Friday, 20 March 2026

Blog

భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కలెక్టర్కు జాతీయ స్థాయి అవార్డు

భద్రాద్రి కలెక్టర్కు జాతీయ స్థాయి అవార్డు పున్నమి ప్రతినిధి- భుక్యా వినోద్ కుమార్ 18 నవంబర్ 2025, భద్రాద్రి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. జల్ సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను, సౌత్ జోన్ 3లో ఆయన ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. నేడు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డుతో పాటు రూ. 25 లక్షల నగదు బహుమతిని కూడా అందుకోనున్నారు. తెలంగాణలో ఎంపికైన ఆరు జిల్లాల్లో భద్రాద్రి జిల్లా ఒకటి. భద్రాద్రి జిల్లా కలెక్టర్ కు జాతీయ స్థాయి అవార్డు రావడంతో జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు.

విశాఖపట్నం

విశాఖ ఉత్తర నియోజకవర్గం 24 వార్డు బృందావనం పార్క్ లో కోటి సంతకాలు సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న – కె.కె రాజు

మంగళవారం విశాఖ ఉత్తర నియోజకవర్గం 24వార్డు టి పి టి కాలనీలో బృందావనం పార్క్ వద్ద ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం 24వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబెర్ సాడి పద్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.ఈకార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు,విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు పాల్గొని విద్యార్థులు,మేధావులు,ప్రజలు వద్ద నుండి సంతకాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 24 వార్డు అధ్యక్షులు జి.అశోక్ రెడ్డి 24వార్డు సీనియర్ నాయకులు,మహిళలు ఐటీ వింగ్ టీమ్,తదితరులు పాల్గొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం

ప్రమాదకరంగా విద్యుత్ తీగలు

ప్రమాదకరంగా విద్యుత్ తీగలు పొంచి ఉన్న ప్రమాదం పట్టించుకోని జిల్లా విద్యుత్ అధికారులు పున్నమి ప్రతినిధి – భుక్యా వినోద్ కుమార్ 18నవంబర్ 2025, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం కోయగూడెం గ్రామపంచాయతీ పరిధిలో గల కోయగూడెం గ్రామపంచాయతీ నుంచి పెద్ద కోయగూడెంకు రోడ్డు మార్గం లో ఉన్న కరెంటు తీగలకు చెట్ల కొమ్మలు తగులుతూ ప్రమాదకరంగా ఉన్నాయి. కోయగూడెం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలకు ముందు రోడ్డు మార్గంలో చెట్ల కొమ్మలు కరెంట్ తీగలకు తాకుతూ ఉన్నాయి, ఈ గిరిజన ఉన్నత ఆశ్రమ పాఠశాలలో సుమారుగా 300 మంది విద్యార్థులకు విద్యాభ్యాసం జరుగుతూ ఉంటుంది, జిల్లాల నలుమూలల గిరిజన ప్రాంతాల నుంచి గిరిజన విద్యార్థులు వసతి ఉంటున్నారు? అదే విధంగా గ్రామంలో ప్రజలు ఇదే రోడ్డు మార్గం లో నిరంతరం ప్రజలు తిరుగుతూ ఉంటారు? అయితే జిల్లా విద్యుత్ అధికారులు విద్యుత్ వైర్లకు ఉన్న చెట్ల కొమ్మలను తొలగించకపోతే ఏ సమయంలోనైనా విద్యుత్ ప్రమాదం పొంచి ఉన్నది? ప్రభుత్వ విద్యుత్ అధికారులు విద్యుత్ వైర్లపై ఉన్న చెట్ల కొమ్మలను తక్షణమే తొలగించాలని స్థానికులు కోరారు.

