Thursday, 19 March 2026

Blog

అల్లూరి సీతారామరాజు

అడ్డతీగల: కొనలోవ సచివాలయాన్ని సందర్శించిన ఎంపీడీఓ

అడ్డతీగల మండలం, కొనలోవ సచివాలయాన్ని ఎంపీడీఓ ఏవివి కుమార్ గురువారం సందర్శించారు. ఈ మేరకు సిబ్బందికి సచివాలయంలో నిర్వహించవలసిన రిజిస్టర్లు, సచివాలయ ఆవరణలో ప్రదర్శించవలసిన బేనర్ల గురించి సూచించారు. అనంతరం గ్రామ అంగన్వాడీని, ప్రాధమిక పాఠశాలను సందర్శించి మెనూ ప్రకారం ఆహార పదార్ధాలు పిల్లలకు అందించాలని ఎంపీడీఓ తెలిపారు. సబ్ సెంటర్ ను పరిశీలించి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఏఎన్ఎమ్ కు చెప్పారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: రేపు ఉదయం క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ పై శిక్షణ

పరిశుభ్రత కొరకు ప్రతీ ఒక్కరూ శ్రద్ద పెట్టాలని అరకులోయ ఎంపీడీఓ లవరాజు అన్నారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు మండల పరిషత్ ఆఫీసు వద్ద క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ పై సెక్రటరీలకు, గ్రీన్ అంబాసిడర్లకు, గ్రీన్ గార్డులకు శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. శిక్షణలో సంపద కేంద్రాల నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధం, వర్మీ తయారీ లపై అవగాహణ కల్పిస్తారన్నారు. గ్రీన్ అంబాసిడర్ల, గ్రీన్ గార్డుల హక్కులు, విధులను తెలుపుతాన్నారు.

తిరుపతి

కలంకారీ వస్త్రాలు దేశవిదేశాల్లో భారీ డిమాండ్ -ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి సమీపంలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఉన్న హస్తకళ కేంద్రాన్ని బుధవారం నాడు స్థానిక శాసన సభ సబ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి పరివేక్షించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో సంప్రదాయ కళలకు కొత్త ఊపునిచ్చే విధంగా, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. AP టూరిజం ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న హస్తకళ కేంద్రంలో, కళాకారులు తమ ఉత్పత్తులను దళారుల జోక్యం లేకుండా నేరుగా విక్రయించుకునే సౌకర్యం అందించనున్నట్లు ఆయన తెలిపారు. శ్రీకాళహస్తి ప్రాంతానికి ప్రపంచ ప్రఖ్యాతి తీసుకొచ్చిన కలంకారీ కళకు ప్రాధాన్య స్థానాన్ని ఇవ్వడం. “దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కలంకారీ కళాకారులు తమ ఉత్పత్తులకు సరైన ధర దొరకాలని, మధ్యవర్తుల కారణంగా కలిగే నష్టాన్ని పూర్తిగా తొలగించాలని” ఎమ్మెల్యే స్పష్టంచేశారు. కొత్త హస్తకళ భవనంలో 10 ప్రత్యేక గదులు కలంకారి, చేనేత, కోయ్య బొమ్మలు, ఇతర చేతివృత్తుల కళాకారుల కోసం కేటాయించనున్నట్లు ఆయన చెప్పారు. కలంకారీ కళాకారుల కోసం ‘డైరెక్ట్ సేల్స్’ మార్గం కలంకారీ వస్త్రాలు దేశవిదేశాల్లో భారీ డిమాండ్ ఉన్నప్పటికీ, స్థానిక కళాకారులు అందుకునే లాభం మాత్రం చాలా తక్కువగా ఉండటం పెద్ద సమస్యగావుందని ఈ నేపథ్యంలో కొత్త వ్యవస్థ కళాకారులకు నేరుగా లాభం చేకూర్చేలా రూపుదిద్దుకుంటోందన్నారు. కళాకారులే స్వయంగా తమ ఉత్పత్తులు విక్రయించే అవకాశం కల్పిస్తూ మధ్యవర్తులు, దళారీ వ్యవస్థ పూర్తిగా తొలగింపు, కళాకారులే తమ ధరలు నిర్ణయించుకునే స్వేచ్ఛ కలంకారీ ప్రాముఖ్యతను ఎత్తి చూపే ప్రత్యేక ప్రదర్శన/విక్రయ వేదిక చేతిపని, నేచురల్ డైస్‌తో తయారయ్యే ఈ పురాతన కళను ప్రభుత్వ స్థాయిలో ప్రోత్సహించడం ప్రాంతీయ అభివృద్ధికి కీలకం అని అధికారులు భావిస్తున్నారన్నారు. కళాకారులకు ఎమ్మెల్యే హామీలు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్న ముఖ్య అంశాలు: హస్తకళ భవనంలో 10 రూముల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి కళాకారులకే కేటాయింపు డైరెక్ట్ సేల్స్ మోడల్ ద్వారా కళాకారుల ఆదాయం పెంచే చర్యలు కలంకారీ, చేనేత, కోయ బొమ్మలు వంటి సంప్రదాయ కళలకు శాశ్వత విక్రయ వేదిక స్థానిక కళలకు మార్కెట్‌ను విస్తరించే కార్యక్రమాలు, ప్రోత్సాహక చర్యలు స్థానిక కళల పునరుజ్జీవనానికి మార్గదర్శక నిర్ణయం ఈ నిర్ణయంతో కలంకారీ కళాకారులకు న్యాయమైన ధర, స్థిరమైన ఆదాయం శ్రీకాళహస్తి హస్తకళలకు పెరుగుతున్న గుర్తింపు యువతలో చేతివృత్తులపై ఆసక్తి పెరుగుదల చిన్న–పెద్ద కళాకారులకు ఒకే వేదికలో విక్రయ అవకాశాలు కళాకారులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, “ఇది మా కళకు వచ్చిన భారీ గౌరవం… మా కుటుంబాలకి కొత్త ఆశ” అని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్

