Friday, 20 March 2026

Blog

E-పేపర్

నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన బోలా శంకర్ సేవా సమితి పెనపోలు చంద్రశేఖర్

నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన బోలా శంకర్ సేవా సమితి పెనపోలు చంద్రశేఖర్ రైల్వేకోడూరు మేజర్ న్యూస్ రైల్వే కోడూరు రంగనాయకులపేటకు చెందిన కొర్లకుంట సిద్దమ్మ ఆనే నిరుపేద మహిళకు మా భోళాశంకరసేవా సమితి ద్వార రైల్వే కోడూర్ పాత బజర్ కు చెండిన,పెనపోలు చంద్రశేఖర్ఆనే వ్యక్తి ఎవరైనానిరూపేద మహిళకు తన వంతు సహాయము అందించాలని మా భోలా శంకర్ సేవా సమితి అధ్యక్షడు.మండల.నాగేంద్ర నీ కోరగా మా సమస్త ద్వార కొర్లకుంట సిద్దమ్మ ఆనే మహిళ పే రు చెప్పగా ఆమెకునిత్యావసర సరుకులు బియం పంపిని చేయడము జరిగినది. ఈకార్యక్రమములో పాల్గొనవారు చెనంశెట్టి రమేష్ బాబు ,వాసా బాబు, పి.రాజేశ్వరమ్మ, యనమల,రత్తయ్య,టి.ఆంజనేయులు,కొప్పల.శంకరయ్య,మహాకాళి సుబ్రహ్మణ్యం,బి.నాగరాజ మలేల ,సుబ్రహ్మణ్యం,కస్తూరీ సుబ్బారావు,పెనుకొండ సుబ్బరాయుడు,సుంకేసులబాష,చాటకొండు సుబ్రహ్మణ్యం చెనం సెట్టి పురుషోత్తం తధితరులు పల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దిగ్విజయంగా ముగిసిన యాదవ సంఘం వనభోజన మహోత్సవం

మర్రిపాడు (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండలంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం వనభోజన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వందలాది యాదవ సోదరులు తరలి రావడంతో మండల కేంద్రం సందడిగా మారింది. తాసిల్దార్ ఆఫీస్ దగ్గర ప్రారంభమైన ర్యాలీ పి.ఎన్.ఆర్ బృందావనం గార్డెన్స్ వరకు అద్భుతంగా కొనసాగింది. బాణాసంచాలు, నృత్యాలు, సంఘ జెండాలు, నినాదాలతో సాగిన ప్రదర్శన స్థానికుల దృష్టిని ఆకట్టుకుంది. బృందావనంలో ఉసిరి చెట్టు, శివలింగానికి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. పురోహితుల వేదమంత్రాలతో వాతావరణం ఆధ్యాత్మికంగా మారింది. అనంతరం వనభోజనం ఏర్పాటు చేసి సంఘసభ్యులు కుటుంబాలతో కలిసి పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన యాదవ సంఘం పెద్దలు, మాజీ ప్రజా ప్రతినిధులు నిర్వాహకులను అభినందించారు. బొమ్మి రాదయ్య మాట్లాడుతూ యాదవ సమాజ అభివృద్ధికి విద్య, ఐక్యత, పరస్పర సహకారం అత్యవసరమని పిలుపునిచ్చారు. జిల్లా యాదవ సంఘం ఆఫీసు ఏర్పాటు చేయడానికి అందరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమం విజయవంతం కావడంలో జిల్లా, మండల యాదవ సంఘం కమిటీలు, యువజన విభాగం కీలకపాత్ర పోషించాయి. మాజీ జెడ్పిటిసి చైర్మన్ చెంచలబాబు యాదవ్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

సాగు నీరు కోరుతూ రోడ్డెక్కిన రైతు

బంటుమిల్లి మండలం బంటుమిల్లి లో దాల్వా సాగు నీరు కోరుతూ బంటుమిల్లి, కృత్తువెన్ను మండలాల రైతులు, రైతు సంఘాల ఆధ్వర్యంలో స్థానిక MRO ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. మొదట పెందుర్రు నుండి ర్యాలీ గా తరలివచ్చి,అనంతరం MRO గారికి సాగు నీరు విడుదల చేయాలంటూ వినతి పత్రం అందించారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ రైతులు కోరారు. ఇప్పటికే మొంతా తుఫాన్ దాటికి కుదేలు అయ్యిపోయామని రెండో పంట కు నీరు అందిస్తే రైతు బయటపడతాడని లేదంటే వ్యవసాయం వదిలేయాల్సిన పరిస్థితి అని అని రైతులు వాపోయారు. ఈ ధర్నా కు YCP పెడన ఇంచార్జి ఉప్పాల రాము గారు మద్దతు ప్రకటించారు.

