Friday, 20 March 2026

Blog

E-పేపర్

మహిళలు ఉత్పత్తి రంగంలో రాణించాలి జిల్లా ఉపాధి అధికారి ప్రసాద్

మహిళలు ఉత్పత్తి రంగంలో రాణించాలి జిల్లా ఉపాధి అధికారి ప్రసాద్ రైల్వేకోడూరు మేజర్ న్యూస్ రైల్వేకోడూరు స్థానిక గిరిజమ్మ వీధిలోని గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని జిల్లా ఉపాధి అధికారి కె.సురేష్ సందర్శించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతికి వస్తున్నాం105వ టైలరింగ్ బ్యాచ్ లో శిక్షణ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన శిక్షణ పొందుతున్న మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ మీ ప్రతిభ మీరు కుట్టిన దుస్తులతో చూపించాలన్నారు. ఉన్నతమైన ఆశయాలను కలిగి, కొత్త పద్ధతులతో వ్యాపార రంగంలో రాణించాలన్నారు. ఫుడ్ ప్రొడక్ట్స్, గార్మెంట్స్, బ్యూటీ పార్లర్ కేంద్రాలు, డైరీ యూనిట్లు మొదలగు రంగాలలో విజయం సాధిచిన వారిని ఆదర్శంగా తీసుకుని మహిళా పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు. నారీ శక్తి వంటి పథకాలు ఉపయోగించుకోవలన్నారు. ట్రస్ట్ చైర్మన్ కె.పార్థసారధి మాట్లాడుతూ సంక్రాంతికి టైలర్లుగా తీర్చిదిద్దే విధంగా శిక్షణ ఇస్తున్నామని అందరూ శ్రద్ధగా నేర్చుకుంటున్నారని వారిని ప్రోత్సహించుటకు కుట్టిన బట్టలు ప్రదర్శించి ఓటింగ్ పద్ధతి ద్వారా మొదటి మూడు స్థానాలు పొందిన వారికి బహుమతులు అందజేస్తున్నామన్నారు. ముఖ్య అతిధి జిల్లా ఉపాధి అధికారి కె.సురేష్ చేతుల మీదుగా మొదటి గ్రూపులో మొదటి మూడు స్థానాలు పొందిన సుమలత, ప్రత్యూష, ముస్కినా లకు, రెండవ గ్రూపులో మొదటి మూడు స్థానాలు పొందిన తస్లీమా, కావ్య, మౌనిక లకు బహుమతులు అందజేశారు. అనంతరం జిల్లా ఉపాధి అధికారిని మహిళలు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ట్రస్ట్ కో ఆర్డినేటర్ ముస్కినా, ట్రైనర్ కావ్య, మహిళలు పాల్గొన్నారు.

తెలంగాణ

మావోయిజానికి ఇక నాలుగు నెలలు మాత్రమే” — హిడ్మా ఎన్‌కౌంటర్ నేపథ్యంలో కఠిన సందేశం ఇచ్చిన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్

పువ్వాడ నాగేంద్ర కుమార్ (తెలంగాణ పున్నమి ప్రతినిధి) కేంద్ర ప్రభుత్వం మావోయిజంపై యుద్ధస్ఫూర్తితో కొనసాగిస్తున్న చర్యల నేపథ్యంలో, హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. నక్సలైట్లకు ఇక నాలుగు నెలలే మిగిలాయని, దేశంలో మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని వెల్లడించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘కాంప్రమైజ్ లేని ప్రభుత్వం’ మార్గదర్శకత్వంలో, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ముందుండి మావోయిస్టులపై దృఢంగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ కూమర్ అన్నారు. నక్సలైట్లు ఆయుధాలు వదిలేసి జన జీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. వచ్చే మార్చికల్లా మావోయిజం పూర్తిగా ముగుస్తుందని, ఇక ప్రభుత్వ ధోరణిలో ఎలాంటి సడలింపు ఉండదని బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. అర్బన్ నక్సల్స్ పేరుతో నగరాల్లో సురక్షితంగా ఉంటూ, పేద యువకులను అడవుల్లోకి తోసే వ్యక్తులే అసలు దేశద్రోహులని వ్యాఖ్యానించారు. నిరపరాధుల మరణాలకు వారికి బాధ్యత ఉంటుందని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూమర్ పేర్కొన్నారు.

