Friday, 20 March 2026

Blog

Blog

నంద్యాలలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రివర్యులు ఎన్.ఎమ్.డి. ఫరూక్

నంద్యాల స్థానిక పాలకేంద్రం పక్కన ఉన్న మురారి కాటన్ మిల్ ప్రాంగణంలో, నంద్యాల పట్టణంలో రైతులకు ఉపశమనం కల్పించే దిశగా నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యంగా పత్తి రైతులకు సరైన మద్దతు ధర (Minimum Support Price – MSP) లభించేలా ఈ కొనుగోలు కేంద్రం కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. దళారుల వ్యవస్థను తొలగించి, పారదర్శకతతో కూడిన కొనుగోళ్లను ప్రోత్సహించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, నేరుగా కేంద్రంలో పత్తిని విక్రయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్.ఎమ్.డి. ఫయాజ్ , చాబోలు ఇలియాస్ ,బద్రి శెట్టి రవి, రంగ ప్రసాద్, జనసేన పబ్బతి రవి, విజయ గౌరీ, కాల్వ శీను, ధనుంజయ, డైరెక్టర్ మునియర్ ఖలీల్, మరియు నంద్యాల మార్కెట్ యార్డ్ అధికారులు, మిల్లు ఓనర్లు, స్థానిక రైతులు, మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కామారెడ్డి

కామారెడ్డి జిల్లాలో కరెంట్ మీటర్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి?

కామారెడ్డి, 17 నవంబర్ , (పున్నమి ప్రతినిధి) : కామారెడ్డి జిల్లాలో కొత్త కరెంట్ మీటర్ కోసం దరఖాస్తు చేయడం ఇప్పుడు చాలా సులభమైంది. మీరు ఇంటర్నెట్‌లో, మీసేవ కేంద్రంలో లేదా TG SPDCL అధికార వెబ్‌సైట్‌లో “కొత్త సేవ కనెక్షన్” విభాగం ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు చేసేటప్పుడు మీకు కావలసిన పత్రాలు:వ్యక్తిగత గుర్తింపు పత్రం (ఆధార్, ఓటరు కార్డు, లేదా డ్రైవింగ్ లైసెన్స్)చిరునామా ధృవీక రణ పత్రం (ఇల్లు పత్రము, అద్దె ఒప్పందం, పాస్‌ బుక్, లేదా రేషన్ కార్డు)రెండు ఫోటోలుపూర్తి చేసి న అప్లికేషన్ ఫారంఅద్దె ఇళ్లవారి ప్రక్రియఅద్దెకు ఉన్న వారు తమ పేరుమీద మీటర్ తీసుకునేందు కు ఇంటి యజమానితో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) తప్పనిసరి. అద్దె ఒప్పంద పత్రం చిరునా మా రుజువు గా చెల్లుతుంది. ఈ పత్రాలతో పాటు ఆధార్, అప్లికేషన్ మరియు ఫోటోలను మీసేవ కేంద్రంలో లేదా TGSPDCL వెబ్‌సైట్‌లో సమర్పిం చవచ్చు.సొంత ఇల్లు, స్థలం కలిగిన వారుమీ పేరు మీద నమోదు అయ్యిన సొంత ఇల్లు లేదా స్థల పత్రాలు ఉంటే, వాటిని ఆధారంగా తీసుకుని ఆధార్, రేషన్ కార్డు, ఫోటోలతో పాటు దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు సమర్పించిన తర్వాత 3-7 రోజుల్లో మీట్ కంట్రోల్ ప్రారంభం అవుతుంది.ఇల్లు లేకపోయినా సదుపాయం ఇల్లు లేదా స్థిరాస్తి పత్రాలు లేకపోయినవారైతే , మీటర్ కోసం ప్రయ త్నించవచ్చు. వాడుతున్న ప్రామాణిక చిరునామా పత్రాలు, స్థానిక అధికారుల NOC, ఆధార్ కార్డుతో పాటు 600 రూపాయల డిపాజిట్ చెల్లించి దరఖా స్తు చేయవచ్చు.చిన్న పరిశ్రమలకుచిన్న పరిశ్రమల కు కనెక్షన్ కావాలంటే పరిశ్రమ అనుమతులు, పర్యావరణ అనుమతులు, వైరింగ్ సర్టిఫికేట్ వంటి పత్రాలు సమర్పించి TGSPDCL వెబ్‌సైట్‌లోని “Industry Connection” ద్వారా దరఖాస్తు చేయాలి.దరఖాస్తు స్థితిని ఆన్‌లైన్‌ లో మీ అప్లికేష న్ నెంబర్ ఉపయోగించి గమనించవచ్చు. ఏదైనా సందేహాలు తలెత్తినప్పుడు దగ్గరి మీసేవ కేంద్రం లేదా స్థానిక విద్యుత్ కార్యాలయం సంప్రదించం డి.ఈ సదుపాయం వల్ల కామారెడ్డి జిల్లాలో విద్యుత్ కనెక్షన్ పొందడం కోసం ప్రజలకు భారీ సౌకర్యం కలబడింది.