గ్రామ, బూత్ స్థాయిలో బీజేపీ బలోపేతమే లక్ష్యం: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ప్రసన్న

భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం అంబాజీపేట లో గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ సారధ్యం పేరుతో రాష్ట్రం అంతా పర్యటించారని, పార్టీని బలోపేతమే లక్ష్యంగా కృషి చేస్తున్నారని అన్నారు. మండల అధ్యక్షులు, మండల ఇంచార్జి లు పార్టీకి సమయం కేటాయించి గ్రామాలలో తిరిగి పార్టీ ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని అన్నారు. రాబోయే కాలంలో మన ఊరు-మన జండా, చేరువ కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు వెళ్తాం అన్నారు. అలాగే మన్ కీ బాత్ కార్యక్రమం స్కూల్ లో విద్యార్దులకు చూపించే కార్యక్రమం, జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలపై కలెక్టరేట్ లో జరిగే పీజీఆర్ఎస్ లో పిర్యాదు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలన్నారు. ప్రతీ గ్రామం లో ప్రజలలోకి వెళ్ళి బూత్ కమిటీ లు వెయ్యాలి అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా మాట్లాడుతూ కన్వీనర్ వ్యవస్థ రద్దు చేసిన తర్వాత మండల ఇంచార్జీలను గ్రామాలలో, బూత్ లలో పార్టీ బలోపేతానికి కృషి చేయడానికి నియమించిందని అన్నారు. వారు క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేసి కార్యకర్తలలో ఉత్తేజాన్ని నింపాలన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రతీ మండలాలలో ఉన్న రాష్ట్ర, జిల్లా నాయకులు మండల అధ్యక్షులతో పర్యటనలు చేసి బూత్ కమిటీలను, శక్తి కేంద్రాలను త్వరితగతన పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చీకరమెల్లి శ్రీనివాసరావు, సలాది వీరబాబు, కోపనాతి దత్తాత్రేయ, గుంటూరు జిల్లా ఇన్చార్జ్ తమనంపూడి రామకృష్ణారెడ్డి, అనకాపల్లి ఇంచార్జి కర్రి చిట్టిబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం, సీనియర్ నాయకులు ఆర్వీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