E-పేపర్

జాతీయ స్థాయికి యస్ వి కె స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థిలు ఎంపిక

జాతీయ స్థాయికి యస్ వి కె స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థిలు ఎంపిక రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరుకు చెందిన ఎస్ వి కె స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థులు ఈ నెల 15,16 వ తేది కాకినాడలో ఆంధ్ర ప్రదేశ టైక్వాండోఅసోసియేషన్ నీర్వహించిన 39వ సబ్ – జూనియర్, 8th క్యాడట్, 41st సీనియర్స్ రాష్ట్ర స్థాయి టైక్వాండో పోటీలు నిర్వహించారు . ఇందులో రైల్వేకోడూరు పట్టణం లో ఉన్న యస్.వి.కె స్పోర్ట్స్ అకాడమీకి చెందిన సీనియర్స్ విభాగంలో ఎం.చైతన్య ప్రసాద్, జె. నాగమణి. బంగారు పథకాలు సాధించారు సబ్ -జూనియర్ విభాగంలో పి.నాగ చరణ్. జి. అభి రామ్ సాయి వర్మ .బంగారు పథకాలు సాధించారు. క్యాడట్ బాలుల విభాగంలో పి. శ్రీరామ్, ఎ. రామ్ చరణ్ బాలికల విభాగంలో పి. హర్షిత, కె. నిహారిక బంగారు పతకాలు సాధించారు, వరుణ్ కుమార్ , వర్ష(శ్రీ, సుమయ వెండి పథకాలు సాధించారని కోచ్ శివాజీ తెలిపారు . రాష్ట్ర స్థాయిలో బంగరు పతకాలు సాధించిన 8 మంది ఈ నెల 21 నుండి26 వ తేదీలలో పంజాబ్ లో జరగబోయే జాతీయ స్థాయి టైక్వాండో పోటీలకు ఎంపికయినట్లు తెలిపారు, అలాగే సీనియర్స్ విభాగంలో డిసెంబర్ నెలలోహైదరాబాద్ లో జరగభోయే జాతీయ స్థాయి టైక్వాండో పోటీలకు ఎంపికయినట్లు విలేకర్ల సమావేశంలో తెలిపారు.

ఖమ్మం

అయ్యప్ప మండపాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు – భక్తులతో కలిసి సహాపంక్తి భోజనం

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి తెలంగాణ ప్రతి నిధి) ఖమ్మం 1వ పట్టణం 18వ డివిజన్‌లో శ్రీ దివ్య మణికంఠ అన్నదాన సేవ సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప మండపాన్ని ఈరోజు బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ నెల్లూరి కోటేశ్వరరావు, ఖమ్మం 1 వ పట్టణ అధ్యక్షులు గడీల నరేష్ సందర్శించారు. పూజ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం జరిగిన మహా అన్నసంతర్పణలో అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులతో కలిసి సహాపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా కార్తీకమాసం సందర్భంగా ప్రతిరోజు సుమారు 1500 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న ట్రస్ట్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. వృత్తిరీత్యా వివిధ ప్రాంతాల్లో పనిచేసే అయ్యప్ప మాలదారుల కోసం ఒకే వేదికపై అన్నసేవ అందిస్తుండడం ప్రశంసనీయమన్నారు. కమిటీ సభ్యులు శ్రీరాముల వీరభద్రం, ఉప్పల భూపతి రెడ్డి, శ్రీనివాస్‌తో పాటు బీజేపీ నాయకులు నెల్లూరి బెనర్జీ, బండ్ల రిగాన్ ప్రతాప్, పొట్టిమూతి జనార్దన్, గడల నరసింహారావు, నేరెళ్ల శ్రీనివాస్, పాలేపు రాము, మేడ సంపత్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ కామారెడ్డి తెలంగాణ