అనకాపల్లి

హైదరాబాదులో కొప్పల వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన

ఆదివారం హైదరాబాద్‌లో కొప్పుల వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీకమాసం సందర్భంగా నిర్వహించిన పిక్నిక్ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పి వి జి కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా మాట్లాడుతూ పి వి జి కుమార్ “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువకిశోరం నారా లోకేశ్ బాబు కొప్పుల వెలమల అభివృద్ధికి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ— “తెలంగాణ ప్రభుత్వం కొప్పుల వెలమలను బిసి జాబితా నుండి తొలగించి ఓ సి కేటగిరీలో చేరించడం చాలా బాధాకరం. ఈ సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, మన వర్గ హక్కుల సాధన కోసం కృషి చేస్తాను” అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సంఘాధ్యక్షులు బాబురావు, నూకరాపు సూర్యప్రకాశరావు సహా ఇతర పెద్దలు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో 42 మంది భారతీయులు మృతి

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారత్ కు చెందిన 42 మంది యాత్రికులు మృతి చెందారు. భారతీయ యాత్రికులు ఉన్న బస్సును డీజిల్ ఢీకొట్టడంతో యాత్రికులు సజీవ దహనమయ్యారు. చనిపోయిన వారిలో హైదరాబాద్ కు చెందిన వారే ఎక్కువ ఉన్నట్టు సమాచారం. మక్కా నుండి మాది నాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో 20 మంది మహిళలు 11 మంది చిన్నారులు ఉన్నారు.

మహబూబ్ నగర్

ఉపాధ్యాయ అర్హత పరీక్ష నుండి ఇన్ సర్వీస్ సీనియర్ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయకుమార్ డిమాండ్

*రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ప్రభుత్వానికి డిమాండ్* *🔊టీచర్లకు టెట్ తిప్పలు* *🔶లాంగ్వేజెస్, ఇంగ్లిష్, బయోలజీ, ఫిజిక్స్ టీచర్లకు ఇబ్బందులు* *🔷వాళ్లకు సంబంధం లేని సబ్జెక్టుల నుంచే 90 మార్కులు* *🔶సబ్జెక్ట్ పరంగా టెట్ పెట్టాలని డిమాండ్* *రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవాధ్యక్షులు డిమాండ్* *🔷రెండేండ్లలోపే క్వాలిఫై కావాల్సినోళ్లు 45 వేల మంది టీచర్లు* *🍥పిల్లలకు పరీక్షలు పెట్టే టీచర్లకు సుప్రీంకోర్టు తీర్పుతో ఆ టీచర్లకూ సర్కారు ఎగ్జామ్ పెట్టబోతున్నది. పిల్లలు ఫెయిలైతే మళ్లీ పరీక్షలు రాసుకునే వెసులుబాటు ఉండగా, సర్కారు పెట్టే పరీక్ష రెండేండ్లలోపు పాస్ గాకపోతే వారంతా ఇంటిదారి పట్టాల్సిందే. అయితే, అభ్యర్థుల వరకూ రాసేందుకు సిద్ధంగా ఉన్నా, ఇన్ సర్వీస్ టీచర్లలో మాత్రం ఆందోళన మొదలైంది.దీనికి ప్రధాన కారణం.. ఎగ్జామ్ సిలబస్ లో వారికి సంబంధం లేని సబ్జెక్టులు ఉండటమే. 15-20 ఏండ్ల కిందే వదిలేసిన సబ్జెక్టుల్లోంచి పరీక్షల్లో ప్రశ్నలు వస్తే పరీక్ష ఎలా రాయాలని వారంతా ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో సర్కారు స్కూళ్లలో ప్రస్తుతం 1.11 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరిలో 2012 కంటే ముందే రిక్రూట్ అయిన టీచర్లు కూడా టెట్ క్వాలిఫై కావల్సిందేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రిటైర్మెంట్ కు ఐదేండ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న టీచర్లు తమ సర్వీస్ ను కొనసాగించాలంటే, ఉత్త ర్వుల తేదీ నుంచి రెండేండ్లలోపు తప్పనిసరిగా టెట్ పాస్ కావాల్సిందే. మరోపక్క ఐదేండ్లలోపు సర్వీస్ ఉన్న టీచర్లు కూడా ప్రమోషన్ పొందాలంటే టెట్ క్వాలిఫై కావాల్సి ఉంది. అయితే, 2012 తర్వాత జరిగిన అన్ని టీచర్ రిక్రూట్ మెంట్లలో టెట్ క్వాలిఫై అయిన వారే టీచర్లు వచ్చారు. కానీ, అంతకు ముందే రిక్రూట్ అయిన టీచర్లకు మాత్రం టెట్ గండం మొదలైంది. సర్వీస్ లో కొనసాగాలంటే రెండేండ్లలోపు తప్పనిసరిగా 45,742 మంది టీచర్లు, ప్రమోషన్లు పొందాలంటే 60,094 మంది టీచర్లు టెట్ క్వాలిఫై కావాల్సి ఉంది. టెట్ కు రెండు రోజుల నుంచి దరఖా స్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఇన్ సర్వీస్ టీచర్లలో ఎస్జీటీలు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు పేపర్ 1కు. స్కూల్ అసిసెంట్లు, లాంగ్వేజీ పండిట్లు, హెడ్మాస్టర్లు పేపర్ 2 ఎగ్జామ్ కు అటెండ్ కావాల్సి ఉంది.