కాకినాడ

శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా అఖండ మహా దీపారాధన

పున్నమి న్యూస్, పెద్దాపురం, నవంబర్ 17.కార్తీక మాసంలోని సోమవారం పురస్కరించుకొని ప్రముఖ గ్రామ దేవతాలయం శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో అఖండ మహా దీపారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ ఈవో శ్రీమతి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంనకు ఎమ్మెల్యే చినరాజప్ప గారు, రాజా సూరిబాబు రాజు గారు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యే గారు అమ్మవారిని ప్రత్యేక పూజలు చేసి దర్శనం చేసుకుని, స్వయంగా అఖండ దీపారాధనను తిలకించారు. కార్తీక మాసంలో సోమవారాలు పవిత్రమైనవిగా భావించే నేపథ్యంలో వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి పూజలు, అభిషేకాలు, అఖండ దీపారాధనలో పాల్గొన్నారని ఆలయ EO విజయలక్ష్మి అన్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది సహకారంతో కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందని భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

సూర్యాపేట

కోదాడలో దళిత యువకుడి అనుమానాస్పద లాకప్ డెత్ – చిత్రహింసలు, నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆగ్రహం

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి తెలంగాణ ప్రతి నిధి) సూర్యాపేట జిల్లాలోని కోదాడలో దళిత యువకుడి లాకప్ డెత్ కలకలం రేపుతోంది. కోదాడ కల్లుగడ్డ బజారు ప్రాంతానికి చెందిన కర్ల రాజేష్ (30) అనే యువకుడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు కాజేయబడిన విషయంపై న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించగా, అదే ఫిర్యాదు అతని ప్రాణాలకు కారణమైనట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తెలుసుకున్న వివరాల ప్రకారం, రాజేష్ పేరు మీద విడుదలైన రూ.1 లక్ష సీఎంఆర్‌ఎఫ్ చెక్కును దొండపాడు ప్రాంతానికి చెందిన చెడపంగు నరేష్ అనే వ్యక్తి దుర్వినియోగం చేసినట్టు బయటపడింది. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసిన రాజేష్‌ను కస్టడీలోకి తీసుకున్న కోడాడ రూరల్ సీఐ, చిలుకూరు ఎస్ఐ, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు నాలుగు రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసినట్టు కుటుంబ సభ్యుల ఆరోపణ. తీవ్ర గాయాలతో ఉన్న రాజేష్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి, రిమాండు నిమిత్తం హుజూర్‌నగర్ సబ్ జైలుకు తరలించగా, అక్కడ ఆయన శ్వాస సమస్యతో ఇబ్బంది పడటాన్ని గమనించిన జైలు అధికారులు తిరిగి పోలీసులకే అప్పగించారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలో పరిశీలించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్ తరలించాలని సూచించారు. అయితే మార్గమధ్యంలోనే రాజేష్ మృతి చెందాడు. తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసిన రాజేష్‌ను కస్టడీలో చిత్రహింసలు పెట్టి చంపారని కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి రాకుండా కోదాడ డీఎస్పీ ప్రయత్నిస్తున్నారని దళిత సంఘాలు ఆరోపిస్తుండగా, రాజేష్ కుటుంబం న్యాయం చేయాలని మానవ హక్కుల సంఘాలు, దళిత సంఘాలకు విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం

టేకులపల్లి మోడల్ స్కూల్‌లో దయనీయ స్థితి – ప్రమాదకరంగా మారిన హాస్టల్ భవనం, విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన తెలంగాణ జాగృతి నేత శ్రీమతి కవిత

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి తెలంగాణ ప్రతినిధి) ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి మోడల్ స్కూల్‌లో దయనీయ స్థితి మీద తెలంగాణ జాగృతి నేత శ్రీమతి కవిత ఆందోళన వ్యక్తం చేశారు. టేకులపల్లి మోడల్ స్కూల్ ని సం దర్శించిన ఆమె మీడియా తో మాట్లాడుతూ.. మోడల్ స్కూల్‌లో పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయి. హాస్టల్ భవనం పూర్తిగా ప్రమాదకర స్థితికి చేరడం వల్ల విద్యార్థులు భయాందోళన మధ్య రోజులు గడుపుతున్నారన్నారు. కొన్ని రోజుల క్రితం భోజనంలో బొద్దింకలు, పురుగులు రావడంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన వెలుగులోకి రావడంతో నిర్వహణ లోపాలు బయటపడ్డాయని ప్రభుత్వ గురుకులాలు, మోడల్ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లలో ఇలాంటి సమస్యలు నిరంతరం వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో పర్యటించినా విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన హాస్టళ్లలో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు సంక్షేమ హాస్టల్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ప్రజల తరుపున డిమాండ్ చేస్తున్నాను అని అన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కవలల బయోమెట్రిక్ మ్యాచ్… కాన్పూర్లో కలకలం!

