Thursday, 19 March 2026

Blog

నాగర్‌కర్నూల్

ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు…

వెల్దండ:- ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ సందర్భంగా వెల్దండ స్థానిక గ్రామ ముదిరాజ్ సంఘం కార్యాలయంలో ముదిరాజ్ సంఘం నాయకులు తెలంగాణ ముదిరాజ్ మహాసభ 11వ వార్షికోత్సవ వేడుకలను జరిపి, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ జండా ఆవిష్కరించి అనంతరం మాట్లాడుతూ.. ముదిరాజులను బిసి-డి నుంచి బీసీ-ఏ ల్లోకి మార్చాలని, సుప్రీంకోర్టు ఆదేశాలనుసారం తెలంగాణ బిసి కమిషన్ తగిన అదేశాలను జారీ చేసి ముదిరాజ్లకు న్యాయం చేయాలని కోరారు. ముదిరాజుల సంఖ్య పరంగా అభివృద్ధి కోసం బడ్జెట్లో 20,000 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మత్స్యశాఖకు 3000 వేల కోట్ల రూపాయలను కేటాయించి వివిధ పథకాల ద్వారా మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని తెలిపారు.50ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వృద్ధాప్య మత్స్యకార అభయహస్తం ప్రారంభించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యకారుల డైరెక్టర్ క్యాసరపు వెంకయ్య ముదిరాజ్, జిల్లా నాయకులు బయ్య మల్లయ్య, పిల్లి దేవేందర్ ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు బాదేపల్లి మల్లేష్ ,ముదిరాజ్ మహాసభ మండల యూత్ అధ్యక్షుడు బొక్కల శ్రీనివాస్,నాయకులు రంగరాతి శ్రీశైలం , మారేపల్లి శ్రీనివాస్ ,సదమోని బాలక

విశాఖపట్నం

44వ వార్డులో కోటి సంతకాల కార్యక్రమం ఘనంగా

44 వార్డు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు సూచనల మేరకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన “కోటి సంతకాలు” కార్యక్రమం పెద్దవూరు మసీద్ వద్ద ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి బాణాల తరుణ్ కుమార్, 44వ వార్డు అధ్యక్షుడు ఎ.డి. హబీబ్ ఆధ్వర్యం వహించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా విశాఖ జిల్లా అధ్యక్షులు, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె. రాజు పాల్గొని విద్య రంగంలో ప్రభుత్వ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతపై మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ నుంచి కాపాడాలి అనే లక్ష్యంతో విద్యార్థులు, ప్రజలు సమగ్రమైన భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యాసిన్, మహాదాస్యం గోపి, ఎం. సునీల్, కన్నప్పడు, రామకృష్ణ, బాధ శ్రీనివాస్, పిడుగు వెంకట్, సన్యాసిరావు, మల్లేశ్వరావు, బషీర్, బాషా, రసీద్, నారాయణ, బిల్లు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరై ప్రభుత్వ మెడికల్ విద్య అందరికీ అందుబాటులో ఉండాలని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ సంతకాలతో మద్దతు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

యవతకు TTD అరుదైన ఆఫర్

*యవతకు TTD అరుదైన ఆఫర్, కోటి నామాలు రాస్తే కుటుంబంతో సహా వెంటనే బ్రేక్ దర్శనం..!!* యువతలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, సనాతన ధర్మంపై అనురక్తిని కల్పించడమే లక్ష్యంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రామకోటి తరహాలో గోవింద కోటిని ప్రవేశపెట్టింది. గోవింద కోటి రాసిన యువతకు వీఐపీ దర్శనాన్ని కల్పిస్తోంది. 25 సంవత్సరాలు, లేదా అంతకంటే తక్కువ వయసున్న వారు ఇందుకు అర్హులు. 10,01,116 సార్లు రాస్తే రాసిన వారికి వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పిస్తారు. కోటిసార్లు నామాలు రాస్తే వారితోపాటు కుటుంబ సభ్యులందరూ వీఐపీ బ్రేక్‌ దర్శనం చేసుకోవచ్చు. తితిదే సమాచార కేంద్రాలు, పుస్తక విక్రయ కేంద్రాలు, ఆన్‌లైన్‌లో గోవిందకోటి నామాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. 200 పేజీలుండే పుస్తకంలో 39,600 నామాలు రాయొచ్చు. 10,01,116 నామాలు పూర్తి చేయడానికి దాదాపు 26 పుస్తకాలు అవసరం అవుతాయని టీటీడీ అధికారులు చెబుతున్నారు. కోటి నామాల పుస్తకాలను రాయడానికి కనీసం మూడేళ్ల సమయం పడుతుందని టిటిడి సిబ్బంది చెబుతున్నారు. గోవిందకోటి నామాల పుస్తకాన్ని పూర్తిచేసి తిరుమలలోని తితిదే పేష్కార్‌ ఆఫీసు లో అందిస్తే వారికి మరుసటి రోజు వీఐపీ బ్రేక్