E-పేపర్

జమాఆతె ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో “పొరుగువారి హక్కుల దేశవ్యాప్త ఉద్యమం” గోడ పత్రికా ఆవిష్కరించిన నంద్యాల అధ్యక్షులు అబ్దుల్ సమద్ ఇరుగుపొరుగు కలిసి ఉండటం ఐక్యతకు నిదర్శనం…సమద్

జమాఆతె ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నవంబర్ 21-30 వరకు నిర్వహించనున్న పొరుగువారి హక్కుల ఉద్యమాన్ని నంద్యాలలో స్థానిక అధ్యక్షులు అబ్దుల్ సమద్ గోడ పత్రికా, కరపత్రాలు ఆవిష్కరించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సంధర్భంగా సమద్ మాట్లాడుతూ కుంచించుకు పోతున్న మానవ సంబంధాలు పెంపొందించుటకు, ఏకాంత జీవితానికి అలువాటు పడుతున్న ప్రజల్లో పరస్పర మానవ సంబంధాలు పెంచుటకు, ప్రజలలో సామాజిక చింతన కలిగించుటకు జమాఆతె ఇస్లామీ హింద్ సంస్థ దేశవ్యాప్తంగా నవంబర్ 21-30 మధ్య “పొరుగువారి హక్కుల ఉద్యమం” నిర్వహిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఇరుగుపొరుగు వారితో సస్సంబంధాలు , ఇచ్చిపుచ్చుకునే పూర్వ సాంప్రదాయాలు పరస్పర సహాయసహకారాలు, అన్యోనతలు కలిగించుటకు వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకుని పోతామని, ఖుర్ఆన్ తాకీదు చేసిన, ప్రవక్త ప్రవచనాలు ఉద్భోదించిన పోరుగువారి హక్కులు బాధ్యతగా స్వీకరించమని ముస్లిం సమాజాన్ని కోరుతామని తమ చుట్టుపక్కల ఉన్న అన్ని మతాలవారితో నిష్కల్మష సంబంధాలు కలిగిస్తాయని సమద్ తెలిపారు. ఇరుగు పొరుగు కలిసి ఉండటం ఐక్యతకు నిదర్శనం అన్నారు. ఈ ఉద్యమ నిర్వహణకు సి. యం. జూలియా కన్వీనర్ గా, మొహతరమా బేగం అమ్తుస్సలాం, అబ్దుల్ అలీం కో కన్వినర్ గా వ్యవహరిస్తారు అన్నారు జక్రియా మాట్లాడుతూ కళాశాలల్లో , పాఠశాల ప్రాంగణాల్లో పొరుగువారి బాధ్యతలు గుర్తు చేస్తామని,శుక్రవారం ప్రసంగాల్లో,కార్నర్ మీటింగుల్లో పొరుగవారి హక్కులు సంబంధం బాంధవ్యాల ఆవశ్యకత వివరిస్తామని, రెండు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నంద్యాల యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ విద్యార్థులనులు మేము సైతం అంటు కార్యక్రమంలో పాల్గొన్నారు

ఎన్ టి ఆర్ జిల్లా

సీఐఐ సమ్మిట్‌తో ఏపీకి పెట్టుబడుల వెల్లువ రాష్ట్రాన్ని ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చుతున్న చంద్రబాబు – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

విశాఖపట్టణం: రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేం దుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి అమోఘమైందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. విశాఖలో జరిగిన రెండు రోజుల సీఐఐ సమ్మిట్‌ ద్వారా రాష్ట్ర భవిష్యత్తు కొత్త దిశగా పయనించబోతోందని ఆమె తెలిపారు. సోమవారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయం లో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎంపీతో పాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, నాగుల్ మీరాతో కలిసి ఆమె మాట్లాడారు. సౌమ్య మాట్లాడుతూ— సమ్మిట్‌లో 613 ఒప్పందాలు కుదిరి మొత్తం ₹13.25 లక్షల కోట్లపెట్టుబడులు ప్రకటించబడినట్లు తెలిపారు. వీటి ద్వారా 16 లక్షల మందికి ఉద్యోగావకాశాలు సృష్టించ బడనున్నాయని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సులభ వాతావరణం, భౌగోళిక విశిష్టత లను పరిశ్రమాధిపతులు అభి నందిస్తున్నారని వెల్లడించారు. CRDA, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, టూరిజం, మున్సిపల్ తదితర కీలక విభాగాల్లో భారీగా ఒప్పందాలు కుదిరినట్లు ఆమె వివరించారు. ప్రాంతాల వారీగా పెట్టుబడుల పంపిణీపై మాట్లాడిన ఆమె— రాయలసీమలో రెన్యూవబుల్ మాన్యుఫ్యాక్చరింగ్, కోస్తాంధ్రలో క్వాంటం, పెట్రో, ఆక్వా, పోర్ట్ ఆధారిత రంగాలు, ఉత్తరాంధ్ర–విశాఖలో ఐటీ, ఏఐ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో గణనీయమైన పెట్టుబడులు ప్రవహిస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో ప్రతి నియోజక వర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు స్థాపించి “ఇంటికొక పారిశ్రామికవేత్త” లక్ష్యాన్ని చేరు కునేందుకు ప్రభుత్వం ముంద డుగులు వేస్తోందని ఆమె చెప్పింది. గతంలో జీనోమ్ వ్యాలీ, మైక్రోసాఫ్ట్ వంటి ఐటీ దిగ్గజాలను హైదరాబాద్‌కు తీసుకువచ్చిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రధాన పరిశ్రమలను నెలకొల్పి మరోసారి చరిత్ర సృష్టించ బోతున్నారని పేర్కొన్నారు.