48వ వార్డునకు త్వరలో నూతన హై మాస్ట్ వీధి దీపాల వెలుగులు*

కొండ ప్రాంతంలో రింగ్ పోల్స్ ఏర్పాటుపై ఫలించిన గంకల కవిత అప్పారావు యాదవ్ కృషి పగలు రాత్రి తేడా లేకుండా వార్డు అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న గంకల కవిత అప్పారావు యాదవ్* 48వ వార్డులో అధికారులతో కలిసి నూతన రింగ్ పోల్స్ ను ఏర్పాటు చేసిన గంకల జీవీఎంసీ 48వ వార్డు కొండవాలు ప్రాంతంలో రింగ్ పోల్స్ ఏర్పాటు చేయాలని 48వ వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ బిజెపి ఫ్లోర్ లీడర్, స్టాండింగ్ కమిటీ మెంబర్ గంకల కవిత అప్పారావు యాదవ్ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమీషనర్,జీవీఎంసీ మేయర్,ఏపీఈపీడీసీఎల్ సీఎండి లకు పలుమార్లు వినతులు చేశారు.గంకల కవిత అప్పారావు యాదవ్ పిర్యాదుపై అధికారులు స్పందించి శుక్రవారం వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా 48వ వార్డునకు ఏడు నూతన రింగ్ పోల్స్ కేటాయించినట్లు గంకల కవిత అప్పారావు యాదవ్ తెలిపారు.ఇందులో భాగంగా వార్డులో ఏ ప్రాంతంలో రింగ్ పోల్స్ అవసరం ఉన్నది అనేది అధికారులతో కలిసి గంకల కవిత అప్పారావు యాదవ్ పర్యటించి ఆ ప్రదేశంలో భారీ క్రేన్లు సహాయంతో రింగ్ పోల్స్ ను ఏర్పాటు చేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఉదయం నుంచి కార్మికులతో కలిసి మధ్యాహ్నం భోజనం విరామం లేకుండా కార్మికులతో రాత్రి వరకు ఉండి వార్డులో నూతన రింగ్ పోల్స్ ను ఏర్పాటు చేసి నూతన రింగ్ పోల్స్ కు సిమ్మెంటుతో రక్షణ గట్టు నిర్మాణాలు చేశారు.ఈ సందర్భంగా గంకల కవిత అప్పారావు యాదవ్ మాట్లాడుతూ 48 వ వార్డు అంతా కొండ ప్రాంతం కావడంతో చీకటి ప్రదేశం నెలకొంటుందని,ఈ చీకటి ప్రదేశంలో ఆకతాయిల ఆగడాలు పెరుగుతున్నాయని, నిత్యం దొంగతనాలు జరుగుతున్నాయని పలుమార్లు కలెక్టర్, జీవీఎంసీ కమీషనర్,జీవీఎంసీ మేయర్,ఏపీఈపీడీసీఎల్ సీఎండి లకు వార్డులో నూతన రింగ్ పోల్స్ ఏర్పాటు చేయాలని వినతి అందజేయడం జరిగిందని, ఇదే విషయంపై జీవీఎంసీ కౌన్సిల్లో చర్చించడం జరిగిందన్నారు. గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంలో వార్డు ప్రజల సమస్యలు తెలుసుకుని వార్డులో రింగ్ పోల్స్ అవశ్యకత ఉందని ప్రజల ద్వారా తెలుసుకొని గత నాలుగు ఏళ్లగా పోరాటం చేశామని ఈ పోరాటానికి ఫలితం దక్కిందన్నారు.పలు మార్లు అందించిన వినతులపై జీవీఎంసీ కమిషనర్,మేయర్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు స్పందించి వార్డులో ఏడు రింగ్ పోల్స్ కేటాయించడం జరిగిందని,వాటిని జవహర్ లాల్ నెహ్రు నగర్, ఇందిరా నగర్ -2,ఇందిరా నగర్ -4,ఇందిరా నగర్ -5,జై భారత్ నగర్, పల్నాటి కాలనీ, బాపూజీ నగర్ లో ఒక్కొక్క పోల్ చొప్పున ఈరోజు ఏర్పాటు చేయడం జరిగిందని త్వరలో వాటికి ఒక్కొక్క రింగ్ పోల్ కు నాలుగు హైమాస్ట్ వీధి దీపాలను ఏర్పాటు చేసి వార్డు అంతట విద్యుత్ దీపాల వెలుగులను కురిపిస్తామన్నారు. వార్డులో అధికారులతో కలిసి పర్యటించి పలు సూచనలు ఇచ్చినట్లు గంకల పేర్కొన్నారు. అతి త్వరలో వార్డులో మరిన్ని వీధి దీపాలు,సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తామని గంకల హామీ ఇచ్చారు.48వ వార్డులో రింగ్ పోల్స్ ఏర్పాటు పట్ల గంకల కవిత అప్పారావు యాదవ్ కృషి ఫలించిందని, వార్డులో గంకల కవిత అప్పారావు యాదవ్ కృషితో నూతన వెలుగులు వెలగడం పట్ల పలువురు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వార్డు ప్రజలకు ఎటువంటి సమస్య ఏర్పడిన తక్షణమే తనను సంప్రదించాలని గంకల కవిత అప్పారావు యాదవ్ సూచించారు.

