Friday, 20 March 2026

Blog

సత్యసాయి

సూపర్ సిక్స్ అమలు చేయండి. – వ్యక్తిగత విమర్శలు చేయకండి. – మండల కన్వీనర్ తనకంటి జయప్ప.

అమడగూరు: రాజకీయాలు వ్యక్తిగత స్థాయిలోకి దిగజార్చడం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే చర్య అని వైసిపి మండల కన్వీనర్ తనకంటి జయ్యప్ప అన్నారు.ఆదివారం మండల కేంద్రంలోని స్థానిక శ్రీ చౌడేశ్వరి దేవి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల కన్వీనర్ తనకంటి జయప్ప మాట్లాడుతూ….రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అందించాలని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అధికార పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు ప్రతిపక్ష నాయకులు పైన వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదని అన్నారు.ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయమని ప్రతిపక్ష నాయకులు ఎవరైనా అడిగితే వారిపై దాడి చేస్తూ,దుర్భాషలాడుతూ,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం మంచిదికాదని తెలియజేశారు.ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని మానుకోవాలన్నారు.ప్రజలకు అందజేయాల్సిన సంక్షేమ పథకాలను అందించేంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తనకంటి జయప్ప,స్టేట్ జాయింట్ సెక్రటరీ శేషురెడ్డి,శ్రీ సత్యసాయి డాక్టర్స్ వింగ్ డాక్టర్ రమేష్,సర్పంచ్ సురేంద్రరెడ్డి,మాజీ మండల కన్వీనర్ సూర్యనారాయణ,సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ తభిరీజ్,పంచాయతీ కన్వీనర్ కమ్మల నాగరాజు,టౌన్ కన్వీనర్ సుధాకర్ రాజు,రమణారెడ్డి,బావాజీ,కమ్మి రవి,చంద్ర,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

యాదవుల కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎండి ఫయాజ్

నంద్యాల యాదవుల కార్తీక వనభోజన మహోత్సవాన్ని కార్తీక వనభోజన కమిటీ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో స్థానిక పద్మావతి నగర్ లో ఉన్న శ్రీకృష్ణుని మందిరం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ పాల్గొన్నారు. ముందుగా శ్రీ కృష్ణ భగవానుడి విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ కార్తీక మాసంలో హిందూ సాంప్రదాయంలో వనభోజన కార్యక్రమానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని. ఈ కార్యక్రమంలో యాదవ సోదర, సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొని, కలిసి భోజనాలు చేస్తూ, ఆధ్యాత్మిక చర్చలతో ఆనందోత్సాహాల మధ్య ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి చాలా సంతోషంగా ఉందన్నారు. యాదవ సంఘటిత శక్తిని చాటిచెప్పిన ఈ యాదవ కార్తీక వనభోజన మహోత్సవం మత సామరస్యాన్ని, సామాజిక ఐకమత్యాన్ని ప్రతిబింబిస్తూ, అందరిలో ఆధ్యాత్మిక భావనను పెంచిందన్నారు ఈ కార్యక్రమంలో యాదవ కార్తీక వనభోజన కమిటీ వేదిక , శ్రీకృష్ణ మందిరము పద్మావతి నగర్ నంద్యాల సభ్యులు పృధ్విరాజ్ యాదవ్,కొండా శ్రీనివాస్ యాదవ్, నాగేశ్వరరావు యాదవ్, విజయ్ గౌరీ యాదవ్ , చలపతి యాదవ్ , హరి యాదవ్, భోధనం చంద్రశేఖర్ యాదవ్, చల్ల గోపాల్ యాదవ్ , నాగరాజు యాదవ్, నాగమధు యాదవ్, శివ కృష్ణ యాదవ్, వెంకటేశ్వర్లు యాదవ్ తదితరులు పాల్గొనారు

కడప

*తాగునీటి సమస్యకు పరిష్కారం::బీటెక్ రవి*

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని 20, 22 డివిజన్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం అందించేందుకు బీటెక్ రవి గారి ఆధ్వర్యంలో ఐదు రూపాయలకు శుద్ధి చేసిన మంచినీటిని ప్రజలకు అందించే కార్యక్రమం లో భాగంగా మూడు వాటర్ ఆటోలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు & కడప జిల్లా టిడిపి అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన ప్రాథమిక వసతులలో తాగునీరు అత్యంత కీలకమన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఈ కార్యక్రమం ఉపయోగకరమని అభినందించారు.