E-పేపర్

భారత ఎన్నికల కమిషన్ పనితీరు- ప్రజాస్వామ్యం పై దాని ప్రభావం అనే అంశంపై కరపత్రాల విడుదల

నంద్యాల పట్టణంలోని ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక జిల్లా కార్యాలయంలో భారత ఎన్నికల కమిషన్ పనితీరు ప్రజాస్వామ్యం పై దాని ప్రభావం అనే అంశం పైన ఈనెల 23వ తేదీ ఆదివారం నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కాలేజీ వివేకానంద ఆడిటోరియం నందు ప్రజాసంఘాల ప్రజాసభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కరపత్రాలు ఆవిష్కరణకు పెద్దలు ప్రజాస్వామ్య పర్యరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎం రామకృష్ణారెడ్డి మరియు మాజీ కౌన్సిలర్ శంకరయ్య ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని వివిధ యువజన,ప్రజా సంఘాల నాయకుల చేత కరపత్రాలను ఆవిష్కరించారు. 23వ తేదీ జరిగే ప్రజాసంఘాల ప్రజాసభకు ప్రధాన వక్తగా జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్v బ్రహ్మారెడ్డి రెడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎం రామకృష్ణారెడ్డి జై భారత్ సంస్థ నాయకులు లోకనాథ్ ఈ ప్రజా సభకు హాజరవుతారు నంద్యాలలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజలు యువజన, విద్యార్థి, మహిళా,కార్మిక,కర్షక, మేధావులు మరియు ప్రజాస్వామ్య వాదులు ఎక్కువ సంఖ్యలు హాజరై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో తమ వంతు బాధ్యతగా ఈ సభకు హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరి రక్షణ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుమల రహీం, ప్రజా సంఘాల నాయకులు క్రిస్టియన్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నెం దానయ్య, ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కరాటేమా భాష, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ సయ్యద్ ఇక్బాల్, నంద్యాల కూరగాయల మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు హర్షద్, డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ అధ్యక్షులు మస్తాన్ వలి, పి డి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు రఫీ,చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, జానో జాగో మహబూబ్బాషా,గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రొక్కం నాగేశ్వర రెడ్డి, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక బండి ఆత్మకూరు మండల ఉపాధ్యక్షులు నాగకాంత్ రెడ్డి, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నంద్యాల మండల ఉపాధ్యక్షులు చాబోలు ఆరిఫ్, బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు రాజునాయక్ నంద్యాల జిల్లా బట్రాజుల సంఘం జిల్లా కార్యదర్శి సంజీవరాజు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ శివరామిరెడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మహిళా విభాగం కోశాధికారి నీలిమ తదితరులు పాల్గొన్నారు

Blog

భారత ఎన్నికల కమిషన్ పనితీరు- ప్రజాస్వామ్యం పై దాని ప్రభావం అనే అంశంపై కరపత్రాల విడుదల