ఉత్తర ప్రదేశ్‌ కాన్పూర్లో : ప్రపంచంలో రెండు వ్యక్తుల వేలిముద్రలు ఒకేలా ఉండవన్న శాస్త్రీయ నమ్మకానికి సవాల్ విసిరే ఘటన ఉత్తర ప్రదేశ్‌కు చెందిన కాన్పూర్లో వెలుగులోకి వచ్చింది. కవలలైన ప్రబల్ మరియు పవిత్ర మిశ్రాల ఫింగర్ ప్రింట్లు మాత్రమే కాదు, రెటీనా స్క్యాన్ నమూనాలు కూడా ఒకేలా ఉన్నట్లు నమోదు కావడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. ఈ విచిత్ర అంశం బయటపడటానికి కారణం వారి ఆధార్ అప్డేట్ ప్రక్రియ. కవలల్లో ఒకరి బయోమెట్రిక్ అప్డేట్ చేసే సమయంలో, మరొకరి ఆధార్ అప్రతంగా డియాక్టివేట్ కావడం సమస్యగా మారింది. వెంటనే పరిశీలించిన UIDAI అధికారులకు ఇరువురి బయోమెట్రిక్స్ పూర్తిగా ఒక్కటేలా నమోదై ఉన్నట్లు తెలిసింది. సాధారణంగా జన్యు నిర్మాణం ఒకటే అయినా, కవలల వేలిముద్రలు, కంటి రెటీనా నమూనాలు పూర్తిగా ఒకటే కావడం శాస్త్రపరంగా అసాధ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వ్యక్తి అభివృద్ధిలో సూక్ష్మ మార్పులు చోటుచేసుకోవడం వల్ల బయోమెట్రిక్స్ ప్రత్యేకత సాధిస్తాయి. అలాంటి సందర్భంలో ఈ ఘటన కొత్త అనుమానాలకు దారితీసింది. నిజంగానే ఈ కవలల బయోమెట్రిక్స్ ఒక్కటేనా? లేదా నమోదులో సాంకేతిక లోపం జరిగిందా? అనే అంశంపై UIDAI ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించింది. ఈ పరిణామం దేశవ్యాప్తంగా బయోమెట్రిక్ సిస్టమ్ నమ్మకంపై చర్చ రేపుతోంది. ఒకేలా రెండు వేలిముద్రలు ఉండవనే దృఢమైన అభిప్రాయాన్ని ఈ ఘటన ఎంతవరకు ప్రభావితం చేస్తుందో చూడాలి.

ములుగు

ములుగు జిల్లాలో యువకుడి దారుణ హత్య

ములుగు జిల్లాలో యువకుడి దారుణ హత్య ములుగు జిల్లా మండలం లాలాయగూడెంలో జాడి సమ్మయ్య అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు అతన్ని కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది వివరాల్లోకెళ్తే ఏటూర్ నగరం మండల కేంద్ర లో జాడి సమ్మయ్య (40) మండల కేంద్రంలోని ఎలక్ట్రిషన్ గా పనిచేస్తు జీవనం గడుపుతున్నాడు అతనికి వివాహం కాగా భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు గత కొద్దికాలంలో లాలాయిగూడెం చెందిన ఒక మైనర్ బాలిక( 16) తో వివాహేతర సంబంధం పెట్టుకొని మద్యానికి బానిస అయ్యాడని సమాచారం గత కొద్దిరోజుల క్రితం సమ్మయ్య తండ్రి సైతం గొడవలు అవుతున్నాయని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం ఈ క్రమంలో సమ్మయ్య ఆదివారం సాయంకాలం టీఎస్ 25766 నెంబర్ గల ద్విచక్ర హోండా వాహనం లాలాయి గూడెం లో ఉన్న మైనర్ బాలిక తల్లిదండ్రులు సమ్మయ్య ను గ్రామంలో ఉన్న ఒక విద్యుత్ స్తంభానికి కట్టేసి విపరీతంగా కొట్టగా ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

