరు స్కూలు ప్రిన్సిపాలు,ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,విద్యార్థినుల సమన్వయంతో కార్యక్రమాలు ఆనందభరితంగా పాల్గునారు. పిల్లలే రేపటి భారత నిర్మాతలు.వారి కలలకు రెక్కలు ఇవ్వడం,హక్కులకు రక్షణ కల్పించడం డబ్ల్యూ హెచ్ ఆర్సీ ప్రధాన ధ్యేయమని నిర్వాహకులు తెలిపారు.

E-పేపర్

ధూళి మిట్ట గ్రామంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ నేతల సంబరాలు

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో విజయం సాధించడంతో సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కలసి మండల అధ్యక్షుడు కోల సాయిలు గౌడ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు టపాసులు పేల్చి మిఠాయిలు పంచారు వారు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ప్రజా ప్రభుత్వానికి పట్టం కట్టారని అన్నారు.

తెలంగాణ

బద్దిపడగ గ్రామం అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు…

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగ గ్రామం అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భారతదేశపు మొదటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా వారి అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పిల్లల కోసమే ప్రత్యేక కార్యక్రమాలు, ఆటలు, ప్రదర్శనలు నిర్వహించారు పిల్లల్లోని సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించేందుకు, వారు సురక్షితంగా వెలుగులోకి రావడానికి పలు కార్యక్రమాలను నిర్వహించినరు.

విశాఖపట్నం

విశాఖ వేదికగా రెండు రోజుల్లో భారీ ఎత్తున ఎంఓయూలు కుదుర్చుకున్న ప్రభుత్వం*

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* *CII Summit… Big Hit* *విశాఖ వేదికగా రెండు రోజుల్లో భారీ ఎత్తున ఎంఓయూలు కుదుర్చుకున్న ప్రభుత్వం* *జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకున్న ప్రభుత్వం* *400 ఎంఓయూల ద్వారా రూ. 11,91,972 కోట్ల పెట్టుబడులు, 13,32,445 ఉద్యోగాలు* *అంచనాలకు మించి ఎంఓయూలు కుదుర్చుకునేందుకు తరలి వచ్చిన పరిశ్రమలు* *తొలి రోజ 14వ తేదీన భాగస్వామ్య సదస్సులో రూ. 8.26 లక్షల కోట్ల పెట్టుబడులు, వీటి ద్వారా 12.05 లక్షల ఉద్యోగాలు* *ఇవాళ సీఎం సమక్షంలో 41 ఎంఓయూల ద్వారా రూ. 3.50 లక్షల కోట్ల పెట్టుబడులు ద్వారా 4.16 లక్షల ఉద్యోగాలు* *మంత్రుల సమక్షంలో 324 ఒప్పందాలు ద్వారా రూ. 8,41,786 కోట్ల పెట్టుబడులు* *ఏపీ సీఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఐ అండ్ ఐ, పరిశ్రమలు – వాణిజ్యం, ఐటీి, మున్సిపల్ శాఖల్లో ఒప్పందాలు కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం*

విశాఖపట్నం

విశాఖపట్నంలో జరిగిన CII Partnership Summit

విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- విశాఖపట్నంలో జరిగిన CII Partnership Summit సందర్భంగా, ఎమ్మెల్యే బిజెపి ఫ్లోర్ లీడర్ శ్రీ పీ విష్ణుకుమార్ రాజు గారితో ,సీఐఐ ఇంటర్నేషనల్ కో-చైర్మన్ అమయ ప్రభు గారు (మాజీ కేంద్ర మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ సురేష్ ప్రభు గారి కుమారుడు) ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరూ పాలసీ అంశాలు మరియు అభివృద్ధి అవకాశాలపై సవివరంగా చర్చించారు.