విశాఖపట్నం

పారిశుధ్య కార్మికుల సంక్షేమార్థం ప్రభుత్వ విప్ గణబాబు ఆదేశాలపై సేవా కార్యక్రమం

విశాఖపట్నం నగరంలోని 90వ వార్డులో పారిశుధ్య కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ విప్, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు ప్రత్యేక ఆదేశాల మేరకు గురువారం సేవా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా 90వ వార్డ్ కార్పొరేటర్ బొమ్మిడి రమణ చేతుల మీదుగా జీవీఎంసీ పారిశుధ్య కార్మికులకు అవసరమైన వస్త్రాలు, యూనిఫామ్‌లు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో మహిళా పారిశుధ్య సిబ్బందికి 3 చీరలు, 3 జాకెట్ పీసులు మరియు 3 టవళ్ళు, పురుష పారిశుధ్య కార్మికులకు 2 జతల యూనిఫామ్‌లు మరియు 3 టవళ్ళు అందజేయబడినట్లు కార్పొరేటర్ తెలిపారు. నగర పరిశుభ్రత కోసం రాత్రింబగళ్లు శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికులకు ఇది ప్రోత్సాహకరంగా ఉండే చర్య అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ సానిటరీ ఇన్‌స్పెక్టర్ బుచ్చిబాబు, సచివాలయం సానిటరీ సిబ్బంది, పోతల సతీష్, మడ్డి శ్రీను సహా పలువురు జీవీఎంసీ కార్మికులు పాల్గొన్నారు. పరిశుభ్రతా కార్యకలాపాల్లో ముందుండే సిబ్బంది ఆత్మవిశ్వాసం పెంపొందేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో సహాయపడతాయని అధికారులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో పాల్గొన్న పారిశుధ్య కార్మికులు ఈ సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజా సేవలో మరింత నిబద్ధతతో పనిచేస్తామని హామీ ఇచ్చారు.

విశాఖపట్నం

విశాఖ వేదికగా ‘డ్రింక్ ఫ్రం ట్యాప్ (డి ఎఫ్ టి)’ ప్రాజెక్ట్ అమలు పై రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ నిర్వహణ.