తెలంగాణ

పత్తి జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమావేశమైన : కలెక్టర్

నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) జిల్లాలో పత్తి కొనుగోళ్ల పై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ ఆదివారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు, జిల్లాలోని పత్తి జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమావేశమై పత్తి కొనుగోళ్లపై సమీక్షించారు. పత్తి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సోమవారం నుండి తలపెట్టిన సమ్మెను జిన్నింగ్ మిల్లుల యజమానులు విరమించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. జిన్నింగ్ మిల్లుల యజమానుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలియజేయడమే కాకుండా అప్పటికప్పుడే రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ సెక్రెటరీ సురేంద్ర మోహన్ తో ఫోన్ ద్వారా మాట్లాడి జిన్నింగ్ మిల్లుల యజమానుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.జిల్లాలోని 23 జిన్నింగ్ మిల్లులకు గాను, ఇప్పటివరకు 19 మిల్లులను ప్రారంభించడం జరిగిందని, తక్కిన నాలుగు జిన్నింగ్ మిల్లులను కూడా సాధ్యమైనంత త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని, అందువల్ల జిన్నింగ్ మిల్లుల యజమానులు పత్తి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి సమ్మె కు వెళ్లకుండా మిల్లులు నిర్వహించాలని కోరారు. రాష్ట్ర అసోసియేషన్ తో మాట్లాడిన అనంతరం తగు నిర్ణయం తీసుకుంటామని జిన్నింగ్ మిల్లుల యజమానులు తెలిపారు.

విశాఖపట్నం

సి ఐ ఐ భాగస్వామ్య సదస్సు ఊహించిన దాని కంటే విజయవంతం అయింది— వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్.

* సి ఐ ఐ భాగస్వామ్య సదస్సు ఊహించిన దాని కంటే విజయవంతం అయింది— వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్. * ఫ్యూచర్ రెడీ ఇన్నోవేషన్ రాష్ట్రంగా ఆంధ్రపదేశ్. ని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దుతున్నారు. * సి ఐ ఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం కావటంతో వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదు. * పెద్దఎత్తున ఒప్పందాలు జరగటంతో వైసీపీ నేతలు బయపడుతున్నారు. * దీంతో రాష్ట్ర ప్రభుత్వం పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. * కోడిగుడ్డు మంత్రి గా పేరొందిన అమర్ నాథ్ గారు మీరు ఐదు ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. * దేశ విదేశాలు తిరిగి పెద్ద ఎత్తున పలు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు కష్టపడ్డారు. దీని ఫలితమే సదస్సు విజయవంతం అయింది. * మీ హాయంలో జరిగిన పెట్టుబడుల సదస్సులో అద్దె కోట్లు, నకిలీ సంస్థలతోనే మీకు ఒప్పందాలు జరిగాయి. అందుకే ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదు. * రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు హైదరాబాద్ ను హైటెక్ సిటీని అభివృద్ధి చేయగా, నేడు విశాఖను గూగుల్ సిటీ గా అభివృద్ధి చేస్తున్నారు. * కూటమి ప్రభుత్వం లో సదస్సులో మావి నిజమైన లెక్కలు… అమర్నాథ్ గారి హయంలో సదస్సులో కోడిగుడ్డు కథలు వినిపించారు. * జగన్ హయంలో పెట్టుబడి మ్యాప్‌లో నుంచి ఆంధ్రపదేశ్ మాయమైంది. * మా మీద ఆరోపణలు పెట్టే ముందు వైసీపీ హయంలో వచ్చిన కంపెనీలు చూపించండి. * స్టేజ్‌పై కూర్చోబెట్టడం కాదు… పెట్టుబడులు రప్పించడం అనేది మాత్రమే మాకు తెలుసు. * విశాఖ అభివృద్ధి అనే మాట వైసీపీ నేతల నోటి నుంచి వస్తుంటే ప్రజలు నవ్వుతున్నారు. * కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ ను, వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మలేదు ఇటు పెట్టుబడిదారులు కూడా నమ్మలేదు. * విశాఖ లో జరిగిన సదస్సలో 613 ఒప్పందాలతో రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నాయి.