విశాఖపట్నం

విశాఖ గాదిరాజు ప్యాలెస్ లో నిర్వహిస్తున్న NAREDCO (నరేడ్కో) ప్రాపర్టీ షో

విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- విశాఖ గాదిరాజు ప్యాలెస్ లో నిర్వహిస్తున్న NAREDCO (నరేడ్కో) ప్రాపర్టీ షో ను సందర్శించిన VMRDA చైర్మన్ శ్రీ ఎంవి ప్రణవ్ గోపాల్ మరియు మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ N తేజ్ భరత్, IAS., గాదిరాజు ప్యాలెస్ లో NAREDCO (నరేడ్కో) అధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షో ను VMRDA చైర్మన్ శ్రీ ఎంవి ప్రణవ్ గోపాల్ గారు మరియు మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ N తేజ్ భరత్ గారు సంయుక్తంగా అక్కడ వివిధ రియల్ ఎస్టేట్ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు మాట్లాడుతూ విశాఖపట్నంలో ఉన్న అన్ని రియల్ ఎస్టేట్ సంస్థలవారు ఒకే తాటి పైకి వచ్చి ఇక్కడ ఈ ప్రాపర్టీ షో ను ఏర్పాటు చేయడమనేది ఎంతో ముదావహమని, ఇంత చక్కగా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులకు నా యొక్క అభినందనలన్నారు. దీని వల్ల కొనుగోలుదారులు వారి సందేహాలను నివృత్తి చేసుకొని ప్లాట్లు కొనుగోలు చేయడం మరింత సులభతరం అవుతుందన్నారు. గౌ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల విశాఖకు టీసీఎస్, గూగుల్ వంటి ఐటీ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని ఈ చర్యలవల్ల ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం మరింత ఊపు అందుకొని ఉత్తరాంధ్ర – ఉత్తమ ప్రాంతంగా మారుతుందన్నారు. రానున్న రోజుల్లో విశాఖ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని, అందుకు తగిన సదుపాయాలు, వాతావరణం కల్పించటం జరుగుతుందని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు కు అనుసంధానించే ప్రధాన రహదారులు కూడా త్వరలోనే పూర్తి చేయనున్నామని, వి ఎం ఆర్ డి ఎ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ ఎన్.తేజ్ భరత్ గారు మాట్లాడుతూ గౌ ముఖ్యమంత్రి వర్యులు విశాఖను రాష్ట్రంలోనే కాకుండా దేశం మరియు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని , నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు ఈ ప్రాంతమంతా ఊహించని విధంగా అభివృద్ధి చెందుతుందని కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం లో పెట్టుబడులు చాలా మంచి నిర్ణయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జి సి సి చైర్మన్ శ్రీ శ్రవణ్ కుమార్ గారు, NAREDCO (నరేడ్కో) ప్రతినిధులు శ్రీ చక్రధర్, శ్రీ సురేష్ శ్రీ సుబ్బారావు, శ్రీ హుస్సేన్, శ్రీ వెంకన్న చౌదరి తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

మోదీ నాయకత్వంపై ప్రజల్లో పెరిగిన విశ్వాసo*

*మోదీ నాయకత్వంపై ప్రజల్లో పెరిగిన విశ్వాసo* *బీహార్ లో భాజపా ఘన విజయo… గాజువాకలో శ్రేణుల సంబరాలు* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-బీహార్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రెండు వందల పై చిలుకు స్థానాలను కైవసం చేసుకున్న నేపథ్యంలో గాజువాక పాత కర్నవానిపాలెం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.భాజపా రాష్ట్ర మీడియా పేనలిస్ట్ మరియు గాజువాక ఇంచార్జ్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో మిఠాయిలు పంచి,బాణాసంచా కాల్చారు.అనంతరం కేక్ ను కట్ చేశారు.ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ బీహార్ ఎన్నికల్లో అక్కడి ప్రజలు మోదీ నాయకత్వాన్ని నమ్మి పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించారని అన్నారు.ఇటీవల జరుగుతున్న ఎన్నికలన్నింటిలో భాజపా జెండా రెపరెపలాడుతోందని దీంతో ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయని అన్నారు.దేశంలో మోదీ ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది అన్నారు.జమ్ము కశ్మీర్ లో జరిగిన ఉప ఎన్నికల్లో అక్కడి బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా కూడా ఘన విజయాన్ని అందుకున్నారని పేర్కొంటూ భాజపా తరపున గెలుపొందిన అభ్యర్థులందరికీ అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు సిరసపల్లి నూకరాజు,గూటూరు శంకరరావు,బాటా శ్రీనివాస్,బొండా ఎల్లాజీ,అశోక్,నాగేశ్వరరావు,రోహిణి,పద్మ,భువనేశ్వరి ,అప్పలరాజు,నాగరాజు,కృష్ణారెడ్డి, మనోహర్,రమాదేవి,సత్యనారాయణ , జగదీష్,నారాయణ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.