25 రాష్ట్రాల ప్రతినిధులతో జాతీయ స్థాయి కార్యక్రమం. విశాఖపట్నం లో జీవీఎంసీ నీటి సరఫరా నిర్వహణ వ్యవస్థ ఆదర్శపూరితం. విశాఖ నగర పరిశుభ్రతకు సుందరీకరణకు ముగ్ధులైన వర్క్ షాప్ ప్రతినిధులు. ఎం ఓ హెచ్ యు ఏ డిప్యూటీ సెక్రటరీ గ్రేస్ లాల్క్రింది పచావ్ భారత ప్రభుత్వ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎం ఓ హెచ్ యు ఏ), గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి), అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏ ఎస్ సి ఐ) సంయుక్త ఆధ్వర్యంలో ‘డ్రింక్ ఫ్రం ట్యాప్’ (డీ ఎఫ్ టి) ప్రాజెక్ట్ అమలు పై 25 రాష్ట్రాల ప్రతినిధులతో జాతీయస్థాయి కార్యక్రమంగా రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌ను నవంబర్ 20, 2025న హోటల్ గ్రీన్‌పార్క్, విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ వర్క్‌షాప్ ప్రధాన ఉద్దేశ్యం అమృత్ 2.0 కార్యక్రమం కింద 24×7 సురక్షిత తాగునీటి సరఫరా వ్యవస్థలను అమలు చేయడంలో రాష్ట్ర పట్టణ సంస్థల అధికారుల సామర్థ్యాలను పెంపొందించడం, అలాగే “డ్రింక్ ఫ్రం ట్యాప్” లక్ష్యాల వైపు విశాఖపట్నం చేస్తున్న పురోగతిని పంచుకోవడం జరిగినది. విశాఖ నగరం విమానాశ్రయం నుండి వర్క్ షాప్ కార్యక్రమానికి చేరుకునే వరకు విశాఖ నగర పరిశుభ్రత , సుందరీకరణ చాలా అద్భుతంగా ఉందని, అందర్నీ జీవీఎంసీ ముగ్ధులను చేసిందని , జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ విశాఖ నగరంలో చేపడుతున్న ప్రత్యేక కార్యాచరణ అందరికీ ఆకర్షణీయంగా నిలిచిందని ప్రతినిధులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సి పి హెచ్ ఈ ఈ ఓ, ఎం ఓ హెచ్ యు ఏ డిప్యూటీ అడ్వైజర్ (పీహెచ్ఇ) డా. రామకాంత్ వర్క్‌షాప్‌ ఆవశ్యకతను వివరించారు . తరువాత ఏ ఎస్ సి ఐ అడ్జంక్ట్ ప్రొఫెసర్, సెంటర్ డైరెక్టర్ డా. బి. జనార్ధన్ రెడ్డి, ఐఏఎస్ (రిటైర్డ్) నగర తాగునీటి సరఫరా విధానాన్ని ‘ఇంటర్మిటెంట్’ నుండి ‘కంటిన్యుయస్’ వ్యవస్థగా మార్చాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రీ-మాన్సూన్ ప్రిపేర్డ్‌నెస్ అండ్ అర్బన్ ఫ్లడింగ్ మిటిగేషన్‌పై సలహా పుస్తకాన్ని విడుదల చేశారు. ఇది మాన్సూన్ సీజన్ ముందు పట్టణ స్థానిక సంస్థలకు మార్గదర్శకంగా ఉంటుందని తెలిపారు. ఎం ఓ హెచ్ యు ఏ తరఫున డిప్యూటీ సెక్రటరీ గ్రేస్ లాల్క్రింది పచావ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా “డ్రింక్ ఫ్రం ట్యాప్”, అమృత్ 2.0 కార్యక్రమాల పురోగతిపై ప్రసంగించారు. విశాఖపట్నం జీవీఎంసీ నీటి సరఫరా నిర్వహణ వ్యవస్థ ఆదర్శపూరితంగా ఉన్నందున ఈ వర్క్ షాప్ కార్యక్రమంను విశాఖలో నిర్వహించడం జరిగిందని, విశాఖపట్నంలో నీటి సరఫరా నిర్వహణ వ్యవస్థను, విశాఖ నగర అభివృద్ధి, సుందరీకరణ అందర్నీ అబ్బురపరిచేలా జీవీఎంసీ తీర్చిదిద్దడం అభినందనీయమని, జీవీఎంసీ విజయ గాధను అందరూ తెలుసుకునేందుకు ఈ వర్క్ షాప్ ఉపయోగపడుతుందన్నారు. 