విశాఖపట్నం

రోడ్డు ప్రమాద బాధితుల స్మరణ సభలో పాల్గొన్న రవాణా శాఖ అధికారులు

విశాఖపట్నం, నవంబర్ 16: (పున్నమి ప్రతినిధి) “వరల్డ్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఫర్ రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్” సందర్భంగా బ్రహ్మకుమారి సమాజం కార్యాలయంలో నిర్వహించిన రోడ్డు ప్రమాద బాధితుల స్మరణ సభలో రవాణా శాఖ, ప్రజా రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజినల్ మేనేజర్ మాట్లాడుతూ— అతివేగమే రోడ్డు ప్రమాదాల ప్రధాన కారణంగా మారిందని, వేగ నియంత్రణ పాటించకపోవడంతో విలువైన ప్రాణాలు కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఉప రవాణా కమిషనర్ మాట్లాడుతూ— విశాఖపట్నం జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రతి రెండు నెలలకు ఒకసారి జరుగుతున్న రోడ్డు భద్రత కమిటీ సమావేశాల్లో ప్రమాదాలకు దారితీసే కారణాలను పరిశీలించి నివారణ చర్యలు చేపడుతున్నాము అన్నారు. అతివేగం అదుపులో పెట్టడం, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకపోవడం, స్కూల్ పిల్లలను తీసుకెళ్లే ఆటోల్లో అనుమతికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని సూచించారు. బ్రహ్మకుమారి సమాజం ప్రతినిధులు మాట్లాడుతూ— డ్రైవర్లకు ఏకాగ్రత అత్యంత కీలకం అని, రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారికి శాంతి కలగాలని ప్రార్థిస్తూ కార్యక్రమాన్ని ముగించారు.

తెలంగాణ

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి తెలంగాణ ప్రతి నిధి) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం తీసుకున్న ముఖ్య నిర్ణయాలను మీడియాకు మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించారు. 👉🏽ప్రజాకవి అందెశ్రీకి కేబినెట్ నివాళి తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీ గారి మరణం రాష్ట్రానికి తీరని లోటుగా కేబినెట్ పేర్కొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించింది. కేబినెట్ నిర్ణయాలు: అందెశ్రీ గారి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం అందెశ్రీ స్మృతి వనం ఏర్పాటు పాఠ్యపుస్తకాల మొదటి పేజీలో “జయజయహే” రాష్ట్ర గీతం ముద్రణ 👉🏽 రిజర్వేషన్ల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు బీసీలకు 42% రిజర్వేషన్లపై కేంద్రం సహకరించనందున, హైకోర్టు ఆదేశాల ప్రకారం: 50% రిజర్వేషన్ పరిమితిలో స్థానిక సంస్థల ఎన్నికలు 15వ ఫైనాన్స్ కమీషన్ నిధుల దృష్ట్యా ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు 👉🏽తెలంగాణ గిగ్ వర్కర్స్ బిల్లు ఆమోదం సుమారు 4 లక్షల గిగ్ వర్కర్లు రక్షణ & భరోసా పొందేలా రూపొందించిన గిగ్ వర్కర్స్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 👉🏽 SRSP ఫేజ్–2 కు దామోదర్ రెడ్డి పేరు SRSP ఫేజ్–2 కు దివంగత నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరును కేబినెట్ ఖరారు చేసింది. 👉🏽 ప్రజా ప్రభుత్వం 2 ఏళ్ల సందర్బంగా గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫోర్త్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని నిర్ణయం. ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు డిసెంబర్ 9న తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల 👉🏽సౌదీ ప్రమాదంలో తెలంగాణ వాసుల మృతి – సంతాపం & సాయం సౌదీలో జరిగిన ప్రమాదంలో మరణించిన తెలంగాణ వాసుల కుటుంబాలకు: ₹5 లక్షల ఆర్థిక సాయం తక్షణమే ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని సౌదీకి పంపడం కుటుంబ సభ్యుల కోరిక మేరకు అక్కడే అంత్యక్రియలకీ ప్రభుత్వం సహాయం. చేస్తుంది అని మంత్రి పొంగులేటి శ్రీనువాసు రెడ్డి తెలియజేసారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.