విశాఖపట్నం

89 వ వార్డు లో గౌరీ కేదారేశ్వర ఆలయంలో కార్తీక అన్న సమారాధనలో పాల్గొన్న సిపి.డా.శంఖబ్రత భాగ్చి*

*89 వ వార్డు లో గౌరీ కేదారేశ్వర ఆలయంలో కార్తీక అన్న సమారాధనలో పాల్గొన్న సిపి.డా.శంఖబ్రత భాగ్చి* *కోనేరు పక్కన ఆహ్లాదకర దేవాలయం:సిపి.డా.శంఖబ్రత భాగ్చి ప్రశంసలు* విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- విశాఖ జీవీఎంసీ 89వ వార్డు భగత్ సింగ్ నగర్‌లోని శ్రీ శ్రీ శ్రీ గణపతి సహిత గౌరీ కేదారేశ్వర ఆలయంలో, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక అన్నసమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన విశాఖ నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత భాగ్చి కి సభ్యులు సాలువాతో సత్కారం చేసి బొకే అందజేసి ఘన స్వాగతం పలికారు. అలాగే గోపాలపట్నం సీఐ ఎల్. సన్యాసినాయుడు కి కూడా కమిటీ సభ్యులు సాదర స్వాగతం చెప్పారు.తరువాత కమిషనర్ శంఖబ్రత భాగ్చి కేదారేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ పరిసరాలను పరిశీలించిన ఆయన కమిటీ సభ్యులు తీర్చిదిద్దిన తీరు పట్ల ప్రశంసలు కురిపించారు.ఈ సందర్భంగా సీపీ శంఖబ్రత భాగ్చి మాట్లాడుతూ— “విశాఖ నగరంలో ఎన్నో దేవాలయాలు చూశాను. కానీ ఇలా కోనేరు పక్కన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న దేవాలయం చాలా అరుదు. ఎంతో చక్కగా, శాంతియుతంగా ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా మళ్లీ దర్శనం చేసుకుంటాను” అన్నారు. అలాగే ఆలయ కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తరువాత నిర్వహించిన కార్తీక అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న సీపీ భాగ్చి, భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయం కమిటీ సభ్యులు కృష్ణ చారి,చంద్రశేఖర్,నాగేశ్వరరావు, సంతోష్ కుమార్,వాసు,ఉగాది నాయుడు తదితర సభ్యులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన గ్రంథాలయ ఉద్యమం గురించి అంతా తెలుసుకోవాలి

విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- ఆంధ్రప్రదేశ్ లో జరిగిన గ్రంథాలయ ఉద్యమం గురించి అంతా తెలుసుకోవాలి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సామాజిక ఉద్యమాల్లో గ్రంథాలయ ఉద్యమం అత్యంత ప్రముఖమైనదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ కోరుబిల్లి రాము అన్నారు. స్థానిక మల్కాపురంలోని శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆయన గ్రంథాలయ ఉద్యమంపై మాట్లాడుతూ – శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరి నాగభూషణం, కందుకూరి వీరేశలింగం, కొమర్రాజు లక్ష్మణరావు, గిడుగు రామ్మూర్తి పంతులు, ఎం. అనంత పద్మనాభం, గోరంట్ల వెంకటచలం మొదలైన వారు ఆంధ్రప్రదేశ్ లో గ్రంథాలయ ఉద్యమానికి ఎంతగానో శ్రమించారని అన్నారు. గ్రంథాలయాలను స్థాపించడం, పుస్తకాలను సేకరించడం, పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచడం మొదలైన విషయాల్లో వారి కృషి గణనీయమైనదని, వారిని స్మరించుకోవడం మన కర్తవ్యం అని అన్నారు. సమావేశానికి గ్రంథాలయాధికారి శ్రీ వి. అజయ్ కుమార్ అధ్యక్షత వహించి గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న వారి జీవిత చరిత్రలను తెలియజేశారు. అనంతరం బాలలకు దేశభక్తి గేయాలలో పోటీని నిర్వహించారు. తొలుత అంతా గ్రంథాలయ ఉద్యమానికి కృషి చేసిన వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి, అంజలి ఘటించారు.