కడప

పరారీ లో ఉన్న క్రికెట్ బుకీలు అరెస్ట్

వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు బెంగళూరు కేంద్రంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ, ఆన్లైన్ గేమింగ్ కొరకు తమకు బ్యాంకుల యందు అకౌంట్ లు కావాలని తెలిసినవారికి ఆశ చూపి నమ్మించి వారి ద్వారా వివిధ బ్యాంకులలో కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేయించి, అకౌంట్ లకు ఆన్లైన్ బెట్టింగ్ ఆప్ లేదా వెబ్ సైట్ ద్వారా ఖాతాలలో సొమ్ము జమ చేసుకున్న ముఠాలోని ఆరు మంది సభ్యులను ఈనెల 5వ తేదీన అరెస్టు చేసినట్లు, నేరం అంగీకరించగా ముఠాలో కీలక సభ్యులైన ప్రొద్దుటూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన ధనికల వీర శంకరయ్య అలియాస్ వీరశంకర్ అలాగే కాశినాయన మండలానికి చెంది ప్రస్తుతం బెంగళూరు నందు ఉన్న ఆర్ల చంద్రశేఖర్ యాదవ్ లపై ప్రొద్దుటూరు పోలీసులు గట్టి నిఘా ఉంచి శుక్రవారం ఇరువురిని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ యు. సదాశివయ్య అరెస్టు చేయగా, వారి వద్ద నుండి ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ద్వారా ఖాతాలలో జమ చేయబడిన 10 లక్షల 56 వేల రూపాయల నగదు, మూడు చరవాణీలు, ఒక బ్యాగు స్వాధీనం చేసుకున్నారు. పై ముఠా సభ్యుల విచారణ చేసినప్పుడు బెంగళూరు నందు పీజీ నడుపుతున్న ధనికల వీర శంకరయ్య మరియు ఆర్ల చంద్ర యాదవ్ ఇరువురు royalbook365.com.in అనే వెబ్సైట్ను సృష్టించి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ, వెబ్సైట్ ద్వారా బెట్టింగ్ లావాదేవీల కొరకు బ్యాంకులలో ఖాతాలు అవసరం అయినందున గతంలో అరెస్టు కాబడ్డ తమ అనుచరుల ద్వారా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించుకుని వారికి కమిషన్లు ఇస్తూ వారి ద్వారా విస్తృతంగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసినదని, కావున బెట్టింగ్ కు ఉపయోగించిన ఆన్లైన్ అకౌంట్లను ఫ్రీజ్ చేస్తూ బ్యాంకులకు సందేశాలు పంపించామని, అలాగే అనుమానాస్పద లావాదేవీలు ఉన్న అన్ని అకౌంట్లను ఫ్రీజ్ చేయమని కోరినట్లు ప్రొద్దుటూరు డిఎస్పి పి భావన పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు. క్రికెట్ బెట్టింగ్ పై లోతైన విచారణ చేస్తున్నట్లు పై ముఠాలతో సంబంధం ఉన్న అందరిని గుర్తించి త్వరలో అరెస్టు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. బెట్టింగ్ ముఠా కార్యకలాపాలను గుర్తించి డ్యూటీలో ప్రతిభను పరిచిన రెండో పట్టణ సీఐ అలాగే స్టేషన్ సిబ్బందిని అభినందిస్తూ తగు రివార్డ్ కోసం సిఫారసు చేస్తున్నట్లు డీఎస్పీ భావన పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