కామారెడ్డి జిల్లా పోలీసులు – నెలకు 150కుపైగా మొబైల్ ఫోన్ల రికవరీ

కామారెడ్డి:, 18 నవంబర్ పున్నమి ప్రతినిధి : జిల్లా పోలీస్ శాఖ ప్రతీ నెల 150కుపైగా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తూ, బాధితులకు వీటిని తిరిగి అందజేస్తోంది. ఇప్పటి వరకూ ఈ సంవత్సరం మొత్తం 1,722 మొబైల్ ఫోన్లు సుమారు రూ. 2.75 కోట్ల విలువైనవి రికవరీ చేసి, యజమానులకు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ శ్రీ యం.రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు తెలిపారు.ఇటీవల నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా 143 మొబైల్ ఫోన్లు (మొత్తం విలువ ₹23 లక్షలు) తిరిగి రికవరీ చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసులకు ప్రత్యేక బృందంగా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో RSI బలరాజు, ఆరుగురు కానిస్టేబుళ్లు ఉన్నారని ఎస్పీ వివరించారు. రికవరీలో విశేషంగా పనిచేసిన సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు.ఎస్పీ గారు మాట్లాడుతూ, మొబైల్ ఫోన్ నేటి కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యావసరమైనదని, అందులో ఉన్న వ్యక్తిగత డేటా, బ్యాంక్ వివరాలు, సోషల్ మీడియా అకౌంట్లు వంటి సమాచారం ఆర్థిక మరియు వ్యక్తిగత భద్రతకు కీలకమని తెలిపారు.మొబైల్ పోయిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడం, సిమ్ బ్లాక్ చేసి CEIR వెబ్‌సైట్ ద్వారా IMEI నంబర్ బ్లాక్ చేయడం ద్వారా ఫోన్‌ను త్వరగా గుర్తించే అవకాశం ఉంటుందని సూచించారు.జిల్లాలో CEIR పోర్టల్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు మొత్తం 4,169 ఫోన్లు (రూ. 6.67 కోట్ల విలువ) రికవరీ చేయడం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు.పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి పొందదలచిన బాధితులు జిల్లా పోలీస్ కార్యాలయంలో RSI శ్రీ బాలరాజు (8712686114) గారిని సంప్రదించి, సంబంధిత ధ్రవీకరణ పత్రాలు చూపి తమ మొబైల్ స్వీకరించవచ్చని తెలిపారు.

నాగర్‌కర్నూల్

ఏసీబీ కి చిక్కిన విద్యుత్ శాఖ ఏఈ

గోపాల్ పేట : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో లంచాలు తీసుకుంటూ అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుపడుతున్న సంఘటనల పరంపర కొనసాగుతోంది. మంగళవారం వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం విద్యుత్ శాఖ ఏఈ హర్షవర్ధన్ రెడ్డి ట్రాన్స్ ఫార్మర్ మంజూరి కోసం రూ.20వేలు లంచం తీసుకుంటుండ‌గా.. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివ‌రాల్లోకి వెళ్లితే.. రెండు సంవత్సరాల క్రితం విద్యుత్ శాఖ ఏఈ గా విధుల్లో చేరిన హర్షవర్ధన్ రెడ్డి ఓ రైతుకు విద్యుత్ ట్రాన్స్ ఫార్మ‌ర్ మంజూరు చేసేందుకు రూ.50వేలు లంచం డిమాండ్ చేశాడు. ఆ రైతు అంత ఇచ్చుకోలేను అని కోరగా.. చివరకు. 40 వేలకు తగ్గేది లేదు అని తేల్చి చెప్పడంతో.. ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం రైతు కు మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ సారధ్యంలో అధికారులు డబ్బులు ఇచ్చి పంపారు. విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏఈకి రైతు 20వేల రూపాయలు ఇస్తుండ‌గా ఏసీబీ అధికారులు అకస్మికంగా దాడి చేసి పట్టుకున్నారు. ఏఈ నుంచి రూ.20వేలు స్వాధీన పరుచుకొని కేసు నమోదు చేశారు. ఇటీవలే విద్యుత్ శాఖలోనే పనిచేస్తున్న మరో అధికారి సోదరీమణితో కోటి రూపాయల కట్నంతో ఎంగేజ్మెంట్ జరిగినట్లు సమాచారం. లంచం తీసుకుంటూ పట్టుబడిన ఏఈ ని బుధవారం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ వెల్ల‌డించారు.