* *💥టెట్ లో సంబంధం లేని సబ్జెక్టులు* *🌀పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు 150 క్వశ్చన్లతో ఎగ్జామ్ ఉంటుంది. ఈ 2 పేపర్లలో తెలుగు, ఇంగ్లిష్, చైల్డ్ డెవలప్ మెంట్ అండ్ పెడగొజీ (సైకాలజీ) ఒక్కో సబ్జెక్టుకు 30 చొప్పున 90 మార్కులు అందరికీ కామన్ గా ఉంటాయి. పేపర్ 1లో మ్యాధ్స్ కు 30 మార్కులు, ఎన్విరాన్ మెంటల్ స్టడీస్ కు మరో 30 మార్కులున్నాయి. పేపర్ 2లో సోషల్ స్టడీస్ టీచర్లకు హిస్టరీ, జియోగ్రఫీ, సివిక్స్. ఎకనామిక్స్. పెడగోజి తదితర వాటి నుంచే 60 మార్కులు రానున్నాయి. ఎస్ఏ మ్యాథ్స్, ఫిజిక్స్, బయోలజీ టీచర్లకు 30 మార్కులు మ్యాథ్స్, సైన్స్ 30 మార్కులు ఉండ నున్నాయి. సైన్స్ లోనూ ఫిజిక్స్ లో 12 మార్కులు, బయోలజీ 12 మార్కులు, సైన్స్ పెడగోజీ నుంచి 6 మార్కులు రానున్నాయి.* . డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్, తెలుగు, ఇతర సబ్జె క్టుల్లో టీచర్లకు వచ్చిన వారి పరిస్థితి కూడా దాదాపు ఇలాంటిదే. వారంతా 30 మార్కులే ఆయా సబ్జెక్టుల కు సంబంధించిన క్వశ్చన్లు రానున్నాయి. వీరంతా మ్యాథ్స్ 30 మార్కులు ఎలా చేయగలమని ప్రశ్ని స్తున్నారు. ఉదాహరణకు ఇంగ్లిష్ టీచర్లు మ్యాథ్స్, బయోలజీ, ఫిజిక్స్, తెలుగు సబ్జెక్టుల పరీక్షలు ఎలా రాయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.* *💥టీచర్లకు వారి సబ్జెక్టుల్లోనే టెట్ పెట్టాలి* *🥏విద్యాహక్కు చట్టం నిబంధనల్లో టెట్ అంశాన్ని 2010లో పొందుపరిచారు. ఈ చట్టం ప్రకారం.. 2010 నుంచి ప్రమోషన్ కోసం ఇన్ సర్వీస్ టీచర్లకు వారు బోధిస్తున్న సబ్జెక్టుల పరంగా మాత్రమే పరీక్ష ఉండాలి. 2010 కన్నా ముందున్న వారికి అంటే.. 1995 నుంచి చట్టం అమల్లోకి రాకంటే ముందున్న వారికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. ప్రమోషన్ కోసం వారి సంబంధిత సబ్జెక్టులో మాత్రమే టెట్ ఉండాలని కోరుతున్నాం.* ?దయచేసి ప్రభుత్వం ఆలోచించి, ఇన్ సర్వీస్ టీచర్లకు సబ్జెక్టుల వారీగా టెట్ పెట్టాలి.