కుప్పకూలిన భారత్‌కు చెందిన తేజస్‌ యుద్ధ విమానం

దుబాయ్‌ ఎయిర్‌ షోలో ప్రమాదం కుప్పకూలిన భారత్‌కు చెందిన తేజస్‌ యుద్ధ విమానం విమానం కూలిన వెంటనే భారీగా మంటలు, పొగ ఇంకా లభించని పైలట్‌ ఆచూకీ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజస్‌ విమానం బెంగళూరులోని HAL సంస్థలో తయారైన విమానం మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో ప్రమాదం

జనగాం

జఫర్గడ్డలో లో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం*

స్టేషన్ ఘనపూర్ పున్నమి ప్రతినిధి: *ఈ రోజు ప్రపంచ మత్స్య దినోత్సవం* సందర్బంగా రఘునాథ్ పల్లి గ్రామంలో *ముదిరాజ్ కమిటీ అధ్యక్షులు* మట్టెపల్లి బుచయ్య మాట్లాడుతూ ముదిరాజ్ కుటుంబ సభ్యులందరికి *ప్రపంచ మత్స్య దినోత్సవ శుభాకాంక్షలు* తెలియజేస్తూ ప్రపంచ మత్స్య దినోత్సవన్ని పురస్కరించుకొని ముదిరాజ్ జెండాను ఆవిష్కరణ చెయ్యడం జరిగింది. * 🐟 *ముదిరాజులకు ఇచ్చిన అభయహస్తం హమీలు అమలు పరచండి* 🐠✊* 1.అభయహస్తం-కామరెడ్డి బిసి డిక్లరేషన్లో చెప్పిన విధంగా 42% శాతం విద్య, ఉద్యోగాలలో రేజర్వేషన్లు కల్పించాలి. పెరిగే రిజర్వేషన్లలో ముదిరాజులకు మా జనాభాకు తగట్లు మా వాటా ఇవ్వవల్సిందిగా కోరుతున్నాము. 2. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు బిసిలకు కల్పించాలి. 3. అభయహస్తంలో పేర్కొన్న హామీ ప్రకారము జి.వో. 15 తేది 19-02-2009 ముదిరాజ్/ముత్తరాసి/ తెనుగోళ్లు బి.సి. “డి” నుండి బి.సి. “ఏ” పునరుద్ధరణ చేసి తక్షణమే దానిని బి.సి. “ఏ”లో చేరడం జరగాలి. 4. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం SLC 11/10/2022 ఈ సమస్యను రాష్ట్ర కమీషన్ ద్వారా పరిష్కరించడానికి ఆదేశాలు జారీ చేసినందున తెలంగాణ బిసి కమిషన్ తగిన ఆదేశాలు జారీ చేసి పైహామీ అమలు చేయవలసిందిగా కోరుచున్నాము. 5. ముదిరాజుల అభివృద్ధి కోసం మీరు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కో-ఆపరేటివ్ సోసైటీస్ కార్పోరేషన్ లిమిటెడ్ను ఏర్పాటు చేసినందుకు ధన్యవాదములు, కాని దానికి 50కోట్లు మాత్రమే కేటాయించారు, మా సంఖ్య పరంగా కూడా ఆలోచించి రూ॥ 1000 కోట్ల నిధులు కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. 6. GO. M.S. NO 98, 22:22-01-1964 (8), GO, M.S. NO. 74, GO. M.S. NO. 4. GO. M.S. NO.6 ລ້ຍ ప్రకారము చెరువు కుంటలపై, మత్స్య సంపదపై తెనుగు / ముత్తరాశి/ ముదిరాజ్, బెస్త, గంగపుత్ర మరియు గూండ్ల కులాలకు మాత్రమే “హక్కులు ఉండే విధముగా చట్టపరమైన ఆదేశాలు జారీ చేయవలసినదిగా కోరుతున్నాము. 7. తెలంగాణ మత్స్య అభివృద్ధి కోసం తెలంగాణ మత్స్య కోఆపరేటివ్ ఫెడరేషన్కు వెంటనే ఎన్నికలు జరిపి చైర్మన్ మరియు పాలక మండలిని నియమించాలి. గ్రామ మరియు జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలు వెంటనే నిర్వహించాలి. 8.తెలంగాణ మత్స్య శాఖకు 3000 కోట్ల రూపాయలు కేటాయించి వివిధ పథకాల ద్వారా మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలి. 9. మత్య్సకారుల భరోసా కార్యక్రమం ప్రారంభించి ప్రతి సొసైటీకి ఉచిత చేప పిల్లల బదులుగా నగదు బదిలీ చేయాలని కోరుతున్నాం. 10. గౌడ కులస్తులకు మరియు నేతన్నలకు 50 సంవత్సరాలకు ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్లను మత్స్యకారులకు కూడా 50 సంవత్సరాలకే వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా దండు ఆగయ్య,అన్నేపు అశోక్, ఉప్పలయ్య, రాజయ్య,రాజు, రమేష్, సింగరపు అశోక్,మట్టెపల్లి ఎల్లయ్య,నరేల్లి వెంకటేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జనగాం