E-పేపర్

ద్విచక్ర వాహనం పై వేళ్తున్న వ్యక్తి కుక్క ను డీ కొట్టడం తో అక్కడికి అక్కడే మృతి

పున్నమి ప్రతినిధి : ఆలంపల్లి దుర్గేష్ 9640204826 రంగారెడ్డి జిల్లా గడ్డమాల్లయ్య గూడ రంగాపూర్ మధ్య లో రోడ్డు ప్రమాదం ద్విచక్ర వాహనం పై వేళ్తున్న వ్యక్తి కుక్క ను డీ కొట్టడం తో అక్కడికి అక్కడే మృతి మృతుడు యాచారం చౌదర్ పల్లి కి చెందిన అజ్జు (40) గుర్తింపు, గత కొన్నలాగా చెధేడ్ లో నివాసం ఉంటున్న మృతుడు… పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

శ్రీకాకుళం 

పంజాబ్‌లో జాతీయ తైక్వాండో క్యాడెట్ పోటీలు — ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది ప్లేయర్స్ ఎంపిక

పంజాబ్‌లో నిర్వహిస్తున్న జాతీయ తైక్వాండో నేషనల్ క్యాడెట్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 25 మంది ప్రతిభావంతులైన ప్లేయర్లు ఎంపికయ్యారు. రాష్ట్రాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ లోహిత్, రోహిత్, జోషిత తదితర క్రీడాకారులు ఈ ప్రతిష్ఠాత్మక పోటీలకు వెళ్తున్నారు. ప్లేయర్స్‌తో పాటు కోచ్ గౌతం, హరి, తైక్వాండో శ్రీను సహా శిక్షణ బృందం కూడా ఈ జాతీయ పోటీల్లో పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా, పోటీలకు వెళ్తున్న మొత్తం ప్లేయర్స్‌కు అవసరమైన టీ-షర్ట్స్‌ను శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన పొట్నూరు గిరీష్, తన మిత్రులు, భవానీ, హర్ష, నీహాల్ ఉచితంగా దానం చేయడం విశేషం. యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ చేసిన ఈ సేవకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు

భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కలెక్టర్కు జాతీయ స్థాయి అవార్డు

భద్రాద్రి కలెక్టర్కు జాతీయ స్థాయి అవార్డు పున్నమి ప్రతినిధి- భుక్యా వినోద్ కుమార్ 18 నవంబర్ 2025, భద్రాద్రి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. జల్ సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను, సౌత్ జోన్ 3లో ఆయన ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. నేడు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డుతో పాటు రూ. 25 లక్షల నగదు బహుమతిని కూడా అందుకోనున్నారు. తెలంగాణలో ఎంపికైన ఆరు జిల్లాల్లో భద్రాద్రి జిల్లా ఒకటి. భద్రాద్రి జిల్లా కలెక్టర్ కు జాతీయ స్థాయి అవార్డు రావడంతో జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు.

విశాఖపట్నం

విశాఖ ఉత్తర నియోజకవర్గం 24 వార్డు బృందావనం పార్క్ లో కోటి సంతకాలు సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న – కె.కె రాజు

మంగళవారం విశాఖ ఉత్తర నియోజకవర్గం 24వార్డు టి పి టి కాలనీలో బృందావనం పార్క్ వద్ద ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం 24వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబెర్ సాడి పద్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.ఈకార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు,విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు పాల్గొని విద్యార్థులు,మేధావులు,ప్రజలు వద్ద నుండి సంతకాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 24 వార్డు అధ్యక్షులు జి.అశోక్ రెడ్డి 24వార్డు సీనియర్ నాయకులు,మహిళలు ఐటీ వింగ్ టీమ్,తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.