ఆంధ్రప్రదేశ్

వ్యవసాయ విద్యార్థుల రక్తదానం

సి.ఎస్. పురం: కదిరి బాబురావు వ్యవసాయ కళాశాలలో ఏజిబీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం- 2025 కార్యక్రమంలో భాగంగా ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఒంగోలు ఆధ్వర్యంలో జరిగిన కార్యాక్రమంలో 26 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. వారిని కళాశాల డీన్ డాక్టర్ పి. వీరన్న గౌడ్, అధ్యాపకులు అభినందించారు. ఎన్ ఎస్ ఎస్ బాద్యులు స్టెఫి, రెడ్ క్రాస్ మెడికల్ ఆఫిసర్ డాక్టర్ కృష్ణ, సిబ్బంది రవి పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

మొక్కలు.. ఆరోగ్యాన్ని అందించే ఆయుధాలు. – లయన్స్ గవర్నర్ డి. సూర్యప్రకాష్ (శ్రీకాకుళం – )

మొక్కలు.. ఆరోగ్యాన్ని అందించే ఆయుధాలని లయన్స్ జిల్లా గవర్నర్ డి. సూర్యప్రకాష్ అన్నారు. “మన ఊరు, మన బాధ్యత” లో భాగముగా, స్థానిక ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల ఆవరణలో లయన్స్ జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ.రవి కుమార్ ఆధ్వర్యంలో లయన్స్ ఇంటర్నేషనల్ సభ్యుల బృందం మొక్కలను నాటారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న గవర్నర్ డి. సూర్యప్రకాష్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డా.పైడి.సింధూర బృందంతో, జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ.రవికుమార్ అద్భుతంగా పర్యావరణ పరిరక్షణ బాధ్యతను చేపడుతున్నారని, రానున్న వారాంతంలో ఐదు వందలు మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతుండటం సంతోషకరమన్నారు. వైస్ గవర్నర్ కె.వి.సుబ్బరాజు, జిఎంటీ కోఆర్డినేటర్ డి.ఎస్.ఎస్.వి. వర్మ, డిసి వి.ఎం. రావు, జోన్ చైర్మన్ సాహు రమణ మాట్లాడుతూ లయన్ రవికుమార్ జిల్లా కలెక్టర్ సలహాలు, సూచనలతో ముందుకు వెళ్తున్నారని, జిల్లా అటవీశాఖ అధికారుల సహకారంతో శ్రీకాకుళం జిల్లానే కాకుండా, విశాఖ, విజయనగరం జిల్లాలో కూడా తన వంతు పాత్ర పోషిస్తున్నారన్నారు. అనంతరం పొన్నాడ.రవి కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు అమితమైన బాధ్యతను అందించిన ఇంటర్నేషనల్ బృందానికి ధన్యావాదాలని, నేడు నగరంలో కాలుష్య నిలయాలుగా మారిపోయాయని, అందుకే ఇంటిని ఆనందమయం చేసుకునేందుకు మొక్కలు పెంచాలని, కాలుష్యాన్ని తరిమేసే రక్షకులు మొక్కలని, ఈ రోజు కళాశాల విద్యార్థులచే మొక్కలు నాటడం ఆనందంగా ఉందని, జిల్లాలో అన్ని క్లబ్ లను సమన్వయము చేసుకుంటూ ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో భాగముగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం డిసి బరాటం.లక్ష్మణ రావు, పర్యావరణంపై, పొన్నాడ.రవి కుమార్ చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు. మన వూరు, మన బాధ్యత మొక్కలు నాటే కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఉపాధ్యక్షులు ఉర్లం.శివతేజ పట్నాయక్, కళాశాల విద్యార్థినిలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

కనుల పండువగా పుష్ప యాగం

సి.ఎస్.పురం: మండలంలోని మిట్టపాలెం నారాయణ స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి మహా ఫూష్పయాగం కనుల పండువగా నిర్వహించారు. మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వేడుకను తిలకించి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం, రాజగోపురం, ప్రాంగణం విద్యుత్తు దీపాల వెలుగుల్లో కాంతులినాయి. కోలాట ప్రదర్శనలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టు కున్నాయి. దాతల సహకారంతో భక్తులకు భోజన వసతి కల్పించారు. ఈవో ఎస్. నరసింహాబాబు, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కె. చిన్నఆదినారాయణ, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

కడప

ఏపీలోని విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే మొదలు.. పూర్తిగా ఫ్రీ..

ఏపీలోని విద్యార్థులకు ముఖ్య గమనిక. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్‌ క్యాంపులు నిర్వహిస్తోంది. నవంబర్ 17 నుంచి 26 వరకూ పది రోజుల పాటు ఈ ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఏపీ విద్యాశాఖ యూఐడీఏఐ సమన్వయంతో వీటిని ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక క్యాంపులలో పిల్లల ఆధార్ బయోమెట్రిక్‌ల‌ అప్డేట్‌ పూర్తిగా ఉచితమని.. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఏపీలో 15 లక్షల మంది పిల్లల ఆధార్ కార్డుల వివరాలు బయోమెట్రిక్ అప్ డేట్ చేయాల్సి ఉందని యూఐడీఏఐ చెప్తోంది.

కడప

భక్తులతో కిటకిటలాడిన అల్లాడుపల్లె

పవిత్ర కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని భక్తులు కడప జిల్లా మైదుకూరు మండలం అల్లాడుపల్లె గ్రామంలో గల భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం కి పోటెత్తారు కార్తీక మాసం చివరి సోమవారం కావడం తో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి ఆ స్వామి దీవెనలు పొందారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.