స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా చేస్తారా??

స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిన్న కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు నోటీసులు ఇచ్చిన స్పీకర్ 23వ తేదీ లోపు ఫిరాయింపు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసులు వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని కోరిన కడియం శ్రీహరి ఢిల్లీ నుండి రాగానే స్పీకర్‌ను కలవనున్న దానం నాగేందర్ దానం నాగేందర్ మరింత సమయం కోరతాడా లేదా రాజీనామా చేస్తాడా అనే అంశంపై సందిగ్ధత

జనగాం

ఘన్ పూర్ లో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం*

(స్టే)ఘన్ పూర్ పున్నమి ప్రతినిధి: ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా (స్టే)ఘన్పూర్ రిజర్వాయర్ కట్టపై మత్స్యకారుల ప్రతీక అయిన నీలిరంగు జెండాను సంఘం గ్రామ అధ్యక్షులు గోనెల యాదగిరి ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం(TMKMKS) జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి మునిగెల రమేష్ హాజరై మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తున్న మత్స్యకారుల జీవన పరిస్థితులు అద్వానంగా ఉన్నాయని అన్నారు మత్స్యకారుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని మత్స్యకారుల సంక్షేమానికి సరైన ప్రణాళిక లేదన్నారు ఈ దేశంలో మత్స్య పరిశ్రమలు ఏర్పాటు చేసి మత్స్య శ్రామికులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశాలు ఉన్నాయని కానీ ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు చైనా,వియత్నం మాదిరిగా చేపలతో మెడిసిన్,కాస్మోటిక్ వస్తువులు ఇంకా ఇతర అనేక ప్రయోగాలు చేసి పరిశ్రమలు ఏర్పాటు చేశారని మనదేశంలో కూడా మత్స్య పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయని వెంటనే ఆ మాదిరిగా ఆలోచించాలని కోరారు NCDC,NFDB ద్వారా మత్స్యకారులకు ప్రత్యేక స్కీములు ఏర్పాటు చేయాలని వాటి ద్వారా ప్రతి మత్స్యకారుడికి లబ్ధి చేకూరే విధంగా ప్రణాళిక చేయాలని కోరారు మత్స్యకారులకు ఎక్స్గ్రేషియా మరియు ఇన్సూరెన్స్ కేరళ ప్రభుత్వ మాదిరిగా 20 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు మహిళ సొసైటీలకు 10 లక్షల రుణ సౌకర్యం కల్పించాలని జిల్లా మండల కేంద్రాలలో చేపల మార్కెట్లు ఏర్పాటు చేసి చేపలకు మద్దతు ధర ప్రకటించాలని కోరారు స్టేషన్గన్పూర్ రిజర్వాయర్ దగ్గర చేపల ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు మత్స్యకారుల సమస్యల పరిష్కారానికై ఈనెల 25,26 తేదీలలో కరీంనగర్ పట్టణ కేంద్రంలో TMKMKS రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని మొదటి రోజు 25న రాష్ట్ర సదస్సు జరుగుతుందని ఈ సదస్సుకు మత్స్యకారులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు ఈ సందర్భంగా ప్రపంచ మత్స్యకార శ్రామికులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు నీలగట్టయ్య TMKMKS మండల అధ్యక్షులు గోనెల వెంకన్న సొసైటీ అధ్యక్షులు నీల సోమన్న డైరెక్టర్లు, నాయకులు మునిగెల వెంకన్న,మునిగెల ఐలోని,గోనెల ఉప్పలయ్య,కుంభం సాంబరాజు,నీల సాంబరాజు,నక్క శ్రీను, మాజీ ఎంపీటీసీలు మునిగల రాజు,గోనెల రాజయ్య,నీల శ్రీధర్,గోనెల చందు,గోనెల అనిల్ మునిగెల రమేష్ గోనెల పరుశురాముడు తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