24/7 వాటర్ సప్లై, పోర్టబుల్ వాటర్ సిస్టం, ఎఫిషియన్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్జ్యూమర్ బెనిఫిట్స్, సస్టైన్బిలిటీ అనే అంశాలతో కూడిన “డ్రింక్ ఫ్రమ్ ట్యాప్” సంబంధించి పి పి టి ద్వారా అందరికీ వివరించారు. తదనంతరం తెలంగాణ ప్రభుత్వ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి, సి డి ఎం ఏ (ఎఫ్ ఏ సి) డా. టి.కె. శ్రీదేవి, ఐఏఎస్ ప్రత్యేక ప్రసంగం చేస్తూ డ్రింక్ ఫ్రం ట్యాప్ లక్ష్యాలు, ప్రాముఖ్యత పట్టణ తాగునీటి సరఫరా వ్యవస్థల బలోపేతం గురించి విశదీకరించారు. టెక్నికల్ సెషన్‌లో, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గార్గ్, ఐఏఎస్ నిరంతర తాగునీటి సరఫరా, నాన్-రెవెన్యూ వాటర్ (ఎన్ ఆర్ డబ్ల్యు) తగ్గింపు పై విశాఖపట్నం నగర అనుభవాన్ని, పురోగతిని వివరించారు. జీవీఎంసీ పది జోన్లలో 24/7 నీటి సరఫరా అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధంగా ఉందని, విశాఖ నగరానికి 11 వనరుల ద్వారా నీటి సరఫరా పుష్కలంగా ఉంటుందని, 310 జి ఎస్ ఎల్ ఆర్, ఇ ఎస్ ఎల్ ఆర్ ద్వారా నీటి సరఫరా జరుగుతుందని, ఏడిబి,అమృత్ ,15 ఫైనాన్స్ ద్వారా ఆర్థిక సహకారం జీవీఎంసీ కి అందుతుందని, స్మార్ట్ సిటీ ద్వారా నీటి సరఫరా నిర్వహణ ఉందని, మొత్తంగా 28 లక్షల ప్రజానీకానికి 400 ఎంఎల్డి నీరు సరఫరా చేయబడుతుందని, జీవీఎంసీ నీటి సరఫరా విభాగం ద్వారా నిర్వహిస్తున్న స్కాడ సిస్టం ,సిఓసి వ్యవస్థ,న్యూ హౌస్ సర్వీస్ కనెక్షన్స్ , జిఐఎస్ మ్యాపింగ్ ,ఆటోమేషన్ డబ్ల్యూ టి పి ఎస్,575 వార్డ్ ఇమ్యూనిటీస్ సెక్రటరీస్ ద్వారా ఇన్ హౌస్ వాటర్ టెస్టింగ్ నిత్యం జరుగుతుందని కమిషనర్ పిపిటి ద్వారా వివరిస్తూ విశాఖ నగరంలో “డ్రింక్ ఫ్రమ్ టాప్ ” వర్క్ షాప్ వర్క్ షాప్ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తదనంతరం జరిగిన ఇతర టెక్నికల్ సెషన్లలో డా. రామకాంత్ – బ్యాంకబుల్ ప్రాజెక్ట్ అంశాలు డా. అశోక్ నటరాజన్ – ఎన్ఆర్ డబ్ల్యు మేనేజ్‌మెంట్ డా. ఎం. స్నేహలత (ఏ ఎస్ సి ఐ) – అమృత్ 2.0 సామర్థ్య వేదిక డీఎఫ్ టి మాడ్యూళ్లు చిన్మయ్ త్రిపాఠీ (డబ్ల్యూ ఏ టి సి ఓ, ఒడిశా ప్రభుత్వం) – ఒడిశా రాష్ట్రం డ్రింక్ ఫ్రం ట్యాప్ అమలు అనుభవం పై అంశాలపై పిపిటి ద్వారా వివరించారు. మధ్యాహ్నం, జివిఎంసి ఆధ్వర్యంలో వర్క్‌షాప్ పాల్గొన్న వారందరికీ ఫీల్డ్ విజిట్ ఏర్పాటు ఏర్పాటు చేయడమైనది. ఈ ఫీల్డ్ విజిట్ లో మాధవధారలోని ఎస్ సి ఏ డి ఏ సిస్టమ్ సౌకర్యాన్ని, నగర తాగునీటి పర్యవేక్షణ వ్యవస్థను పరిశీలించారు. అనంతరం గాజువాక వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (డబ్ల్యూ టి పి) ను సందర్శించి అమృత్ 2.0 కింద చేపట్టిన సంస్కరణలను పరిశీలించారు. అనంతరం జీవీఎంసీ కమిషనర్ జీవీఎంసీ సమావేశ మందిరంలో అందరితో సమీక్షా సమావేశం నిర్వహించి , వారికి జ్ఞాపికలను అందించారు. ఈ వర్క్‌షాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణాలు డ్రింక్ ఫ్రం ట్యాప్ ప్రాజెక్ట్‌ల ప్రణాళిక, అమలు చర్యల్లో మరింత పురోగతిని సాధించడంలో తోడ్పడుతుందని అధికారులు తెలిపారు.