నంద్యాల పట్టణంలోని ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక జిల్లా కార్యాలయంలో భారత ఎన్నికల కమిషన్ పనితీరు ప్రజాస్వామ్యం పై దాని ప్రభావం అనే అంశం పైన ఈనెల 23వ తేదీ ఆదివారం నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కాలేజీ వివేకానంద ఆడిటోరియం నందు ప్రజాసంఘాల ప్రజాసభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కరపత్రాలు ఆవిష్కరణకు పెద్దలు ప్రజాస్వామ్య పర్యరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎం రామకృష్ణారెడ్డి గారు మరియు మాజీ కౌన్సిలర్ శంకరయ్య ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని వివిధ యువజన,ప్రజా సంఘాల నాయకుల చేత కరపత్రాలను ఆవిష్కరించారు. 23వ తేదీ జరిగే ప్రజాసంఘాల ప్రజాసభకు ప్రధాన వక్తగా జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్v బ్రహ్మారెడ్డి రెడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎం రామకృష్ణారెడ్డి జై భారత్ సంస్థ నాయకులు లోకనాథ్ ఈ ప్రజా సభకు హాజరవుతారు నంద్యాలలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజలు యువజన, విద్యార్థి, మహిళా,కార్మిక,కర్షక, మేధావులు మరియు ప్రజాస్వామ్య వాదులు ఎక్కువ సంఖ్యలు హాజరై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో తమ వంతు బాధ్యతగా ఈ సభకు హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరి రక్షణ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుమల రహీం, ప్రజా సంఘాల నాయకులు క్రిస్టియన్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నెం దానయ్య, ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కరాటేమా భాష, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ సయ్యద్ ఇక్బాల్, నంద్యాల కూరగాయల మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు హర్షద్, డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ అధ్యక్షులు మస్తాన్ వలి, పి డి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు రఫీ,చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, జానో జాగో మహబూబ్బాషా,గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రొక్కం నాగేశ్వర రెడ్డి, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక బండి ఆత్మకూరు మండల ఉపాధ్యక్షులు నాగకాంత్ రెడ్డి, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నంద్యాల మండల ఉపాధ్యక్షులు చాబోలు ఆరిఫ్, బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు రాజునాయక్ నంద్యాల జిల్లా బట్రాజుల సంఘం జిల్లా కార్యదర్శి సంజీవరాజు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ శివరామిరెడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మహిళా విభాగం కోశాధికారి నీలిమ తదితరులు పాల్గొన్నారు

కాకినాడ

పెద్దాపురం 27వ వార్డు బ్రహ్మల వీధిలో రోడ్డు, డ్రైనేజీ సమస్యలు.. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లిన పెద్దాపురం బీజేపీ అధ్యక్షుడు రామ్‌కుమార్.

పెద్దాపురం, నవంబర్ 17, 27వ వార్డులోని బ్రహ్మల వీధి (బ్రహ్మల కాలనీ) నివాసులు రోడ్డు, డ్రైనేజీ సౌకర్యాలు లేక రోజువారీ జీవితంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిషత్‌లో పెద్దాపురం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు బొలిశెట్టి రామ్‌కుమార్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు సానుకూలంగా స్పందించి, త్వరలోనే సిబ్బందిని పంపి పరిశీలించి, మూడు నెలల్లో సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాలనీలో రోడ్లు లేకుండా, డ్రైనేజీ వ్యవస్థ లోపం కారణంగా నివాసులు తుఫానులు, వర్షాల సమయంలో తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, పిల్లలు, వృద్ధులు ఈ సమస్యలతో మరింత ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని బీజేపీ అధ్యక్షుడు బొలిశెట్టి రామ్‌కుమార్ ప్రజా సమస్యల సమావేశంలో వివరంగా చెప్పి, తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కాలనీ నివాసులు సమస్యలను వివరించడానికి చెల్లిపోయిన రత్నం, డి. సురేష్, జి. కుమారి, నాగమ్మ, జ్యోతి, భవాని, జి. సురేష్ తదితరులు పాల్గొన్నారు. వారు రోడ్లు నిర్మాణం, డ్రైనేజీ లైన్లు వేయాలని, ఇలాంటి సౌకర్యాలు లేకుండా రోగాలు, అధిక వ్యయాలు పెరుగుతున్నాయని తెలిపారు. మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ, సమస్యలు గుర్తించి. బడ్జెట్, సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని, మూడు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని కాలనీ వాసులకు నమ్మకాన్ని కల్పిస్తూ, హామీ ఇవ్వడం జరిగింది.

ఎన్ టి ఆర్ జిల్లా

జనసేన నేత గాదెల రామారావు కుమార్తె వివాహ రిసెప్షన్‌లో పాల్గొన్న సామినేని విమలభాను

వత్సవాయి మండలం, వత్సవాయి గ్రామానికి చెందిన జనసేన నాయకులు గాదెల రామారావు కుమార్తె వివాహం సందర్బంగా వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను సతీమణి సామినేనివిమలభాను పాల్గొన్నారు. నూతన వధూవరు లను ఆశీర్వదించి, హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ జేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కుటుంబసభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

కార్తీక సోమవారం సందర్భంగా స్వాములకు అన్నసంతర్పణ

పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో కార్తిక సోమవారం సందర్భంగా అయ్యప్ప, శివమాల ధారణ చేసిన స్వాములకు అన్నసంత ర్పణ కార్యక్రమంనిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయ భాను ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఆయన సతీమణి సామినేని విమలభాను ప్రారం భించారు. స్వాములకు నైవేద్యం సమర్పించిన అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.