500 రూపాయల కోసం ఫ్రెండ్‌నే..చంపేశారు

*అయ్యో ఎంత ఘోరం…..500 రూపాయల కోసం ఫ్రెండ్‌నే..చంపేశారు* నెల్లూరు కోవూరు పట్టణానికి సమీపంలోని వేగురు కాలువ ప్రాంతానికి చెందిన రాజా, షాజహాన్ మంచి స్నేహితులు. ఇటీవల షాజహాన్ రాజా వద్ద అవసరానికి రూ.500 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అయితే అది తిరిగి చెల్లించలేదు. గత నెల 25న రాజా, షాజహాన్‌తో పాటు తమ స్నేహితులు మస్తాన్, సుబ్బయ్య, పెంచలయ్య కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న రాజా, షాజహాన్‌ను రూ.500 బాకీ గురించి అడిగాడు. షాజహాన్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో మద్యం మత్తులో ఉన్న రాజా, అతని స్నేహితులు మస్తాన్, సుబ్బయ్య, పెంచలయ్య కలిసి షాజహాన్‌పై తీవ్రంగా దాడి చేశారు. హత్య చేసి.. కాల్వలో మృతదేహం దాడిలో షాజహాన్‌కు గాయాలు కావడంతో స్నేహితులంతా కలిసి అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అయితే అర్ధరాత్రి తిరిగి ఇంటికి వస్తుండగా నిందితులు మరోసారి షాజహాన్‌పై తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిలో షాజహాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు షాజహాన్ మృతదేహాన్ని నిందితులు వేగురు కాలువలో పడవేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు 24 గంటల్లోనే.. తెల్లారేసరికి షాజహాన్ ఇంటికి రాకపోవడంతో ఫోన్ పనిచేయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు కోవూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, 24 గంటల్లోనే మృతదేహాన్ని గుర్తించారు. తొలుత దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినప్పటికీ లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత కేవలం రూ.500 రూపాయల అప్పు వివాదమే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని కోర్టుకి హాజరుపరచినట్లు కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు.

తిరుపతి

తిరుమలలో శ్రీవారి దర్శనం చేసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

తిరుమల నవంబర్ (పున్నమి ప్రతినిధి) భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని భక్తితో దర్శించుకున్నారు. ముందుగా పద్మావతి విశ్రాంతి భవనం నుంచి బయలుదేరిన ఆమె, తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం శ్రీ భూవరాహ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకున్న గౌరవ రాష్ట్రపతికి టీటీడీ ఛైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి సాదర స్వాగతం పలికారు. ఆలయ ఆచారాలను పాటిస్తూ, అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఆమెకు ఘన స్వాగతం అందించారు. ధ్వజస్తంభాన్ని నమస్కరించిన అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్రపతితో పాటు ఉన్నారు. తదుపరి రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం నిర్వహించగా, టీటీడీ అధికారులు శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు, 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్, డైరీలను ఆమెకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీమతి జానకి దేవి, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, అలాగే జిల్లా కలెక్టర్ డా. వేంకటేశ్వర్, ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.