విశాఖపట్నం

61వ వార్డు శ్రీ గౌరీ దేవి మహోత్సవాలు

విశాఖ నవంబర్ పున్నమి ప్రతినిధి:- 61 వ వార్డు అన్నసంతర్పణ మల్కాపురం  జీవీఎంసి   61వ వార్డు శ్రీ గౌరీ దేవి మహోత్సవాలు సందర్భంగా ప్రకాష్ నగర్ లో శ్రీ గౌరీ సేవ సంఘం వారి అద్వర్యం లో అదివారం   అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. అన్నసమారాధన కార్యక్రమం నకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు .వచ్చిన భక్తు లకు మల్కాపురం పోలీస్ లు అలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు .కార్యక్రమంలో మహిళలు యూత్ సభ్యులు కమిటి సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఎర్ర చందనం రక్షణకు సంకల్పం తీసుకుందాం

*ఎర్ర చందనం రక్షణకు సంకల్పం తీసుకుందాం* *అమరావతి ( విశాఖ పున్నమి ప్రతినిధి) • అమూల్యమైన సంపదను భావి తరాలకు అందించాలి • గత ప్రభుత్వ హయాంలో వన సంపదనూ వదల్లేదు… లక్షలాది ఎర్రచందనం చెట్లను నరికేశారు • అక్రమ రవాణా నిరోధానికి డ్రోన్లతో పహారా • ఎర్ర చందనం ద్వారా వచ్చే ఆదాయంలో నిర్దేశిత శాతం ఎర్ర చందనం వనాల అభివృద్ధి, సంరక్షణకు కేటాయింపు • ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక ప్రత్యేక టాస్క్ ఫోర్సుకు జీవం • పోలీసు-అటవీ శాఖల సమన్వయం ప్రధానం • ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధంపై అటవీ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ‘ఎర్రచందనం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన సంపద. పర్యావరణపరంగానూ, ఆధ్యాత్మికంగానూ, ఆర్థికంగానూ దీనికి ఉన్న ప్రాధాన్యం అపారమైంది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించాలి. ఎర్ర చందనం విక్రయాల ద్వారా సమకూరే ఆదాయంలో నిర్దేశిత శాతం ఎర్ర చందనం విత్తనాలు జల్లడం, ఎర్ర చందనం వనాలు అభివృద్ధి, సంరక్షణకు కేటాయించే ఆలోచన చేస్తున్నాము’ అని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. శేషాచలం అడవుల నుంచి ఒక్క ఎర్రచందనం దుంగ కూడా అక్రమంగా బయటకు వెళ్లకూడదనీ, దీని కోసం ఓ పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. వ్యవస్థలన్నీ సమన్వయంతో పని చేస్తే అక్రమార్కుల ఆటకట్టించడం అసాధ్యం కాదన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకొన్న కింగ్ పిన్స్ ను చట్టం ముందు నిలపడానికి ప్రత్యేక బృందాలను పోలీసు-అటవీ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెట్లను నరకడానికి వస్తున్న కూలీలు, మేస్త్రీలు, సూపర్ వైజర్లు, గోదాము కీపర్లు వంటి కిందిస్థాయి వారిని గుర్తించి, వారికి చట్టంపై అవగాహన కల్పించి కౌన్సిలింగ్ చేసి, ఇతర ఉపాధి మార్గాలు చూపించాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం మధ్యాహ్నం అటవీశాఖ ఉన్నతాధికారులతో ఎర్ర చందనం పరిరక్షణ, అక్రమ రవాణా నిరోధానికి ఉన్న