విజయనగరం 

అగ్నివీర్ జవాన్ అడ్డూరి దుర్గాప్రసాద్ అంతిమ యాత్రలో పాల్గొన్న బెల్లాన చంద్రశేఖర్

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన అగ్నివీర్ జవాన్ అడ్డూరి దుర్గాప్రసాద్ భౌతికకాయానికి నివాళులు అర్పిస్తూ, రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఎసీ కమిటీ సభ్యులు, విజయనగరం మాజీ పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) గురువారం చీపురుపల్లి పట్టణంలో నిర్వహించిన అంతిమయాత్రలో పాల్గొన్నారు. చీపురుపల్లి నుండి స్వగ్రామమైన మెరకముడిదం మండలం గొల్లలవలస వరకు కొనసాగిన అంతిమయాత్రలో పాల్గొన్న పెదబాబు, దుర్గాప్రసాద్ భౌతికకాయంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తరువాత దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, వారి దుఃఖంలో తాను భాగస్వామినేనని తెలియజేస్తూ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్

వినతిపత్రాలు స్వీకరించిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి

కడప ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజల వినతిపత్రాలు స్వీకరించిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారు కడప ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సందర్శించిన పలువురు ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను ప్రభుత్వ విప్ & కడప ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి రెడ్డి గారికి అందజేశారు. మాధవి రెడ్డి గారు వచ్చిన ప్రతి వినతిపత్రాన్ని పరిశీలించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు తక్షణ దిశానిర్దేశం చేశారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, ప్రజల సమస్యల పరిష్కారాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ ముందుకు సాగుతానని మాధవి రెడ్డి గారు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

26న రైతు, కార్మిక, కూలీల నిరసన, ప్రదర్శన కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ వరకు

విజయవాడ: దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, చేతివృత్తుల సంఘాలు, ప్రజాసంఘాలు 26న నిరసన ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చాయి. రైతు ఉద్యమం సాగి ఐదు సంవత్సరాలైన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాయి. రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం అని కూడా పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపట్టాయి. దేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని, అనంతరం జిల్లా కలెక్టర్లకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు గురువారం విజయవాడ నగరంలోని దాసరి భవన్లో ఎన్టీఆర్ జిల్లా రైతు, కార్మిక, ప్రజా సంఘాల సంయుక్త సమావేశం జరిగింది. సమావేశం నగరంలోని తుమ్మలపల్లె కళాక్షేత్రం నుంచి ఏలూరు రోడ్డు మీదగా లెనిన్ సెంటర్ కు ప్రదర్శన నిర్వహించాలని, అనంతరం లెనిన్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. జిల్లాస్థాయిలోని అన్ని ప్రజా సంఘాలు జన సమీకరణ చేసి పాల్గొనాలని కోరారు. లేబర్ కోడ్ల్ రద్దు, 10 గంటల పని గంటల పెంపు, అన్ని రకాల పంటలకు మద్దతు ధర, ఉపాధి హామీ పథకం అమలు, ధరల నియంత్రణ, నిరుద్యోగం, తదితర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నిరసన ప్రదర్శన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి ఏఐటీసీ నగర ప్రధాన కార్యదర్శి మూలీ సాంబశివరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్నీడి యల్లమందారావు, ఎల్లా రైతు సంఘం నాయకులు పి ఆంజనేయులు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ సి హెచ్ శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం ఉన్న జిల్లా నాయకులు కళ్యాణ్ రావు, ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం. రామకృష్ణ, టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు మరీదు ప్రసాద్ బాబు, ఏఐసిటియు జిల్లా నాయకుల లక్ష్మీనారాయణ, కిసాన్ సంఘటన్ జిల్లా నాయకులు కొప్పుల విజయబాబు, ఎఐటియుసి నగర అధ్యక్షులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.