మార్గాలపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… ‘‘2015లో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చొరవ తీసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే దీని కోసం ప్రత్యేకంగా ఆలోచించి రెడ్ సాందర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేశారు. కార్యకలాపాలను విస్తృతం చేశారు. ఐజీ స్థాయి అధికారిని టాస్క్ ఫోర్స్ కు నియమించి, అటవీ-పోలీసు అధికారులతో ప్రత్యేకంగా దళం ఏర్పాటు చేయించి ముందుకు వెళ్లారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత టాస్క్ ఫోర్సును ఓ పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేశారు. తత్ఫలితంగా అక్రమ రవాణాకు ద్వారాలు తెరిచినట్లయింది. ఫలితంగానే 2019-24 మధ్య లక్షలాది ఎర్రచందనం చెట్లను నరికి అక్రమంగా తరలించారు. నేను ఇటీవల సందర్శించిన తిరుపతిలోని 8 గోదాముల్లో 2,63,267 ఎర్రచందనం దుంగులున్నాయి. కేవలం పట్టుబడిన దుంగలను బట్టి చూస్తేనే సుమారు 2 లక్షల చెట్లు నరికినట్లు అర్ధమవుతోంది. మరి అక్రమ మార్గాల్లో ఎన్ని లక్షల చెట్లను నరికివేశారో ఊహకు అందటం లేదు. ఎర్రచందనం అనేది పర్యావరణహితమైన చెట్టు. అత్యంత పటిష్టంగా శేషాచలం అడవుల్లో మాత్రమే పెరిగే అరుదైన వృక్షం. ఇక నుంచి ఎర్రచందనం ఒక్క దుంగ కూడా బయటకుపోకుండా చేయాలి. దీనికి మన ముందున్న దారులన్నీ వినియోగించుకుందాం. మళ్లీ టాస్క్ ఫోర్సుకు జీవం పోసి, అక్రమ రవాణా నిరోధించే ప్రణాళికపై గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతాను. స్మగ్లర్లపై పెట్టిన కేసుల్లోనూ న్యాయస్థానాల నుంచి వేగంగా తీర్పులు రావడం శుభసూచకం. అటవీ శాఖ సిబ్బంది ఎర్ర చందనం సంరక్షణను ఒక సంకల్పంలా తీసుకోవాలి. • కేంద్ర సాయంతో ఎర్రచందనం వెనక్కు వస్తోంది వైసీపీ హయాంలో అంతర్రాష్ట్ర ఒప్పందాలను పట్టించుకోలేదు. ఫలితంగా ఎర్రచందనం సరిహద్దులు దాటి వేర్వేరు ప్రాంతాల్లో పట్టుకున్నా, దాన్ని వెనక్కు తీసుకురాలేకపోయారు. ఇటీవల కర్ణాటకకు వెళ్లినపుడు రూ.140 కోట్ల ఎర్రచందనం వారు పట్టుకొని, అమ్ముకున్నట్లు చెప్పడం నన్ను ఆలోచింప చేసింది. అంతర్రాష్ట్ర ఒప్పందాలను పటిష్టంగా అమలు చేసి ఉంటే, ఆ సంపద మనకు దక్కేది. ఈ అంశంపై కేంద్ర అటవీశాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ గారితో చర్చించాను. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మన రాష్ట్రం నుంచి అక్రమంగా రవాణా అయిన ఎర్రచందనం దుంగలు దేశంలో ఎక్కడ దొరికినా మనకు చెందేలా ప్రత్యేకంగా ఆదేశాలను ఇప్పించాం. దీంతోనే ఇటీవల గుజరాత్ లో 5 టన్నులు, తమిళనాడు, రాజస్థాన్ ప్రాంతాల్లో 7 టన్నులు, కర్ణాటకలో 6 టన్నులు, ఢిల్లీలో 10 టన్నులు సీజ్ చేశాం. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే నేపాల్ లో ఉన్న 173 టన్నల ఎర్రచందనం తిరిగి రాష్ట్రానికి రప్పించే ప్రక్రియ మొదలైంది. దీంతోపాటు వివిధ రాష్ట్రాల్లో 2019-24 ప్రాంతాల్లో పట్టుబడిన 407 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం కూడా తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తున్నాం. • సాంకేతికతకు తోడు మానవ కృషి అవసరం ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి అందుబాటులో ఉన్న సాంకేతిక వినియోగానికి తోడు సిబ్బంది కృషి చాలా అవసరం. టెక్నాలజీతోపాటు సంకల్పం తోడైతేనే ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించగలం. పోలీసు-అటవీ అధికారుల ఆధ్వర్యంలో నిరంతరం ఎర్రచందనం స్మగ్లింగు జరిగే అవకాశం ఉన్న ఎగ్జిట్, ఎంట్రీ పాయింట్ల వద్ద థర్మల్ డ్రోన్లతో నిఘాను పెంచాలి. అటవీ చెక్ పోస్టులను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు సీసీ కెమెరాలను అమర్చి, నిత్యం పర్యవేక్షణ చేయాలి. సరికొత్త బ్యారికేడ్లను చెక్ పోస్టుల వద్ద అమర్చి, బేస్ క్యాంపులు, వాచ్ టవర్లలో గస్తీ ముమ్మరం చేయాలి. వన సంరక్షణ సమితి వాలంటీర్ల ఆధ్వర్యంలో చైతన్య సదస్సులను శేషాచలానికి ఆనుకొని ఉన్న అన్ని గ్రామాల్లో నిర్వహించాలి. గ్రామస్థులకు అక్రమ రవాణా నిరోధానికి సహకరించాలని ప్రత్యేక సదస్సుల ద్వారా విన్నవించాలి. పాత కేసుల్లో ఉన్న వారి వివరాలను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని, వారి కదలికలను రికార్డు చేయాలి. ఎర్రచందనం కేసుల పరిష్కారానికి వేగం పెంచాలి. 60 రోజుల్లోగా ఛార్జిషీటు దాఖలు చేయాలి. ఆర్మ్డ్ బేస్ క్యాంపులను విస్తృతం చేయాలి. ఎక్కువగా అక్రమ రవాణా జరిగే ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రత్యేక కూంబింగ్ లను నిర్వహించాలి. అడవిలో ఎలాంటి అలికిడి, అలజడి గుర్తించినా, రక్షణ దళాలు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలి. అక్రమార్కుల ఆట కట్టించాలి. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధం విషయంలో సమన్వయం అనేది ప్రధానం. పోలీసు-అటవీ అధికారులు ఈగోలకు తావు లేకుండా జాతి సంపదను రక్షించాలనే అంకిత భావంతో పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టలేడు కాని ప్రత్యేక నిఘా ద్వారా వారిని పట్టుకుంటాం. ప్రత్యేక ఇంటిలిజెన్స్ ఏర్పాటు చేసి, సమాచారాన్ని అక్రమార్కులకు చేరవేసేవారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని హెచ్చరించారు.

E-పేపర్

పెండ్యాల విజయ్ కు శుభాకాంక్షలు తెలిపిన కోడూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిహెచ్ రమేష్ బాబు

కోడూరు టౌన్ శ్రీ పొట్టి శ్రీరాములు వారి వీధి నందు ఆర్యవైశ్య సమాజం అధ్యక్ష ఎన్నికలలో పెండ్యాల విజయ్ కుమార్ గారు 111 ఓట్ల ఆధిక్యతతో కామిశెట్టి సత్య గారిపై విజయం సాధించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసిన కోడూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిహెచ్ రమేష్ బాబు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.